/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి Mane Praveen
NLG: నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండలం, శివన్న గూడెం లో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న  నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి, మంగళవారం కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

పాత గ్రామపంచాయతీ భవన  ఆవరణ మొత్తం కలియతిరిగి నూతనంగా నిర్మించే భవనానికి పలు మార్పులు సూచించారు.

శివన్నగూడెంలో త్వరలోనే మహిళా సమాఖ్య భవన్, సబ్ సెంటర్, రెండు అంగన్వాడి కేంద్రాలకు కొత్త భవనాలు నిర్మిస్తామని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ భవన నిర్మాణాలు ఉంటాయని తెలిపారు.

అదేవిధంగా  చర్లగూడెం రిజర్వాయర్ లో  ముంపుకు గురైన నిర్వాసితులు  బయట ఇల్లులు నిర్మించుకోవడానికి  అనుమతులు ఇవ్వాలని మర్రిగూడెం ఎమ్మార్వో, స్థానిక పంచాయతీ సెక్రెటరీ లను ఆదేశించారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాస్ శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి లు మేతరి యాదయ్య, పలువురు నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
NLG: రాజ్యాంగం ప్రజలనే ప్రభువులుగా పేర్కొంది: దుచ్చర్ల
నల్లగొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో రాజనీతి శాస్త్రం విభాగం, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన జలసాధన సమితి వ్యవస్థాపకులు దుచ్చర్ల సత్యనారాయణ మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రజలనే ప్రభువులుగా పేర్కొందని,పౌరులకు స్వేచ్ఛను ప్రసాధించడంలో భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఉత్తమమైనదని అన్నారు. ఈ సందర్బంగా భారత రాజ్యాంగ పీఠకను విద్యార్థులచే చదివించారు.

కార్యక్రమంలో ప్రిన్సిపాల్  ఉపేందర్, వైస్ ప్రిన్సిపాల్ రవికుమార్, రాజనీతిశాస్త్ర విభాగం అధ్యక్షులు ఆదె మల్లేశం, ఎన్ ఎస్ ఎస్ ఆఫీసర్లు వెంకట్ రెడ్డి, అనిల్ బొజ్జ, శివరాణి, ఎన్ సి సి ఆఫీసర్ సుధాకర్, పరీక్షల నియంత్రణధికారి నాగరాజు, అధ్యాపకులు మునిస్వామి, వెల్దండి శ్రీధర్, విద్యార్థులు పాల్గొన్నారు.
NLG: రోడ్డుపై బైఠాయించి నిరసన
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ: మండల కేంద్రంలోని చౌరస్తాలో, సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలని, కనీస వేతన చట్టం అమలు చేయాలని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే ఇవ్వాలని, సమాన పనికి సమానం వేతనం ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు మట్టం భాగ్యమ్మ, మంజుల, తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండలో రాజ్యాంగం పత్రాలు పంపిణీ
నల్లగొండ: భారత రాజ్యాంగం ఆమోదించిన రోజు సందర్భంగా.. జిల్లా కేంద్రంలోని మాస్టర్ స్కూల్ లో సంవిదాన్ దివస్ కార్యక్రమం   నిర్వహించారు. ఈ మేరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగించడానికి ప్రజాస్వామ్య పరిరక్షణ సేవా సమితి అధ్యక్షుడు పాశం నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో రాజ్యాంగ పీఠిక పత్రాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా  ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్, సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్, న్యాయవాది చింత యాదగిరి, మాస్టర్ స్కూల్ ప్రిన్సిపల్ అలువాల ప్రభాకర్, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
NLG: విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ని కలిసిన బొమ్మపాల గిరిబాబు
నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి, జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో, ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో భాగంగా నల్గొండకు విచ్చేసిన విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఐఏఎస్ ను ఫిజికల్ డైరెక్టర్ బొమ్మపాల గిరిబాబు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ మేరకు పాఠశాల విద్యలో ప్రధాన అంతర్భాగమైన క్రీడలను బలోపేతం చేయాలని, పాఠశాల క్రీడా విభాగానికి అధిక నిధులు కేటాయించి, క్షేత్రస్థాయి నుండే క్రీడాకారులు తయారయ్యే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని విద్యా కమిషన్ చైర్మన్ ను కోరారు.

విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సానుకూలంగా స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యలో అంతర్భాగమైన ప్రతి వ్యవస్థను బలోపేతం చేస్తూ, పాఠశాల విద్యా వ్యవస్థను అత్యున్నతంగా తీర్చిదిద్దుతుందని తెలిపారు.
NLG: బీఎస్పీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
నల్గొండ జిల్లా కేంద్రంలో, బీఎస్పీ ఆధ్వర్యంలో మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షులు మామిడి సైదులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి బొడ్డు కిరణ్, విశిష్ట అతిథులుగా కత్తుల కాన్షీరామ్ హాజరై రాజ్యాంగ విశిష్టతను, డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తక్కెళ్ళపల్లీ శ్రీను, భీమ్ ప్రసాద్, యాదగిరి, మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి నేరళ్ళ ప్రభుదాస్, శోభ, దినేష్, రవిశంకర్, రాము తదితరులు పాల్గొన్నారు.

                     
NLG: ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో ఘనంగా 75 వ రాజ్యాంగ దినోత్సవ వేడుక
నల్లగొండ జిల్లా, కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తాలూకా కమిటీ కన్వీనర్ జిల్లా రాములు ఆధ్వర్యంలో, అంబేద్కర్ విగ్రహం వద్ద భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొండమల్లేపల్లి ఎస్ఐ రామ్ మూర్తి యాదవ్ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, భారత రాజ్యాంగ పీఠిక ను ప్రతిజ్ఞ చేశారు.

ఈ మేరకు ఎస్ఐ రామ్ మూర్తి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ ద్వారా నిర్వహించడం అభినందనీయమన్నారు. భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అన్నారు.

ప్రపంచ దేశాల కెల్లా భారత రాజ్యాంగం దృఢమైనటువంటిది, గొప్పది అని, యావత్ దేశ ప్రజలకు భారత రాజ్యాంగం ద్వారా  ప్రాథమిక హక్కులు, విధులు అందించిన మహోన్నతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ రచన కర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.

భారతదేశంలో ప్రజలందరికీ హక్కులను ఇచ్చి మనిషిని మనిషిగా చూసే గొప్ప సంకల్పాన్ని భారత రాజ్యాంగం ద్వారా కల్పించబడ్డదని అన్నారు.

కొండమల్లేపల్లి విఓ డాకు నాయక్, ఆ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దళిత రత్న డా. బుర్రి వెంకన్న మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులను కల్పించిందని అన్ని కులాల జాతుల వారికి సమాన హక్కులను కల్పించినటువంటి భారత రాజ్యాంగం గొప్పతనం గురించి కొనియాడారు.

ఈ కార్యక్రమంలో బహుజన మేధావి డాక్టర్ ఏకుల రాజారావు, ఏఐఎస్ఎస్డి నాయకులు ధర్మపురం శ్రీను, ఏకుల సురేష్, గ్యార యాదగిరి, డివిజన్ నాయకులు ఊరే సురేష్, చేపూరి రాజేష్, వెంకన్న, కూర సాలయ్య, అన్యపాక సంజీవ, కొండమల్లేపల్లి మండల కన్వీనర్ మేదరి ప్రసాద్, చేపురి లక్ష్మయ్య, ఆడెపు శోభన్ బాబు, ఇరిగి రవి, సహదేవ్, చంటి, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పెరిక విజయ్ కుమార్, డీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి పెరిక వెంకటేశ్వర్లు, కందుల చంటి, తదితరులు పాల్గొన్నారు
NLG: అంగన్వాడి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండలం, కొట్టాల గ్రామంలో రూ.12 లక్షలు అంచనా వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడి భవన నిర్మాణానికి, మంగళవారం స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని, మూడు లేదా నాలుగు గ్రామాల కలిపి ఒక పెద్ద స్కూల్ నిర్మించుకుని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసుకుందామని అన్నారు.

కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాస్ శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి లు మేతరి యాదయ్య, పాశం సురేందర్ రెడ్డి, మాల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నక్క శ్రీను యాదవ్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు కంచుకట్ల సంపత్, ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ కంచుకట్ల సుభాష్,  ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

NLG: 5.7 కి.మీ. బీటీ రోడ్డు ను ప్రారంభించిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా:
నేడు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజా పాలన విజయోత్సవాల లో భాగంగా, మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలం దేవత్ పల్లి గ్రామంలో.. సాగర్ హైవే దేవత్ పల్లి గేటు నుండి శర్బాపురం గ్రామం వరకు 4 కోట్ల 35 లక్షల వ్యయంతో  నూతనంగా నిర్మించిన 5.7 కిలోమీటర్ల బీటీ రోడ్డు ను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ప్రారంభించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఈ రోడ్డుపై ప్రయాణించే పది గ్రామాల ప్రజలు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకురాగా.. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, రోడ్డు నిర్మాణ పనులు మంజూరు చేయించి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయించారు. ఈ మేరకు స్థానిక 10 గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కార్య దీక్షత పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
NLG: నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
నల్లగొండ జిల్లా:
దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం చింతపల్లి మండలం, వింజమూరు (ధైర్యపురితండా)కు  విచ్చేసి నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

నేడు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని, ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా ఎమ్మెల్యే బాలు నాయక్ ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.