ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని మార్చ్ 25నసుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాదులో జరుగు రాష్ట్రస్థాయి సదస్సును విజయవంతం చేయాలని కరపత్రముల
ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలి.తల్లమల్ల హసేన్., మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ సామాజిక అభివృద్ధి అను అంశం పైన 25 మార్చి శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాదులో జరుగు రాష్ట్రస్థాయి సదస్సును విజయవంతం చేయాలని ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన్ నల్గొండ జిల్లా కేంద్రంలో కరపత్రములు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు న్యాయవాది తల్లమల్ల హసేన్ మాట్లాడుతూ ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల ఆవశ్యకత అను అంశం పైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు న్యాయవాది తల్లమల్ల హసేన్ విచ్చేసి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మనదేశంలో ప్రపంచీకరణ ప్రైవేటీకరణ అతివేగంగా విస్తరించినందువలన ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన ప్రభుత్వ రంగ సంస్థలు మరియు ప్రభుత్వ శాఖలు నిర్వీర్యం చెంది ప్రైవేట్ రంగం విస్తరించడం వలన లక్షలాది ఉద్యోగాలు కోల్పోవడం జరిగిందని, కేవలం 8% ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వ పరంగా ఉండటం వలన ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోవడం జరిగిందని ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో 92 శాతం ప్రైవేటుపరం జరగటం వలన ఉన్నత విద్యలు అభ్యసించిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి యువకులు నిరాశ నిస్సృహలలో కొట్టుమిట్టాడుతూ తమ జీవితాలను తమ భవిష్యత్తును కోల్పోయే ప్రమాదం ఉన్నదని అన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం సాధించటంలో 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో కూడా నూటికి 70 శాతం మంది ఎస్సీలు దారిద్య దివరేఖ లో ఉండటం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వ నుండి భూమిని విద్యుత్ శక్తిని సబ్సిడీ రుణాలను తీసుకుంటున్న ప్రైవేట్ రంగ సంస్థలు ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించవలసిన బాధ్యత ఉన్నదని అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వచ్చే శాసనసభ సమావేశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేశారు 1. ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు అమలు చేయాలి.2. తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల వారికి రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు అమలు చేయాలి.3. వచ్చే అసెంబ్లీ సమావేశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి నివేదికని 4.నామినేటెడ్ పోస్టులలో ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించాలి.5 హైకోర్టు , సుప్రీంకోర్టు, జిల్లా కోర్టు నియామకాలలో మరియు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ సహాయ ప్రభుత్వ న్యాయవాదుల నియామకాలలో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించాలి.6 . రాజ్యసభ సభ్యులు శాసనమండలి సభ్యుల ఎన్నికలలో ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్లుకల్పించాలి.7. ప్రభుత్వ టెండర్ విధానాల్లో ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్లు అమలు చేయాలి.8. ప్రభుత్వ ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా నియమించే విధానాన్ని రద్దు చేయాలి. 9. మూసివేసిన ప్రభుత్వ రంగ సంస్థలను వెంటనే పునరుద్ధరించాలి..10. పెరిగిన జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు 15 శాతం నుండి 20 శాతం వరకు రిజర్వేషన్లు పెంచాలి ఎస్టీలకు 6 శాతం నుండి 10 శాతం వరకు పెంచాలి.11. నిరుపేద దళితులకు మూడు ఎకరాల భూమి డబల్ బెడ్ రూములు అందరికీ కల్పించాలి.12. దళిత బంధు పథకంలో అర్హులైన మాల కులం అందరికీ ఇవ్వాలి. ఈ సమావేశంలో మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ముండ్లగిరి కాంతయ్య , కేవీపీస్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి కట్ట దుర్గాప్రసాద్, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ తెలంగాణ విద్యావంతుల వేదిక నల్గొండ జిల్లా అధ్యక్షులు పందుల సైదులు, మాల మహానాడు నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పురిమిట్ల శ్రీనివాస్ , రావిరాల జగన్, చింతపల్లి యాదయ్య, వెన్నమల్ల రమేష్ మాల మహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షులు అద్దంకి రవీందర్, సమత లాయర్స్ ఫోరం నాయకులు కోక రంజిత్ కుమార్, బొల్లెద్దు వెంకటరత్నం, విద్యార్థి నాయకులు ఎడ్ల కళ్యాణ్ కులుకులపల్లి నాగార్జున ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.
Mar 01 2023, 18:19