/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz హైదరాబాద్‌లో పాకిస్థాన్‌ ఉగ్రవాదసంస్థ లష్కరే తోయిబా, ఐఎస్‌ఐ ఉగ్రకుట్రలకు ప్రయత్నిస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థకు సమాచారం Miryala Kiran Kumar
హైదరాబాద్‌లో పాకిస్థాన్‌ ఉగ్రవాదసంస్థ లష్కరే తోయిబా, ఐఎస్‌ఐ ఉగ్రకుట్రలకు ప్రయత్నిస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థకు సమాచారం

హైదరాబాద్‌లో పాకిస్థాన్‌ ఉగ్రవాదసంస్థ లష్కరే తోయిబా, ఐఎస్‌ఐ ఉగ్రకుట్రలకు ప్రయత్నిస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థకు సమాచారమందినట్లు తెలుస్తోంది.ఈ ఉగ్ర పన్నాగంపై ఎన్‌ఐఏ స్పెషల్ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్‌ మూసారంబాగ్‌కు చెందిన జాహెద్‌ అలియాస్‌ అబ్దుల్‌.. హుమాయున్‌నగర్‌ వాసి మాజ్‌హసన్‌ ఫరూఖ్‌, సైదాబాద్‌ అక్బర్‌బాగ్‌కు చెందిన సమీయుద్దీన్‌పై కేసు నమోదు చేసింది.

హైదరాబాద్‌లోని రద్దీప్రాంతాల్లో పేలుళ్లకు, ఉగ్రదాడులకు జాహెద్‌ బృందం కుట్ర పన్నుతోందనే సమాచారంతో ఈ ముగ్గురినీ హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు గతేడాది అక్టోబరులోనే రిమాండ్‌ చేయటం తెలిసిందే. హైదరాబాద్‌లో ఉగ్రదాడులకు పాకిస్థాన్‌ నుంచి హవాలా రూపంలో నిధులతోపాటు మందుగుండు సామగ్రి సమకూరిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కేసు తీవ్రత దృష్ట్యా ఎన్‌ఐఏ తాజాగా రంగంలోకి దిగింది.

ఉగ్రకుట్రలకు సంబంధించి జాహెద్‌పై గతంలో పలు కేసులు నమోదయ్యాయి. 2005లోనే హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయం పేల్చివేత కేసులో జైలుకెళ్లాడు. 2004లో రైట్‌వింగ్‌ కార్యకర్తల హత్యకు కుట్రతోపాటు 2012లో జైలు సిబ్బందిపై దాడి ఘటనల్లోనూ అతడిపై కేసులున్నాయి. 2005 నుంచి 2017 వరకు జైల్లోనే ఉన్నాడు. టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయం పేల్చివేత కేసును న్యాయస్థానం కొట్టేయడంతో 2017 ఆగస్టు 10న విడుదలయ్యాడు. విడుదలయ్యాక కూడా జాహెద్‌ ఉగ్ర ప్రణాళిక రచనల్లో మునిగితేలినట్లు ఇటీవలే హైదరాబాద్‌ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

నల్గొండలో వైభవంగా ప్రారంభమైన లింగమంతుల జాతర హాజరైన మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

వైభవంగా ప్రారంభమైన గొల్లగట్టు లింగమంతుల స్వామి జాతర

 సంప్రదాయ డోలు వాయించిన చైర్మన్ సైదిరెడ్డి

నల్లగొండ: నల్గొండ పట్టణంలో మర్రిగూడ గొల్లగట్టు లింగమంతుల స్వామి జాతర వైభవంగా ప్రారంభించారు. నల్గొండ మున్సిపల్ చైర్మన్ సంప్రదాయ డోలు వాయించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవుల కులదైవమైన

గొల్లగట్టు లింగమంతుల స్వామి జాతర ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా నిర్వహిస్తారని తెలియజేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు వట్టిపల్లి శ్రీనివాస్, ఊట్కూరు వెంకట్ రెడ్డి*,ముఖ్యనాయకులు దోనాల నాగార్జున్ రెడ్డి, మెండే చంద్రశేఖర్ రెడ్డి, వివేక్ రెడ్డి, పద్మ, కైరంకొండ శివశంకర్, సత్యనారాయణ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కేసులు తప్పవు బహిరంగంగా మద్యం సేవిస్తే జైలుకు పంపుతాం:టూటౌన్ SI రాజశేఖర్ రెడ్డి.

ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కేసులు తప్పవు

బహిరంగంగా మద్యం సేవిస్తే జైలుకు పంపుతాం

మైనర్లకు బైకులు ఇస్తే తల్లిందండ్రులదే బాధ్యత 

ఆకతాయిలపై ఆకస్మిక దాడులు 

 

నల్లగొండ: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని నల్లగొండ టూటౌన్ ఎస్ఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి హెచ్చరించారు. అర్థరాత్రి సమయంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై శనివారం రాత్రి ఆకస్మికంగా దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. టుటౌన్ ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ పట్టణ ప్రాంతంలో అర్థరాత్రి ఆవరాగా తిరుతుగున్న వారిపై నిఘా ఉంచారు. దీనిలో భాగంగానే శనివారం అర్థరాత్రి బహరంగా ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ, స్థానికులను ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై తమ సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించారు. మద్యం సేవించిన అనంతరం భారీ శబ్ధాలు చేస్తూ బైక్ రేసింగ్ లకు పాల్పడుతున్న యువకులను అదుపులోకి తీసుకున్నారు. అర్థరాత్రి సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న ఆకతాయిలపై 15 కేసులు, డ్రంకెన్ డ్రైవ్ లో10 మందిపై కేసులు నమోదు చేసి, 23 సెల్ ఫోన్లను సీజ్ చేశారు. రాత్రి సమయంలో మైనర్లకు బైకులు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజలు నిద్రిస్తున్న సమయంలో పట్టణ ప్రాంతంలో మద్యం సేవించినా, న్యూసెన్స్ కలిగిస్తూ భారీ శబ్ధాలతో బైక్ రైడింగ్ లకు పాల్పడుతున్నవారిపై తమకు సమాచారం అందించాలని ఎస్ఐ స్థానిక ప్రజలకు కోరారు.

ఈనెల 9న చలో హైదరాబాద్ జయప్రదం చేయండి: పాలడుగు ప్రభావతి

ఈనెల 9న చలో హైదరాబాద్ జయప్రదం చేయండి

    పాలడుగు ప్రభావతి ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పిలుపు.

  

ఇంటి స్థలాలు ఇంటి నిర్మాణం కి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చలో హైదరాబాద్ జయప్రదం చేయాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి అన్నారు. ఈ రోజు ఐద్వా జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షురాలు పోలేబోయిన వరలక్ష్మి అధ్యక్షతన స్థానిక దొడ్డి కొమరయ్య భవనంలో జరిగింది.ఈ సందర్భంగా ప్రభావతీ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుపేదలు ఇంటి స్థలాలు లేక స్థలమున్న ఇల్లు నిర్మాణం చేసుకోలేక సతమత మవుతున్నారని ఇరుకైన ఇండ్లలో కాలం వెల్లదీస్తున్నారని ఇంటి స్థలాల సమస్యపై ఐక్య ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నామాని వేలాదిగా ప్రజలు తరలివచ్చి జయప్రదం చేయాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల మేనిఫెస్టోలలో ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇస్తామని వాగ్దానాలు చేశారని బడ్జెట్ లో కేటాయింపులు చేయలేదని అన్నారు. నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సొమ్మును లూటీ చేస్తుందని పెట్టుబడుదారులకు అప్పనంగా కట్టిపెడుతుందని పేదల సంక్షేమానికి రూపాయి ఖర్చు చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వ ఆధీనంలో వేలాది ఎకరాల భూములు ఉన్నాయని అయినప్పటికీ చిత్తశుద్ధితో వాటిని పేదలకు అందివ్వ లేదని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఐద్వా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు సమీకరించినున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నాలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు.

   జిల్లా కమిటీ సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు పోలేబోయిన వరలక్ష్మి రాష్ట్ర కమిటీ సభ్యురాలు జిట్టా సరోజ జిల్లా ఆఫీసు బేరర్స్ తుమ్మల పద్మ ,భూతం అరుణ, కారంపూడి ధనలక్ష్మి ,జిల్లా కమిటీ సభ్యురాలు ఎండి సుల్తానా ,గోలి వెంకటమ్మ , సైదమ్మ ,నాగమణి, శాంతమ్మ , తదితరులు పాల్గొన్నారు.

ఆర్ కృష్ణయ్య గారి తనయుడి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న నలగొండ బీసీ సంక్షేమ సంఘం నాయకులు

ఘణంగా బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు టైగర్ R కృష్ణన్న గారి తనయుడు జాతీయ విద్యార్థి -యువజన సంఘాల కోఆర్డినేటర్ డాక్టర్ R అరుణ్ కుమార్ గారి జన్మదిన వేడుకలను స్థానిక బిసి స్టడీ సర్కిల్ హాస్టల్లో జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో కేకు కట్చేసి ,స్వీట్స్ పంపిణి చేసి జరిపారు .ఈ కార్యక్రమములో జిల్లా కార్యదర్శి వడ్డెబోయిన సైదులు ,విద్యార్థి సంఘం సింగం రమేశ్ యాదవ్ ,యువజన సంఘం జిల్లా ఉపాద్యక్షుడు పగిళ్ల కృష్ణ ,మహిలా మండలాధ్యక్షురాలు శంకరదుర్గ ,సతీశ్ ,తుంగతుర్తి శంకరా చారీ తదితరులు పాల్గొన్నారు.