బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి లేదా గుమిగూడి ఇతరులకు న్యూసెన్స్ కలిగించే వారిపై కఠిన చర్యలు: నల్గొండ ఎస్ ఐ రాజశేఖర్ రెడ్డి.
బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి లేదా గుమిగూడి ఇతరులకు న్యూసెన్స్ కలిగించే వారిపై కఠిన చర్యలు:
పట్టణం లో వివిధ కాలనీలలో రాత్రి సమయాలలో రోడ్లపై ఆవారాగా తిరుగుతూ, గుమిగుడి సిగరెట్లు తాగుతూ, చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలిగిస్తూ పట్టుబడ్డ వారికి ఈ రోజు కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగింది.
ఎవరైనా ఇలా పట్టుబడినట్లైతే జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అటువంటి వ్యక్తులకు భవిష్యత్తులో ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్ లలో అర్హత పొందుటకు ఇబ్బంది కలుగును. కనుక నేటి యువత స్నేహితుల ప్రభావం తో గానీ, ఇతర కారణాలతో గాని, చెడు మార్గంలోకి వెళ్లి జైలు పాలు కాకుండా, భవిష్యత్తును సన్మార్గం లో తీసుకెళ్లాలని,వారికి, వారి కుటుంబ సభ్యులకు, సమాజానికి మంచి పేరు తీసుకొచ్చేలా ప్రవర్తన మార్చుకోవాలి అని హెచ్చరించడం జరిగింది. మద్యం సేవిస్తూ పట్టుబడిన వారి పై చట్ట ప్రకారం కేసులు 6 నమోదు చేయబడినాయి.
*ప్రజలకు, పోలీస్ వాలంటీర్స్ కి టూ టౌన్ పోలీస్ వారి విజ్ఞప్తి. మీ ప్రాంతాల్లో కూడా ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు అయితే వెంటనే 100 కి గాని, పి ఎస్ కి గాని సమాచారం ఇవ్వండి.
Feb 07 2023, 21:26