/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz TG: గ్రూప్-2 పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ Mane Praveen
TG: గ్రూప్-2 పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

జగిత్యాల జిల్లా: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఆదివారం ప్రారంభం అయ్యాయి. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల లో అరుణోదయ కాలేజ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు, జగిత్యాల ఎస్ కె ఎన్ ఆర్ కాలేజ్, జేఎన్టీయూ కళాశాలలో  ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలించారు. నిబంధనలు పక్కాగా పాటిస్తున్నారా లేదా అన్నది గమనించి పలు సూచనలు చేశారు. కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ సాఫీగా పరీక్షలు నిర్వహించాలని అన్నారు.

ఆదివారం ఉదయం సెషన్ లో జరిగిన  పరీక్షకు జిల్లాలో మొత్తం 10,907 మంది అభ్యర్థులకు గాను, 5274 మంది హాజరు కాగా, 5633 మంది గైర్హాజరు అయ్యారని వివరించారు.

ఆది, సోమవారాలలో ఉదయం, మధ్యాహ్నం చొప్పున మొత్తం నాలుగు సెషన్ లలో జరిగే గ్రూప్-2 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, పకడ్బందీగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వెల్లడించారు.
NLG: జీపీ కార్మికుల చలో హైదరాబాద్ ను జయప్రదం చేయండి: సిఐటియు జిల్లా అధ్యక్షులు
నల్లగొండ: గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు, పర్మినెంట్, ఇతర పెండింగ్ సమస్యల సాధన కోసం ఈ నెల 17 న జరిగే, చలో హైదరాబాద్ కు కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని,  తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం గ్రామపంచాయతీ కార్మికుల జిల్లా విస్తృత సమావేశం స్థానిక దొడ్డి కొమరయ్య భవన్ లో జిల్లా అధ్యక్షుడు పోలె సాంబయ్య అధ్యక్షతన జరిగింది.

సీఐటీయూ జిల్లా నాయకులు పి.సత్యనారాయణ, పొన్న అంజయ్య, పి.సర్వయ్య, ఎర్ర అరుణ, లింగయ్య, కె.మంగా రెడ్డి, నరసయ్య, జానయ్య, రామలింగయ్య, ఎం.డి జహీర్, పి.చంద్రయ్య, అనుక్, బాలమ్మ మంజుల, సైదులు, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
'మన పిల్లల్ని మనం ఇంట్లో ఎలా చూసుకుంటామో హాస్టల్లో ఉండే పిల్లల్ని సిబ్బంది అలాగే చూసుకోవాలి'
నల్లగొండ జిల్లా:
మునుగోడు నియోజకవర్గం, చౌటుప్పల్ లోని తెలంగాణ గురుకుల బాలికల పాఠశాలలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పెంచిన డైట్ చార్జీల పెంపు కార్యక్రమాన్ని, శనివారం గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండ్ ఎన్.శుభం ప్రకాష్ ఐపీఎస్ తో కలిసి మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి  ప్రారంభించారు. ఈ మేరకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మెస్ చార్జీల పెంపు అనేది ఎప్పటినుండో ఉన్న డిమాండ్, దానిని ప్రజా ప్రభుత్వం నెరవేర్చిందని తెలిపారు. మన పిల్లల్ని మనం ఇంట్లో ఎలా చూసుకుంటామో హాస్టల్లో ఉండే పిల్లల్ని సిబ్బంది అలాగే చూసుకోవాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే  విద్యార్థినులు మరియు వారి తల్లి తల్లిదండ్రులతో కలిసి హాస్టల్లో సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, గురుకుల పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
NLG: ఘనంగా మెస్ చార్జీల పెంపు కార్యక్రమం.. సహపంక్తి భోజనం చేసిన అధికారులు, పేరెంట్స్ కమిటీ
నల్లగొండ: ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థుల మెస్ చార్జీల పెంపు కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించాలని సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణి పిలుపు మేరకు, ఈరోజు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల (బాలుర) చండూర్ నందు కార్యక్రమం .ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పేరెంట్స్ కమిటి సభ్యులు,  ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా  పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కే.గిరిధర్ విచ్చేసి పాఠశాల కిచెన్ రూమ్,, డార్మెటరీ మరియు బాత్రూంలు,తరగతి గదులు అన్ని పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేసినారు. అనంతరం సమావేశంలో పాల్గొని రాష్ట ప్రభుత్వం విద్యార్థులకు 40% మేర పెంచిన మెస్ చార్జీలను గురించి తల్లిదండ్రులకు వివరించారు. తదుపరి విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులతో కలిసి సహపంక్తి భోజనం చేసారు. ఈ కార్యక్రమంలో పాఠశాల/కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ స్వామి,పేరెంట్స్ కమిటి అధ్యక్షులు గ్యార యాదగిరి, ఉపాధ్యక్షులు సుష్మ, జనరల్ సెక్రెటరీ అద్దంకి కిరణ్, సెక్రెటరీ సుధా, కమిటీ మెంబర్ రాజు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు పాఠశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు.
ఈ నెల 22 న పుడమి పుత్ర అవార్డుల ప్రధానం
నల్లగొండ: డిసెంబర్ 22న యాదగిరిగుట్టలో గాంధీ విజ్ఞాన సదస్సు పేరుతో, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి సారధ్యంలో, రైతు సదస్సు నిర్వహించనున్నామని.. అందులో ఆదర్శ రైతులకు 'పుడమి పుత్ర' అవార్డు ప్రధానం జరగనున్నదని, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి అన్నారు, శనివారం స్థానిక మైత్రి కోచింగ్ సెంటర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. డిసెంబర్ 22న యాదగిరిగుట్ట లోని రెడ్డి సంక్షేమ సంఘ భవనం లో రైతు సదస్సు నిర్వహిస్తున్నామని, పది రాష్ట్రాల నుంచి 115 మంది సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు మరియు ప్రత్యక్షంగా పరోక్షంగా రైతులకు సహకరిస్తున్న శాస్త్రవేత్తలు, జర్నలిస్టు లకు 'కిసాన్ సేవా రత్న' అవార్డులు అందజేయనున్నామని తెలిపారు. ఈ మేరకు  రైతు సదస్సు కన్వీనర్ పడమటి పావని మాట్లాడుతూ.. కార్యక్రమంలో రైతుల ఉత్పత్తులు ప్రదరిస్తున్నామని, గ్రామ నిర్మాతల ఉత్పత్తుల ప్రదర్శన, చరఖ ప్రదర్శన మరియు ఫీట్ పొడవు గల 500 మహాత్మా గాంధీ విగ్రహాల ప్రదర్శన నిర్వహించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో నమోదు కాబోతున్నామని తెలిపారు. గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు లో ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ చీప్ విప్  బీర్ల ఐలయ్య ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు.

విలేకరుల సమావేశంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ మెరుగు మధు, రాష్ట్ర క్రీడా విభాగం కన్వీనర్ బొమ్మ పాల గిరిబాబు, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మాటూరి అశోక్, కొత్త బాలరాజు, యానాల అనిత, పాముల అశోక్ ముదిరాజ్, అజీజ్ ,జ్యోతి, వెంకట్ రెడ్డి,రవి తదితరులు పాల్గొన్నారు.
నూతన బస్సు సర్వీస్ లను ప్రారంభించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నల్గొండ జిల్లా:
మునుగోడు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మాహా లక్ష్మి పథకాన్ని నియోజకవర్గంలోని అన్ని గ్రామాల మహిళలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కే.జానీ రెడ్డి, డిప్యూటీ రీజినల్ మేనేజర్ (యం) శివశంకర్, నల్లగొండ డిఎం శ్రీనాథ్ లతో కలిసి 6 కొత్త బస్సులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మునుగోడు నియోజకవర్గంలో బస్సు సౌకర్యం లేని వివిధ గ్రామాలకు బస్సులను నడిపించాలని, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇటీవల  ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరిక మేరకు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ 6 కొత్త బస్సులను నల్గొండ రీజియన్ కు ఇవ్వడం జరిగింది.

నూతనంగా ప్రారంభించిన ఇట్టి బస్సు సర్వీస్ ల  వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

1) దేవరకొండ నుండి మల్లేపల్లి, ముష్టిపల్లి, నాంపల్లి, మర్రిగూడ, శివన్నగూడెం, చౌటుప్పల్, వలిగొండ ద్వారా యాదగిరిగుట్ట.

2) దేవరకొండ నుండి మల్లేపల్లి, రేవల్లి, నాంపల్లి, మాల్ ద్వారా హైదరాబాద్.

3) దేవరకొండ నుండి మల్లేపల్లి, ముష్టిపల్లి, నాంపల్లి, చండూర్, మునుగోడు, కాంచనపల్లి ద్వారా నల్గొండ.

4) నల్గొండ నుండి కొంచనాపల్లి, మునుగోడు, చొల్లేడు, గట్టుప్పల్, శివన్నగూడ, మర్రిగూడ ద్వారా మాల్.

5) నల్గొండ నుండి కొంచనాపల్లి, మునుగోడు, వెల్మకన్నె, శివన్నగూడ, లోయపల్లి, రంగాపూర్ ద్వారా ఇబ్రహీంపట్నం.

6) నల్గొండ నుండి కనగల్, చండూర్, లెంకలపల్లి, మర్రిగూడ ద్వారా మాల్

కాగా, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కృషి వల్ల మునుగోడు నియోజకవర్గానికి ఆరు కొత్త బస్సులు రావడం పట్ల ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
TG: ప్రజా భవన్ లో ప్రజావాణికి 441 దరఖాస్తులు
HYD: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 441 దరఖాస్తులు అందాయి.

పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 110, మైనార్టీ సంక్షేమ శాఖకు సంబంధించి 76, రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 71, విద్యుత్ శాఖకు సంబంధించి 57, హోం శాఖకు సంబంధించి 23, ఇతర శాఖలకు సంబంధించి 104 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రజాపాలన ప్రత్యేక అధికారి దివ్య ఐఏఎస్ పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు. ప్రజా భవన్ కు వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ఈ మేరకు సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
TG:  బాసర ట్రిపుల్ ఐటీకి కోటి రూపాయల నిధులు మంజూరు చేయాలని కలెక్టర్ ను ఆదేశించిన మంత్రి సీతక్క
నిర్మల్ జిల్లా:
బాసర ట్రిపుల్ ఐటీని మంత్రి సీతక్క శుక్రవారం సందర్శించారు. కాన్ఫరెన్స్ హాల్లో విద్యార్థులతో ముఖాముఖి భేటీలో పాల్గొన్నారు. నాణ్యమైన ఆహారం, మినీస్టేడియం, ఫ్యాకల్టీ, స్కాలర్షిప్, ల్యాప్టాప్ లు, డ్రైనేజీ వ్యవస్థ, ఆస్పత్రి సిబ్బంది వంటి విషయాలపై చర్చించారు. త్వరలోనే విద్యార్థుల సమస్యల గురించి ముఖ్యమంత్రితో చర్చించి సమస్యలను పరిష్కరిస్తామని హామి ఇవ్వడం జరిగింది. తక్షణమే కోటి రూపాయల నిధులు ట్రిపుల్ ఐటీకి మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ను మంత్రి సీతక్క ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల , ఎమ్మెల్సీ దండే విట్టల్, ట్రిపుల్ ఐటీ వీసీ గోవర్ధన్,  అధికారులు పాల్గొన్నారు.
NLG: సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలి: సిపిఐ
నల్గొండ: సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు.శుక్రవారం  జిల్లా కలెక్టర్  కార్యాలయం ముందు ముందు  సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న 4వ రోజు నిరవధిక  సమ్మె శిబిరానికి హాజరై మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. విద్యాశాఖలోని సమగ్ర శిక్ష  మన రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నదని, ఇందులో పనిచేస్తున్న ఉద్యోగులను రోస్టర్, మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, మరియు రాత పరీక్ష ద్వారా జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉన్న కమిటీ చే ఇంటర్వ్యూలలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి వివిధ స్థాయిలలో విధులు నిర్వహిస్తున్నారు.

గత 18 నుండి 20 సంవత్సరాలుగా సర్వ శిక్ష ఉద్యోగులు పాఠశాల విద్య అభివృద్ధి కోసం వారి నైపుణ్యాన్ని మరియు కృషిని అందిస్తున్నారు. వీరిలో చాలామంది ఆర్థికంగా వెనుకబడిన పేద మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే పర్మినెంట్ చేయాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని,  పే స్కేల్ వర్తింపచేయాలని, ప్రతి ఉద్యోగి కి జీవిత బీమా 10 లక్షలు ,ఆరోగ్య బీమా 10 లక్షలు సౌకర్యం కల్పించాలని, పదవి విరమణ చేస్తున్న వారికి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.  

రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం సర్వ శిక్ష ఉద్యోగుల ను వెంటనే రెగ్యులైజేషన్ కు కావలసిన చర్యలను చేపట్టాలని అనేకమార్లు ముఖ్యమంత్రిని వివిధ రాష్ట్ర ,జిల్లా అధికారులకు విన్నవించినప్పటికీ వారి నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో  రాతపూర్వకంగా సమ్మె నోటిస్ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే సమ్మెలోకి వెళ్ళామని.. తక్షణం ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించి సమస్య పరిష్కారానికి చొర చూపాలని ప్రభుత్వానికి కోరారు.

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెపుతున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకుండా శ్రమదోపిడికి పాల్పడుతున్నాయని ఆరోపించారు. కాంట్రాక్టు వ్యవస్థ దోపిడి వ్యవస్థ అని.. కాంట్రాక్టు వ్యవస్థను రద్దుచేసి అందులో పని చేస్తున్న వారందరిని పర్మినెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలతో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఓటు వేసి గెలిపించారని, ఆ నమ్మకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వమ్ము కాకుండా కాపాడుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సర్వ శిక్ష ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని అన్నారు.

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మెలుగురి కృష్ణ, ప్రధాన కార్యదర్శి బొమ్మగాని రాజు, క్రాంతి లింగయ్య, వివిధ కేటగిరి ల ఉద్యోగ కార్మికులు పాల్గొన్నారు.
NLG: పాఠశాల విద్యార్థులకు జామెట్రీ బాక్సులు పంపిణీ
నల్గొండ: పట్టణంలోని బొట్టుగూడ ఉన్నత పాఠశాలలో ప్రముఖ పారిశ్రామికవేత్త వైఆర్పీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎలిశాల రవి ప్రసాద్ జన్మదిన వేడుకలను విద్యార్థుల మధ్యన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ కౌన్సిలర్ యామా కవితా దయాకర్ లు పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి విద్యార్థులందరికీ జామెంట్రీ బాక్స్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యామా కవితా దయాకర్ మాట్లాడుతూ.. వై ఆర్ పి ఫౌండేషన్ ద్వారా రవిప్రసాద్ బీద విద్యార్థుల ఉన్నత చదువుల కొరకు చేయూతనివ్వడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుల పంపిణీ మరియు కరోనా కష్టకాలంలో ప్రైవేటు ఉపాధ్యాయులకు చేయూతనివ్వడం ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలతో ముందరికి వెళ్తున్నారని, ముఖ్యంగా బీద విద్యార్థుల చదువుల కొరకు ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలిపారు.

ప్రధానోపాధ్యాయులు తీగల శంకరయ్య మాట్లాడుతూ.. వై ఆర్ పి ఫౌండేషన్ వారు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సహాయ సహకారాలు అందించాలనే సంకల్పంతో ముందరికి రావడం ఎంతో అభినందనీయమని కొనియాడారు.

ఫిజికల్ డైరెక్టర్ బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ.. ఎలిషాల రవిప్రసాద్ బహుముఖప్రజ్ఞాశాలిగా, విద్యావేత్తగా, పారిశ్రామికవేత్తగా, పర్యావరణవేత్తగా, ఆధ్యాత్మికవేత్తగా, క్రీడా బాంధవుడిగా ఎన్నో సమాజహిత కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారని, వారికి పాఠశాల తరఫున ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మన్సూర్అలీ, వినాయక్, రాములు, సుధారాణి, కుశలకుమారి,
మైమూన బేగం, పి.ఆర్.టి.యు అర్బన్ శాఖ మాజీ అధ్యక్షులు గాదే వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.