రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
గౌతమ్ అదానీపై అవినీతి ఆరోపణలపై వెల్లువెత్తుతున్న సమయంలో తాము చేసుకున్న ఒప్పందాలు, విరాళంపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం ప్రకటించారు.
ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన గౌతమ్ అదానీ కంపెనీ వ్యవహారంతో రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణకు ఇచ్చిన రూ.వంద కోట్ల విరాళాన్ని తిరస్కరించారు.
ఆ డబ్బులను తీసుకోవడం లేదని చెబుతూ లేఖ రాసినట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. అనవసర వివాదం జోలికి వెళ్లకూడదనే నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించినట్లు వెల్లడించారు.
న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై సోమవారం చర్చించిన అనంతరం రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమ్ అదానీ వ్యవహారంపై కీలక ప్రకటన చేశారు. 'గౌతమ్ అదానీ అంశంపై ఇప్పటికే చెప్పాను.
అయినా ఆరోపణలు చేస్తున్నారు అని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. యంగ్ ఇండియా పథకంలో రూ.100 కోట్లు నాకు చేరాయని చెబుతున్నారు. వివాదాల నేపథ్యంలో రూ.100 కోట్లను స్కిల్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దని వారికి లేఖ రాశాం అని వివరించారు.
Nov 25 2024, 20:06