ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలి : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ డిమాండ్
![]()
భువనగిరి: ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని, గ్రామ సభల ద్వారా టెక్నికల్ సమస్యలను పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రోజున భువనగిరి ఆర్డీవో కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో నర్సింహ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ కోసం తక్షణమే 13 వేల కోట్ల రూపాయలను విడుదల చేయాలని అన్నారు. సగం మంది రైతులకే మాఫీ కావడం వల్ల మిగతా సగం మంది రైతులు అయోమయానికి గురవుతున్నారని అన్నారు. బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ అధికారుల చుట్టూ అన్ని పనులు మాని తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రుణమాఫీ కోసం 45 వేల కోట్ల రూపాయలు అవుతుందని అంచనాకొచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 31 వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పికేవలం 18 వేల కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసిందన్నారు. వారు చెప్పిన ప్రకారమే 13వేల కోట్ల రూపాయలను వెంటనే చేయాలన్నారు. రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను సవరించకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. రేషన్ కార్డులు, ఐటీ రిటర్న్స్, రీ షెడ్యూల్ లాంటి వాటిని సవరించాలని డిమాండ్ చేశారు. రైతు వేదికల ద్వారా కాకుండా గ్రామపంచాయతీ పరిధిలో గ్రామసభలు నిర్వహించి సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 మాసాల అవుతున్న రెండు సీజన్లకు రైతు బరోసా డబ్బులు ఇవ్వకుండా తాత్సార్యం చేస్తుందన్నారు. జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్న ఈ తరుణంలో కరెంటు కోతలను నివారించే నాణ్యమైన కరెంటును 24 గంటల పాటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు గౌడ్, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు నాయకులు దయ్యాల నర్సింహ, మాయ కృష్ణ , రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి, సిపిఎం బొమ్మలరామారం మండల కార్యదర్శి రాకల శ్రీశైలం, నాయకులు ఏదునూరి మల్లేశం, పల్లెర్ల అంజయ్య, కొండమడుగు నాగమణి, అబ్దుల్లాపురం వెంకటేష్ , వనం రాజు,సిలివేరు ఎల్లయ్య, కొండా అశోక్, కూకుట్ల కృష్ణ, చింతల శివ, వడ్డబోయిన వెంకటేష్, మచ్చ భాస్కర్, ఐతరాజు కిష్టయ్య, పండాల మైసయ్య, బోడ ఆంజనేయులు బందెల ఎల్లయ్య, మోకు దేవేందర్ రెడ్డి, రంగా కొండల్, కడారి కృష్ణ, ముత్యం ప్రకాష్, పాలడుగు రవి , గోరేమియా పాల్గొన్నారు.
![]()


యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నర్సింహ స్వామి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవలప్మెంట్ ఆద్వర్యంలో విద్యార్థులకు రెండు రోజుల శిక్షణా సదస్సులో భాగంగా గురువారం జరిగిన ప్రారంభ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. స్కిల్ ఇండియా వారి సహకారంతో సఫల్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాపార అవకాశాలు, మెలకువలు, ఆర్థిక వనరుల సమీకరణ, వ్యాపార నిర్వహణ, ప్రభుత్వ సహకార పథకాలపై కల్పించిన అవగాహనను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా రీసోర్స్ పర్సన్ ఎర్ర శివరాజ్ మాట్లాడుతూ సూక్ష్మ , కుటీర, చిన్న పరిశ్రమలు స్థాపించాలనుకునే విద్యార్థులు ప్రభుత్వ సహకారంతో కార్యోన్ముఖులు కావాలని పిలుపునిచ్చారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే క్రమంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు,రుణ సౌకర్యాలు, సబ్సిడీలు ఇచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశ్రమల స్థాపనలో విద్యార్థులు అంచెలంచెలుగా ఎదిగి, నలుగురికి ఉపాధి అవకాశాలను కల్పించాలని కోరారు. ఈ అవగాహన సదస్సు సమావేశంలో రీసోర్స్ పర్సన్ కొడారి వెంకటేష్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గంజి రమేష్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఏ ఐ ఎస్ ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 8 వేల కోట్ల పైచిలుకు బకాయిలు ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని విద్యా వ్యవస్థ సక్రమంగా నడవడానికి వెంటనే విద్యాశాఖకు మంత్రిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు స్కాలర్షిప్ బకాయిల పేరుతో సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి వెంటనే బకాయిలను విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా పక్షాన డిమాండ్ చేశారు లేనిపక్షంలో విద్యార్థుల కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి నిర్వహిస్తామని అన్నారు.
Aug 29 2024, 21:37
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3.6k