NLG: సదర్ ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా:
మునుగోడు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో శుక్రవారం, మునుగోడు మండల గొల్ల కురుమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ ఉత్సవంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదర్ ఉత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే కు గొల్ల కురుమ సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే.. యాదవ సోదరులతో కలిసి సంప్రదాయబద్ధంగా దున్నపోతును ఆడించి యాదవ సోదరులలో ఉత్సాహాన్ని నింపారు. ఈ మేరకు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. యాదవ సోదరులు నీతికి నిజాయితీకి మారుపేరని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలలో యాదవులు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో గొల్ల కురుమ సంఘ భవనం కోసం జిల్లా కలెక్టర్ తో మాట్లాడి స్థలం కేటాయింపు జరిగేలా చూస్తానని, భవన నిర్మాణానికి తనవంతుగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, రాజ్ గోపాల్ రెడ్డి అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Nov 23 2024, 10:08