/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz ప్రభుత్వ పాఠశాల లను మెరుగైన మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తాం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి Mane Praveen
ప్రభుత్వ పాఠశాల లను మెరుగైన మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తాం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా:
మునుగోడు: నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో    విద్యాశాఖ అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ మేరకు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య, పాఠశాలలలో ఉన్న మౌలిక సదుపాయాల పై అధికారులతో ఎమ్మెల్యే చర్చించారు.

ప్రభుత్వ పాఠశాలను పటిష్టం చేయడానికి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండలంలో ఒకటి నుండి పదవ తరగతి వరకు ఓకే కాంపౌండ్ లో చదివే విధంగా, మెరుగైన మౌలిక సదుపాయాలతో ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తానని, దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖ అధికారులను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశించారు.

మొదటి విడతగా 30 నుండి 40 ప్రభుత్వ పాఠశాలల ను మెరుగైన మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

ప్రభుత్వపరంగా  ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడమే ధ్యేయంగా ప్రతి ఒక్కరు పాటుపడాలని అధికారులను కోరారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ రెడ్డి, వివిధ మండలాల ముఖ్య నాయకులు, డిఈఓ బిక్షపతి, మునుగోడు, చండూరు, నాంపల్లి, మర్రిగూడ, గట్టుప్పల్  మండలాల ఎంఈఓ లు, కాంప్లెక్స్ హెడ్మాస్టర్ లు పాల్గొన్నారు.
కొండమల్లేపల్లి లో విలేకరులకు సన్మానం
నల్లగొండ జిల్లా:
కొండమల్లేపల్లి: సమాజ శ్రేయస్సు లో పత్రికల పాత్ర విలువైనది అని  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేమన్ రెడ్డి అన్నారు.

శనివారం జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా.. పత్రిక విలేకరులను ఘనంగా సన్మానించి, పెన్నులు బహుమతిగా ఇచ్చి కేక్ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ గంధం సురేష్, యువజన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మూడావత్ మంగ్య నాయక్, పత్రిక విలేకరులు పాల్గొన్నారు.
NLG: వ్యాధి నిరోధక టీకాల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్
నల్లగొండ: వృత్తి ప్రాధాన్యతను తెలియజేస్తూ వైద్యాధికారులకు వ్యాధి నిరోధక టీకాల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు.

ఈ మేరకు వైద్యులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్య వృత్తి అత్యంత  పవిత్రమైందని, అలాంటి వృత్తిలో పనిచేయడం గొప్ప విషయం అని అన్నారు.

కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు
కంఠమహేశ్వర స్వామి వారి కళ్యాణం, బోనాల మహోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం:
చౌటుప్పల్ పట్టణంలో శ్రీ సురమాంబ కంఠమహేశ్వర స్వామి వారి కళ్యాణం, బోనాల మహోత్సవ కార్యక్రమంలో శనివారం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ మేరకు కంఠమహేశ్వర స్వామి సురమాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. స్వామి వారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలకు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, తదితరులు పాల్గొన్నారు.
దుగ్యాల ఆదర్శ పాఠశాల వెళ్లే రోడ్డు మరమ్మత్తులు చేయించాలి: ఎస్ఎఫ్ఐ
నల్లగొండ జిల్లా:
పీఏ పల్లి: ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం దుగ్యాల ఆదర్శ పాఠశాల వెళ్లే రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా పరిశీలనకు వచ్చిన ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ..పాఠశాల వెళ్లే విద్యార్థిని విద్యార్థులు రోడ్డు దుస్థితి వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని  పాఠశాలకు వచ్చేటటువంటి విద్యార్థులు  ఆటో,బస్సు, బైక్ రవాణా సౌకర్యం ద్వారా రావడం జరుగుతుంది. రోడ్డు గుంతలగా మారి కంకర తేలడంతో వాహనాలు  పాఠశాలకు అరకిలోమీటర్ దూరంలో దించడం వల్ల  కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని ఉంది.

అదేవిధంగా పాఠశాలకు వెళ్లేటప్పుడు  విద్యార్థులు నడుస్తున్నటువంటి సందర్భంలో ముందల ఉన్నటువంటి వాహనాల దుమ్ము ధూళి, కంకర తాకి ఇబ్బందులు గాయాల పాలవుతున్నారని అన్నారు. రోడ్డు వేసి సమయంలో సదరు కాంటాక్ట్ ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే రోడ్డు వేసిన కొంతకాలానికే త్వరగా పాడైందని తెలిపారు.

తక్షణమే అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం చేయాలని వారు అన్నారు, లేని ఎడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉదృతం చేసామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి దున్న రవి, జెల్లల ఇద్దిరాములు, పొట్ల రాకేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
కాలుష్య రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి: ఎమ్మెల్యే
ప్రతి ఒక్కరు పర్యావరణానికి మేలు చేసే పరిశ్రమలు స్థాపించాలని, అటువంటి వారికి మా పూర్తి సహకారం లభిస్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు.

శనివారం మునుగోడు నియోజకవర్గం, చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం లోని ఇండస్ట్రియల్ పార్కు లో కాలుష్య రహిత, పర్యావరణహిత క్యారీ బ్యాగ్స్ ఉత్పత్తి చేసే రమణి ఇండస్ట్రీస్ ని స్థానిక  ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో కలిసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, తదితరులు పాల్గొన్నారు.
TG: అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు
HYD: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణమధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్ల ను నడుపుతోంది

సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్, మౌలాలి నుండి.. కొట్టాయం, కొచ్చి వరకు 26 ప్రత్యేక రైళ్ల ను ప్రకటించింది. 

ఇవి నవంబర్ 17 నుంచి డిసెంబర్ 2 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.. నేటి కార్యక్రమ వివరాలు..
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, శనివారం ఈ నెల 16 న నియోజకవర్గంలో జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు.

చౌటుప్పల్ మండలం, దండు మల్కాపురం లోని ఇండస్ట్రియల్ పార్కులో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ఇండస్ట్రీ ప్రారంభోత్సవం, చౌటుప్పల్ మున్సిపాలిటీలో గౌడ సోదరుల కాటమయ్య బోనాలు, నారాయణపురం లో కాటమయ్య బోనాల కార్యక్రమాలలో పాల్గొననున్నారు.

అనంతరం మునుగోడు క్యాంపు కార్యాలయంలో సాయంత్రం విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని, క్యాంపు కార్యాలయం వారు తెలిపారు.
కాటమయ్య రక్ష కిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా:
మునుగోడు: నియోజకవర్గ కేంద్రంలో 
ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ, బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో   శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం, గీత కార్మికులకు కాటమయ్య రక్ష కిట్లు పంపిణీ చేశారు. ప్రమాదవశాత్తు తాడిచెట్టు నుండి కింద పడిపోకుండా గౌడ సోదరుల రక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కిట్లను పంపిణీ చేస్తుంది. దాంట్లో భాగంగానే మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న  కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్ష కిట్లను పంపిణీ చేశారు. మొదటి విడతగా 200 కిట్లు పంపిణీ చేశారు.

కార్యక్రమంలో పలువురు గీత కార్మికులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
కరెంటు సమస్య లేకుండా చూడాలి.. విద్యుత్ అధికారుల సమీక్షలో మాట్లాడిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా, మునుగోడు: నియోజకవర్గంలో రాబోయే 20 సంవత్సరాల వరకు  కరెంటు సమస్య లేకుండా, రాకుండా పకడ్బందీగా పనులు చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి విద్యుత్ అధికారులను ఆదేశించారు.

మునుగోడు మండల కేంద్రంలోని తన వ్యక్తిగత క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే విద్యుత్ అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యుత్ సమస్యలపై కిందిస్థాయి నుండి పరిశీలన చేసి నివేదికలు పంపాలని చెప్పారు.

గృహాల పైన ప్రమాదకరం గా ఉన్న విద్యుత్ లైన్లు, రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ పోల్స్ ను తొలగించి, సురక్షితంగా విద్యుత్ లైన్లు విద్యుత్ పోల్స్ ఏర్పాట్లు చేయాలి అన్నారు. కార్యక్రమంలో వివిధ మండలాల నుండి వచ్చిన నాయకులు, విద్యుత్ అధికారులు  పాల్గొన్నారు.