అమెరికా-జపాన్ మార్కెట్ల పతనం.. భారత్ ఎకానమీపై ప్రభావం ఉంటుందా?
నేడు వారంలో మొదటి రోజైన సోమవారం (ఆగస్టు 5న) దేశీయ స్టాక్ మార్కెట్‌కు(stock market) బ్లాక్ సోమవారంగా నిలిచిపోయింది. అయితే అమెరికా-జపాన్ మార్కెట్ల క్షీణత సందర్భంగా భారత్ ఎకానమీపై ప్రభావం చూపుతుందా అని పలువురు ప్రశ్నిస్తు్న్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.
నేడు వారంలో మొదటి రోజైన సోమవారం (ఆగస్టు 5న) దేశీయ స్టాక్ మార్కెట్‌కు(stock market) బ్లాక్ సోమవారంగా నిలిచిపోయింది. ఇదే రోజు జపనీస్ స్టాక్ ఎక్స్ఛేంజీ నిక్కీ 225లో 13 శాతం లేదా 4750 పాయింట్లు పతనమైంది. మరోవైపు మాంద్యం భయంతో గత ట్రేడింగ్ సెషన్‌లో అమెరికా స్టాక్ మార్కెట్ భారీగా క్షీణించింది. దీంతో భారత మార్కెట్లలో గందరగోళం ఏర్పడి ఈరోజు ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ ఏకంగా 2700 పాయింట్లు నష్టపోయింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 825 పాయింట్లు పడిపోయింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్‌లు కూడా భారీగా పతనమయ్యాయి. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్‌లో ఈ పతనం కారణంగా ఒక్క రోజే ఇన్వెస్టర్లు రూ.17.50 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశారు
అయితే అమెరికా-జపాన్ మార్కెట్ల క్షీణత సందర్భంగా భారత్ ఎకానమీపై ప్రభావం చూపుతుందా అని పలువురు ప్రశ్నిస్తు్న్నారు. ప్రస్తుతం గందరగోళం ఉన్నప్పటికీ భారతీయ మార్కెట్లు ఇతరులకన్నా త్వరగా స్థిరపడవచ్చని అమెరికా సంస్థ Dezerv సహ వ్యవస్థాపకుడు వైభవ్ పోర్వాల్ అన్నారు. భారత్‌లోకి ఎఫ్‌ఐఐ ప్రవాహాలు అనేక కారణాల వల్ల పెరిగాయని గుర్తు చేశారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇతర ప్రపంచ దేశాల కంటే మెరుగ్గా ఉందని, ఇది పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిందన్నారు. ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు భారతదేశంతో సహా ఇతర చోట్ల మెరుగైన రాబడిని కోరుకునే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే ఈ ఏడాది చివరి నాటికి వడ్డీరేట్లు 1.16 శాతం తగ్గవచ్చని జెఫరీస్ విశ్లేషకుడు క్రిస్టోఫర్ వుడ్ అంచనా వేశారు. జూన్ ఉపాధి డేటాకు ముందు ఈ అంచనా 0.86 శాతం మాత్రమేనని అన్నారు. అయితే ఈ కోత అమెరికా స్టాక్స్‌కు ప్రయోజనం చేకూర్చాల్సిన అవసరం లేదని, ఎక్కువ కోతలకు అవకాశం ఉన్న ఆసియా, అభివృద్ధి చెందుతున్న దేశాల స్టాక్ మార్కెట్లకు ఇది మంచి ప్రయోజనం చేకూరుస్తుందని క్రిస్టోఫర్ వుడ్ చెప్పారు.
క్రిస్టోఫర్ వుడ్ ప్రకారం భారత పెట్టుబడులకు మద్దతు ఇక్కడ చాలా బలంగా ఉందన్నారు. అయితే జపాన్‌లో అది లేదు. కాబట్టి భారతీయ స్టాక్ మార్కెట్ మరింత వృద్ధిని చూడవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో గోల్డ్‌మన్ సాచ్స్ సోమవారం US మాంద్యం సంభావ్యతను వచ్చే ఏడాది 15 శాతం నుంచి 25 శాతానికి పెంచింది. అయినప్పటికీ ఆశాజనకంగా ఉండటానికి అనేక కారణాలను పేర్కొంది. ఆగస్ట్‌లో ఉద్యోగ వృద్ధి పుంజుకుంటుందని, ద్రవ్యోల్భణం కూడా అదుపులోనే ఉందని తెలిపింది.
మరోవైపు ఉద్యోగావకాశాల డిమాండ్ పటిష్టంగా ఉందని, తిరోగమనానికి దారితీసే స్పష్టమైన షాక్ ఏమీ లేనందున అమెరికా మార్కెట్ వేగంగా పెరుగుతుందని మరికొంత మంది ఆర్థికవేత్తలు అంటున్నారు. పెద్ద ఆర్థిక అసమతుల్యత లేకుండా స్థిరంగా ఉందని, అవసరమైతే వడ్డీరేట్లను తగ్గించే వెసులుబాటు ఫెడరల్ రిజర్వ్‌కు ఉందని వారు ప్రస్తావించారు.
Aug 05 2024, 21:38