/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: వికలాంగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి: వికలాంగుల హక్కుల పోరాట సమితి Mane Praveen
NLG: వికలాంగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి: వికలాంగుల హక్కుల పోరాట సమితి
నల్గొండ జిల్లా, మునుగోడు:
వికలాంగులకు ఇచ్చిన మాట కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, వికలాంగుల హక్కుల పోరాట సమితి 
జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ అందే రాంబాబు అన్నారు.

మునుగోడు మండల కేంద్రంలోని, నేడు రైతు వేదికలో జరిగిన వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వికలాంగుల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు మునుగోడు నియోజకవర్గ ఇంచార్జి పెరిక శ్రీనివాసులు, ముఖ్య అతిథులుగా జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ అందే రాంబాబు పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గత 11 నెలలుగా చేయూత పెన్షన్ దారులను మోసం చేస్తుందని.. 6 గ్యారంటీ లలో వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులకు 4000 రూపాయల పెన్షన్  ఇస్తామని, అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో దివ్యాంగులకు 6000 పెన్షన్ ఇస్తామని మాట ఇచ్చి, ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేయక పోవడాన్ని త్రీవంగా ఖండిస్తూ, ఈనెల 18 నుండి 23 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ రేట్ల ముందు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తామని ఆ లోపు  పెన్షన్ల పెంపు పై స్పష్టత రాకపోతే, నవంబర్ 26 వ తారీకు చలో హైదరాబాద్ నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నల్గొండ నియోజకవర్గ కన్వీనర్ కొమ్ము హరి కుమార్, జిల్లా కో కన్వీనర్లు వీరబోయిన సైదులు యాదవ్,జిల్లా సీనియర్ నాయకులు చిలుముల జలంధర్, జిల్లా నాయకులు దొంతగాని మహేష్, మునుగోడు నియోజకవర్గ నాయకులు దొమ్మటి సత్యనారి, యాసరాని మంగమ్మ, శివరాత్రి సైదమ్మ, ఈత పరమేష్, సహదేవులు, శృతి,రమేష్, సత్తెమ్మ, రాములమ్మ, మల్లిక, లిఖిత, తదితరులు పాల్గొన్నారు.
నూతన గ్రామపంచాయితీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
నల్లగొండ జిల్లా:
మునుగోడు నియోజకవర్గం, చండూరు మండలం చొప్పరివారిగూడెంలో రూ. 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయితీ కార్యాలయ భవనాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు ఉన్నారు.
NLG: ఇచ్చిన మాటను నెరవేర్చిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా, చండూరు మండలం:
సీసీ రోడ్డు లేదు సార్ అంటే వేయిస్తానన్నారు.. ఇచ్చిన మాట నెరవేర్చారు.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

చండూరు మండలం, చామలపల్లి గ్రామానికి గతంలో పర్యటనకు వెళ్ళిన స్థానిక ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ను  నాగమణి అనే యువతి మా ఇంటి ముందు సిసి రోడ్డు లేదు సార్ అని  కోరడంతో తప్పకుండా వేయిస్తానని గతంలో మాటిచ్చారు.

ఇచ్చిన మాట ప్రకారం  ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఈరోజు చామలపల్లి గ్రామానికి చేరుకొని, నాగమణి విజ్ఞప్తి మేరకు సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి రోడ్డు పనులను ప్రారంభించారు.

కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, రాజగోపాల్ రెడ్డి అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
TG: సాంస్కృతిక సారథి చైర్‌ పర్సన్‌ గా గద్దర్‌ కుమార్తె వెన్నెల

HYD: తెలంగాణ ప్రభుత్వం వాగ్గేయకారుడు, ప్రజా గాయకుడు దివంగత గద్దర్ కూతురు వెన్నెలకు 'తెలంగాణ సాంస్కృతిక సారథి' చైర్‌ పర్సన్‌ గా సముచిత స్థానాన్ని కల్పించి గౌరవించింది.

తెలంగాణ  సాంస్కృతిక సారథి చైర్‌ పర్సన్‌ గా గద్దర్‌ కుమార్తె డాక్టర్‌ గుమ్మడి వి. వెన్నెలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి సాంస్కృతిక సారథి కళాకారులతో ప్రచారం చేయిస్తారు.

అయితే ప్రజా గాయకుడు గద్దర్ కూతురు వెన్నెలకు ఈ పదవి దక్కడం పట్ల గద్దర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వెన్నెలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

"నల్లగొండ జిల్లా సమగ్ర స్వరూపం" పుస్తకాన్ని ఆవిష్కరించిన తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్

నల్లగొండ: జిల్లాల చరిత్రల తోనే రాష్ట్ర సమగ్ర స్వరూపం ఆవిష్కృతం అవుతుందని తెలంగాణ మీడియా అకాడమి చైర్మెన్ కె. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ‘నల్లగొండ జిల్లా సమగ్ర స్వరూపం’ పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లా సాంస్కృతిక, సాహిత్య, ఆర్థిక, రాజకీయ చరిత్రను తెలుసుకోవడానికి ఈ గ్రంథం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. నల్లగొండ పేరు ఎలా వచ్చిందో ఇప్పటి తరానికి తెలియాలంటే ఇలాంటి పుస్తకాలు పఠించాలని సూచించారు. 

సభాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ.. ౩౩ జిల్లాల సమగ్ర స్వరూపం నేటి తరానికి అందించాలనే సంకల్పం మేరకు తెలంగాణ సారస్వత పరిషత్ ఈ పుస్తక ప్రచురణ చేపట్టిందని తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లు పుస్తకాన్ని కొనుగోలు చేయడానికి ముందుకు వస్తే జిల్లాలోని అన్ని పాఠశాలలకు, జూనియర్ కళాశాలలకు ఈ పుస్తకాలు చేరుతాయని అన్నారు. దీని కోసం పరిషత్ డిస్కౌంట్ కూడా ఇస్తుందని అన్నారు. 

వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సూర్యా ధనుంజయ్ మాట్లాడుతూ.. ఒక పుస్తకం ప్రచురించాలంటే ఎన్నో పురిటి నొప్పులు పడాలాని అలాంటిది 33 జిల్లాల సమగ్ర స్వరూపాలు తీసుకురావడం సాధారణ విషయం కాదని అన్నారు. ఇలాంటి గొప్ప సాహిత్య సేవను చేస్తున్న తెలంగాణ సారస్వత పరిషత్ కృషిని ఆమె అభినందించారు. 

ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధ్యక్షులు డా. సాగి కమలాకర శర్మ మాట్లాడుతూ.. ఈ పుస్తకం పోటీ పరీక్షలకు కూడా ఉపయుక్తమని అన్నారు. నల్లగొండ జిల్లాలో ఎన్నో చారిత్రిక, సాంస్కృతిక కట్టడాలు, గ్రంథాలు, వ్యక్తులు ఉన్నారని వారందరి గురించి తెలుసుకోవడానికి ఈ పుస్తకం దోహద పడుతుందని అన్నారు. 

తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి డా. జుర్రు చెన్నయ్య మాట్లాడుతూ.. ఈ గ్రంథం ఎంతో మంది నల్లగొండ సాహితీ వేత్తలు కలిసి రూపొందించిన గ్రంథమని పాఠకులు ఆదరించాలని కోరారు. 

ప్రముఖ సాహితీవేత్త డా. శ్రీరంగాచార్య మాట్లాడుతూ.. తాను మహబూబ్ నగర్ లో నివసిస్తున్నా ఈ జిల్లాలో పుట్టినందుకు ఈ జిల్లా సమాచారంతో ఎన్నో గ్రంథాలు వెలువరించానని అన్నారు. నేటి తరాలు తనను గుర్తించడం లేదని ఆవేదన చెందారు. 

నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. ఉపేందర్ మాట్లాడుతూ.. నల్గొండ జిల్లా సమగ్ర స్వరూపం లాంటి బృహత్తర గ్రంథం తమ కళాశాలలో ఆవిష్కరించడం గర్వకారణమని అన్నారు. 

కార్యక్రమ అనంతరం వ్యాసకర్తలను దుశ్శాలువాతో సన్మానించి, పుస్తకాన్ని బహుకరించారు. కార్యక్రమంలో సమాచారశాఖ సంయుక్త సంచాలకులు కన్నెగంటి వెంకట రమణ, తెలుగుశాఖ అధ్యక్షులు డా. వెల్దండి శ్రీధర్, గ్రంథ రచనా కోర్ కమిటీ సభ్యులు డా. భిన్నూరి మనోహరి,       డా. తండు కృష్ణ కౌండిన్య, డా. బండారు సుజాతా శేఖర్, పున్న అంజయ్య, డా. సాగర్ల సత్తయ్య, సాహితీవేత్తలు డా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, మునాసు వెంకట్, లవేందర్ రెడ్డి, కందుకూరి దుర్గాప్రసాద్, డా. పురుషోత్తమాచార్య, మేరెడ్డి యాదగిరి రెడ్డి, పెరుమాళ్ళ ఆనంద్, డా. ఉప్పల పద్మ, అధ్యాపకులు గోవర్ధనగిరి, డా. వాసా భూపాల్, డా. సైదులు, మల్లేశం, వెంకట్ రెడ్డి, భాగ్యలక్ష్మి, విద్యార్థినీ, విద్యార్థులు, తదితర సాహితీవేత్తలు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాల లను మెరుగైన మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తాం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా:
మునుగోడు: నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో    విద్యాశాఖ అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ మేరకు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య, పాఠశాలలలో ఉన్న మౌలిక సదుపాయాల పై అధికారులతో ఎమ్మెల్యే చర్చించారు.

ప్రభుత్వ పాఠశాలను పటిష్టం చేయడానికి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండలంలో ఒకటి నుండి పదవ తరగతి వరకు ఓకే కాంపౌండ్ లో చదివే విధంగా, మెరుగైన మౌలిక సదుపాయాలతో ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తానని, దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖ అధికారులను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశించారు.

మొదటి విడతగా 30 నుండి 40 ప్రభుత్వ పాఠశాలల ను మెరుగైన మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

ప్రభుత్వపరంగా  ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడమే ధ్యేయంగా ప్రతి ఒక్కరు పాటుపడాలని అధికారులను కోరారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ రెడ్డి, వివిధ మండలాల ముఖ్య నాయకులు, డిఈఓ బిక్షపతి, మునుగోడు, చండూరు, నాంపల్లి, మర్రిగూడ, గట్టుప్పల్  మండలాల ఎంఈఓ లు, కాంప్లెక్స్ హెడ్మాస్టర్ లు పాల్గొన్నారు.
కొండమల్లేపల్లి లో విలేకరులకు సన్మానం
నల్లగొండ జిల్లా:
కొండమల్లేపల్లి: సమాజ శ్రేయస్సు లో పత్రికల పాత్ర విలువైనది అని  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేమన్ రెడ్డి అన్నారు.

శనివారం జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా.. పత్రిక విలేకరులను ఘనంగా సన్మానించి, పెన్నులు బహుమతిగా ఇచ్చి కేక్ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ గంధం సురేష్, యువజన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మూడావత్ మంగ్య నాయక్, పత్రిక విలేకరులు పాల్గొన్నారు.
NLG: వ్యాధి నిరోధక టీకాల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్
నల్లగొండ: వృత్తి ప్రాధాన్యతను తెలియజేస్తూ వైద్యాధికారులకు వ్యాధి నిరోధక టీకాల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు.

ఈ మేరకు వైద్యులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్య వృత్తి అత్యంత  పవిత్రమైందని, అలాంటి వృత్తిలో పనిచేయడం గొప్ప విషయం అని అన్నారు.

కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు
కంఠమహేశ్వర స్వామి వారి కళ్యాణం, బోనాల మహోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం:
చౌటుప్పల్ పట్టణంలో శ్రీ సురమాంబ కంఠమహేశ్వర స్వామి వారి కళ్యాణం, బోనాల మహోత్సవ కార్యక్రమంలో శనివారం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ మేరకు కంఠమహేశ్వర స్వామి సురమాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. స్వామి వారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలకు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, తదితరులు పాల్గొన్నారు.
దుగ్యాల ఆదర్శ పాఠశాల వెళ్లే రోడ్డు మరమ్మత్తులు చేయించాలి: ఎస్ఎఫ్ఐ
నల్లగొండ జిల్లా:
పీఏ పల్లి: ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం దుగ్యాల ఆదర్శ పాఠశాల వెళ్లే రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా పరిశీలనకు వచ్చిన ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ..పాఠశాల వెళ్లే విద్యార్థిని విద్యార్థులు రోడ్డు దుస్థితి వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని  పాఠశాలకు వచ్చేటటువంటి విద్యార్థులు  ఆటో,బస్సు, బైక్ రవాణా సౌకర్యం ద్వారా రావడం జరుగుతుంది. రోడ్డు గుంతలగా మారి కంకర తేలడంతో వాహనాలు  పాఠశాలకు అరకిలోమీటర్ దూరంలో దించడం వల్ల  కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని ఉంది.

అదేవిధంగా పాఠశాలకు వెళ్లేటప్పుడు  విద్యార్థులు నడుస్తున్నటువంటి సందర్భంలో ముందల ఉన్నటువంటి వాహనాల దుమ్ము ధూళి, కంకర తాకి ఇబ్బందులు గాయాల పాలవుతున్నారని అన్నారు. రోడ్డు వేసి సమయంలో సదరు కాంటాక్ట్ ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే రోడ్డు వేసిన కొంతకాలానికే త్వరగా పాడైందని తెలిపారు.

తక్షణమే అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం చేయాలని వారు అన్నారు, లేని ఎడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉదృతం చేసామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి దున్న రవి, జెల్లల ఇద్దిరాములు, పొట్ల రాకేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.