మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల స్కూల్ తరలించడం విరమించుకోవాలి:ప్రియదర్శిని మేడి
మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల స్కూల్ తరలించడం విరమించుకోవాలి
- ప్రియదర్శిని మేడి
నకిరేకల్ పట్టణ కేంద్రంలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు అనుకూలంగా అందుబాటులో ఉన్న తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల స్కూల్ ను తరలించడం ప్రభుత్వ అసమర్థ చర్య అని బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పాఠశాల ప్రిన్సిపల్ మరియు పాఠశాలలోని ఉపాధ్యాయులు వారి స్వలాభం కోసం స్కూలు తరలించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. జిల్లా స్థాయి అధికారులకు చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకొని పాఠశాలను తరలించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రియదర్శిని మేడి జిల్లా స్థాయి అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించగా హాస్టల్ ని ఎక్కడికి మార్చడం లేదని చెప్పడం గమనార్హం. పార్టీ మారానని చెప్పుకునే ఎమ్మెల్యే సిసి రోడ్లు, డ్రైనేజీలు శంకుస్థాపనలకు, దళిత బంధు ఆశ చూపే పనికి మాత్రమే పరిమితమయ్యారన్నారు. నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ఉన్న ప్రభుత్వ హాస్టల్ ను ఇతర ప్రాంతాలకు తరలించడం పట్ల ఎమ్మెల్యే స్పందించకపోవడం ఆయనకు పేద విద్యార్థుల పట్ల ఉన్న నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ హాస్టళ్లకు ప్రత్యేక నిధులు కేటాయించి సొంత భవనాలు నిర్మించలేని అసమర్థ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్పి సీనియర్ నాయకుడు గద్దపాటి రమేష్, చిట్యాల మండల అధ్యక్షురాలు చుక్క పూజిత,నార్కట్ పల్లి మండల అధ్యక్షులు చెరుకుపల్లి శాంతి కుమార్,విద్యార్థి సంఘం నాయకులు అంజన్ కుమార్ యాదవ్,జిల్లా సంపత్ తదితరులు పాల్గొన్నారు.

మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల స్కూల్ తరలించడం విరమించుకోవాలి


మానవత్వం చాటుకున్న మున్సిపల్ చైర్మన్:
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్...
నకిరేకల్ నియోజకవర్గం
నల్లగొండ: ప్రభుత్వ ఆసుపత్రిలో సిమెంట్ బెంచిల పంపిణీ
బడ్జెట్‌పై ఉభయ సభల్లో ఇవాళ సాధారణ చర్చ జరగనుంది.2023 - 24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళికను సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్‌పై నేడు శాసనసభ, శాసనమండలిలో చర్చ జరగనుంది. అనంతరం రెండు సభల్లో జరిగిన చర్చకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇస్తారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దుచేసి నేరుగా బడ్జెట్ పై చర్చ చేపడతారు.


Feb 10 2023, 13:02
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
28.9k