నల్లగొండ ఆర్జాలబావి గోదాములను పరిశీలించిన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
నేడు నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు ఆర్జాలబావి ధాన్యం గోదాములను... పరిశీలించారు..
ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయిన. రాష్ట్రంలో పండిన పండిన ప్రతి గింజను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని... ఇప్పటికే రాష్ట్రంలో నల్లగొండ జిల్లా..3.5 లక్షల మెట్రిక్ టన్నుల,ధాన్యాన్ని కొనుగోలు చేసి అగ్రస్థానంలో ఉందని,అందులో నల్లగొండ నియోజకవర్గం లో లక్ష మెట్రిక్ టన్నుల దాన్యాన్ని సేకరించినదన్నారు.
రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టుకొని తాలు లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని, వర్షాలు పడే అవకాశం ఉన్నందున, ధాన్యం తడవకుండా రాశులను కప్పి ఉంచుకోవాలని, కోరారు.
ఎప్పటికప్పుడు, కాంట ఐన ధాన్యాన్ని .. లారీలు ట్రాక్టర్లతో వెంట వెంటనే ట్రాన్స్పోర్ట్ చేసి గోదాములకు తరలించాలని.. అధికారులను ఆదేశించారు..
జిల్లా సివిల్ సప్లై అధికారి, నల్గొండ మండల పార్టీ అధ్యక్షుడు దేప వెంకటరెడ్డి అన్నెపర్తి సర్పంచ్ మేకల అరవింద్ రెడ్డి, రైస్ మిల్లుల యజమానులు కందుకూరు మహేందర్ కొండా లక్ష్మయ్య తదితరులు వెంట ఉన్నారు.
May 06 2023, 23:24