/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz కాటమయ్య రక్ష కిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి Mane Praveen
కాటమయ్య రక్ష కిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా:
మునుగోడు: నియోజకవర్గ కేంద్రంలో 
ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ, బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో   శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం, గీత కార్మికులకు కాటమయ్య రక్ష కిట్లు పంపిణీ చేశారు. ప్రమాదవశాత్తు తాడిచెట్టు నుండి కింద పడిపోకుండా గౌడ సోదరుల రక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కిట్లను పంపిణీ చేస్తుంది. దాంట్లో భాగంగానే మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న  కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్ష కిట్లను పంపిణీ చేశారు. మొదటి విడతగా 200 కిట్లు పంపిణీ చేశారు.

కార్యక్రమంలో పలువురు గీత కార్మికులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
కరెంటు సమస్య లేకుండా చూడాలి.. విద్యుత్ అధికారుల సమీక్షలో మాట్లాడిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా, మునుగోడు: నియోజకవర్గంలో రాబోయే 20 సంవత్సరాల వరకు  కరెంటు సమస్య లేకుండా, రాకుండా పకడ్బందీగా పనులు చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి విద్యుత్ అధికారులను ఆదేశించారు.

మునుగోడు మండల కేంద్రంలోని తన వ్యక్తిగత క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే విద్యుత్ అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యుత్ సమస్యలపై కిందిస్థాయి నుండి పరిశీలన చేసి నివేదికలు పంపాలని చెప్పారు.

గృహాల పైన ప్రమాదకరం గా ఉన్న విద్యుత్ లైన్లు, రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ పోల్స్ ను తొలగించి, సురక్షితంగా విద్యుత్ లైన్లు విద్యుత్ పోల్స్ ఏర్పాట్లు చేయాలి అన్నారు. కార్యక్రమంలో వివిధ మండలాల నుండి వచ్చిన నాయకులు, విద్యుత్ అధికారులు  పాల్గొన్నారు.
TG: ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
నిర్మల్ జిల్లా:
ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

శుక్రవారం బైంసా పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఇంజనీరింగ్, మార్కెటింగ్, వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ అధికారులతో  మంత్రి సమావేశం నిర్వహించారు.

ఈ మేరకు మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, ప్రజల భూ సమస్యలను త్వరితగతిన పరిశీలించి,పరిష్కరించాలని అధికారులను సూచించారు. జిల్లాలోని అటవీ, ప్రభుత్వ భూముల సర్వేను చేపట్టి, హద్దులను గుర్తించి, సంరక్షించాలని తెలిపారు. ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సర్వే నిర్వహించి వివరాలను రికార్డు రూపంలో సమర్పించాలన్నారు.

వరి ధాన్యం, పత్తి పంట కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. రైతులు నష్టపోకుండా పంటల కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా ఉండాలన్నారు. ఇప్పటివరకు జిల్లాలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సేకరించిన వరి ధాన్యం, పత్తి పంట, రైతుల ఖాతాల్లో జమ చేసిన డబ్బులకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

పంటలను అమ్మిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను తప్పకుండా కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. సన్న వడ్ల పై క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ను అందిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల లోనే పంటను అమ్ముకోవాలని, రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.

అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటివరకు జిల్లాలో పంపిణీ చేసిన రెండు పడక గదుల ఇండ్లు, పంపిణీకి సిద్ధంగా ఉన్న ఇండ్లకు సంబంధించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా ఉంటుందని తెలిపారు.
రామలింగేశ్వర స్వామి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం:
సంస్థాన్ నారాయణపురం మండలం,  చిల్లాపురం గ్రామంలో  ఏడాదికి ఒక్కసారి కార్తీక పౌర్ణమి రోజున మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే  శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి జాతరలో శుక్రవారం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి  పాల్గొన్నారు.

జాతరకు వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి.. స్థానిక ప్రజలు, నాయకులు, కార్యకర్తలు మరియు దేవాలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు.

ఈ మేరకు గుట్టపైన ఉన్న శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ  భగవంతుని ఆశీస్సులతో  ప్రజలు అందరూ బాగుండాలని కోరుకున్నారు.

కార్యక్రమంలో స్థానిక ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు, రాజ్ గోపాల్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు.
TG:'మాలల సింహ గర్జన భారీ బహిరంగ సభ' కరపత్రాలు ఆవిష్కరించిన ఎమ్మెల్యేలు
హైదరాబాద్:
డిసెంబర్ 1న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే మాలల సింహ గర్జన భారీ బహిరంగ సభ ను విజయవంతం చేయాలని చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి, వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు అన్నారు.

ఈ మేరకు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక కమిటీ సభ్యులతో కలిసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కరపత్రాలు మరియు వాల్ పోస్టర్స్ ను గురువారం సాయంత్రం ఆవిష్కరించారు. 

రాష్ట్ర వ్యాప్తంగా వున్న మాలలు అధిక సంఖ్యలో పాల్గొని బహిరంగ సభను విజయవంతం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు పాల్గొన్నారు.
అంబేద్కర్ భవన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం:
నారాయణపూర్ మండలం, జనగాం గ్రామంలో అంబేద్కర్ భవన్ ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి, శుక్రవారం మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి  శంకుస్థాపన చేశారు. ఇప్పటికే ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా 6 లక్షల రూపాయలు  మంజూరు చేసిన ఎమ్మెల్యే.. కాలనీవాసులకు ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాల్ డిజైన్ రూపొందించి ఎస్టిమేషన్ పంపివ్వాలని స్థానిక నాయకులను ఆదేశించారు.

కమ్యూనిటీ హాలు నిర్మాణానికి అయ్యే నిధులను కూడా పూర్తిగా మంజూరు చేపిస్తానని హామీ ఇవ్వడంతో కాలనీవాసులు హర్షం  వ్యక్తం చేశారు.
NLG: దేవాలయాల్లో భక్తజనం.. పరమేశ్వరునికి అభిషేకాలు
నల్లగొండ మండలం, కంచనపల్లి గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు చెన్నోజు నాగేంద్ర ఆచార్యులు  ఉదయం 4 గంటల నుండి అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో వొచ్చి పరమేశ్వరుని దర్శించుకొని అభిషేకాలు చేసి, కార్తీక దీపాలు వెలిగించారు. దేవదేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు.

ఈ మేరకు ఆలయ అర్చకులు భక్త జనులకు, ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
NLG: గ్రంథాలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తా: కలెక్టర్ త్రిపాఠి
నల్లగొండ: జిల్లా కేంద్రంలోని కేంద్ర గ్రంధాలయాన్ని గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. 

ఈనెల 14 నుండి 20 వరకు జరగనున్న జిల్లా గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ మేరకు వారు మాట్లాడుతూ.. లైబ్రరీ అభివృద్ధికి జిల్లా కలెక్టర్ గా తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు.
NLG: బాల సదన్ లో బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ త్రిపాఠి

నల్లగొండ: జిల్లా కేంద్రంలోని బాలసదనాన్ని  గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలతో బాలలదినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా  పిల్లలకు చాక్లెట్లు, కేక్ ఇచ్చి బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఇంటికో మనిషి-ఊరుకో బండి.. చలో మిర్యాలగూడ కు తరలి రావాలి:సిపిఎం
నల్లగొండ జిల్లా:
డిసెంబర్ 2 న చలో మిర్యాలగూడ బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం పిలుపునిచ్చారు. ఇంటికో మనిషి _ ఊరుకో బండి తో చలో మిర్యాలగూడ కు తరలిరావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు.

గురువారం చండూరు మండల పరిధిలోని బోడంగిపర్తి గ్రామంలో మిర్యాలగూడలో జరిగే బహిరంగ సభ కరపత్రం ను ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ, సిపిఎం బోడంగపర్తి గ్రామ శాఖ కార్యదర్శి  గౌసియా బేగం, సిపిఎం నాయకులు ఈరటి వెంకన్న, గిరి, సైదులు, జాంగిర్ తదితరులు పాల్గొన్నారు.