NLG: వికలాంగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి: వికలాంగుల హక్కుల పోరాట సమితి
నల్గొండ జిల్లా, మునుగోడు:
వికలాంగులకు ఇచ్చిన మాట కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, వికలాంగుల హక్కుల పోరాట సమితి
జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ అందే రాంబాబు అన్నారు.
మునుగోడు మండల కేంద్రంలోని, నేడు రైతు వేదికలో జరిగిన వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వికలాంగుల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు మునుగోడు నియోజకవర్గ ఇంచార్జి పెరిక శ్రీనివాసులు, ముఖ్య అతిథులుగా జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ అందే రాంబాబు పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గత 11 నెలలుగా చేయూత పెన్షన్ దారులను మోసం చేస్తుందని.. 6 గ్యారంటీ లలో వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులకు 4000 రూపాయల పెన్షన్ ఇస్తామని, అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో దివ్యాంగులకు 6000 పెన్షన్ ఇస్తామని మాట ఇచ్చి, ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేయక పోవడాన్ని త్రీవంగా ఖండిస్తూ, ఈనెల 18 నుండి 23 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ రేట్ల ముందు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తామని ఆ లోపు పెన్షన్ల పెంపు పై స్పష్టత రాకపోతే, నవంబర్ 26 వ తారీకు చలో హైదరాబాద్ నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ నియోజకవర్గ కన్వీనర్ కొమ్ము హరి కుమార్, జిల్లా కో కన్వీనర్లు వీరబోయిన సైదులు యాదవ్,జిల్లా సీనియర్ నాయకులు చిలుముల జలంధర్, జిల్లా నాయకులు దొంతగాని మహేష్, మునుగోడు నియోజకవర్గ నాయకులు దొమ్మటి సత్యనారి, యాసరాని మంగమ్మ, శివరాత్రి సైదమ్మ, ఈత పరమేష్, సహదేవులు, శృతి,రమేష్, సత్తెమ్మ, రాములమ్మ, మల్లిక, లిఖిత, తదితరులు పాల్గొన్నారు.
Nov 19 2024, 11:50