మూసి ప్రక్షాళన - గోదావరి కృష్ణా జలాల సాధన వేదిక భువనగిరి మండల కన్వీనర్ గా ఏదునూరి మల్లేశం ఏకగ్రీవ ఎన్నిక
![]()
మూసీ జల కాలుష్యాన్ని అరికట్టి, ప్రక్షాళన చేపట్టి గోదావరి, కృష్ణా జలాలను ప్రత్యామ్నాయంగా అందించాలని భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన మండల స్థాయి సదస్సులో మూసీ ప్రక్షాళన - గోదావరి, కృష్ణా జలాల సాధన వేదిక భువనగిరి మండల కన్వీనర్ గా ఏదునూరి మల్లేశం ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని జిల్లా కో- కన్వీనర్ దయ్యాల నర్సింహ తెలియజేసినారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ అనేక పోరాటాల ఫలితంగా భువనగిరి మండలంలోని అనాజిపురం గ్రామం తో పాటు పది గ్రామాలకు మూసీ జలాలు అందించాలని కోరుతూ ఆనాడు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భునాదిగాని కాల్వ కోసం అనేక ఉద్యమాలు నిర్వహించి కాలువను సాధించడం జరిగిందని వారు తెలియజేశారు. కానీ నేటికీ ఆ కాలువ పూర్తిస్థాయిలో పూర్తి కాలేదని, ఇంకా రైతులకు నష్టపరిహారం మరియు అన్ని గ్రామాలకు సాగునీరు అందించే దాంట్లో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. ఇప్పటికైనా నిర్వాసితులకు నష్టపరిహారం, కాలువను పూర్తిస్థాయిలో పూర్తి చేయాలని అన్ని గ్రామాలకు నీరు అందించాలని, మూసీ జల కాలుష్యాన్ని అరికట్టాలి ప్రత్యమ్నయంగా గోదావరి జలాలను వడపర్తి కతత్వ నుండి భువనగిరి, బీబీనగర్ చెరువులను నింపి అందించాలని వారు ప్రభుత్వానికి సూచించారు. భునాదిగాని కాల్వ పూర్తి కోసం, ప్రత్యామ్నాయంగా గోదావరి జలాల కోసం 11 తేదీన ఎర్రంబెల్లి నుండి నమాత్ పల్లి, నందనం, అనాజిపురం మీదుగా బీబీనగర్ మండల కేంద్రంలో నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహిస్తున్న మోటార్ సైకిల్ యాత్రను అనంతరం జిల్లా కలెక్టరేట్ ముందు నిర్వహిస్తున్న మహాధర్నాను రైతులు, కూలీలు, వృత్తి దారులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని మల్లేశం పిలుపునిచ్చారు. ఇంకా కమిటీలో కో- కన్వీనర్లుగా గునుగుంట్ల శ్రీనివాస్, బొల్లెపల్లి కుమార్, జిట్టా అంజిరెడ్డి, కొండాపురం యాదగిరి, గుండెనబోయిన దానయ్య, కమిటీ సభ్యులుగా ఏదునూరి వెంకటేష్, కడారి కృష్ణ, గంగనబోయిన పాండు, బొల్లేపల్లి పరమేష్, తోటకూరి మల్లేష్, ముత్యం ప్రకాష్, ఎల్లంల ఐలయ్య, కొల్లూరు సిద్ధిరాజు, సింగిరెడ్డి భూపాల్ రెడ్డి, రాసాల శ్రీశైలం, హైతరాజు కృష్ణయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని మల్లేశం తెలియజేశారు. ఇట్లు ఏదునూరి మల్లేశం కన్వీనర్ మూసీ ప్రక్షాళన - గోదావరి, కృష్ణా జలాల సాధన వేదిక భువనగిరి మండలం


వలిగొండ మండల పరిధిలోని దాసిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన బొడిగె నర్సింహ తండ్రి యాదయ్య ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ సాధించారు. " ఫిజికల్ స్పెక్ట్టోస్కోపిక్ ( ఆప్టికల్ ఈ పి ఆర్ ,ఎఫ్ టి ఐ ఆర్ అండ్ రామన్ ) క్యారెక్టర్రైజేషన్ ఆఫ్ ఇండియావ్ డోఫుడ్ ఆల్కలైన్ ఎర్త్ ఆక్సైడ్ బారేటు గ్లాసెస్ "అనే అంశంపై అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి .రామదేవుడు గారి పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశారు . వలిగొండ మండలంలో భౌతికశాస్త్రం విభాగంలో డాక్టరేట్ సాధించిన మొట్టమొదటి వ్యక్తి . బోడిగె .నరసింహ డాక్టరేట్ సాధించిన విషయం తెలుసుకున్న దాసిరెడ్డిగూడెం గ్రామస్తులు, యువకులు పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేశారు విద్యాభ్యాసం 1. పాఠశాల: ప్రగతి హై స్కూల్ 10 th వరకు 2. ఇంటర్మీడియట్: ప్రగతి జూనియర్ కళాశాల .వలిగొండ 3. డిగ్రీ : శ్రీ సాయి కృప డిగ్రీ కళాశాల భువనగిరి 4. P.G : డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ ఉస్మానియా యూనివర్సిటీ 5. P.H.D : డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రస్తుత హోదా:contract (ఒప్పంద) degree lecturer, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రాజేంద్రనగర్ ( శంషాబాద్ )
Sep 09 2024, 17:02
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
9.0k