పేదల సంక్షేమాన్ని విస్మరిస్తున్న కేంద్ర రాష్ట్ర బడ్జెట్ లను సవరించాలి,స్థానిక సమస్యలపై ప్రజా పోరాటాలు నిర్వహిస్తాం:ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి
పేదల సంక్షేమాన్ని విస్మరిస్తున్న కేంద్ర రాష్ట్ర బడ్జెట్ లను సవరించాలి
స్థానిక సమస్యలపై ప్రజా పోరాటాలు నిర్వహిస్తాం
ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి
ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేదల సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్ శక్తులకు రాయితీలు ఇస్తున్న తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి నల్గొండ నియోజకవర్గ ఇన్చార్జి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు
దొడ్డి కొమరయ్య భవన్లో బుధవారం సిపిఎం నల్గొండ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర చట్టం చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడం విచారకరమని అన్నారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి సబ్సిడీలు ఇవ్వకుండా కార్పొరేటీకరణ చేయడానికి కుట్ర జరుగుతుందని అన్నారు. పేదలు, వామపక్ష పార్టీల పోరాట ఫలితంగా వచ్చిన ఉపాధి హామీ చట్టానికి 60 శాతం నిధులు తగ్గిస్తూ పథకాన్ని నీరుగార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడులను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం ఆపాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ ను సవరించి ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. నల్గొండ నియోజకవర్గ పరిధిలో జిల్లా కేంద్రానికి రావడానికి ఉన్న పంచాయతీరాజ్ ,ఆర్ అండ్ బి రోడ్లను డబల్ రోడ్లుగా మార్చాలని, దెబ్బతిని గుంతలతో అధ్వానంగా ఉన్న రోడ్లను మరమ్మత్తులు చేయాలని పాదయాత్రలు, మంత్రులకు వినతి పత్రాలు సమర్పించడం జరిగిందని అన్నారు. పట్టణంలో ప్రధాన రహదారులు మినహా శివారు ప్రాంతాల అభివృద్ధిని విస్మరించారని ఆరోపించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇండ్లు, ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు, తదితర సమస్యలపై ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
*ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాశమ్ ,పాలడుగు ప్రభావతి, నల్లగొండ పట్టణ కార్యదర్శి ఎండి సలీం, జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య, నన్నూరి వెంకటరమణారెడ్డి, తుమ్మల పద్మ, నల్లగొండ ,తిప్పర్తి, కనగల్లు మండల కార్యదర్శిలు నలపరాజు సైదులు, మన్నె బిక్షం, కందుల సైదులు, తదితరులు పాల్గొన్నారు.
Feb 20 2023, 16:38