పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ ఫీజు బకాయిలు విడుదల చేయాలని కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసిన SC,ST విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
పెండింగ్లో ఉన్న 3500 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ ఫీజు బకాయిలు విడుదల చేయాలని నలగొండ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ సుమారు 300 కోట్ల రూపాయలు విడుదల కాక విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు చదువు పూర్తి అయిన కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వలన సర్టిఫికెట్లు విద్యార్థులకు ఇవ్వకపోవడంతో ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేద బిడ్డలందరూ ఉన్నత చదువులకు దూరం కావడం జరుగుతుంది చదువు పూర్తి అయినా ఫీజు రీయంబర్స్మెంట్ రాకపోవడం వల్ల సర్టిఫికెట్ లేక ఉన్నత చదువుల్లో పై కోర్సుల్లో చేరకపోవడం వలన విద్యార్థులు తీవ్ర మనోవేదన గురి అవుతున్నారు కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న 3500కోట్ల స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ మెంబర్ పరికశెట్టి జిల్లా నాయకులు ఈగల సూర్య బిక్షం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Feb 20 2023, 21:03