పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరలో పాల్గొన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి
మంత్రి జగదీష్ రెడ్డి.. పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర...
.......
.......
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం లో సభండ వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని ,
పెద్దగట్టు జాతరలో పాల్గొన్న భక్తుల మొహల్లో కనిపిస్తున్న చిరునవ్వు ,ఆనందమే దానికి తార్కాణం అని అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి....కుటుంబ సమేతంగా పెద్దగట్టు జాతరలో పాల్గొన్న జగదీష్ రెడ్డి లింగమంతుల స్వామివారికి నిర్వహించిన చంద్రపట్నం,కల్యాణ మహోత్సవం లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు...కోట్ల రూపాయలను వెచ్చించి మౌలిక సదుపాయాలు కల్పించడంతో భక్తులు చాలా సంతోషంగా స్వామివారి ని దర్శించుకుంటున్నారని మంత్రి అన్నారు..ఇప్పటి వరకు 12 లక్షల కు పైగా భక్తులు జాతరలో పాల్గొన్నారని తెలిపారు..రేపు ఎల్లుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నదని దానికి అనుగుణంగా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు...ఆలయ కమిటీ సభ్యులు,ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు సమిష్టిగా పని చేస్తూ,జాతరలో ఎలాంటి అసౌకర్యం లేకుండా రేయింబవళ్లు పని చేస్తున్నారని మంత్రి కితాబిచ్చారు...పాడి పంటలతో, సిరి సంపదలతో, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా మరిందని అన్నారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి విజన్ తో, తెలంగాణ యావత్ దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందని అన్నారు...లింగమంతుల స్వామివారి దయతో తెలంగాణ మరింత పురోగమించాలని జగదీష్ రెడ్డి ఆకాంక్షించారు.
Feb 07 2023, 15:42