నల్గొండ ప్రజలు ఫోన్ పోగొట్టుకున్నట్లయితే ఈ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేసుకోండి: నల్గొండ ఎస్పీ కే అపూర్వరావు
నల్గొండ టూ టౌన్ పరిధిలో పోగొట్టుకున్న యాభై ఫోన్లను CEIR (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) ద్వారా వెతికి బాధితులకు అందజేత.
జిల్లా యస్.పి కె.అపూర్వ రావు IPS.
మొబైల్ ఫోన్ పోయిన,చోరికి గురైనా www.ceir.gov.in పోర్టల్ నందు పిర్యాదు చేసుకోండి.
-www.ceir.gov.in పోర్టల్ పై ప్రత్యేక అవగాహన
CEIR పోర్టల్ ద్వారా నల్లగొండ 2 టౌన్ పరిధిలో పోగొట్టుకున్న,చోరికి గురైన మొబైల్ ఫోన్లను ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో 50 మంది బాధితులకు జిల్లా యస్.పి గారు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి గారు మాట్లాడుతూ పోయిన లేదా దొంగలించబడిన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి CEIR (Central Equipment Identity Register) అనే వెబ్ సైట్ లో సంబంధిత వివరాలను నమోదు చేసుకున్నట్లైతే అలాంటి మొబైల్స్ ను ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుంది అని ఎస్పీ గారు తెలిపారు.ఈ పోర్టల్ నిర్వహణకు సంబంధించి అన్ని పోలీస్ స్టేషన్ల నందు అధికారులకు శిక్షణ ఇవ్వడం జరిగినది అన్నారు. ఈ పోర్టల్ యొక్క ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పింస్తున్నమని తెలిపారు.
May 05 2023, 13:14