TSPSC: ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌లో మరో 3 ప్రశ్నపత్రాలు.. గుర్తించిన ఎఫ్ఎస్‌ఎల్ అధికారులు.
TSPSC: ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌లో మరో 3 ప్రశ్నపత్రాలు.. గుర్తించిన ఎఫ్ఎస్‌ఎల్ అధికారులు.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఏఈ ప్రశ్నపత్రం మాత్రమే లీకైందని గుర్తించిన టీఎస్‌పీఎస్సీ అధికారులు మార్చి 5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పరీక్షను రద్దు చేసినట్టు ఇప్పటికే ప్రకటించారు..
కానీ, ప్రవీణ్ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్‌లో ఏఈ ప్రశ్నపత్రంతో పాటు టౌన్‌ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు కూడా ఉన్నట్టు సిట్ అధికారులు అనుమానించారు. దీంతో ప్రవీణ్ వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తో పాటు పెన్‌డ్రైవ్‌ను సిట్ అధికారులు స్వాధీనం చేసుకుని ఎఫ్ఎస్‌ఎల్‌కు పంపించారు.
![]()
వాటిని విశ్లేషించిన ఎఫ్ఎస్‌ఎల్ అధికారులు ప్రవీణ్ పెన్ డ్రైవ్‌లో మరి కొన్ని ప్రశ్నపత్రాలు గుర్తించినట్టు సమాచారం. వెటర్నరీ అసిస్టెంట్, టౌన్ ప్లానింగ్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు పెన్‌డ్రైవ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై టీఎస్‌పీఎస్సీ అధికారులు కానీ, సిట్ అధికారులు కానీ ఇప్పటి వరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉన్నందున ఎలాంటి వివరాలు వెల్లడించినా నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంటుందని, సమాచారం వెల్లడించడం సాధ్యం కాదని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 9మంది నిందితులను అరెస్టు చేసి కస్టడీకి తరలించారు. నిందితులను పోలీసు కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని చెబుతున్నారు. నిందితుడు ప్రవీణ్ ఏఈ ప్రశ్నపత్రం రేణుకకు విక్రయించగా.. మిగిలిన ప్రశ్నపత్రాలు ఎవరికి విక్రయించాడనే దానిపై సిట్ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు.

TSPSC: ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌లో మరో 3 ప్రశ్నపత్రాలు.. గుర్తించిన ఎఫ్ఎస్‌ఎల్ అధికారులు.


మహిళలను కార్యాలయం పిలిపించి విచారించకూడదు. ఆడియో, వీడియో విచారణకు నేను సిద్ధం: ఎమ్మెల్సీ కవిత

Tspsc ఉద్యోగాల పరీక్ష పేపర్ లీకేజ్ కి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని tspsc చైర్మన్ జనార్దన్ రెడ్డి గారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక నిరుద్యోగులు లక్షల రూపాయలు వెచ్చించి కోచింగ్లు తీసుకుంటూ ఉంటే మన నిరుద్యోగుల పొట్ట కొడుతున్న టీఎస్పీఎస్సీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని నిర్లక్ష్యం వహించిన చైర్మన్ జనార్ధన్ రెడ్డి సస్పెండ్ చేయాలని లక్షల రూపాయలు వెచ్చించి కోచింగ్ లు తీసుకొని ఈరోజు ఉద్యోగాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రవన్న బిడ్డలు చదువుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో లీకేజీల వ్యవహారం చాలా దౌర్భాగ్యకరమని దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని ఇట్టి కారకులైన వారిని పీడియాట్ కేసు నమోదు చేయాలని సీట్ వేగవంతంగా దర్యాప్తు చేసి వారిని శిక్షించాలని బడుగు బలహీన వర్గాల ప్రజల విద్యార్థుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఉండాలని యధావిధిగా గ్రూప్ వన్ మరియు ఇతర పరీక్షలు కూడా అభ్యర్థులు పరీక్ష పెట్టాలని రాబోయే రోజుల్లో జరిగే పరీక్షలు పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని కఠినంగా నియమ నిబంధనలతో నిర్వర్తించాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థులు రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు మామిళ్ల జానీ యాదవ్ వరికుప్పల విష్ణు వెంకన్న శ్రీధర్ నవీన్ విష్ణు సురేష్ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు.
వినియోగదారుడా మేలుకో
తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తాసిల్దార్ పై కేసు నమోదు....
జిల్లా పోలీస్ షీ టీం ఆధ్వర్యంలో నిర్వహించిన 3.2 K రన్ లో మొదటి 4 బహుమతులు సాధించిన చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ కు చెందిన ఫుట్బాల్ క్రీడాకారులు

బిఎస్పి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

అంతర్జాతీయ కబడ్డీ పోటీలకు ఎంపికైన క్రీడాకారిణికి ఆర్ధిక సహాయమందించిన కస్తూరి ఫౌండేషన్....
వీరి దీనస్థితిగతులపై 'ఈనాడు' గత ఏడాది జులై 20న 'ఇదో దివ్యాంగుడి ముంపు గోస' పేరిట కథనాన్ని ప్రచురించింది. ఇతను శాశ్వత పరిష్కారం కోసం రెండు పడక గదుల ఇల్లు కేటాయించాలని ఎన్నోసార్లు అధికారులకు విన్నవించుకుంటున్నా ఫలితం లేకపోవడం గమనార్హం. సోమవారం జిల్లా సమీకృత ప్రాంగణానికి అతడి తల్లితో సహా వచ్చి మరోసారి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీనారాయణకు వినతిపత్రం ఇచ్చారు. వెంటనే స్పందించిన ఆయన మంథని ఆర్డీవో వీరబ్రహ్మేంద్రచారికి ఫోన్ చేసి రెండు పడక గదుల ఇల్లు మంజూరుకు అర్హతలను పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారు.
Mar 17 2023, 12:42
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
38.7k