NLG: పత్తి, వరి తేమ శాతాన్ని పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించాలి: పాలడుగు నాగార్జున
నల్లగొండ జిల్లా:
మర్రిగూడెం: వరి, పత్తి పంటలు కొనుగోలు సమయంలో, తేమను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం కొనుగోలు చేసి మద్దతు ధర ప్రకటించాలని, వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా మద్దతు ధర ప్రకటించి, కొనుగోలు కేంద్రాలలో దళారుల బెడద లేకుండా చూసి మద్దతు ధర ఇవ్వాలని, వరి తేమ శాతం ను పరిగణలోకి తీసుకోకుండా కొనుగోలు చేయాలని అన్ని వొడ్లను కొనుగోలు చేయాలని అన్నారు.
పత్తి రంగు మారిందని రైతులను మోసం చేస్తూ దళారులు ఊర్ల మీద ఎగబడి డిజిటల్ కాంటాలు పెట్టి తూకాలలో మోసం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఆరుగాలం పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే స్థితికి వస్తుందని అందుకే పత్తిని రంగు మారిన అన్ని రకాల పత్తిని తీసుకుని మద్దతు ధర కల్పించాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం మహాసభలకు ఏర్పాట్లు చేసుకోవాలని పిలుపునిచ్చారు. గత కార్యక్రమాలని సమీక్షించుకొని భవిష్యత్ కార్యక్రమాలకు ఉద్యమాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాంపల్లి మర్రిగూడ మండల కార్యదర్శిలు నాంపల్లి చంద్రమౌళి ఏర్పుల యాదయ్య కె,వి,పి,ఎస్, రాష్ట్ర కమిటీ సభ్యులు బోట్ట శివకుమార్, మండల కమిటీ సభ్యులు వాష్పాక ముత్తిలింగం దేవయ్య నీలకంఠం రాములు కొట్టం యాదయ్య దామెర లక్ష్మి గిరి విష్ణు ఆయిల్ కృష్ణయ్య గడగోటి వెంకటేష్ పిట్టల రమేష్ గిరి వెంకటయ్య పల్లపు రాజు, తదితరులు పాల్గొన్నారు.
Nov 05 2024, 16:36