/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి గట్టి ఎదురుదెబ్బ
రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం ముగిసింది.
లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ*
'
మోదీ ఇంటిపేరు' కేసులో దోషిగా తేలడంతో రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం కోల్పోయారు
గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1300 కరోనా కేసులు నమోదు...
భారతదేశంలో మరోసారి కరోనా పడగవిప్పుతోంది. నెమ్మదిగా కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. కొన్నాళ్ల క్రితం కేసుల సంఖ్య కేవలం వెయ్యికి దిగువన మాత్రమే ఉండేవి.
అయితే తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన గణాంకాల ప్రకారం గత రెండు రోజుల్లో 1000 పైగా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1300 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 140 రోజుల తర్వాత ఇదే అత్యధికం. కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రల్లో ఒక్కొక్కరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,816కి పెరిగింది.
దేశంలో ఇప్పటి వరకు 4.46 కోట్లు (4,46,99, 418) కరోనా కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 4,41,60,997 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 7,605కు చేరింది. డైలీ పాజిటివిటీ రేటు 1.46 శాతం ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 1.08 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.02 శాతం ఉండగా.. రికవరీ రేటు 98.79 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 92.06 కోట్ల పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో 89,078 చేశారు. మొత్తం మరణాల శాతం 1.19 శాతంగా ఉంది. దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా 220.65 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు అందించారు.
AI bot as CEO: మానవ చరిత్రలోనూ మొదటిసారి కావటం విశేషం
విశ్వంలో విశేషం చోటుచేసుకుంది. మానవ చరిత్రలో మహాద్భుతం జరిగింది. దేవుడు చేసిన మనిషి స్థానాన్ని.. మనిషి చేసిన రోబో భర్తీ చేసింది. కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఏఐ చాట్‌బాట్ ఓ కంపెనీకి బాస్ అయింది. చైనాలోని హాంకాంగ్‌కు చెందిన ఆన్‌లైన్ గేమ్స్ డెవలపింగ్ సంస్థ నెట్‌డ్రాగన్ వెబ్‌సాఫ్ట్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ కంపెనీ స్టాక్ మార్కెట్‌లో రికార్డు స్థాయిలో రాణించింది.
ప్రపంచంలోనే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒక సంస్థ పగ్గాలను చేజిక్కించుకున్న ఈ చాట్‌బాట్ పేరు.. టాంగ్ యు. ఇటీవల ఎక్కువగా చాట్‌జీపీటీ గురించి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్‌గా అభివర్ణిస్తున్న చాట్‌జీపీటీ భవిష్యత్తులో ఎన్నో వండర్స్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు. అయితే.. దానికన్నా చాలా ముందే ఏఐ చాట్‌బాట్ సీఈఓ కావటం చెప్పుకోదగ్గ విషయం.
నెట్‌డ్రాగన్ వెబ్‌సాఫ్ట్ సంస్థ మల్టీప్లేయర్ ఇంటర్నెట్ గేమ్స్‌లో భాగంగా మొబైల్ అప్లికేషన్లను రూపొందిస్తుంది. ఈ కంపెనీ చైర్మన్.. డెజియన్ లియు. కార్పొరేట్ మేనేజ్‌మెంట్‌లో ఫ్యూచర్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌దేనని చెప్పారు. భవిష్యత్తులో తమ బిజినెస్ మొత్తం ఏఐ సాయంతోనే జరుగుతుందని తెలిపారు. ఈ లక్ష్యాన్ని చేరుకునే దిశగానే టాంగ్ యుని కంపెనీ హెడ్‌గా నియమించామని వివరించారు.
ఓపెన్, ఇంటరాక్టివ్ అండ్ ట్రాన్స్‌పరెంట్ మేనేజ్‌మెంట్ మోడల్‌ని నిర్మిస్తామని, ఈ మేరకు సీఈఓ టాంగ్ యుకి కావాల్సిన ఆల్గారిథమ్స్‌ని పెంచుతూనే ఉంటామని చైర్మన్ డెజియన్ లియు వెల్లడించారు. రానున్న రోజుల్లో మెటావర్స్ బేస్డ్ వర్కింగ్ కమ్యూనిటీని డెవలప్ చేస్తామని స్పష్టం చేశారు. ఈవిధంగా గ్లోబల్ మార్కెట్‌లోని ట్యాలెంట్‌లను ఆకర్షించటం ద్వారా మరింత పెద్ద టార్గెట్లను రీచ్ అవుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.
వరల్డ్‌లోనే ఫస్ట్ టైమ్ ఒక కంపెనీకి హెడ్‌గా నియమితులైన ఈ హ్యూమనాయిడ్ రోబో.. ఆడ మనిషిని పోలి ఉంటుంది. అందుకే.. మిస్ టాంగ్ యు అని పేర్కొంటున్నారు. ఈ లేడీ లీడర్‌కి.. అప్పుడే.. కీలక బాధ్యతలు అప్పగించారు. ఉన్నత స్థాయి విశ్లేషణలను సమీక్షించటం, నాయకత్వ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవటం, ప్రమాదాలను ముందే పసిగట్టడం, పని ప్రదేశాన్ని సమర్థవంతంగా తీర్చిదిద్దటం ఈమె చేయాల్సినవాటిలో కొన్ని.
24/7 పనిచేసే సంస్థను ముందుండి నడుపుతూ.. ఒక్క రూపాయి కూడా శాలరీ తీసుకోని వన్ అండ్ ఓన్లీ ఎంప్లాయీ.. మిస్ టాంగ్ యునే కావటం గమనించాల్సిన అంశం. ఈమె.. ఈ కంపెనీలోని వివిధ ప్రక్రియలను సక్రమంగా పట్టాలెక్కించనున్నారు. క్వాలిటీ ఆఫ్ వర్క్ టాస్క్‌లను పెంపొందించటం ద్వారా సంస్థ కార్యకలాపాలను వేగవంతం చేస్తారు. రోజువారీ వ్యవహారాలను చక్కదిద్దటంతోపాటు సరైన నిర్ణయాలు తీసుకోవటానికి కావాల్సిన రియల్ టైమ్ డేటా హబ్‌గా వ్యవహరిస్తారు.
ఏఐ చాట్‌బాట్ మిస్ టాంగ్ యుని అధిపతిగా నియమించటం నెట్‌డ్రాగన్ వెబ్‌సాఫ్ట్ సంస్థకు తక్షణ ఫలితాన్ని ఇచ్చింది. ఈ కంపెనీ షేర్ విలువ ఒక్కసారిగా 10 శాతం పెరిగింది. గడచిన 6 నెలలతో పోల్చితే ఇప్పుడు హాంకాంగ్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్‌లో అనూహ్యమైన పనితీరును కనబరిచింది. దీనికి ఇతరత్రా కారణాలు ఉన్నప్పటికీ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం శుభసూచికగా నిలిచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
చెన్నైలో విచారకర సంఘటన... కోర్టు ఆవరణలో భార్యపై భర్త యాసిడ్ దాడి
చెన్నైలో విచారకర సంఘటన చోటు చేసుకుంది. కోయంబత్తూర్ లోని కోర్టు ఆవరణలో యాసిడ్ దాడి కలకలం రేపింది. తనపై కేసు పెట్టిందని భార్యపై కోర్టు ఆవరణలో యాసిడ్ బాటిల్ ను భార్య మొహంపై విసిరాడు భర్త శివకుమార్. భర్త శివకుమార్ వేదింపులు తట్టుకోలేక కేసు పెట్టింది భార్య చిత్ర.
అయితే నేడు కోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో వారు అక్కడికి చేరుకోగానే ఒక్కసారిగా యాసిడ్ దాడి చేయడంతో పక్కకు తప్పుకుంది అతడి భార్య చిత్ర. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఆసిడ్ బాటిల్ టేబుల్ పై పడడంతో కోర్టు ఆవరణలో ఉన్న టేబుల్ కాలి బూడిదైంది. దీంతో కోర్టుకు వచ్చిన ఇతర బాధితులు, పోలీసులు శివకుమార్ నీ చితకబాదారు. ఈ ఘటనపై పోలీసులపై సీరియస్ అయింది న్యాయస్థానం.
ప్రతిపక్షాలను అంతం చేసే కుట్ర జరుగుతుంది – కేజ్రీవాల్
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఆగ్రనేత రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి పేరును ఉద్దేశించి 2019 ఎన్నికల ప్రచారం వేల కర్ణాటకలోని కోలార్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది గుజరాత్ సూరత్ లోని న్యాయస్థానం. ఐపీసీ సెక్షన్ 504 ప్రకారం ఉద్దేశపూర్వకంగా అవమానించడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హెచ్ హెచ్ వర్మ స్పష్టం చేశారు.
ఇందుకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. “ప్రతిపక్ష నేతలను, పార్టీలను అంతం చేసే కుట్ర జరుగుతుంది. కాంగ్రెస్తో మాకు విభేదాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో రాహుల్ గాంధీని ఇలా ఇరికించడం సరైనది కాదు. న్యాయస్థానాన్ని గౌరవిస్తా.. కానీ తీర్పుతో ఏకీభవించను’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
దాచుకో, పంచుకో, తినుకో అనేది చంద్రబాబు విధానం : సీఎం జగన్
పోలవరం ప్రాజెక్ట్ తన తండ్రి వైఎస్సార్ కల అని దానిని తన హాయంలోనే పూర్తి చేస్తానని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. పోలవరం అంటే వైఎస్సార్.. వైఎస్సార్ అంటేనే పోలవరమని అన్నారు. పోలవరం అని పలికే అర్హత కూడా టీడీపీ లేదన్నారు.
1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నోటి నుంచి ఒక్కసారి కూడా పోలవరం పేరు రాలేదన్నారు. టీడీపీ ప్రభుత్వ హాయంలో పోలవరం ఒక్క అడుగైనా ముందుకు కదిలిందా అని ప్రశ్నించారు. టీడీపీ ద్యాసంతా డబ్బుల మీదనే అని విమర్శించారు. దాచుకో, పంచుకో, తినుకో అనేది చంద్రబాబు విధానమని , టీడీపీ ప్రభుత్వం నిధుల పారుదల మీదే దృష్టి పెట్టిందని ఆరోపించారు.
పోలవరం అంటే చంద్రబాబుకు ఏటీఎం అన్న జగన్… ఈ విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా చెప్పారని తెలిపారు. పోలవరం పనులు వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జగన్ సభకు తెలిపారు.
ప్రపంచంలోనే అతిపెద్ద అరటిపండు..! పసిబిడ్డ బరువుతో గిన్నిస్ రికార్డ్..!!
శరీరానికి తక్షణ శక్తినిచ్చే ఆరోగ్యకరమైన పండ్లలో అతి ముఖ్యమైనది అరటిపండు అని మనందరికీ తెలిసిందే. అలాంటి ఒక అరటిపండు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ అరటిపండును చూసి మీరు కూడా ఒక్క క్షణంకు గురవుతారు. ఎందుకంటే ఒక మనిషి ఈ మొత్తం అరటిపండును తినలేడు. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అరటిపండు. ఈ పండు దాదాపు ఒక పసిబిడ్డ బరువుంది. ఏ ఒక్కరూ ఈ అరటిపండును పూర్తిగా తినటం వారి సామర్థ్యానికి మించినదే అవుతుంది. అయితే, ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ భారీ అరటిపండు గురించి తెలుసుకోండి..
మనక్ గుప్తా అనే వినియోగదారు ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇది చిన్న పిల్లల బరువుతో సమానంగా ఉందని చెప్పారు. వీడియోలో ఈ భారీ అరటిపండును చేతిలో పట్టుకుని తినడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఒక వ్యక్తి పూర్తిగా తినడం సాధ్యం కాదు. ఈ వీడియో ఆస్ట్రేలియన్ ద్వీపం పాపువా న్యూ గినియాలోని కొన్ని ప్రాంతాలను చూపిస్తుంది. అక్కడ ఈ రకమైన అరటి మొక్కను పెంచుతారు. దాని నుండి వచ్చే అరటి పండ్లు ఒక మూర పొడవు ఉంటాయి. ప్రస్తుతం ఈ భారీ అరటిపండు గిన్నిస్ బుక్‌లో నమోదైంది.
న్యూ పాపువా గినియాకు చెందిన ఈ అరటి మొక్కలను ప్రపంచంలోనే అతిపెద్ద అరటి మొక్కగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నమోదు చేసింది. ఈ మొక్క నుండి వచ్చే అరటి బరువు సుమారు 3 కిలోలు. ఇది నవజాత శిశువుతో సమానం. అయితే, ఈ పండు పండడానికి 5 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి పెద్దగా వ్యాపారం లేదు. ఈ మొక్క ట్రంక్ 15 మీటర్ల ఎత్తు ఉంటుందని, ఆకులు కూడా భూమి నుండి 20 మీటర్ల ఎత్తులో ఉన్నాయని చెబుతారు.
అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద అరటిపండుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ 38 సెకన్ల వీడియోను 88 వేలకు పైగా వీక్షించారు. అయ్యబాబోయ్ ఇంతపెద్ద అరటిపండా అని కొందరు నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ పెట్టారు. 5 ఏళ్లలో పండే ఈ అరటిపండు తినడానికి కనీసం 5 రోజులు పడుతుందంటూ మరో వినియోగదారు వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ దోషే.. ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో తీర్పు.. రెండేళ్ల జైలు శిక్షకు ఛాన్స్..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇంటి పేరుతో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యల కేసులో దోషిగా తేల్చిచింది గుజరాత్ కోర్టు. 2019 ఎన్నికల సమయంలో ప్రదాని నరేంద్ర మోదీ ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. దొంగలందరికీ మోదీ ఇంటి పేరేనంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తప్పేనని కోర్టు తేల్చి చెప్పింది. గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోడీని ఉద్దేశించి రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ.. దొంగలందరూ మోదీ ఇంటిపేరుతోనే ఉన్నారెందుకు? అంటూ వ్యాఖ్యానించారు రాహుల్ గాంధీ. కర్ణాటకలోని కోలార్‌లో ఓ ఎన్నికల సభలో రాహుల్ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో పరువు నష్టం కేసును దాఖలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ. గత శుక్రవారం విచారణ ముగించి తీర్పును రిజర్వు చేసిన సూరత్ న్యాయస్థానం.
సార్వత్రిక ఎన్నికలకు ముందు కర్ణాటకలోని కోలార్‌లో నిర్వహించిన బహిరంగ సభలో వయనాడ్‌కు చెందిన లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యానించినప్పుడు ఈ కేసు 2019కి సంబంధించినది. ఆ తర్వాత అతనిపై పరువు నష్టం కేసు నమోదైంది. ‘దొంగలందరికీ మోదీ ఇంటిపేరు ఒక్కటే ఎందుకు?’ అని రాహుల్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోడీ పిటిషన్ దాఖలు చేశారు.
2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కర్నాటకలోని కోలార్ సభలో రాహుల్ ఈ కామెంట్స్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై క్రిమినల్ డెఫమెషన్ కేసు నమోదు చేశారు. రాహుల్‌పై పరువునష్టం దావా కేసుని విచారించిన సూరత్ కోర్టు రాహుల్‌ని దోషిగా నిర్ధారించింది.
రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించడం వల్ల ఆయన సభ్యత్వానికి ముప్పు ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో రెండేళ్ల శిక్షను కూడా ప్రకటించవచ్చు. అయితే కోర్టులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘నా ప్రకటన వల్ల ఎవరికీ నష్టం జరగలేదు. శిక్షను తగ్గించాలని కోర్టును ఆశ్రయించాను. మరోవైపు, అశ్విని చౌబే మాట్లాడుతూ, ‘రాహుల్ గాంధీ కోర్టు పరిధిలో ఉన్నారు. అతను కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నారు. పార్లమెంట్‌కు వచ్చి క్షమాపణ చెప్పే ధైర్యం కూడా చేయలేదు. రాహుల్ గాంధీపై ఐపీసీ సెక్షన్ 499, 500 కింద నేరం నమోదు చేశారు.
ఈ కేసులో ఇవాళ మూడోసారి కోర్టుకు హాజరయ్యారు. చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్‌హెచ్ వర్మ కోర్టు గత వారం ఇరుపక్షాల వాదనలు విని మార్చి 23న తీర్పును ప్రకటించాలని నిర్ణయించింది. ఈరోజు విచారణ అనంతరం రాహుల్ గాంధీని దోషిగా కోర్టు తేల్చింది.
Cyber crime : వ్యక్తిగత డేటా చోరీ చేస్తున్న ముఠా అరెస్టు
దేశవ్యాప్తంగా కోట్ల మంది వ్యక్తిగత డేటాను చోరీ చేసిన ముఠాను సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. కోట్ల మంది డేటాను సేకరించి.. నిందితులు విక్రయిస్తున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో వందల సంఖ్యలో కేసులు నమోదైన క్రమంలో ఈ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ నేరగాళ్లు వినియోగదారులకు బ్యాంకులు, సిమ్ కార్డుల పేరుతో మెసేజ్ లతో పాటు లింకులను పంపుతున్నట్లు గుర్తించారు. సైబర్ నేరగాళ్లు పంపిన లింకులను తెలియక క్లిక్ చేసిన వారి వ్యక్తిగత డేటాను మొత్తం చోరీ చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
సంబంధం లేకపోయినా అనవసర సందేశాలు పంపుతూ దేశవ్యాప్తంగా కోట్ల మంది డేటాను చోరీ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇటువంటి సందేశాలపై ప్రతిఒక్కరూ అలర్ట్ గా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా కోట్ల మంది వ్యక్తిగత డేటాను ఇప్పటికే చోరీ చేసినట్లు గుర్తించారు. ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు డీటెయిల్స్ ను కొట్టేసినట్లు విచారణలో తేల్చారు. కోట్ల మంది వ్యక్తిగత డేటాను సైబరాబాద్ పోలీసులు రికవరీ చేశారని తెలుస్తోంది.
ఇన్‌కాగ్ని సంస్థ నివేదికలో ఏముంది..?
దేశవ్యాప్తంగా కోటి 80 లక్షల మంది వ్యక్తిగత డేటా చోరీకి గురైనట్టు తాజా సర్వే తెలిపింది. ఈ డాటా గత 20 ఏండ్లలో 10 సందర్భాల్లో డేటా చోరీ జరిగిందని ఇన్‌కాగ్ని సంస్థ వెల్లడించింది. డేటా చోరీ బాధిత టాప్-5 దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉందని వివరించింది. అమెరికాలో 20.7 కోట్ల మంది వ్యక్తిగత డేటా చోరీకి గురైందని ఇన్‌కాగ్ని పేర్కొంది. భారత్ తర్వాత యూకే, బ్రెజిల్, కెనడా దేశాల్లో వ్యక్తిగత డేటా చోరీ ఎక్కువగా జరిగిందని స్పష్టం చేసింది.
Mar 25 2023, 11:45