/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz రావన్నపేట మెయిన్ రోడ్డులో గల నకరికంటే కిష్టయ్య కాంప్లెక్స్ లో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు Vijay.S
రావన్నపేట మెయిన్ రోడ్డులో గల నకరికంటే కిష్టయ్య కాంప్లెక్స్ లో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మెయిన్ రోడ్ లో గల నకిరేకంటి కిష్టయ్య కాంప్లెక్స్ ఆవరణలో 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.నకిరేకంటి కిష్టయ్య గారు జెండా ఆవిష్కరించి మాట్లాడుతూ మహనీయుల త్యాగాలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో గొల్లెపల్లి శంకరయ్య, బొడ్డు భిక్షం తదితరులు పాల్గొన్నారు.

రామన్నపేట: నేర్నెముల గ్రామానికి కాంక్రీట్ బెంచీల బహుకరణ చేసిన దొంతర బోయిన నవీన్ కుమార్

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట  మండలంలోని నిర్నెంల గ్రామంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ రోజున తన జన్మదిన పురస్కరించుకుని దొంతరదొంతర బోయిన నవీన్ గ్రామ వాసుల సౌకర్యార్థం సుమారు రూ.60000/- రూపాయల విలువ గల ఏడు సిమెంటు కాంక్రీటు బెంచీలను గ్రామ పంచాయతీ కార్యాలయానికి అందజేశారు. వీటిని గ్రామ ప్రజల సౌకర్యార్థం వివిధ ప్రాంతాలలో ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. ప్రజల సౌకర్యార్థం చేయూత అందించినందుకు గ్రామ పెద్దలు వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి లక్ష్మి, మాజీ సర్పంచ్ ముత్యాల సుజాత రవి, గోపాల్, చిప్పలపల్లి రవి, సాయిలు, రాంబాబు, తరుణ్, ఆవుల సాయి, దొంతర బోయిన దైవాధీనం ముదిరాజ్, ఉద్యోగ సంఘం కార్యదర్శి యాదగిరి, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

వలిగొండ: దుప్పల్లి లో మద్యం విక్రయిస్తున్న ఓ కిరణా షాప్ పై పోలీసుల దాడి ,కేసు నమోదు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని దుప్పల్లి గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్న భీమ గాని రంగయ్య కిరణా షాప్ పై వలిగొండ పోలీసులు దాడులు నిర్వహించి మద్య పట్టుకున్నారు. అక్రమంగా మద్యం నిల్వచేసి ఎలాంటి వ్యాలీడి లైసెన్స్ లేకుండా కస్టమర్స్ కి మద్యం అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు. మద్యాన్ని సీజ్ చేసి భీమ గాని రంగయ్యపై కేసు నమోదు చేశామని వలిగొండ ఎస్సై డి మహేందర్ తెలిపారు.
వలిగొండ: ఆర్థిక సహాయం అందజేసిన తుమ్మల నర్సయ్య సేవాసమితి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అరూర్ గ్రామం లో పురుమ కృష్ణ గారు శనివారం తేదీ 10వ తారీకు సాయంత్రం మరణించడం జరిగినది. వారి కుటుంబాన్ని తుమ్మల నరసయ్య సేవా సమితి సభ్యులు పరామర్శించారు. తుమ్మల నరసయ్య సేవాసమితి ఆధ్వర్యంలో 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగినది.. ఈ కార్యక్రమంలో తుమ్మల నరసయ్య సేవా సమితి సభ్యులు తదితరులు. పాల్గొనడం జరిగింది.
బీబీనగర్ : వెంకిర్యాల మహర్షి మోడల్ హైస్కూల్ లో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా బిబి నగర్ మండలం వెంకీర్యాల మరియు పోచంపల్లి మండలం ఇంద్రియాల మహర్షి మోడల్ హైస్కూల్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు దేశభక్తి గేయాలు ఆలపించారు, సాంస్కృత కార్యక్రమా లలో పాల్గొని డాన్సులు వేశారు. పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పి మల్లేష్ గౌడ్ ,వైస్ ప్రిన్సిపల్ జ్యోతి ,అధ్యాపక బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి : AISF

రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబ్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలి* ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా ఏఐఎస్ఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశం వస్తువుల అభిలాష్ అధ్యక్షతన భువనగిరి లో జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మణికంఠ రెడ్డి, లక్ష్మణ్ మాట్లాడుతూ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి పుణ్యక్షేత్రం గా ప్రాముఖ్యత పొందిన యాదాద్రి పుణ్యక్షేత్రం ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి గవర్నమెంట్ డిగ్రీ ,పీజీ కళాశాల లేకపోవడంతో పేద మధ్యతరగతి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ యూనివర్సిటీ మాదిరిగానే పేద మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ఇక్కడ కూడా దేవస్థానం నిధులతో అన్ని వసతులు , కోర్సులతో కూడిన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలంగాణలో డ్రగ్స్ మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారని విద్యార్థులు వాటికి బానిసలు కాకుండా ఉన్నత చదువులపై దృష్టి సారించాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని,యూనివర్సిటీలకు వీసీ లను వెంటనే నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మణికంఠ రెడ్డి ,లక్ష్మణ్ డిమాండ్ చేశారు రాష్ట్ర ఉపాధ్యక్షులు బరిగల వెంకటేష్ మాట్లాడుతూ భారతదేశంలోనే మొట్టమొదటి విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ స్వాతంత్ర ఉద్యమంలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న విద్యార్థి సంఘం బలోపేతం కోసం విద్యార్థులు నడుం బిగించాలని అన్నారు జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ,సంక్షేమ హాస్టల్లో కనీస మౌలిక సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో వసతి గృహ అధికారులు సమయం పాలన పాటించడం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు మారపాక లోకేశ్వర్ , ఆర్ చందు , రామ్ చరణ్ , సాయి చరణ్, టీ ప్రవీణ్, శ్రీకాంత్ మండల నాయకులు వినీల్ ,భారత్ సుమన్ తదితరులు పాల్గొన్నారు
వలిగొండ మండల కేంద్రంలో పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మా వాటా మాకే పుస్తకావిష్కరణ

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో వలిగొండ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత జూలూరు శంకర్ రచించిన మా వాటా మాకే అనే పుస్తకాన్ని ఘనంగా పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా బిసి జనగణ చేసి 42 శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేసినారు. అనాదిగా తరతరాల నుండి బిసి లను చేనేత వృత్తిపై ఆధారపడిన పద్మశాలీలను రాజకీయంగా మరియు వ్యవహారపరంగా మోసం చేసే వారిపై కలసి పోరాడి మన హక్కులను మనము కాపాడుకోవాలని అన్నారు . ఈ కార్యక్రమంలో బీసీ సంఘం అధ్యక్షులు సాయిని యాదగిరి ,బిసి సంఘం మండల అధ్యక్షుడు ఐటిపాముల ప్రభాకర్, తవుటము నరహరి, దొంత శంకరయ్య, మిరియాల శ్రీనివాస్, ఐటిపాముల కుమార్, గంజి నారాయణ, లెనిన్, డిఎన్ఆర్ రమేష్, జెల్ల నరహరి ,మిరియాల శేఖర్, ఎక్కడ దేవి శ్రీనివాస్, మిర్యాల వెంకటేశం ,గంజి బాల నరసింహ తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక సహాయం అందజేసిన జిట్టబోయిన కుటుంబం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండ గ్రామానికి చెందిన కీ.శే. దాసరి యాదగిరి కుటుంబంకు కీర్తిశేషులు జిట్టబోయిన నరసింహ జ్ఞాపకార్థం వారి కుమారుడు కీ. శే.జయరాం జ్ఞాపకార్థం మరియు వారి తమ్ముళ్లు మల్లేశం, అశోక్ లకు జరిగిన విషాదం గురించి తెలియగానే వెంటనే స్పందించి వారి కుటుంబానికి 10000 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో పులిపలుపుల రాములు ఎస్కే రసూల్ ఎరుపుల వెంకటేశం గన్నెబోయిన నరసింహ ఇంజమూరి శీను కాడిగళ్ల రవి బత్తుల యాదగిరి సలవద్రి చింటూ తదితరులు పాల్గొన్నారు.
దళితులు సాగు చేసుకుంటున్న భూమికి పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలి: దయ్యాల నరసింహ డిమాండ్

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల పరిధిలోని హనుమాపురం గ్రామంలో దళితులు సాగు చేసుకుంటున్న భూమికి వెంటనే పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని సింగిల్ విండో డైరెక్టర్ దయ్యాల నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రోజున హనుమాపురం దళితుల పట్టాదారు పాసుబుక్కుల సాధన కమిటీ ఆధ్వర్యంలో భువనగిరి మండల ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి డిప్యూటీ ఎమ్మార్వోకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా దయ్యాల నరసింహ మాట్లాడుతూ హనుమాపురం గ్రామంలో సర్వేనెంబర్ 87 లో ప్రభుత్వ భూమి 15.06 ఎకరాలు సుమారు 65 సంవత్సరాల నుండి దళితులు సాగు చేసుకోని చెలుక పంటలు పండిస్తూ ఉలువలు, కందులు, నువ్వులు ఇతర పంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్నారు. కావున ప్రభుత్వము దళిత పేద కుటుంబాలని దృష్టిలో పెట్టుకొని పట్టదార్ పాస్ బుక్కులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని నరసింహ కోరారు. ఈ కార్యక్రమంలో పట్టాదారుల సాధన కమిటీ అధ్యక్షులు బిచ్చాల మహేందర్, ప్రధాన కార్యదర్శి ముడుగుల రాజు, నాయకులు బండారి రామచందర్, చందుపట్ల మల్లేష్, బండారి జనార్ధన్, బిచ్చాల కొండలు, బండారి బాల నరసింహ, బిచ్చాల మైసయ్య, బండారి క్రాంతి, బుడుగుల రామచందర్, బండారి జీవన్, బుడుగుల బాల నరసింహ, సింగారం జాంగిర్, బండారి ప్రభాకర్, ముడుగుల ఉప్పలయ్య, ముడుగుల పరమేష్, మడుగుల కొండల్, మైసయ్య, దానయ్య, లింగయ్య, నరసింహ, బిచ్చల రాము ముడుగుల వెంకటయ్య బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో AISF 89వ ఆవిర్భావ దినోత్సవం

యాదధ్రి భువనగిరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వస్తూపుల అభిలాష్, ఉప్పుల శాంతి కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవ జెండాను ఆవిష్కరించడం జరిగింది. వారు మాట్లాడుతూ భారతదేశానికి సంపూర్ణ స్వసంత్రం లక్ష్యంగా విద్యార్థులను చైతన్యం చేసిన విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ స్వతంత్ర ఉద్యమ సమయంలో అక్కడక్కడ ఎవరికి వారుగా పోరాడుతున్న విద్యార్థులను ఏకం చేసి జాతీయస్థాయిలో ఏర్పడిన తొలి విద్యార్థి సంఘముగా ఏఐఎస్ఎఫ్ నిలిచింది 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో మహానగరంలో ..భగత్ సింగ్ ..రాజ్ గురు.. సుఖ్ దేవ్ .. ఆజాద్ ..ఇంకా ఎందరో వీరుల ఆశయ సాధన కోసం ..బాబరుద్దీన్ బాసు.. ప్రేమ్ నారాయణ.. భార్గవ్..లా నాయకత్వన ఏఐఎస్ఎఫ్ సంఘం ఆవిర్భవించింది ఈ విద్యార్థి సంఘం నేటికీ 88 సంవత్సరాలు పూర్తి చేసుకుని 89వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సంఘం ఏఐఎస్ఎఫ్ విద్య కాషాయకరణకు వ్యతిరేకంగా కామన్ విద్యా విధానం కోసం విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతూ నాటి నుండి నేటి వరకు విద్యార్థుల పక్షాన నిలబడిన ఏఐఎస్ఎఫ్ లో ప్రతి ఒక్క విద్యార్థులు విద్యార్థి సంఘంలో చేరి ఆ జెండాను భావితరాల కోసం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో కేజీ టు పీజీ ఉచిత విద్యపై అదే విధంగా సంక్షేమ హాస్టల్ లో మెస్ చార్జీలు పెంచాలని యూనివర్సిటీలలో విసి లను నియమించాలని తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని ఇలా అనేక పోరాటాలు చేసిన విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ ఆ పోరాటాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారతమాత బానిస సంకెళ్లు నుంచి విముక్తి కావాలని ఎందరో విద్యార్థుల విప్లవ కిషోరుల బలిదానం చేసిన ఘనమైన చరిత్ర కలిగిన దేశంలోనే ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు ప్రకాష్, ఆకాష్, శివ, సాయి, నరేష్,రాజు,అశోక్, రజినీ,శ్రీవాణి,పూజ,రేవతి,శ్రావణి తదితరులు పాల్గొన్నారు