NLG: NMMS స్కాలర్షిప్ పొందిన విద్యార్థులను అభినందించిన ఆర్డీవో మరియు డి.ఎస్.పి
నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ హైస్కూల్ కు చెందిన 4గురు విద్యార్థులు M. కీర్తన, లుబ్నాతన్వీర్, A.దివ్య, D.దినేష్ లు 2023-24 విద్యా సంవత్సరంలో National Means Merit Scholarship పొందిన సందర్భంగా పల్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు బ్యాగ్స్, మెటీరియల్స్ అందజేస్తూ, 2024-25 సంవత్సరానికి గాను ప్రిపేర్ అవుతున్న 11 మంది విద్యార్థులకు ప్రోత్సాహక మెటీరియల్స్ అందజేశారు.
బొట్టుగూడ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు తీగల శంకరయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్గొండ ఆర్డీవో రవి, డి.ఎస్.పి శివ రాంరెడ్డి లు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించే భాగంలో బ్యాగ్స్ నోట్ బుక్స్ మరియు NMMS మెటీరియల్స్ అందజేశారు.
అనంతరం వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ శంకర్ ఆధ్వర్యంలో పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా స్త్రీ భద్రత, శాంతి భద్రతలు,డ్రగ్స్ నిర్మూలన పై విద్యార్థులకు
అవగాహన కలిగించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిధులు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు ఎంతో క్రమశిక్షణ మరియు చదువుల పట్ల అంకితభావంతో ఉండాలని మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకొని ఉన్నతమైన ఉద్యోగాలు సాధించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పల్ రెడ్డి ఫౌండేషన్ డైరెక్టర్లు పల్ రెడ్డి రామిరెడ్డి, పల్ రెడ్డి నరసింహారెడ్డి లు, మరియు పాఠశాల ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులు
వై.శ్యామ్ సుందర్ రెడ్డి, ఎస్.కె మన్సూర్ అలీ,ఏ.వి.ఆర్ వినాయక్, కే.దయాశంకర్,ఎస్.కె. సలీం, కే.జయ, బి.రాములు,బి.సుధారాణి,ఎం.ప్రసన్న,
కే.లింగయ్య, పి.శ్రీకాంత్, పి.కుశలకుమారి, బొమ్మపాల గిరిబాబు, ఎస్.చరణ్, కె.చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ హైస్కూల్ కు చెందిన 4గురు విద్యార్థులు M. కీర్తన, లుబ్నాతన్వీర్, A.దివ్య, D.దినేష్ లు 2023-24 విద్యా సంవత్సరంలో National Means Merit Scholarship పొందిన సందర్భంగా పల్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు బ్యాగ్స్, మెటీరియల్స్ అందజేస్తూ, 2024-25 సంవత్సరానికి గాను ప్రిపేర్ అవుతున్న 11 మంది విద్యార్థులకు ప్రోత్సాహక మెటీరియల్స్ అందజేశారు.
బొట్టుగూడ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు తీగల శంకరయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్గొండ ఆర్డీవో రవి, డి.ఎస్.పి శివ రాంరెడ్డి లు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించే భాగంలో బ్యాగ్స్ నోట్ బుక్స్ మరియు NMMS మెటీరియల్స్ అందజేశారు.

హైదరాబాద్: బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డా.నందవరం మృదుల జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు.
నల్లగొండ జిల్లా:
నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో నేడు దివంగత మాజీ సిఎం డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యాలయంలో ఉన్న వైయస్సార్ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు.
నల్లగొండ జిల్లా:

నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం:
సూర్యాపేట జిల్లా: 
Sep 03 2024, 19:02
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
26.5k