తాను నడవలేకున్నా... తన వారిని పోషించాలని!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబమది. నిలువ నీడలేదు. ఆ తల్లిదండ్రులు నలుగురు కుమార్తెలను కూలీనాలీ చేస్తూ పెంచారు. కానీ వరస విషాదాలు ఆ కుటుంబాన్ని వెంటాడాయి. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రగాయాలైన ఆ దంపతులిద్దరూ మంచానికే పరిమితమయ్యారు. ఈ పరిస్థితుల్లో ఊత కర్రలే ఆసరాగా నడుస్తున్న పెద్ద కూతురే వారికి పెద్ద దిక్కయింది. కష్టపడి డిగ్రీ చదివినా ఉపాధి దొరక్క.. అమ్మానాన్నలను వదలి ఎక్కడికీ వెళ్లలేక.. వారికి సపర్యలు చేస్తూ ఆ యువతి బతుకీడుస్తోంది. వివరాలిలా ఉన్నాయి..
![]()
ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరుపేటకు చెందిన గుంజి రాంబాబు(60), లక్ష్మి (55) దంపతులకు నలుగురు కూతుళ్లు. భార్యభర్తలిద్దరూ కూలీ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకునేవారు. పెద్ద కూతురు అంజమ్మ(35)కు చిన్నతనంలోనే పోలియో రావడంతో రెండు కాళ్లూ పనిచేయవు. డిగ్రీ వరకు ఎలాగో చదివిన ఆమె ఊత కర్రలమీదే నడుస్తోంది. చిన్న కుమార్తె మానసిక దివ్యాంగురాలు. కొద్ది సంత్సరాల క్రితం చనిపోయింది. మరో ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేయగా కూలీ పనులు చేసుకుంటూ తమ కుటుంబాలతో జీవనం సాగిస్తున్నారు. గతేడాది లారీ ఢీకొనడంతో రాంబాబు తీవ్రంగా గాయపడ్డారు. అప్పుడే ఒక కాలు తొలగించారు. మరో కాలులో రాడ్లు వేశారు. దీనికితోడు పక్షవాతం రావడంతో ఆయన పూర్తిగా మంచానపడ్డారు. ఇది జరిగిన కొద్ది నెలలకే మరో రోడ్డు ప్రమాదం వారి జీవితాన్ని కకావికలం చేసింది. లక్ష్మి రోడ్డు దాటుతుండగా ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఆమె రెండు కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ఊత కర్ర లేనిదే అడుగు వేయలేని పరిస్థితి. ఇప్పుడా తల్లిదండ్రుల భారమంతా పెద్ద కుమార్తెపై పడింది. తండ్రి, కూతుళ్లకు వస్తున్న దివ్యాంగుల పింఛన్లతోనే బతుకు వెళ్లదీస్తున్నారు. ఆ వచ్చే డబ్బులు ప్రతినెలా మందులకు కూడా సరిపోవడంలేదు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న తనకు ప్రభుత్వం ఏదైనా ఉపాధి చూపాలని అంజమ్మ జిల్లా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. అద్దె ఇంట్లోనే ఉంటున్న తమకు రెండు పడక గదుల ఇల్లు కేటాయించాలని ఆ కుటుంబం వేడుకుంటోంది.

రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబమది. నిలువ నీడలేదు. ఆ తల్లిదండ్రులు నలుగురు కుమార్తెలను కూలీనాలీ చేస్తూ పెంచారు. కానీ వరస విషాదాలు ఆ కుటుంబాన్ని వెంటాడాయి. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రగాయాలైన ఆ దంపతులిద్దరూ మంచానికే పరిమితమయ్యారు. ఈ పరిస్థితుల్లో ఊత కర్రలే ఆసరాగా నడుస్తున్న పెద్ద కూతురే వారికి పెద్ద దిక్కయింది. కష్టపడి డిగ్రీ చదివినా ఉపాధి దొరక్క.. అమ్మానాన్నలను వదలి ఎక్కడికీ వెళ్లలేక.. వారికి సపర్యలు చేస్తూ ఆ యువతి బతుకీడుస్తోంది. వివరాలిలా ఉన్నాయి..




క్షతగాత్రునికి పరామర్శ

Md bilala మంజు బాబా గారికి ఘనంగా సన్మానం 
బొడ్రాయి ప్రతిష్టలో పాల్గొన్న ఎమ్మెల్యేలు.

కేటీఆర్ ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ జెండాాా ఆవిష్కరణలో భాగంగా నల్గొండ 17వ వార్డులోో నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడిిిిి సైదిరెడ్డి గులాబీ జెండాా ఎగురవేయడం జరిగిందిి. ఈ సందర్భంగాా వార్డులోని ప్రజలుు అత్యధికంగా పాల్గొనిి కార్యక్రమాన్ని విజయవంతంం చేశారు. అదేవిధంగాా ఈరోజు ఏర్పాటుచేసిన BRS పార్టీ ప్లీనరీీ సమావేశంలో భారీీీీ ఎత్తున కార్యకర్తలతో సైదిరెడ్డి గారు పాల్గొన్నారు.
నల్గొండ..లో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి,స్థానిక mla కంచర్ల భూపాల్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి.

జాతీయ మానవ హక్కుల మండలి ఆధ్వర్యంలో సామాజిక కార్యక్రమాల్లో భాగంగా రివైవ్ మల్టి స్పెషాలిటి హాస్పిటల్ నకిరేకల్ వారి సౌజన్యంతో ఆదివారం నాడు శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు జరిపి మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది అలాగే NHRC తరపున పేద ప్రజలకు దుప్పట్లు పంచడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో నల్గొండ పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త, NHRC డివిజనల్ ఆదనపు కార్యదర్శి ఎం.డి.సాదిక్ పాషా గారు పాల్గొని మాట్లాడుతూ రాజ్యాంగం ప్రజలకు ప్రసాదించిన పౌర హక్కులకు భంగం కలుగకుండా జాతీయ మానవ హక్కుల మండలి ఎల్లవేళలా కృషి చేస్తుందని అలాగే అవినీతి రహిత సమాజం నిర్మితమయ్యేలా సభ్యులు అహర్నిశలు కృషి చేస్తున్నారని ప్రజలు ఎల్లప్పుడూ NHRC సేవలు పొందొచ్చని వారికి అండగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా రివైవ్ ఆసుపత్రి వారి సామాజిక సేవను కొనియాడారు వైద్య వృత్తి ఎంతో పవిత్రమైన వృత్తిగా పేర్కొంటు రోగి వైద్యుడిని భగవంతుని మరో రూపంగా భావిస్తారని వారి నమ్మకాన్ని నిలబెట్టేలా వైద్యులు కృషి చేయాలని అలాగే రివైవ్ ఆసుపత్రి సేవలను ఆదర్శంగా తీసుకుని ఇతర వైద్యులు కూడా సామాజిక సేవలను కొనసాగించాలని కోరారు.
రాజ్యాంగ నిర్మాత , బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రం మర్రిగూడ బైపాస్ లోని అంబేద్కర్ గారి విగ్రహానికి బీసీ సంక్షేమ, ఉద్యోగ ,యువజన, మహిళా సంఘాలు పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.
May 06 2023, 18:17
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
11.4k