NLG: 2 వ ఏ.ఎన్.ఎం ల రాష్ట్ర మహాసభ ను జయప్రదం చేయాలి: తోట రామాంజనేయులు
నల్లగొండ:
పరీక్ష తేదీ ఖరారు చేసిన ఏఎన్ఎం ల నోటిఫికేషన్ లో ఉన్న 1931 పోస్టులకుకు మరో 3000 పోస్టులను పెంచి.. వయసు మీరి పరీక్ష రాయటానికి అర్హత లేని రెండో ఏఎన్ఎం లకు100 % గ్రాస్ శాలరీ తో పాటు రిటైర్మెంట్ సమయంలో 10 లక్షల లైఫ్ గ్రాట్యుటీ ఇవ్వాలి. పరీక్ష రాసి ఉద్యోగ అర్హత సాధించలేని రెండో ఏఎన్ఎం లకు 100% గ్రాస్ శాలరీని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రెండో ఏఎన్ఎం ల సంఘం, ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు తోట రామాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ నెల 17న రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో జరుగుతున్న రెండవ ఏఎన్ఎంల రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ నల్లగొండ లో జరిగిన జిల్లా రెండో ఏఎన్ఎంల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
గతంలో ఏఐటియుసి ఆధ్వర్యంలో రెండవ ఏఎన్ఎం సమస్యలు పరిష్కరించాలని నిలవధిక సమ్మె చేసినట్లు ఆయన గుర్తు చేశారు. సమ్మె సమయంలో గత ప్రభుత్వం మరియు నేటి ప్రభుత్వ నాయకులు హామీలు ఇచ్చినప్పటికీ అవి అమలుకు నోచుకోలేదన్నారు. రెండు నెలల కిందట రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు మూడు నెలల సమయం కావాలని తెలిపినట్లు వారు తెలిపారు. ఈనెల 17వ తేదీ నాటికి మూడు నెలల సమయం అవుతుండగానే పరీక్ష తేదీని విడుదల చేయడాన్ని ప్రశ్నించారు.
గత 17 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడుతూ పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎం లకు తొలి అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు. అందులో భాగంగానే డిపార్ట్మెంటల్ పరీక్ష ద్వారా వీరికి నియమకాలు చేపట్టేలా అవకాశం ఇవ్వాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్, తెలంగాణ రాష్ట్ర రెండవ ఏఎన్ఎంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి రత్నకుమారి , జిల్లా ప్రధాన కార్యదర్శి రాయల గీతా రాణి, ఉపాధ్యక్షురాలు పుష్ప లత , సహాయ కార్యదర్శి అరుణ మేరీ, హైమావతి, సరిత, రమాదేవి, సాలమ్మ, వసుమతి, పద్మ, నాగమణి, సునీత, భాగ్యలక్ష్మి, రేణుక, శ్రీలత, సునిత కుమారి, తదితరులు పాల్గొన్నారు.
Nov 11 2024, 18:18