రజకుల అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యం.... ఎమ్మెల్యే కంచర్ల
♦️రజకుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..
♦️నెలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ చారిత్రాత్మకం.
♦️ 250 మంది రజకులకు వారి ఆర్థిక అభివృద్ధికై.. స్వంత నిధులతో ఉచిత ఇస్త్రీ పెట్టెల పంపిణీ....
♦️ రజకుల అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యం.... కంచర్ల
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత... అన్ని వర్గాల ప్రజల ఆర్థిక అభివృద్ధికి సీఎం కేసీఆర్ పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని... నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు అన్నారు.
నేడు నల్లగొండ జిల్లా కేంద్రంలోని సాగర్ రోడ్ లో గల రజక భవన్ లో
చాకలి ఐలమ్మ రజక సంఘం ఆధ్వర్యంలో పొదుపు చేసుకుం టున్న ప్రోత్సాహంగా 250 ఇస్త్రీ పెట్టెలను.. తన స్వంత నిధులనుండి ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్లగొండ నియోజకవర్గం లోని రజకులకు ఇళ్ల స్థలాలు ఉన్నవారికి మూడు లక్షల రూపాయల ఇళ్లను మంజూరు చేస్తామని. ప్రస్తుతం 55 లక్షలతో మోడ్రన్ దోబీ ఘాట్ ఏర్పాటు చేసి ప్రారంభించామని,
మరో రెండు కోట్ల రూపాయల వ్యయంతో మరో మోడరన్ దోబీ ఘాట్ నిర్మాణానికి అవసరమగు నిధులు కెసిఆర్ ప్రభుత్వం మంజూరు చేసిందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంబీసీ కులాల అధ్యక్షులు & మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు కొండూరు సత్యనారాయణ, జిల్లా రజకసంఘం అధ్యక్షులు.. చిలకరాజు చెన్నయ్య, జిల్లా కన్వీనర్ పగిళ్ల సైదులు జిల్లా స్థాయి సభ్యులు గోలి శంకర్ చిలక రాజు సతీష్, గడ్డం రాములు భీమనపల్లి నగేష్ చర్లపల్లి మల్లేష్ బి శంకరమ్మ జిల్లపల్లి అరుణ, శైలజ తదితరులు పాల్గొన్నారు.
Mar 20 2023, 06:30