నల్లగొండ ఎన్ హెచ్ ఆర్ సి ఆధ్వర్యంలో శాలి గౌరారం మండలం చిత్తలూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం మరియు పేదలకు దుప్పట్ల పంపిణీ
జాతీయ మానవ హక్కుల మండలి ఆధ్వర్యంలో సామాజిక కార్యక్రమాల్లో భాగంగా రివైవ్ మల్టి స్పెషాలిటి హాస్పిటల్ నకిరేకల్ వారి సౌజన్యంతో ఆదివారం నాడు శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు జరిపి మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది అలాగే NHRC తరపున పేద ప్రజలకు దుప్పట్లు పంచడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో నల్గొండ పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త, NHRC డివిజనల్ ఆదనపు కార్యదర్శి ఎం.డి.సాదిక్ పాషా గారు పాల్గొని మాట్లాడుతూ రాజ్యాంగం ప్రజలకు ప్రసాదించిన పౌర హక్కులకు భంగం కలుగకుండా జాతీయ మానవ హక్కుల మండలి ఎల్లవేళలా కృషి చేస్తుందని అలాగే అవినీతి రహిత సమాజం నిర్మితమయ్యేలా సభ్యులు అహర్నిశలు కృషి చేస్తున్నారని ప్రజలు ఎల్లప్పుడూ NHRC సేవలు పొందొచ్చని వారికి అండగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా రివైవ్ ఆసుపత్రి వారి సామాజిక సేవను కొనియాడారు వైద్య వృత్తి ఎంతో పవిత్రమైన వృత్తిగా పేర్కొంటు రోగి వైద్యుడిని భగవంతుని మరో రూపంగా భావిస్తారని వారి నమ్మకాన్ని నిలబెట్టేలా వైద్యులు కృషి చేయాలని అలాగే రివైవ్ ఆసుపత్రి సేవలను ఆదర్శంగా తీసుకుని ఇతర వైద్యులు కూడా సామాజిక సేవలను కొనసాగించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో NHRC ఉమ్మడి జిల్లా అధ్యక్ష,ఉపాధ్యక్షులు,జిల్లా అధ్యక్షులు,రివైవ్ ఆసుపత్రి డాక్టర్లు,సిబ్బంది,మరియు NHRC సభ్యులు పాల్గొన్నారు.
Apr 22 2023, 21:19