NLG: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కస్తూరి ఫౌండేషన్ చేయూత
నల్లగొండ జిల్లా:
గుర్రంపోడు: మండలంలోని కొప్పోలు, నడికూడ,చేపూర్,పాల్వాయి,గుర్రంపోడ్,తేనెపల్లి,పోచంపల్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు, గురువారం కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీ చరణ్ చేతుల మీదగా నోట్ బుక్స్, స్టేషనరీ సామగ్రి ,గ్రామర్ బుక్స్,డిక్షనరీ వంటి విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా ఉపాధ్యాయులు శ్రీ చరణ్ ను ఘనంగా సన్మానించారు. శ్రీ చరణ్ మాట్లాడుతూ.. పేదరికంతో ఏ విద్యార్థి కూడా చదువుకు దూరం కావొద్దనే ఉద్దేశ్యంతోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఫౌండేషన్ ప్రారంభించిన నాటి నుండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. కస్తూరి ఫౌండేషన్ ద్వారా ఒక విద్యారంగాన్ని బాగుపర్చడమే కాకుండా వివిధ రంగాల్లో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు.
మన ఊరి బడులను మనమే బాగుపర్చుకోవాలని,తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్మాణం ఉంటుందన్నారు.మనలో బలమైన సంకల్పం ఉంటే ఏదైన సాధించగలమని, అదే సంకల్పంతో విద్యార్థులు కష్ట పడి చదివితే మంచి మార్కులు సాధిస్తారు అని తెలిపారు.
ఈ మేరకు ఉపాధ్యాయులు శ్రీ చరణ్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మహేష్, నవీన్ రెడ్డి నరేందర్ రెడ్డి, జహంగీర్,రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మధు, ముక్కముల సైదులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Nov 23 2024, 18:50