అమెరికాపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన ఆరోపణలు
అగ్రరాజ్యం అమెరికాపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధినేత షేక్ హసీనా సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో తీవ్ర స్థాయిలో చెలరేగిన నిరసనలు, అల్లర్ల నేపథ్యంలో ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రాణ భయంలో దేశం విడిచిన హసీనా .. బంగ్లాదేశ్ లో ఇటీవల జరిగిన తిరుగు బాటు, అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉందని ఆరోపించారు. ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ హసీనా ఈ ఆరోపణలు చేశారు.
ఆమెరికాకు తలొగ్గితే అధికారంలో కొనసాగేదాన్నేనని, సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టలేకే పదవి నుండి వైదొలగానని పేర్కొన్నారు. వారు విద్యార్ధుల శవాలను దాటుకుంటూ వచ్చి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని అనుకున్నారని, దానిని తాను సహించలేదన్నారు.
ఒకవేళ సెయింట్ మార్టిన్ ద్వీపంపై సార్వభౌమత్వాన్ని అప్పగించి .. అమెరికాకు బంగాళాఖాతంలో పట్టు లభించేలా చేస్తే పదవిలో కొనసాగేదాన్నని, దానికి ఇష్టపడకనే ప్రధాని పదవికి రాజీనామా చేసినట్లుగా పేర్కొన్నారు.
తాను బంగ్లాదేశ్ లోనే ఉంటే మరిన్ని ప్రాణాలు పోయేవని, అందుకే అత్యంత క్లిష్టమైన నిర్ణయం తీసుకుని వైదొలిగినట్లు చెప్పారు.
దయచేసి అతివాదుల మాయలో పడొద్దని దేశ ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రజలే తన బలమని, వారు తనను వద్దనుకోవడంతో దేశం వీడానని అన్నారు.
తాను ఓడిపోయినా ప్రజలు గెలిచారని వ్యాఖ్యానించారు. వారి కోసమే తమ కుటుంబం ప్రాణత్యాగాలు చేసిందని అన్నారు. చాలా మంది అవామీలీగ్ నాయకులు హత్యకు గురి కావడం ఆవేదన కల్గించిందన్నారు.
తమ పార్టీ మరోసారి నిలదొక్కుకుంటుందన్న ఆశాభావాన్ని షేక్ హసీనా వ్యక్తం చేశారు.









తాజా ఆరోపణలతో అదానీ స్టాక్స్ పడిపోతాయా? మార్కెట్ నిపుణుల సమాధానమిదే..! అదానీ గ్రూప్ సంస్థలపై హిండెన్‌బర్గ్ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. సెబీ చైర్‌పర్సన్ మాధుబి పురి బచ్, ఆమె భర్తకు అదానీ ఆఫ్‌షోర్ వ్యాపారంలో వాటాలు ఉన్నాయని ఆరోపించింది. మరోసారి తీవ్ర ఆరోపణలు చేసిన క్రమంలో సోమవారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో అదానీ గ్రూప్ స్టాక్స్ పతనమవుతాయా? మార్కెట్ నిపుణుల ఏమంటున్నారు? అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మరోసారి అదానీ గ్రూప్‌ని టార్గెట్ చేసి తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే, ఈసారి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) చైర్ పర్సన్ మాధుబి పురి బచ్‌ని ఈ అంశంలోకి తీసుకొచ్చింది. అదానీ గ్రూప్ మారిషస్ ఆఫ్‌షోర్ ఫండ్స్‌లో సెబీ చీఫ్, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు కొత్త ఇన్వెస్ట్‌గేటివ్ రిపోర్ట్ విడుదల చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్ పనితీరుపై చర్చకు దారితీసింది. సోమవారం ఆగస్టు 12వ తేదీన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్ పతనమయ్యే అవకాశం ఉందా? అనేది ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. మరి ఈ అంశంపై మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు? 2023లో అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ అదానీ గ్రూప్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. కృత్రిమంగా షేర్ల విలువను పెంచి లాభపడిందని, స్టాక్ మార్కెట్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలను గౌతమ్ అదానీ నేతృత్వంలోని గ్రూప్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చినప్పటికీ ఆ సమయంలో గ్రూప్ కంపెనీల స్టాక్స్ ఒక్కసారిగా కుప్పకూలాయి. సుమారు 100 బిలియన్ డాలర్ల మేర నష్టపోయాయి. అయితే, ఆ తర్వాత తమ ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని కలిగించేందుకు వేగంగా చర్యలు తీసుకున్నారు. దీంతో అదానీ గ్రూప్ షేర్లు వేగంగా కోలుకున్నాయి. హిండెన్‌బర్గ్ ఆరోపణల ముందు సమయంలోని విలువను దాటి ట్రేడింగ్ అవుతున్నాయి. అదానీ గ్రూప్‌నకు చెందిన 10 కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి. అవి అదానీ పోర్ట్స్ అండే సెజ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పవర్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ విల్మార్, అంబుజా సిమెంట్స్, ఏసీసీ, ఎన్‌డీటీవీ ఉన్నాయి. తాజా ఆరోపణలపై స్టాక్ మార్కెట్ నిపుణులు స్పందిస్తున్నారు. 2023తో పోలిస్తే ప్రస్తుత పరిస్థితులు వేరని గుర్తు చేశారు. హిండెన్‌బర్గ్ తాజా ఆరోపణల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చన్నారు. సోమవారం నాటి ట్రేడింగ్‌లో అదానీ స్టాక్స్‌లో భారీ అమ్మకాలు ఉండకపోవచ్చని, అలాగే స్టాక్ మార్కెట్ సైతం భారీ నష్టాల్లోకి వెళ్లే అవకాశాలేమీ ఉండకపోవచ్చని నమ్ముతున్నట్లు చెప్పారు హిండెన్‌బర్గ్ లేటెస్ట్ రిపోర్ట్ కారణంగా భారత స్టాక్ మార్కెట్లపై భారీ ప్రభావం ఉంటుందని నేను అనుకోవట్లేదు. మొదట్లో ప్రభావం కనిపించవచ్చు కానీ, మార్కెట్లో కొనుగోళ్లు ఉంటాయి. అలాగే అదానీ గ్రూప్ స్టాక్స్‌పైనా పెద్ద ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చు. మార్కెట్లు ప్రారంభమైన తర్వాత అదానీ స్టాక్స్ కాస్త ఒత్తిడికి గురికావచ్చు. కానీ, మళ్లీ రికవరీ అవుతాయి.' అని ఇండిట్రేడ్ క్యాపిటల్ ఛైర్మన్ బందోపాధ్యాయ్ పేర్కొన్నట్లు మింట్ వెల్లడించింది.
తుంగభద్ర డ్యామ్ గేటు ధ్వంసంపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు తుంగభద్ర డ్యామ్ 19వ గేటు ధ్వంసం కావడంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. హోస్పేట్ తుంగభద్ర డ్యామ్ 19వ గేటును ఆదివారం నాడు శివకుమార్ పరిశీలించారు. గేటు ధ్వంసం అవడానికి గల కారణాలను ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. తుంగభద్ర డ్యామ్ 19వ గేటు ధ్వంసం కావడంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Siva Kumar) స్పందించారు.
Aug 12 2024, 17:56
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
8.5k