/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం Mane Praveen
NLG: ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం
నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న రూ.7500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేసి, బహుజన విద్యార్థుల అభివృద్ధికై తోడ్పడాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కి వినతి పత్రం అందజేశారు.

అనంతరం శివకుమార్ మాట్లాడుతూ.. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాకపోవడం వలన ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడం జరుగుతుందనీ, డబ్బులు వచ్చాకే మీ సర్టిఫికెట్స్ ఇస్తాము అని అంటున్నారని.. దీనివలన బహుజన విద్యార్థులు చదువు మధ్యలోనే ఆపేసే పరిస్థితి ఉందని తెలిపారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం చూడాలని విద్యార్థుల పక్షాన నిలబడి, ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్, మెస్ ఛార్జిలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న, ఉపాధ్యక్షులు కాసర్ల లింగస్వామి, రాష్ట్ర కోఆర్డినేటర్ బాకీ తరుణ్, నియోజకవర్గ అధ్యక్షులు పగడాల శివతేజ, వరుణ్, తదితరులు పాల్గొన్నారు.
NLG:పులిమామిడి నర్సింహా రెడ్డి, ఏడుదొడ్ల కృష్ణ రెడ్డి ల ఆర్థిక సహకారంతో హనుమాన్ స్వాముల సన్నిధానం షెడ్ నిర్మాణం
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం
యరగండ్లపల్లి గ్రామములో, హనుమాన్ స్వామి దీక్ష చేపట్టిన స్వాముల సౌకర్యార్థం కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు పులిమామిడి నర్సింహా రెడ్డి, ఏడుదొడ్ల కృష్ణ రెడ్డి 1 లక్ష 35 వేల రూపాయలు ఖర్చు చేసి హనుమాన్ స్వాముల సన్నిధానం షెడ్డు ను నిర్మించారు.

హనుమాన్ స్వాముల సన్నిధానం షెడ్డును పులిమామిడి నరసింహారెడ్డి, ఏడు దొడ్ల కృష్ణారెడ్డి ల చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ఆదివారం ప్రారంభించారు.ఈ మేరకు నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. దైవ చింతన తోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, గ్రామ అభివృద్దే తన లక్ష్యమని అన్నారు.

కార్తీక మాసంలో గత 15 సం.ల నుండి గ్రామంలో హనుమాన్ భక్తులు.. హనుమాన్ స్వామి 41 రోజు దీక్ష తీసుకుంటున్నారని, ఈ నేపథ్యంలో  స్వాములు ఉండడానికి ప్రత్యేక వసతి లేకపోవడంతో  నర్సింహారెడ్డి ని సంప్రదించగా రేకుల షెడ్ కట్టి ఇచ్చారని గ్రామ ప్రజలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు వారికి ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమంలో మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్, కాకులవరం అశోక్ రెడ్డి, ఇబ్రహీం, వనపర్తి యాదయ్య, మాల్ మార్కెట్ యార్డు డైరెక్టర్ జమ్ముల వెంకటేష్, మామిడి అంజయ్య, నక్కరగోని మల్లయ్య,సీత వెంకటయ్య, వాళ్ళముల  ఎర్రన్న, అందుగుల ముత్యాలు, కుక్కడపు వెంకటరమణ, పుప్పాల యాదయ్య, ఆకారపు శివ, కుక్కడపు అంజయ్య, కాకులవరం పృథ్వి రెడ్డి, బొమ్మిడి దర్శన్, ముద్దం వెంకటయ్య, గొడ్డెటి వెంకటయ్య, మైలారపు అంజయ్య, గజ్జి యాదయ్య,సిలివేరు యాదయ్య, పొలగోని అబ్బయ్య, పొలగోని యాదయ్య, ఎరుకలి రాములు, రెడ్డగోని వెంకయ్య, కుక్కడపు ముత్యాలు, మాడెం శంకర్, నక్కరగోని కొండల్, నక్కరగోని స్వామి, తోడేటి నాగరాజు, వల్లంల శ్రీను, రామిని సంతోష్, పొలగోని శేఖర్, సూరగోని శ్రీను, వల్లంల శ్రీశైలం, బచ్చనగోని లింగం, గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు, హనుమాన్ స్వాములు, శివ స్వాములు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
NLG: యాదాద్రి పవర్ ప్లాంట్ కు బొగ్గును తరలించే రైలును ప్రారంభించిన మంత్రులు
NALGONDA DIST: దామరచర్ల మండలంలో గల యాదాద్రి పవర్ ప్లాంట్ స్టేజ్-1 లో ఉత్పత్తి చేసిన విద్యుత్తును గ్రిడ్డుకు అనుసంధానం చేసే కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి లు పాల్గొన్నారు. అనంతరం రామగుండం నుంచి యాదాద్రి పవర్ ప్లాంట్ స్టేషన్ కు బొగ్గు తరలించే రైలు ను వైటీపీఎస్ టేక్ ఆఫ్ దగ్గర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
NLG: నల్లగొండ నుండి అరుణాచలం కు ప్రత్యేక బస్సులు
నల్లగొండ: ఈనెల 13 వ తేదీ రాత్రి గం.7 లకు అన్ని డిపోల నుండి తమిళనాడు లోని అరుణాచలం గిరి సందర్శన కొరకు, ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఉమ్మడి నల్గొండ టీజిఎస్ఆర్టిసి రీజినల్ మేనేజర్ రాజశేఖర్ తెలిపారు.

ప్రతి పౌర్ణమికి రద్దీని బట్టి ప్రత్యేక సర్వీసులు నడిపిస్తామని, అరుణాచలం వెళ్ళే భక్తులకు ఏపీలోని కాణిపాకం, తమిళనాడు వేలూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం ఉంటుందన్నారు. వివరాలకు 9298008888 లేదా సమీప బస్ స్టేషన్లలో సంప్రదించాలన్నారు.
NLG: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి
నల్లగొండ జిల్లా:
దేవరకొండ: ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా.. భారత దేశంలో యధావిధిగా కొనసాగుతున్నాయని, వెంటనే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం సిపిఎం దేవరకొండ మండల కమిటీ సమావేశం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగింది.

ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. డీజిల్ పెట్రోల్ ధరలు క్రమేపీ పడిపోతున్నా.. భారతదేశంలో మాత్రం వాటి ధరల్ని తగ్గించడం లేదని, యధావిధాగా కొనసాగించడం మూలంగా ప్రజల పైన ఆర్థిక భారాలు మోపబడుతున్నాయని  ఆందోళన వ్యక్తం చేశారు.

పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం మూలంగా వాటి మీద ఆధారపడి తయారవుతున్న నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి అవి కొనలేని పరిస్థితుల్లో పేదలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన  ఈ సంవత్సరాల కాలంలో మతోన్మాద రాజకీయాలతో పాటు, కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ రంగ సంస్థల్ని చౌక ధరకు దారాధత్తం చేసి, ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల్ని వీధిన పడేసే పద్ధతుల్లో కార్పొరేట్ శక్తులకు మోడీ ప్రభుత్వం ఊడిగం చేస్తుందని విమర్శించారు.

బ్యాంకింగ్, ఎల్ఐసి, రైల్వే విమానయాన రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయటానికి  ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేస్తుందని, వెంటనే ప్రైవేటు విధానాలను విడనాడి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు.

నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, కెసిఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు లేవు నీళ్లు లేవు నియామకాలు లేవు ప్రజల్ని మోసం చేసిన కేసీఆర్ను పోయిన సంవత్సరం ప్రజలంతా ఓడించారు. ఫలితంగా కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు రైతుబంధు, రుణమాఫీ, రైతు బీమా లాంటి పథకాలను అమలు చేయకపోవడం మూలంగా ప్రజల్లో, రైతుల్లో తీవ్రమైన వ్యతిరేకత ప్రారంభమైందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వాటి అమలు కోసం సిపిఎం ప్రజల్ని సమీకరించి పోరాటాల్ని నడుపుతుందని తెలిపారు.

ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య, మండల కార్యదర్శి నల్ల వెంకటయ్య, మండల నాయకులు బిజిలి లింగయ్య, బుడిగ వెంకటేష్, రహీం, నల్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
బ్రేకింగ్ న్యూస్:ఈతకు వెళ్లి తండ్రి కొడుకు గల్లంతయిన ఘటనలో.. తండ్రి, కొడుకు మృతదేహాలు లభ్యం
నల్లగొండ: జిల్లాలోని కనగల్ మండల పరిధిలో గల శాబ్దల్లాపురం గ్రామ సమీపంలో ఏఎంఆర్పీ కాలువలో నిన్న ఈతకు వెళ్లి తండ్రీ కొడుకు గల్లంతైన ఘటనలో.. కొడుకు బిట్టు మృతదేహం కోదండపురం కాలువ వద్ద ఈరోజు ఉదయం సుమారు 10 గంటల సమయంలో దొరకగా, ఈ ఉదయం సుమారు 7 గంటల సమయంలో గుండ్లపల్లి కాల్వ వద్ద తండ్రి దామోదర్ మృతదేహం లభించింది.

ఈ మేరకు నిన్నటి నుండి కనగల్, నల్లగొండ మండల పోలీసులు మరియు స్థానికులు గాలింపు చర్యలు చేపట్టగా ఇవాళ తండ్రి, కొడుకు ల మృతదేహాలు లభ్యమయ్యాయి.
RR: ఇంటింటి కుటుంబ సర్వే పై విస్తృతస్థాయి సమావేశం.. హాజరైన మంత్రి శ్రీధర్ బాబు
రంగారెడ్డి జిల్లా:
శంషాబాద్: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రేస్ పార్టీ ముందుంటది అని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో కార్యకర్తలు భాగస్వామ్యం అవ్వాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఈ రోజు రంగారెడ్డి జిల్లా కాంగ్రేస్ పార్టీ ఆద్వర్యంలో శంషాబాద్ లోని పద్మావతి గార్డెన్స్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన, ఇంటింటి కుటుంబ సర్వే పై జరిగిన విస్తృత స్థాయి సమావేశానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు అసెంబ్లీ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి, ఎంఎల్సీ పట్నం మహేందర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పోరేషన్ చైర్మన్లు మల్ రెడ్డి రాంరెడ్డి, చల్లా నరసింహారెడ్డి, జిల్లా ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విషాద ఘటన: నల్లగొండలో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆత్మహత్య..!
Breaking news:
నల్గొండ: ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన నల్లగొండ పట్టణంలో చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని పూజిత అపార్టుమెంట్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్  కలకురి రవి శంకర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

యాదగిరిగుట్టలో విధులు నిర్వహిస్తున్న  రవిశంకర్ ఆత్మహత్యకు గల కారణాలపై టూ టౌన్ పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NLG: సిపిఐ శత వార్షికోత్సవాలను జయప్రదం చేయాలి: సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి
నల్లగొండ: సామ్రాజవాదం, భూస్వాములు పెట్టబడుదారులకు వ్యతిరేకంగా అసమాన త్యాగాలు చేసిన సిపిఐ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని నిర్వహించే శత వార్షికోత్సవాలలో కార్మికులు, రైతులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సిపిఐ జాతీయ సమితి సభ్యులు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట రెడ్డి పిలుపునిచ్చారు. సిపిఐ నల్లగొండ జిల్లా సమితి కౌన్సిల్ సమావేశం పట్టణంలోని మగ్దూమ్ భవన్ లో శనివారం జరిగింది. ఈ సమావేశానికి పల్లా వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. దేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని రాజకీయ, ఆర్థిక, సామజిక రంగాలలో సిపిఐ తమ పాత్ర పోషించిందన్నారు. దున్నేవానికి భూమి, గీసే వానికి చెట్టు అనే నినాదంతో దేశవ్యాప్తంగా భూఉద్యమాలకు సిపిఐ నాయకత్వం వహించిందన్నారు. తాత్కాలికంగా  కమ్యూనిస్టు ఉద్యమానికి ఎదురుదెబ్బలు తగిలినా.. పెట్టుబడిదారి విధానాలకు, పాలకులు అవలంబించే ప్రజావ్యతిరేక విధానాలపై ఎర్రజెండా తో పేద ప్రజలను చైతన్యం చేస్తూ సిపిఐ నిరంతరం ప్రజా పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. ప్రజల పక్షాన నిలబడి నిజంగా పోరాటం చేసేది కమ్యూనిస్టులేనని తెలిపారు. ఇంతటి సుధీర్ఘపోరాట చరిత్ర కలిగిన సిపిఐ వంద ఏండ్లలో  అడుగుపెడుతున్న సందర్భంగా నవంబర్ 7 నుంచి సిపిఐ సభ్యత్వం నమోదు కార్యక్రమం చేపడుతుందని ఈ సందర్భంగా తెలిపారు. 

సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. ఆరుగాలాలు కష్టపడి పంటలు పండించిన రైతులకు తమ పంటను అమ్ముకోవడానికి అనేక కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాలను హడావుడిగా ఏర్పాటు చేసినప్పటికీ.. ఏ ఒక్క కొనుగోలు కేంద్రాల్లో కాంట పెట్టి పత్తి కొనుగోలు చేసిన దాఖలాలు లేవని విమర్శించారు.  తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బందులు గురి చేస్తే.. మధ్య దళారులు వాటిని ఆసరా చేసుకుని తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేసి మోసం చేస్తున్నారని ఆరోపించారు. అదేవిదంగా వరి రైతుల కష్టాలు వర్ణాతీతంగా మారిందన్నారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లో అవస్థలు పడుతున్నారని, వెంటనే ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు.

ఈ సమావేశానికి సిపిఐ నాయకులు ఉజ్జిని యాదగిరి రావు అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి, సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి, లోడంగి శ్రవణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి, ఆర్.అంజయ్య చారి, బి.వెంకట్ రమణ, బొల్గురి నర్సింహా, గురిజ రామచంద్ర, టి.వెంకటేశ్వర్లు, బొడ్డుపల్లి రామలింగయ్య, తదితరులు పాల్గొన్నారు.
NLG: ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు సిద్ధంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ త్రిపాఠి
నల్గొండ: ఈ నెల 6 నుండి నిర్వహించనున్న సామాజిక ,ఆర్థిక, విద్య, రాజకీయ మరియు కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఇవాళ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే విషయమై అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల టీచర్ల తో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సర్వే.. ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని, ముందుగా ఇండ్ల జాబితా తయారు చేయాలని, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై విస్తృత ప్రచారం కల్పించాలని, 6వ తేదీ నుండి సర్వే నిర్వహిస్తున్న విషయం అన్ని పట్టణ ప్రాంతాలతో పాటు, గ్రామీణ ప్రాంతం వరకు చేరాలని, సర్వే వివరాల సేకరణ తర్వాత ఏకకాలంలో డేటాను కంప్యూటరైజేషన్ చేయాలని, ఎట్టి పరిస్థితులలో తప్పు వివరాలు డేటా ఎంట్రీ చేయకూడదని ఆయన  ఆదేశించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ తన ఛాంబర్ లో అధికారులతో ఇదే విషయమై సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను సర్వే ఎన్యుమరేటర్లుగా తీసుకోవడం జరుగుతుందని, ఇందుకుగాను జిల్లాలో ఉన్న ఎస్జిటి ఉపాధ్యాయుల జాబితాను తక్షణం సమర్పించాలని డిఈఓ ను ఆదేశించారు.సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు జిల్లాలో మొత్తం 4000 మంది ఎన్యుమనేటర్లు అవసరం కాగా, సుమారు 2800 మంది టీచర్లు అందుబాటు లో ఉన్నారని, ఇదివరకు గుర్తించిన  ఎన్యుమరేటర్లలో  ప్రతిభ కలిగిన వారిని ముందుగా సర్వేకు నియమించి తక్కిన వారిని ఎన్యుమరేటర్లు గా తీసుకోవాలని అన్నారు.అంతేకాకుండా పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, వివిధ శాఖలలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్లు, మెప్మా రిసోర్స్ పర్సన్లు, సిఆర్పిలు, తదితరులు అందరిని  ఎన్యుమరేటర్లు గా తీసుకోవాలని తెలిపారు.

అలాగే సర్వే నిర్వహించిన అనంతరం తక్షణమే డేటా ఎంట్రీ చేసేందుకు డాటా ఎంట్రీ ఆపరేటర్లను,సిస్టమ్స్ ను గుర్తించి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఎన్యుమరేటర్లకు ఇచ్చేందుకు తిరిగి గుర్తింపు కార్డులను తయారు చేయాలని, స్టిక్కర్లు అన్నిటిని మరోసారి ముద్రించి సిద్ధం చేసుకోవాల్సిందిగా ఆమె ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వ ఉపాధ్యాయులతో ప్రత్యేకించి ఎస్జిటి టీచర్లతో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించనున్న దృష్ట్యా తిరిగి  వారికి శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఆదేశించారు.సిపిఓ వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, ఆర్డిఓ అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్, ఈడిఎం దుర్గారావు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.