/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz ట్రెండ్స్ ప్రకారం, మహాయుతికి బంపర్ మెజారిటీ వస్తుంది, 200 కంటే ఎక్కువ సీట్లలో ఆధిక్యం, సంజయ్ రౌత్ ట్రెండ్‌లపై ప్రశ్నలు లేవనెత్తారు Raghu ram reddy
ట్రెండ్స్ ప్రకారం, మహాయుతికి బంపర్ మెజారిటీ వస్తుంది, 200 కంటే ఎక్కువ సీట్లలో ఆధిక్యం, సంజయ్ రౌత్ ట్రెండ్‌లపై ప్రశ్నలు లేవనెత్తారు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు రానున్నాయి. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రారంభ ట్రెండ్స్‌లో, మహావికాస్ అఘాడి కూటమి కంటే మహాయుతి కూటమి పెద్ద ఆధిక్యం తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. మహారాష్ట్రలో ఎన్డీయే సంఖ్య పెరుగుతోంది. దీని సీట్లు 215కి పెరిగాయి.

కాగా, ఎంవీఏ 59 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు, ఏదో తప్పు జరిగిందని శివసేన (యుబిటి)కి చెందిన సంజయ్ రౌత్ అన్నారు. ఇది ప్రజల నిర్ణయం కాదు. గెలుపు ఓటములు ఉంటాయి.

ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం మహారాష్ట్రలో బీజేపీ 124, శివసేన 55, ఎన్సీపీ 35, కాంగ్రెస్ 21, శివసేన యూబీటీ 19, ఎన్సీపీ(ఎస్పీ) 13, ఇతరులు 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

పార్టీ ధోరణి

బీజేపీ 125

శివసేన (షిండే) 55

NCP 35

SHS(UBT) 17

కాంగ్రెస్ 21

సంజయ్ రౌత్ ట్రెండ్‌లపై ప్రశ్నలు సంధించారు

ఎన్నికల ఫలితాల తొలి ట్రెండ్స్‌లో మహాయుతి ఆధిక్యంపై, శివసేన (యుబిటి) నాయకుడు సంజయ్ రౌత్ మాట్లాడుతూ, 'ఇది మహారాష్ట్ర ప్రజల నిర్ణయం కాదు. మహారాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో మాకు తెలుసు.

మహారాష్ట్రలో బీజేపీ జోరు

భారత దేశంలో సీట్ల పరంగా రెండో అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్ర ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది.ఇక మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు బీజేపీ కూటమి ముందంజలో ఉంది. మరోవైపు మహా వికాస్ అఘాడీ కూడా గట్టి పోటీ ఇస్తుంది.

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో కూటమి మెజారిటీ 32 సీట్ల దూరంలో ఆగిపోయింది. గత రెండు పర్యాయాలు పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ కూటమి.. మూడోసారి మిత్రపక్షాల వెన్నుదన్నుతో కేంద్రంలో అధికారం చెలాయిస్తోంది. అయితే.. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో హర్యానాలో బీజేపీ మూడోసారి అధికారం చేపట్టింది. మరోవైపు జమ్ము కశ్మీర్ లో ఎక్కువ ఓట్టు తెచ్చుకున్న పార్టీగా చరిత్ర తిరగరాసింది. బీజేపీ పనైపోయిందన్న వాళ్లు మూయించారు. హర్యారా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఫలితాలు వెలుబడిన వెను వెంటనే మహారాష్ట్రతో పాటు, జార్ఖండ్ కు ఎన్నికల నగారా మోగింది. ఈ నెల 13, 20న రెండు విడతల్లో జార్ఖండ్ లో పోలింగ్ జరిగింది.

మరోవైపు మహారాష్ట్రలోని 288 సీట్లకు ఈ నెల 20న ఎన్నికల జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి (ఎన్డీయే) కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తంగా కూటమి మొత్తంగా.. మహాయుతి దాదాపు సెంచరీ మార్క్ దాటి మెజారిటీకి చేరువలో 151 సీట్లలో ఉంది. బీజేపీ 55 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు శివసేన 34 సీట్లో ముందుంజలో ఉంది. మరోవైపు అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ 19 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది.

మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష మహా వికాస్ అఘాడీ 84 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తగా కాంగ్రెస్ పార్టీ 24 సీట్లు.. శివ సేన ఉద్ధవ్.. 10.. ఎన్సీపీ .. 12 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే.. మహారాష్ట్రలో మరోసారి బీజేపీ నేతృత్వంలో మహాయుతి అధికారంలోకి రావడం గ్యారంటీ అని చెప్పొచ్చు. మొత్తంగా 12 గంటల వరకు మొత్తంగా ఏ పార్టీ ఎన్ని సీట్లలో గెలవబోతుందో క్లియర్ పిక్చర్ రానుంది.

పోలీసులకు పవన్‌కల్యాణ్ ఆదేశం

తమ ఏన్డీఏ కూటమి ప్రభుత్వ పరిపాలన నాలుగు దశాబ్దాల నాటి ఫ్రేమ్‌వర్క్‌ను సమగ్రంగా మార్చేలా ఉంటుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ (నిషేధం) చట్టాన్ని తెచ్చిందని తెలిపారు. ఈ కొత్త చట్టంలో కఠినమైన జరిమానాలు, బాధితులకు పరిహారం, ప్రభుత్వ భూముల రక్షణ, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, నివారణ చర్యలు, మెరుగైన భూ రికార్డులు, టైటిల్ వెరిఫికేషన్, సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ ఉంటాయని అన్నారు.

రెవెన్యూ, పంచాయతీ, దేవాదాయ శాఖల పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలతోపాటు బలవంతపు భూసేకరణ ఘటనలపై తనకు చాలా ఫిర్యాదులు అందుతున్నాయని.. బాధితులు, సంబంధిత శాఖల నుంచి ఇలాంటి ఫిర్యాదులు అందిన వెంటనే పోలీసు శాఖ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ట్విట్టర్(ఎక్స్) లో ఓ పోస్ట్ చేశారు. తనకు వచ్చిన ఫిర్యాదుల్లో గణనీయమైన సంఖ్యలో కాకినాడతో పాటు ఏపీలోని ఇతర ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని అన్నారు.

అన్ని జిల్లాల కలెక్టర్లు, కాకినాడ పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నివేదికలను ప్రాధాన్యం ఇచ్చి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌లు, ఎస్పీలను‌ కోరారు. తమ ఏన్డీఏ కూటమి ప్రభుత్వ పరిపాలన నాలుగు దశాబ్దాల నాటి ఫ్రేమ్‌వర్క్‌ను సమగ్రంగా మార్చేలా ఉంటుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ (నిషేధం) చట్టాన్ని తెచ్చిందని తెలిపారు. ఈ కొత్త చట్టంలో కఠినమైన జరిమానాలు, బాధితులకు పరిహారం, ప్రభుత్వ భూముల రక్షణ, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, నివారణ చర్యలు, మెరుగైన భూ రికార్డులు, టైటిల్ వెరిఫికేషన్, సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ ఉంటాయని అన్నారు. తమ ఎన్డీఏ ప్రభుత్వం భూములను రక్షించడం, బాధితులకు న్యాయం చేయడం, రాష్ట్ర వనరులను రక్షించడంలో నేరస్థులను బాధ్యులను చేయడంలో కట్టుబడి ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తం చేసినట్లుగానే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా భ్రష్టు పట్టించిందని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. ఇటీవల సమీక్షలు నిర్వహించినప్పుడు ఈ పథకం అమల్లో అనేక అవకతవకలు బయటకు వచ్చాయని, వాటిపై లోతుగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి 100 రోజుల ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. కొత్తగా పేర్లు నమోదు చేసుకున్నవారికి 15 రోజుల్లోపు జాబ్‌ కార్డులు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.4,500 కోట్లతో 30 వేల అభివృద్ధి పనులు చేసి 7 కోట్ల పని దినాలు కల్పించామని తెలిపారు. ‘పల్లె పండుగ’ కార్యక్రమంలో 3 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 20 వేల మినీ గోకులం షెడ్లు, అవసరమైనచోట్ల వాటర్‌ హార్వెస్టింగ్‌ పనులు చేపట్టామని, వచ్చే సంక్రాంతిలోపు ఈ పనులన్నీ పూర్తి చేయాలనే బలమైన సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.

ప్రతి పంచాయతీలో సిటిజన్‌ ఇన్ఫర్మేషన్‌ బోర్డులు ఏర్పాటు చేశామని, జాబ్‌కార్డుల జారీలో అవకతవకలను అరికడతామన్నారు. 100 రోజులు పని కల్పించలేకపోతే పరిహారం చెల్లిస్తామన్నారు. తీరప్రాంత కోత నియంత్రణకు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తామని పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు.

పర్యావరణాన్ని పరిరక్షించుకొంటూనే పారిశ్రామిక అభివృద్ధి సాధించాలి. ఈ క్రమంలో మత్స్యకారుల జీవనోపాధికి ఇబ్బందులు లేకుండా చూస్తాం’ అని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ‘తీరం వెంబడి ఉన్న పరిశ్రమలు వ్యర్థాలను శుద్ధి చేసి, నిర్దేశిత ప్రాంతంలోనే వాటిని వదిలేలా చూస్తాం. తద్వారా మత్స్య సంపదకు నష్టం కలగకుండా చర్యలు చేపడతాం’ అని చెప్పారు. కాగా, 25 నుంచి జరగనున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై జనసేన ఎంపీలకు పవన్‌ సూచనలు చేశారు. కాగా, ప్రభుత్వ భూముల అక్రమణలు, దౌర్జన్యంగా భూ దురాక్రమణలపై అనేక ఫిర్యాదులు అందుతున్నాయని, బాధితులు, సంబంధిత శాఖల నుంచి ఇలాంటి ఫిర్యాదులు అందినపుడు వెంటనే స్పందించాలని పోలీస్‌ శాఖకు పవన్‌ కల్యాణ్‌ సూచించారు.

తుంగభద్రకు 33 గేట్లు ఒకేసారి మార్చేయాలి

తుంగభద్ర డ్యాం క్రస్ట్‌గేట్ల జీవిత కాలం అయిపోయింది మరమ్మతులతో కాలయాపన చేయడం సరైంది కాదు.

తుంగభద్ర డ్యాం క్రస్ట్‌గేట్ల జీవిత కాలం అయిపోయింది. మరమ్మతులతో కాలయాపన చేయడం సరైంది కాదు. మరో క్రస్ట్‌గేటు కొట్టుకుపోదని గ్యారెంటీ ఇవ్వలేం. అత్యాధునిక డిజైన్‌తో 33 క్రస్ట్‌గేట్లు కొత్తగా ఏర్పాటు చేయడమే పరిష్కారం’’ అని సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్‌ ఏకే బజాజ్‌ నేతృత్వంలోని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) నిపుణుల కమిటీ సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 33 గేట్లు ఏకకాలంలో మార్చడంపై తుంగభద్ర ప్రాజెక్టు బోర్డు(టీబీపీ బోర్డు) దృష్టి పెట్టింది. ఇలా ఒకేసారి 33 గేట్లు మార్చడం సాధ్యమేనా? ఎంత నిధులు కావాలి? అనే అంశంపై ఆరా తీసింది. దీనికి సంబంధించి డిసెంబరులోగా క్రస్ట్‌గేట్ల నిపుణులతో అధ్యయనం చేయించి, పూర్తిస్థాయి ప్రాజెక్ట్‌ నివేదిక(డీపీఆర్‌) తయారు చేయించాలని నిర్ణయించింది. ఈ మేరకు చైర్మన్‌ పాండే అధ్యక్షతన టీబీపీ బోర్డు పేర్కొంది. శుక్రవారం హోస్పెట్‌లో బోర్డు భేటీ జరిగింది. బోర్డు సెక్రెటరీ రామకృష్ణారెడ్డి, కర్ణాటక రాష్ట్ర సభ్యుడు కులకర్ణి, బోర్డు ఎస్‌ఈ నీలకంఠారెడ్డి, ఏపీ రాష్ట్ర సభ్యుడి తరఫున అనంతపురం జిల్లా హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ సీఈ నాగరాజు హాజరయ్యారు.

కేంద్ర ప్రభుత్వం తరఫున రిచామిశ్ర, తెలంగాణ సభ్యుడు, ఈఎన్‌సీ అనీల్‌ వర్చువల్‌గా పాల్గొన్నారు. జలాశయంలో పూడిక చేరడంతో 30 టీఎంసీలకు పైగా నీటి నిల్వ సామర్థ్యం కోల్పోయింది. ఆ నీటిని వినియోగించుకునేలా కర్ణాటక ప్రభుత్వం 31 టీఎంసీలతో నవలీ జలాశయం నిర్మాణానికి ప్రతిపా దిస్తోంది. దీనికి రూ.15 వేల కోట్ల వ్యయం అవుతుందని బోర్డు సమావేశంలో తెలిపింది. డీపీఆర్‌ను అధ్యయనం చేయాల్సి ఉండడంతో నవలీ రిజర్వాయర్‌కు ఏపీ అభ్యంతరం చెప్పింది. రాయలసీమ జిల్లాలకు తుంగభద్ర వరద జలాలు వినియోగించుకునేలా తుంగభద్ర ప్రధాన ఎగువ కాలువ(హెచ్చెల్సీ)కు సమాంతరంగా మరో కాలువ నిర్మించే తేల్చాలని పేర్కొంది. కాగా, తెలంగాణ ఈ రెండింటినీ వ్యతిరేకించినట్లు సమాచారం.

తుంగభద్ర బోర్డు అకౌంట్‌ ఫ్రీజ్‌ కావడంతో ఉద్యోగులు జీతాలు లేకుండా ఎలా పని చేస్తారు? బోర్డు సెక్రెటరీ, ఎస్‌ఈలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో మాట్లాడి తక్షణమే అకౌంట్‌ ఫ్రీజ్‌ తొలగించాలి’’ అని పాండే ఆదేశించారు. తుంగభద్ర దిగువ, ఎగువ కాలువల సీసీ లైనింగ్‌ కోసం రూ.400 కోట్లతో టెండర్లు పిలిచి.. అగ్రిమెంట్‌ చేసుకున్నారు. అయితే, ఏపీ ప్రభుత్వం ఇటీవల తెచ్చిన టెండర్ల జీవో(టెండర్లు దక్కించుకుని పనులు ప్రారంభించని వాటిని రద్దు చేసే అధికారం) బోర్డుకు వర్తించదని స్పష్టం చేశారు.

పవన్‌ను ఆలింగనం చేసుకున్న బొత్స

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు జరుగుతోన్న వేళ.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. మండలి వేదికగా నిన్నటి రోజున హాట్‌ కామెంట్లు చేసుకున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ..

ఈ రోజు ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ కారెక్కేందుకు వస్తుండటం చూసిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. ఎదురుగా వెళ్లి పవన్‌ను పలకరించారు.. పవన్ కల్యాణ్‌ తనవైపు వస్తుండటం చూసి ఎదురెళ్లి ఆలింగనం చేసుకున్నారు బొత్స.. మరోవైపు పవన్‌ వస్తుండడాన్ని చూసి పక్కకు వెళ్లిపోయారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, ఇతర వైసీపీ ఎమ్మెల్సీలు.

అయితే, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కారు ఎక్కేందుకు వస్తున్న సమయంలో పవన్ కంటపడి నమస్కారం చేశారు బొత్స సత్యనారాయణ.. ఇక, బొత్స స్పందనను చూసి ఆయనకు ఎదురెళ్లారు పవన్ కల్యాణ్‌.. అయితే, పవన్ కల్యాణ్‌ తనవైపు వస్తుండటం చూసి ఎదురెళ్లి ఆలింగనం చేసుకున్నారు బొత్స.. అంతే కాదు.. బొత్స భుజంపై తట్టి మర్యాదపూర్వకంగా కరచాలనం చేసి నమస్కారం పెట్టి అక్కడి నుంచి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కారువైపు వెళ్లిపోయారు.. అయితే, ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

రేపు రాజధాని రైతుల ప్లాట్లకు ఈ-లాటరీ

అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఇవ్వాల్సిన ప్యాకేజీ బ్యాలెన్స్‌ రిటర్నబుల్‌ ప్లాట్లను కేటాయించేందుకు సీఆర్‌డీఏ

అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఇవ్వాల్సిన ప్యాకేజీ బ్యాలెన్స్‌ రిటర్నబుల్‌ ప్లాట్లను కేటాయించేందుకు సీఆర్‌డీఏ అధికారులు నవంబరు 23వ తేదీన ఈ-లాటరీ నిర్వహిస్తున్నారు.

విజయవాడలోని సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలో శనివారం ఈ-లాటరీ నిర్వహిస్తారు. రాజధానిలోని 9 గ్రామాల రైతులకు ఆన్‌లైన్‌ ర్యాండమ్‌ సిస్టమ్‌ (ఓఆర్‌ఎస్‌) ద్వారా రిటర్నబుల్‌ ప్లాట్లను కేటాయిస్తారు.

భారీ ఎన్ కౌంటర్ 10మంది మావోయిస్టుల మృతి

ఛత్తీస్ ఘ‌డ్ లోని సుక్మాలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంట‌ర్ లో 10మంది మావోయిస్టులు మృతిచెందారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన కేటీఆర్

పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ విషయంలో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒకలా, గల్లీలో మరోలా మాట్లాడున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.

పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒకలా, గల్లీలో మరోలా మాట్లాడున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అదానీ విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలంతా రెండు నాలుకల ధోరణితో ఉన్నారని కేటీఆర్ మండిపడ్డారు. అదానీతో తెలంగాణ సర్కార్ చేసుకున్న ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. "అదానీ అవినీతిపరుడైతే సీఎం రేవంత్ రెడ్డి నీతిపరుడు ఎలా అవుతాడో రాహుల్ గాంధీ చెప్పాలి. రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే అదానీతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయించాలి. కెన్యా లాంటి చిన్న దేశాలే రద్దు చేసుకున్నప్పుడు రేవంత్ ఎందుకు రద్దు చేసుకోరు?. అదానీతో ఒప్పందాలపై పునరాలోచన చేయాలని ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి సైతం అన్నారు. ఈ అంశంలో షర్మిల సూచనలను ముఖ్యమంత్రి తీసుకోవాలి. మహరాష్ట్ర వెళ్లి అదానీని గజదొంగ అన్న రేవంత్.. తెలంగాణలో మాత్రం గజమాల వేస్తున్నారు. అదానీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలపై తెలంగాణ బీజేపీ వైఖరి ఏంటో చెప్పాలి?. అదానీ వ్యవహారంతో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని మరోసారి రుజువైంది.

అదానీతో దేశానికి నష్టమైతే తెలంగాణకు నష్టం కాదా?. దీనిపై రాహుల్ గాంధీ జవాబు చెప్పాలి. స్కిల్ యూనివర్శిటీకి రూ.100 కోట్లు తీసుకోవడం తప్పా?.. కాదా?. కోహినూరు హోటల్లో మంత్రి పొంగులేటి, అదానీ రహస్య సమావేశమైన మాట వాస్తవం. ఆయనతో‌ రేవంత్ సర్కార్ రద్దు ఒప్పందాలు చేసుకోవటం లేదు?. అదానీ వేల కోట్ల రూపాయల ఒప్పందాలపై రోజూ విమర్శించే రాహుల్ దీనికి సమాధానం చెప్పాలి. రాహుల్‌కి తెలిసే రేవంత్ రెడ్డి విరాళం తీసుకున్నారా?. జాతీయ పార్టీకి ఢిల్లీలో ఒక నీతి ఉంటే గల్లీలో మరొక నీతి ఉంది. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్ పార్టీనా

కేసీఆర్ హయాంలో ఎంత ప్రయత్నం చేసినా తెలంగాణలో అదానీకి అవకాశం ఇవ్వలేదు. ఆయనతో మేము ఫొటోలు దిగిన మాట వాస్తవం. అంతే మర్యాదగా బయటకు పంపించాం. రేవంత్ మాత్రం అదానీకి ఎర్ర తివాచీ పరచి స్వాగతం పలికారు. అదానీతో చేసుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందాలను వెంటనే రద్దు చేసుకోవాలి.

బడే బాయ్ మోదీ ఆదేశాలను చోటా బాయ్ రేవంత్ అమలు చేశారు. తెలంగాణలో అదానీ వ్యాపార సామ్రాజ్య ఏర్పాటుకు ముఖ్యమంత్రి సహకారం అందిస్తున్నారు. అదానీ వ్యవహారంతో భారతదేశ ప్రతిష్ఠ మసకబారింది. ఈ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి. రామన్నపేటలో అదానీ సిమెంట్ పరిశ్రమ వద్దని ఆందోళన చేసినా రేవంత్ పట్టించుకోలేదుఅంటూ ధ్వజమెత్తారు.

ఏపీ ప్రభుత్వ ఆర్థిక గణాంకాలను వెల్లడించిన కాగ్

భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీ ప్రభుత్వ ఆర్థిక గణంకాలను విడుదల చేసింది. 2022-23లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ రాబడులు గణనీయంగా తగ్గాయని వెల్లడించింది. అదే సమయంలో ఏపీ రెవెన్యూ వ్యయం 26.45 శాతం పెరిగిందని కాగ్ వివరించింది. 

2021-22తో పోల్చితే రెవెన్యూ లోటు 405 శాతం పెరిగిందని స్పష్టం చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు రూ.8,611 కోట్లు అని తన నివేదికలో పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు రూ.43,487 కోట్లు అని వెల్లడించింది. 

2021-22తో పోల్చితే ద్రవ్య లోటు 109 శాతం పెరిగిందని కాగ్ వివరించింది. 2021-22లో ద్రవ్య లోటు రూ.25,013 కోట్లు అని తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు రూ.52,508 కోట్లు అని కాగ్ తన నివేదికలో పేర్కొంది. రెవెన్యూ లోటు భారీగా పెరగడానికి కారణం రాబడికి మించిన ఖర్చులేనని స్పష్టం చేసింది. 

2022-23లో మూలధన వ్యయం రూ.7,244 కోట్లు మాత్రమేనని వెల్లడించింది. 2022-23లో సబ్సిడీల మొత్తం రూ.23,004 కోట్లు అని, సబ్సిడీల్లో 88 శాతం విద్యుత్ రాయితీలేనని వివరించింది. 

2022-23లో ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రూ.1.28 లక్షల కోట్ల అప్పులు తీసుకున్నప్పటికీ, ఆ రుణాలను బడ్జెట్ లో చూపలేదని తెలిపింది. రూ.20,872 కోట్ల కార్పొరేషన్ల రుణాలకు ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చిందని, ప్రభుత్వానికి రావాల్సిన రూ.2,015 కోట్ల కమీషన్ రాలేదని కాగ్ స్పష్టం చేసింది. 

అటు, జీఎస్డీపీలో ప్రభుత్వ రుణం రూ.27.05 శాతానికి పెరిగిందని, బడ్జెటేతర అప్పులతో కలిపి జీఎస్డీపీలో ప్రభుత్వ అప్పు 41.89 శాతం అని వెల్లడించింది.

రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో అనూహ్య మలుపు

రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలల తరబడి హోరాహోరీగా యుద్ధం కొనసాగుతోంది. 2022 ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన ఈ యుద్ధానికి అంతం అనేది ఉండట్లేదు. ఇన్ని రోజులుగా నిరాటంకంగా ఈ రెండు దేశాలు తలపడుతూనే వస్తోన్నాయి. నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న ఈ పోరులో ఉక్రెయిన్‌లోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి.

ఈ యుద్ధంలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. భారీ స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు. ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టం అయ్యాయి. వాటిన్నింటినీ రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి.

మరియోపోల్, మెలిటొపోల్, క్రిమియా, డాన్‌బాస్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, సుమి, ఒడెస్సా, చెర్న్‌హీవ్.. వంటి నగరాలను రష్యా సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పాశ్చాత్య దేశాల నుంచి ఎదురవుతోన్న ఒత్తిళ్లు, ఆంక్షలు, పలు రకాల నిషేధాలను కూడా రష్యా ధీటుగా ఎదుర్కొంటోంది.

రష్యా సైన్యానికి ఉక్రెయిన్ అంత తేలిగ్గా తలవంచట్లేదు. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా సహా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు అందిస్తోన్న ఆయుధాలు, యుద్ధ సామాగ్రితో రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేయగలుగుతోంది. రష్యా ఆధీనంలో ఉన్న కొన్ని కీలక నగరాలను విడిపించుకోగలిగింది.

అదే సమయంలో ఉక్రెయిన్ ఎదురుదాడికి దిగడం రష్యాను ఆందోళనకు గురి చేసింది. రెండు రోజుల కిందటే లాంగ్ రేంజ్ మిస్సైల్‌తో రష్యాపై దాడి చేసింది ఉక్రెయిన్. అమెరికా అభివృద్ధి శక్తిమంతమైన క్షిపణి ఇది. ఈ మిస్సైల్‌ను సంధించడంతో తొలిసారిగా ఆత్మరక్షణలో పడినట్టయింది రష్యాకు.

దీనితో రష్యా అనూహ్య దాడికి దిగింది. ఏకంగా ఉక్రెయిన్‌పై హైపర్‌సొనిక్ ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్‌ను సంధించింది. దిన్‌ప్రో సిటీలో విధ్వంసాన్ని సృష్టించిందీ మిస్సైల్. భారీగా ఆస్తినష్టం సంభవించింది. ఇప్పటివరకు ఎంతమంది మరణించి ఉండొచ్చనేది తెలియరావట్లేదు.

తమదేశంపై ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణిని రష్యా ప్రయోగించిందంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఆరోపించారు. జనావాసాలు, అమాయక ప్రజలపై మారణహోమానికి దిగిందంటూ మండిపడ్డారు. ఇలాంటి దాడులను అంతర్జాతీయ సమాజం ఏ మాత్రం ఉపేక్షించకూడదంటూ ఆయన విమర్శించారు.

ఈ ఆరోపణలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తోసిపుచ్చారు. తాము ప్రయోగించింది ఐసీబీఎం కాదని తేల్చి చెప్పారు. హైపర్‌సొనిక్ ఇంటర్మీడియెట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్‌ను ప్రయోగించినట్లు వెల్లడించారు. ఈ మేరకు దేశ ప్రజలను ఉద్దేశించిన ఆయన టెలివిజన్‌లో ప్రసంగించారు.

అమెరికా, బ్రిటన్ వంటి దేశాల సహకారంతో తమపై దాడికి దిగినందు వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పుతిన్ అన్నారు. మున్ముందు మరిన్ని క్షిపణులను ప్రయోగించే అవకాశాలు లేకపోలేదని హెచ్చరించారు. పాశ్చాత్య దేశాల సహకారాన్ని తీసుకోవడం వల్ల తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని తేల్చి చెప్పారు.