హైదరాబాద్, ఖమ్మం మాదిరిగా రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి:TSJA రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి
హైదరాబాద్, ఖమ్మం మాదిరిగా రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి
రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదులో జర్నలిస్టులకు హౌసింగ్ సొసైటీ ద్వారా ఇవ్వనున్న ఇంటి స్థలాల మాదిరిగానే అదేవిధంగా ఖమ్మంలో త్వరలో ఇవ్వబోతున్న విధంగానే రాష్ట్రంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా లో కొనసాగుతున్న వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ఇంటి స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి ప్రభుత్వాన్ని కోరారు.మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.జర్నలిస్టుల ఇంటి స్థలాల విషయంలో వీలైనంత తొందరగా స్పందించాలని కోరారు. అదేవిధంగా ప్రస్తుతం ప్రభుత్వం ఇవ్వనున్న ఇంటి స్థలాల విషయంలో అర్హత లేని వారికి ఏనాడు వార్తలు రాయకుండా అక్రిడేషన్లు పొందుకున్న వారికి జర్నలిస్టులుగా గుర్తించి ఇంటి స్థలాలు ఇస్తే అలాంటి వారి లిస్ట్ బయటపెట్టి ప్రత్యేక ఉద్యమం చేపడుతామని తెలిపారు. అక్రిడేషన్ లతో సంబంధం లేకుండా వర్కింగ్ లో ఉండి ఇంటి స్థలాలు రాకుండా అణిచివేతకు గురైన ప్రతి ఒక్కరికి టీఎస్ జేఏ అండగా ఉంటుందని తెలిపారు.ఖమ్మం జిల్లాలో హైదరాబాదులో స్పందించిన విధంగా రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం వెనువెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఎల్ నాగబాబు,సూర్యాపేట పట్టణ ఉపాధ్యక్షుడు రవిచంద్ర నాయక్, పట్టణ ప్రధాన కార్యదర్శి యాతాకుల మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు
Feb 07 2023, 21:31