/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: బొట్టుగూడ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు Mane Praveen
NLG: బొట్టుగూడ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు
నల్గొండ: పట్టణంలోని బొట్టుగూడ  హైస్కూల్ లో ఈ రోజు నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా.. వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు.

అదేవిదంగా ఫిజికల్ డైరెక్టర్ బొమ్మపాల గిరిబాబు ఆధ్వర్యంలో కోన్స్, రింగ్స్ పరికరాలతో ఫిజికల్ ఫిట్నెస్ కార్యక్రమాలు మరియు విద్యార్థులతో యోగా నిర్వహించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీగల శంకరయ్య తెలిపారు.
NLG: గ్రూప్-3 పరీక్షలకు జిల్లాలో 88 పరీక్ష కేంద్రాలు
నల్లగొండ: ఈ నెల 17 ,18 తేదీలలో నిర్వహించనున్న గ్రూప్-3 పరీక్షలకు నల్గొండ జిల్లాలో 88 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి వివరించారు.

బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతి కుమారి హైదరాబాద్ నుండి వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

గ్రూప్ -3 పరీక్షల నిర్వహణపై సమీక్ష సందర్భంగా నల్గొండ జిల్లాలో గ్రూప్-3  ఏర్పాట్ల వివరాలను జిల్లా కలెక్టర్ ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శికి వివరిస్తూ నల్గొండ జిల్లాలో 28353 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారని, ప్రశ్నాపత్రాలు భద్రపరిచే స్టాంగ్ రూమ్ లను నోడల్ అధికారులు సందర్శించడం జరిగిందని, పరీక్షకు 15 రూట్లను గుర్తించడం జరిగిందని తెలిపారు.

పరీక్షలు నిర్వహించే 17, 18 తేదీలలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ అధికారులను అదే విధంగా అవసరమైనన్ని ఆర్టిసి బస్సులు నడపాలని ఆర్ టి సి అధికారులను ఆదేశించడం జరిగిందని, ఈ నెల 14న పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటిండెంట్లకు శిక్షణ నిర్వహిస్తున్నట్లు, పరీక్షలు సవ్యంగా నిర్వహించేందుకు  గురువారం అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. పరీక్షకు 2 రోజుల ముందు మరో సారి స్ట్రాంగ్ రూమ్ లు సందర్శించాలని,రవాణా సౌకర్యం,తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు.

జిల్లా ఎస్పీ శరథ్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో నల్గొండ, మిర్యాలగూడ లలో పరీక్షలు నిర్వహించడం జరుగుతున్నదని.. అక్కడ తగిన బందోబస్తు  ఏర్పాటు చేస్తున్నామని, బయోమెట్రిక్ కోసం 9 మంది అధికారులను నియమించామని, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సామాజిక, ఆర్థిక, విద్య,ఉపాధి, రాజకీయ మరియు కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, ధాన్యం  సేకరణ, నర్సింగ్ పారామెడికల్ కళాశాలలో మరమ్మతులు, సంసిద్ధత తదితర అంశాలపై చీఫ్ సెక్రటరీ సమీక్ష నిర్వహించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ కు రాష్ట్ర స్థాయి నుండి డిజిపి జితేందర్ రెడ్డి పాల్గొనగా, జిల్లా నుండి అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు హాజరయ్యారు.
NLG: నాంపల్లి గ్రామ సగర సంఘం అధ్యక్షుడుగా గొల్లూరి శ్రీను సాగర్
నల్లగొండ జిల్లా:
నాంపల్లి మండలం, నాంపల్లి గ్రామ పరిధిలోని ఉప్పరిగూడెం గ్రామంలో బుధవారం సగర ఉప్పర సంఘం ఎన్నికల సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా నల్లగొండ జిల్లా సగర సంఘం అధ్యక్షుడు నేర్లకంటి రవికుమార్ సాగర్.. ప్రధాన కార్యదర్శి బల్గురి కరుణాకర్ సాగర్.. కోశాధికారి కొలుగురి ప్రవీణ్ సాగర్.. పెండెం వెంకటేష్ సాగర్ హాజరై, నూతన సగర సంఘం కమిటీలను ఏర్పాటు చేశారు.

ఈ మేరకు నాంపల్లి గ్రామ సగర సంఘం అధ్యక్షుడుగా గొల్లూరి శ్రీను సాగర్.. ప్రధాన కార్యదర్శిగా నేర్లకంటి పురుషోత్తం సాగర్.. కోశాధికారిగా ఉంగరాల అశోక్ సాగర్ లను, సగర సంఘం మహిళా అధ్యక్షురాలుగా నేర్లకంటి నీరజ సాగర్.. ప్రధాన కార్యదర్శిగా గంట వెంకటమ్మ సాగర్.. కోశాధికారిగా నేర్లకంటి లక్ష్మమ్మ సాగర్ లను నియమించారు.

యువజన సంఘం అధ్యక్షుడుగా కక్కునూరి శివాజీ సాగర్.. ప్రధాన కార్యదర్శి గా నేర్లకంటి వెంకటేష్ సాగర్.. కోశాధికారిగా గొల్లూరి వెంకటేష్ సాగర్ లను నియమించడం జరిగింది.

కార్యక్రమంలో నేర్లకంటి లక్ష్మయ్య సాగర్, సురేందర్ సాగర్, కేశవులు సాగర్..నారయ్య సాగర్, గొల్లూరి యాదయ్య సాగర్, పరమేష్ సాగర్, నేర్లకంటి అశోక్ సాగర్, గొల్లూరి వెంకటేష్ సాగర్,గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, పాల్గొన్నారు.
గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆహ్వానించిన నల్గొండ జిల్లా క్రీడల ప్రతినిధులు

త్వరలో జరగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డిని ఆహ్వానిస్తూ, నల్గొండ జిల్లా హాకీ అసోసియేషన్ సెక్రెటరీ ఇమామ్ కరీం మరియు చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు ఇవాళ ఆయనను శాలువాతో సత్కరించడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ఇటీవల పండిత, పీఈటీ లను స్కూల్ అసిస్టెంట్లుగా అప్గ్రేడేషన్ సాధించడంలో లో గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి చేసిన కృషిని ఎవరు మర్చిపోలేరని తెలియజేస్తూ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అందరూ ఆమోదించాలని కోరారు.

బాలికల రాష్ట్రస్థాయి హాకీ పోటీలలో ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టుకు తృతీయ స్థానం
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్  అండర్ 17 బాలికల రాష్ట్రస్థాయి హాకీ పోటీలలో ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టు మూడవ స్థానం సాధించి కాంస్య పతకం పొందారు. మూడవ స్థానం కోసం కరీంనగర్ జిల్లాతో జరిగిన హోరాహోరీ పోటీలో 2-0  తేడాతో  కరీంనగర్ జిల్లాను మట్టి కరిపించి విజయం సాధించారు.

ఈ పోటీలలో అద్భుత ప్రదర్శన కనబరిచిన   నల్లగొండ మండలం, అప్పాజీపేట MJPT  పాఠశాలలో చదువుతున్న ధరణి మరియు  యాదాద్రి భువనగిరి జిల్లా ZPHS- BN తిమ్మాపురం పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఝాన్సీ జాతీయ పోటీలకు ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా క్రీడాకారిణుల విజయం పట్ల నల్లగొండ జిల్లా విద్య శాఖ అధికారి బిక్షపతి, స్కూల్ గేమ్స్ కార్యదర్శి విమల, హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎండి ఇమామ్ కరీం హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కోచ్ యావర్, మేనేజర్ శ్రీనివాస్ లను జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి అభినందించారు.
సీసీఐ పత్తి కొనుగోలు పైన రైతులను ఇబ్బంది పెడుతున్న నిబంధనలను ఎత్తివేయాలి: బూడిద సురేష్, సిపిఐ
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ: ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరైనది కాదని, రైతుల పైన ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే.. రైతులు పండించిన పత్తి పంటను తక్షణమే ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని, రోజుకు 1200 క్వింటాళ్లు మాత్రమే పత్తి కొనుగోలు చేయాలనే నిబంధనలను ఎత్తి వేయాలని సిపిఐ మండల పార్టీ సహాయ కార్యదర్శి బూడిద సురేష్ అన్నారు.

మర్రిగూడ మండలంలో మంగళవారం బూడిద సురేష్ మాట్లాడుతూ.. మూడు సీసీఐ కేంద్రాలుంటే ఒక కేంద్రంలో పూర్తిగా 1200 క్వింటాళ్లు కొనుగోలు చేసిన తర్వాతనే, మరొక  కేంద్రం వారు కొనుగోలు చేయాలనే నిబంధనను తక్షణమే సవరించాలని, ఈ విధమైన నిబంధనలను పెట్టడం వలన రైతులు రోజుల తరబడి సీసీఐ కేంద్రం ముందర నిలబడి ఎదురు చూడాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి అటువంటి నిబంధనలు ఎత్తివేసి పత్తి కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
NLG: 'వివోఏ లకు ఇచ్చిన వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలి'
నల్లగొండ: వివోఏ లకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన రూ.20వేల వేతన వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఐకెపి వివోఏల ఉద్యోగుల సంఘం (సిఐటియు) జిల్లా గౌరవ అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు 48 గంటల కలెక్టరేట్ ధర్నాలో భాగంగా మంగళవారం కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ త్రిపాఠి, డిఆర్డిఓ పిడి శేఖర్ రెడ్డిలకు వినతిపత్రం అందజేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మహిళ సాధికారత కోసం ప్రభుత్వ పథకాల అమలు కోసం శ్రమిస్తున్న ఐకెపి వివోఏలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం 20 వేల వేతనం వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వ కాలంలో సమ్మె చేస్తున్న సందర్భంగా మాకు మద్దతి ఇచ్చి, మేము అధికారంలోకి వస్తే మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి, సీతక్క లు ముఖ్యమంత్రిగా, పిఆర్ మినిస్టర్ గా ఉన్నారని, అందుకోసం వెంటనే వి ఓ ఏ ల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

బకాయి ఉన్న స్త్రీ నిధి ఇన్సెంటివ్, గ్రామ సంఘం నుంచి ఇవ్వవలసిన 3 వేలు వెంటనే ఇవ్వాలని కోరారు. అర్హత కలిగిన వివోఏ లను సీసీ లుగా ప్రమోషన్ ఇవ్వాలని, సెర్ప్ ద్వారా గుర్తింపు కార్డులు, యూనిఫామ్, 10 లక్షల ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్ చేశారు.

సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చిలుముల దుర్గయ్య, పొడిచేటి సులోచనలు మాట్లాడుతూ.. వివోఏలు ఎంత కష్టపడి పనిచేసినా టార్గెట్ల పేరుతో సీసీ లు, ఏపీఎం లు వేధిస్తున్నారని, వివోఏ లకు సంబంధం లేని ఆన్లైన్ పనులు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీలు చేస్తున్న తప్పుల వల్ల అనేక మంది విఓఏ లకు వేతనాలు సకాలంలో రాక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వివిధ కారణాల చేత తొలగించిన వివోఏ లందరినీ వెంటనే పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వివోఏల సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.
           

ఈ ధర్నా కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు జిల్లా లలిత, ఎం.మంగమ్మ, కె.రేణుక, నగేష్,ఆర్ బాలకృష్ణ ,అహల్య, నాగమణి, పద్మావతి, సువర్ణ, పద్మ, సుమీల, పుష్పలత, ఆర్.బి నాయక్ సైదులు,తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డిని కలిసిన చౌటుప్పల్ గౌడ సంఘం సభ్యులు

చౌటుప్పల్ పట్టణంలో ఈ నెల 15, 16 తేదీలలో  శ్రీ శ్రీ సురమాంబ కంఠమహేశ్వర స్వామి కళ్యాణ బోనాల మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని కోరుతూ.. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ను హైదరాబాదులోని వారి నివాసంలో  చౌటుప్పల్ పట్టణ గౌడ సంఘం సభ్యులు కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
TG: సురక్షితమైన, సున్నితమైన రవాణా నెట్‌వర్క్‌ని నిర్మించుకుందాం: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
రంగారెడ్డి జిల్లా:
తెలంగాణ రాష్ట్రంలో రోడ్లను గుంతలు లేకుండా సురక్షితంగా మార్చడానికి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అత్యాధునిక యంత్రాలతో మేము గరిష్ట సామర్థ్యాన్ని పెంచడం ద్వారా 9,000 కి.మీల గుంతల రోడ్లను పూడ్చబోతున్నామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా, చిలుకూరు గ్రామంలో సోమవారం ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుంతలు, రోడ్డు మెయింటెనెన్స్ మెషినరీ పనులను స్వయంగా పరిశీలించి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యూహాత్మక ప్రణాళిక, మెరుగైన రవాణా, సురక్షితమైన ప్రయాణం కోసం.. వేగవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన పర్యావరణ అనుకూల పరిష్కారాలను లక్ష్యంగా, వినూత్న పద్ధతులను అవలంబించడం ద్వారా, రోడ్ల మరమ్మతు సమయాన్ని గణనీయంగా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి అన్నారు.

ఈ మేరకు సురక్షితమైన, సున్నితమైన మరియు మరింత సుస్థిరమైన రవాణా నెట్‌వర్క్‌ని నిర్మించుకుందామని మంత్రి పేర్కొన్నారు.
శ్రమ దోపిడీ కి వ్యతిరేకంగా ఉద్యమించాలి: ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్

నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ: కార్మిక వ్యతిరేక విధానాలు, మారిన కార్మిక చట్టాల నేపథ్యంలో.. శ్రమ దోపిడీ పెరుగుతుందని ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్ అన్నారు. పాలక వర్గాలు కార్పొరేట్ శక్తుల తొత్తుగా మారాయని యూసుఫ్ విమర్శించారు.ఏఐటియుసి నల్లగొండ జిల్లా శిక్షణా తరగతులు సోమవారం మిర్యాలగూడ లో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు నూనె రామస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు ఎం.డి సయీద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ శిక్షణా తరగతుల్లో ఏఐటియుసి చరిత్ర, కార్మిక చట్టాలు అనే అంశంపై యూసుఫ్ బోధించారు. 

1920 లో ఆవిర్భావించిన ఏఐటియుసి.. స్వాతంత్య్ర పోరాటంలో అలుపెరుగని పాత్ర పోషించిందని, సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని కోరింది మొదట ఏఐటియుసి అని యూసుఫ్ తెలిపారు. స్వాతంత్య్ర ఉద్యమానికి ముందు ఆ తర్వాత స్వాతంత్ర్య భారతదేశంలోను అలుపెరుగని పోరాటాలతో హక్కులను సాధించిన ఘనత ఏఐటియుసికి దక్కుతుందన్నారు. 

ఎన్డీఏ పాలనలో కార్మిక హక్కులు హరించబడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాల సవరణ పేరుతో యాజమాన్యాల క్రింద కార్మికులు బానిసలుగా పనిచేయాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. మోడీకి కార్పొరేట్ల రక్షణ తప్ప కార్మిక సంక్షేమం తెలియదని విమర్శించారు. 

సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు తమ హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రపంచీకరణ, మతోన్మాదం, కార్మిక చట్టాల సవరణ ఇప్పుడు -అత్యంత వేగంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని దీనిని ప్రతిఘటించేందుకు సమరశీల పోరాటాలకు కార్మిక వర్గం సిద్ధం కావాలన్నారు. పాలకులు కార్మికులను కాదని యాజమాన్యాలకు వత్తాసు పలుకుతున్నాయని, శ్రమకు తగిన వేతనం ఇప్పించడంలో విఫలమవుతున్నాయన్నారు. 

గతంలో కార్మిక చట్టాలు అత్యంత పదునుగా ఉండడంతో శ్రమకు తగిన రీతిలో కాకపోయినా కనీసం సగమైనా వేతనం లభించేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. కార్మికుల సంక్షేమాన్ని చూడాల్సిన పాలకులు యాజమాన్యాల సంక్షేమాన్ని చూస్తున్నారని యాజమాన్యాలకు వేల కోట్ల రాయితీలు ప్రకటిస్తున్న ప్రభుత్వాలు కార్మికుల గురించి ఆలోచించడం లేదన్నారు.

సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. పాలకులు అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్మిక వర్గం నిర్వహించే పోరాటాలకు కమ్యూనిస్టు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుంతుంటే అదుపు చేయడంలో పాలకులు విఫలమయ్యారని, ధరలు పెరగడం వల్ల కార్మిక మధ్యతరగతి వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు.

ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా ఉద్యమ నేపథ్యం, కార్మికుల సమస్యలు, పోరాట మార్గాలపై దశ దిశ నిర్దేశం చేశారు. జిల్లాలోని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు. 

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ ఉపాధ్యక్షులు ఎం.డి సయ్యద్, కె.ఎస్ రెడ్డి, పానం వెంకట్రావు, సహాయ కార్యదర్శులు నూనె వెంకటేశ్వర్లు, దోటి వెంకన్న, జిల్లా కోశాధికారి దోనకొండ వెంకటేశ్వర్లు, జిల్లా యాదయ్య, లింగా నాయక్,వలపట్ల వెంకన్న, శంతాబాయి, డి.రాణి, సుజిత, వనజ, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.