NLG: బీసీ వెల్ఫేర్, బీసీ కార్పొరేషన్లను ఒకే గొడుగు కిందికి తేవడం వల్ల బీసీలకు తీవ్రమైన నష్టం: పిఆర్ పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు
నల్లగొండ:
గత ప్రభుత్వం కలిపిన బీసీ వెల్ఫేర్, బీసీ కార్పొరేషన్ లను మళ్లీ విడగొట్టాలని తద్వారానే బీసీ ప్రజలకు ఎక్కువ న్యాయం జరుగుతుందని ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి అన్నారు.
ఈరోజు నల్లగొండలో జరిగిన ఉమ్మడి జిల్లా బీసీ కమిషన్ బహిరంగ విచారణలో తన అభిప్రాయాన్ని తెలిపారు.
నూనె వెంకటస్వామి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం బీసీ వెల్ఫేర్, బీసీ కార్పొరేషన్లను విడిగా ఉన్న వాటిని ఒకే గొడుగు కిందికి తేవడం వల్ల బీసీ ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. వీటి రెండింటిని విడగొట్టాలని దీనివల్లనే బీసీ విద్యార్థులకు, బీసీ ప్రజలకు సమగ్రమైన న్యాయం జరుగుతుందని అన్నారు.
ఉద్యోగ నియామకాలు చేయలేక, బీసీ ప్రజల జనాభా కనుగుణంగా నిధులను ఇవ్వలేక, సరైన అభివృద్ధి పథకాలు లేక.. బీసీ వెల్ఫేర్ ను కార్పొరేషన్ ను కలిపారని, ఈ విధంగా కలపడం వల్ల బీసీ ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతోందని, ప్రస్తుతం బీసీ కమిషన్ ను వేసినందున ఆ కమిషన్, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, మళ్లీ వాటిని విడగొట్టి అత్యధిక నిధులు రాబట్టాలని వారు కోరారు.
Nov 18 2024, 21:34