NLG: మునాస ప్రసన్న ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచం మత్స్యకార దినోత్సవం
నల్లగొండ: పట్టణంలో గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు మునాస ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో, నేడు ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని గంగపుత్ర భవన్ లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మత్స్యకారుల సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు పై చర్చించారు. అనంతరం మహిళా అధ్యక్షులను, సీనియర్ సభ్యులను శాలువాలు కప్పి సత్కరించి స్వీట్లు పంపిణి చేసుకున్నారు.
కార్యక్రమంలో పిల్లి సత్తయ్య, మునాస వెంకన్న, కొప్పు కృష్ణయ్య, మంగిలిపల్లి కిషన్, సింగం వెంకటయ్య గడిగ శ్రీను కౌన్సిలర్, గుండు వెంకటేశ్వర్లు, మునాస సత్యనారాయణ, మంగిలిపల్లి శంకర్, వడ్డెబోయిన వెంకటరామకృష్ణన్, మునాస వినయ్, అంబటి శివకుమార్, అంబటి అనురాధ, సింగం లక్ష్మి, అంబటి గంగ, తదితరులు పాల్గొన్నారు.
Nov 22 2024, 20:33