నమ్మించి ముంచిన రియల్ రంగం ఐన జనని పుడమి
జనని, పుడమి పేర్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగించి, వేలాదిమంది ప్రజల వద్ద 200 కోట్లు రూ. మోసం చేసిన వారి నుండి మోసపోయిన బాధితులను ప్రభుత్వం రక్షించాలి_ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి అభ్యర్థన
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చిట్యాల, బొమ్మలరామారం, యాదాద్రి తదితర చోట్ల జనని, పుడమి పేర్లతో వెంచర్లను ఏర్పాటు చేసి ఒక్క రూపాయి డిపాజిట్ చేస్తే 3 రూపాయలు ఇస్తామని అంటే 5 లక్షలు డిపాజిట్ చేస్తే 15 లక్షలు అవుతుందని నమ్మాజుపి 200 కోట్ల రూ. జమ చేసుకొని జననిని ఎత్తివేసిన వారి నుండి ప్రజలను పోలీసు శాఖ రక్షించాలని ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి అన్నారు.
ఈరోజు యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో జనని, పుడమి సంస్థల ద్వారా మోసపోయిన బాధితుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రస్తుతం పుడమి పేరుతో నూతన వ్యాపారం సాగిస్తున్న రియాల్టర్ల వ్యవహారంపై గత మూడు మాసాల క్రితం పోలీసు శాఖ ప్రత్యేక అధికారులను నియమించిందని, వారి యొక్క పరిశీలనను, విచారణను పూర్తి చేసి, అమాయక ప్రజల వద్ద వసూలు చేసిన 2 వందల కోట్ల రూపాయలను ప్రజలకు ఇచ్చి వేసే విధంగా పోలీసు శాఖ వ్యవహరించాలి. మోసం చేసిన రియల్టర్ల యొక్క ఆస్తులను, వారి యొక్క బినామీల పేరు మీద ఇటీవల కొనుగోలు చేసిన ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం జప్తు చేసి, వెంటనే అమాయకులైన బాధితులను రక్షించాలన PRPS రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి కోరారు
బాధితులంతా మూకుమ్మడిగా యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ను ముట్టడించడం, జిల్లా కలెక్టర్, జిల్లా SP కి మరియు రాష్ట్ర పోలీసు అధికారులకు సమాచారాన్ని అందజేసి న్యాయం పొందే వరకు సమైక్యంగా పోరాడాలని ఆయన కోరారు.
పంతంగి గ్రామంలో జరిగిన బాధితుల సమావేశంలో BSP రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు రాజు తదితరులు పాల్గొన్నారు.
Aug 05 2024, 13:20