/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz మనందరినీ ఏకం చేసే ఒక కల.. న్యూయార్క్ నుంచి సీఎం రేవంత్ సందేశం Raghu ram reddy
మనందరినీ ఏకం చేసే ఒక కల.. న్యూయార్క్ నుంచి సీఎం రేవంత్ సందేశం

తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగ ఉపాధి కల్పనకు దోహదపడే పెట్టుబడులు తీసుకురావడం, వ్యూహత్మక భాగస్వామ్యాలు చేసుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ప్రారంభమైంది.

ఇవాళ న్యూయార్క్ ఎయిర్ పోర్టులో ముఖ్యమంత్రి బృందానికి ఘన స్వాగతం లభించింది. అమెరికాతో పాటు దక్షిణ కొరియాలోనూ వారు పర్యటిస్తారు. "కీలకమైన న్యూయార్క్ నగరం నుంచే పెట్టుబడుల సాధన పర్యటన ప్రారంభించడం సముచితంగా భావిస్తున్నాను.

ప్రవాస భారతీయులైన ఇక్కడి మన తెలుగు సోదర సోదరీమణులు గుండెల నిండా ప్రేమ, ఆప్యాయతలతో మాకు స్వాగతం పలకడానికి విచ్చేశారు.

మనందరినీ ఏకం చేసే ఒక కల.. తెలంగాణను మరింత గొప్పగా అభివృద్ధి చేసుకోవడం" అని ముఖ్యమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

న్యూయార్క్‌ నగరం నుంచి మొదలైన ఈ పెట్టుబడుల సాధన పర్యటనలో రాబోయే 10 రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియాలోని వివిధ నగరాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు వ్యాపార ప్రముఖులతో సమావేశాలు, చర్చలు జరగనున్నాయి.

కాగా, ముఖ్యమంత్రి నాయకత్వంలోని బృందంలో పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పలువురు ఉన్నతాధికారులు భాగమవుతారు.

సీఎం పర్యటనలో భాగంగా ఇవాళ (సమయం 3:00 గంటలకు) న్యూజెర్సీలో ప్రవాస తెలంగాణ ప్రజలతో జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి బృందం పాల్గొంటుంది.

మెట్రో రైలుకు బ్రేక్‌మరో అడ్డంకి

విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు ఇప్పట్లో పట్టాలెక్కేలాలేదు. వైసీపీ ప్రభుత్వం విశాఖలో మోనో రైలు నడుపుతామంటూ ప్రగల్భాలు పలికింది. అంతకు ముందు ప్రభుత్వం సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను రివైజ్‌ చేసి పంపాలని కేంద్ర ప్రభుత్వం కోరితే...నాలుగేళ్లు దానిని తొక్కి పెట్టి ఎన్నికల ముందు సమర్పించింది. దానిని పరిశీలించేలోగా ఎన్నికలు వచ్చాయి. ప్రభుత్వం మారిపోయింది. తాజాగా రాజ్యసభలో ఓ ఎంపీ విశాఖపట్నం మెట్రో రైలు పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నించారు. దానికి దిమ్మ తిరిగే సమాధానం వచ్చింది. ప్రాజెక్టుకు రివైజ్డ్‌ డీపీఆర్‌ అయితే పంపించారు గానీ దానికి జత చేసిన కాంప్రెన్సివ్‌ మొబిలిటీ ప్లాన్‌ (సీఎంపీ)కి కాలదోషం పట్టిందని, కొత్తది పంపాల్సి ఉందని తేల్చి చెప్పింది.

ఏమిటీ మొబిలిటీ ప్లాన్‌?

విశాఖ నగరంలో జనాభా, ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించిన ఏర్పాట్లు, రహదారుల సంఖ్య, వాటి విస్తీర్ణం, వాహనాల సంఖ్య, వార్షిక పెరుగుదల, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా చేపట్టిన చర్యలు, మెట్రో రైలు ప్రాజెక్టుతో వాటికి అనుసంధానం ఎలా?...అనే వివరాలు సమర్పించేదే మొబిలిటి ప్లాన్‌

తెలుగుదేశం పార్టీ 2017లో విశాఖపట్నం మెట్రో రైలును ఫ్లాగ్‌షిప్‌ ప్రాజెక్టుగా ప్రకటించింది. 2108లో అధ్యయనం చేసి మొబిలిటీ ప్లాన్‌ తయారుచేసింది. మొత్తం 42.54 కి.మీ. పొడవున ట్రాక్‌ నిర్మించాలని ప్రతిపాదించింది. దీనికి అప్పట్లో రూ.8,300 కోట్లు అవుతుందని అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా సమకూర్చాల్సిన రూ.4,200 కోట్లను దక్షిణ కొరియాకు చెందిన ఎగ్జిమ్‌ బ్యాంకు నుంచి రుణంగా తీసుకోవాలని భావించారు. టెండర్లు పిలిచారు.

ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు వ్యయం రూ.14,300 కోట్లకు చేరింది. మొబిలిటీ ప్లాన్‌ కాల పరిమితి ఐదేళ్లు. 2018లో రూపొందించినది కాబట్టి దాని గడువు 2023తో ముగిసిపోయింది. ఈ ప్రాజెక్టు ఇంకా డీపీఆర్‌ పరిశీలనలో ఉన్నందున కొత్త మొబిలిటీ ప్లాన్‌ సమర్పించాలని కేంద్రం సూచించింది

ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కొన్ని మార్పులు చేయాలని భావిస్తోంది. నగరంలో ట్రాఫిక్‌ సజావుగా సాగడానికి 12 ఫ్లైఓవర్లు నిర్మించాలని వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించగా జాతీయ రహదారుల సంస్థ వాటికి ఆమోదం తెలిపింది. త్వరలోనే వాటికి టెండర్లను పిలిచే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అయితే నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు ప్రతిపాదన ఉన్నందున, ఆ ఫ్లైఓవర్లు, మెట్రో రైలు స్షేషన్లను ఇంటిగ్రేట్‌ చేస్తూ కొత్త ప్లాన్‌ రూపొందించాలని ముఖ్యమంత్రి

చంద్రబాబునాయుడు ఇటీవల విశాఖపట్నం వచ్చినప్పుడు మెట్రో రైలు అధికారులకు సూచించారు. ఫ్లైఓవర్ల నిర్మాణం మంచిదా?, ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మిస్తే మంచిదా? ఆలోచించి తనకు చెప్పాలని కోరారు. మెట్రో రైలు ప్రాజెక్టుకు ఇబ్బంది లేకుండా మార్పులు చేయాలని సూచించారు.

అంటే కేంద్రం కోరిన మొబిలిటీ ప్లాన్‌ కూడా ఇందులో కీలకం కానుంది. నగరంలో బీఆర్‌టీఎస్‌ రహదారులు, వాహనాల సంఖ్య, ఏయే జంక్షన్లలో ఎంతెంత ట్రాఫిక్‌ ఉంటున్నదీ కొత్తగా అధ్యయనం చేసి, దానికి అనుగుణంగా మెట్రో రైళ్ల సంఖ్య, వాటికి బస్సుల అనుసంధానం వంటివి సమర్పించాల్సి ఉంది. ఇవన్నీ పరిశీలించాకే కేంద్రం నుంచి ఆమోదం లభిస్తుంది. అప్పుడు పీపీపీలో చేయడానికి ఎవరు ముందుకు వస్తారనేది తేలుతుంది. ఆ తరువాతే ప్రాజెక్టు ముందుకు వెళుతుంది.

పింఛన్‌దారులకు అలర్ట్.. పెన్షన్లకు సంబంధించి కీలక అప్‌డేట్.. ఆ సమస్యలకు చెక్..

ఏపీలో పింఛన్‌దారులకు అలర్ట్. పింఛన్ల బదిలీకి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. వ్యక్తిగత కారణాలు, ఆరోగ్య సమస్యలు సహా వేరే ప్రాంతాల్లో ఉన్న వారు పింఛన్లు తీసుకోవటంలో ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో ఇలాంటి ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న అధికారులు.. పింఛన్ల బదిలీకి అవకాశం ఇచ్చారు. పింఛన్లు వేరే చోటుకు బదిలీ చేయాలనుకుంటున్న లబ్ధిదారులు ప్రస్తుతం పింఛన్ అందుకుంటున్న సచివాలయంలో ఇందు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

పింఛన్‌దారులకు అలర్ట్.. పెన్షన్లకు సంబంధించి కీలక అప్‌డేట్.. ఆ సమస్యలకు చెక్..

ఏపీలో పింఛన్‌దారులకు అలర్ట్. పింఛన్ల బదిలీకి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. వ్యక్తిగత కారణాలు, ఆరోగ్య సమస్యలు సహా వేరే ప్రాంతాల్లో ఉన్న వారు పింఛన్లు తీసుకోవటంలో ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో ఇలాంటి ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న అధికారులు.. పింఛన్ల బదిలీకి అవకాశం ఇచ్చారు. పింఛన్లు వేరే చోటుకు బదిలీ చేయాలనుకుంటున్న లబ్ధిదారులు ప్రస్తుతం పింఛన్ అందుకుంటున్న సచివాలయంలో ఇందు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

ఏపీలో పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పెంచిన పింఛన్లను ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం.. లబ్ధిదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా పింఛన్లను బదిలీ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.

కొంతమంది పింఛన్‌దారులు ఉపాధి లేదా ఇతరత్రా అవసరాల కోసం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి అక్కడే నివశిస్తూ ఉంటారు. అయితే అలాంటి వారంతా ఒకటో తేదీ వస్తోందంటే పింఛన్ కోసం తిరిగి సొంతూర్లకు రావాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పింఛన్లను బదిలీ చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.

లబ్ధిదారులు ప్రస్తుతం తాము నివసిస్తున్న లేదా తమకు కావాల్సిన చోటుకే పింఛన్లను బదిలీ చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రస్తుతం పింఛన్ తీసుకుంటున్న గ్రామ లేదా వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సచివాలయంలో పెన్షన్ల బదిలీ ఆప్షన్‌ను ప్రస్తుతం ఓపెన్ చేశారు. దీనివలన పింఛన్ బదిలీ కోసం దరఖాస్తు చేసేందుకు వీలవుతుంది. అయితే పింఛన్ బదిలీ కోసం దరఖాస్తు చేసే సమయంలో పింఛన్ ఐడీతో పాటుగా ఎక్కడికైతే బదిలీ చేయాలని దరఖాస్తు చేసుకుంటున్నారో ఆ జిల్లా, మండలం, సచివాలయం పేర్లు, ఇతర గుర్తింపు కార్డులు అవసరం అవుతాయని అధికారులు చెప్తున్నారు.

మరోవైపు ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రూ.4000 పింఛన్ అందిస్తోంది. వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. ఈ నెల కూడా ఆగస్ట్ ఒకటో తేదీనే 95 శాతం మందికి పింఛన్లను పంపిణీ చేశారు. సాంకేతిక అంశాలు సహా ఇతరత్రా కారణాలతో ఒకటో తేదీ పంపిణీ చేయలేని వారికి రెండో రోజు అందజేశారు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఒకటో తేదీనే అటు పింఛన్లు, ఇటు ఉద్యోగులకు జీతాలు అందించామని టీడీపీ నేతలు చెప్తున్నారు.

ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్, హరీష్‌రావు.. తిహార్ జైలులో కవితతో ములాఖత్

లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఎమ్మెల్సీ కవితను ఆదివారం కేటీఆర్, హరీష్‌రావు కలవనున్నారు.

లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఎమ్మెల్సీ కవితను ఆదివారం కేటీఆర్, హరీష్‌రావు కలవనున్నారు.

ఈ మేరకు వారిద్దరు ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు. అక్కడే రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేయగా..

ఇప్పటిక చాలాసార్లు కవిత బెయిల్ కోసం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. బలమైన సాక్షాధారాలను ఈడీ కోర్టులో ప్రవేశపెట్టడంతో ఆమెకు బెయిల్ విషయంలో నిరాశే ఎదురైంది.

కాగా, ఇటీవలే ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ల‌పై విచారించిన ధర్మాసనం వారికి జ్యుడిషియల్ కస్టడీని ఆగస్టు 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

SB news

SB news

రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో తగలబడిన కోర్బా- విశాఖ రైలు

విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కోర్బా నుంచి వచ్చిన రైల్లో మంటలు చెలరేగాయి. ఏసీ బోగీలు తగలబడిపోయాయి. బీ2. బీ7 ఎం1 బోగీలు పూర్తిగా బూడిదకాగా...

రైల్వే స్టేషన్ పరిసరాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. రైలు ఆగి ఉండటంతోనే ప్రాణనష్టం జరగలేదు. ఈ రైలు తిరుమల ఎక్స్‌ప్రెస్‌గా కడపకు బయలుదేరి వెళ్లాల్సి ఉంది. ఈ ఘటనలో మొత్తం నాలుగు భోగీలు మంటల్లో కాలిపోయినట్టు అధికారులు తెలిపారు.

విశాఖపట్నం రైల్వే స్టేషన్ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం ఉదయం ఓ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు చెలరేగి.. పలు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. కోర్బా నుంచి విశాఖకు వచ్చిన రైలు ఏసీ బోగీల్లో మంటలు చెలరేగడంతో.. బీ 6, బీ7, ఎం1లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో విశాఖ రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో దట్టంగా పొగలు కుమ్ముకున్నాయి.

దీంతో ప్రయాణికులను బయటకు పంపిన అధికారులు.. అగ్నిమాపక సిబ్బంది సహకారంతో మంటలను ఆర్పుతున్నారు. రైల్వే సిబ్బంది, అగ్నిమాపక దళాలు మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఫ్లాట్‌ఫామ్‌పై రైలు నిలిచి ఉన్న సమయంలోనే ప్రమాదం సంభవించింది. కోర్బా నుంచి విశాఖ రైల్వే స్టేషన్‌‌కు ఉదయం చేరుకున్న రైలు.. నాలుగో నెంబరు ఫ్లాట్‌ఫామ్‌పై ఉండగా మంటలు చెలరేగాయి.

కాగా, ఈ రైలు మధ్యాహ్నం 2 గంటలకు తిరుమల ఎక్స్‌ప్రెస్‌గా విశాఖపట్నం నుంచి కడపకు బయలుదేరి వెళ్లనుంది. ఇంతలోనే ప్రమాదం చోటుచేసుకుంది. నిలిపి ఉన్న రైల్లో ఈ ఘటన చోటుచేసుకోగా.. ఎటువంటి ప్రాణనస్టం జరగలేదు. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. తక్షణమే అధికారులు స్పందించడంతో భారీ ముప్పు తప్పింది. ప్రమాదంలో నాలుగు ఏసీ బోగీలు తగలబడినట్టు చెప్పారు. మంటలు మొదలైన తర్వాత రైల్లో ఉన్న ప్రయాాణికులను కిందకు దింపేసినట్టు వెల్లడించారు. ఎవరికీ ఎటువంటి చిన్న గాయం కూడా లేదని పోలీసులు పేర్కొన్నారు.

దగ్ధమైన నాలుగు భోగీలను రైలు ఇంజిన్ నుంచి వేరుచేసి.. ట్రాక్‌ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. బెడ్ షీట్లు, ధర్మాకోల్, బెర్తులు కాలిపోయినట్టు వివరించారు. మంటలను ప్రస్తుతం అదుపులోకి తీసుకొచ్చిన అధికారులు.. కాలిపోయిన బోగీలను పక్కకు తొలగిస్తామని అన్నారు. అయితే, మంటలు ఎలా చెలరేగాయనేది తెలియాల్సి ఉందని చెప్పారు. ఏసీ బోగీల్లోనే మంటలు చెలరేగడంతో షార్ట్ షర్క్యూట్ వల్ల జరిగినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దీనిపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

రైల్వే సిబ్బంది, విశాఖ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రయాణికులు దిగుతున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. మంటలను అదుపుచేస్తూ.. మిగతా బోగీలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వాటిని వెంటనే వేరుచేయడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం మంటలను పూర్తిగా అదుపుచేశారు. కాగా, ఈ ఘటన గురించి పూర్తి వివరాలు కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది.

వృద్ధుడి దారుణ హత్య.. రాళ్లు, కర్రలతో దాడి చేసిన ప్రత్యర్థులు

నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురంలో 65 ఏళ్ల వృద్ధుడు పెద్ద సుబ్బారాయుడు దారుణ హత్యకు గురయ్యారు.

పెద్ద సుబ్బారాయుడు ఇంటిపై తెల్లవారుజామున ప్రత్యర్థులు దాడికి పాల్పడి..

ఆయన ఇంట్లోని సామగ్రిని, వస్తువులను ధ్వంసం చేశారు. రాళ్లతో, కర్రలతో కొట్టడంతో పెద్ద సుబ్బారాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

పాతకక్షలే కారణమని స్థానికులు అంటున్నారు. గ్రామంలో ఉద్రిక్తతగా ఉండటంతో పోలీస్ బలగాలు మోహరించాయి. గ్రామానికి చేరుకుని పోలీసులు విచారిస్తున్నారు.

SB news

SB news

SB news

కరీంనగర్ జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్

ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టాలని పాలకులు ఎంతగా ప్రయత్నిస్తున్నా కొందరు అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ప్రజలకు పనులు చేయాలంటే ఎంతో కొంత డిమాండ్ చేసి తీసుకుంటున్నారు.

తెలంగాణలో మరో అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు.

ఓ రైతు పహాణీ పత్రం కోసం వెళితే తహసీల్దార్ పదివేల రూపాయలు లంచం డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోయాడు.

కరీంనగర్ జిల్లా ఓదెల మండలం కొమిరె గ్రామానికి చెందిన కాడం తిరుపతి అనే రైతు ఇటీవల తాను కొనుగోలు చేసిన భూమిని తండ్రి మల్లయ్య పేరిట పట్టా చేసుకోవడానికి పలుమార్లు తహసీల్దార్ జాహేద్ పాషాను సంప్రదించాడు.

ఆయన రూ. 50వేలు లంచం డిమాండ్ చేయడంతో మూడు దఫాలుగా ఆయన సహాయకుడు ధర్మేందర్‌కు లంచం ముట్టజెప్పాడు. అయినా పట్టా ఇవ్వకపోవడంతో ప్రజావాణికి ధరఖాస్తు చేసుకున్నాడు. దీంతో పట్టాదారు పాసుపుస్తకం వచ్చింది. 

అయితే బ్యాంక్ రుణం తీసుకునేందుకు గానూ పహాణీ నకలు అవసరం కావడంతో తిరుపతి మళ్లీ తహసీల్దార్ వద్దకు వెళ్లాడు. మరో రూ. పదివేలు లంచంగా ఇస్తేనే పహాణీ నకలు పత్రాలు ఇస్తానని చెప్పడంతో ఇక లంచం ఇవ్వలేని తిరుపతి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

నిన్న జుహేద్ పాషా డ్రైవర్ అంజద్ పాషా, సహాయకుడు దాసరి ధర్మేందర్‌కు రైతు లంచం ఇస్తుండగా, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మురుగు శుద్ధి.. ఇక శరవేగంగా...

మహానగరానికి తాగునీటినందించే జంట జలాశయాలు హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌(గండిపేట)లోకి చుక్క మురుగునీరు చేరకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ఈ జలాశయాల ఎగువన పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతుండడంతో భారీగా మురుగు వచ్చి చేరుతోంది.

మహానగరానికి తాగునీటినందించే జంట జలాశయాలు హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌(గండిపేట)లోకి చుక్క మురుగునీరు చేరకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ఈ జలాశయాల ఎగువన పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతుండడంతో భారీగా మురుగు వచ్చి చేరుతోంది.

మరో హుస్సేన్‌సాగర్‌(Hussainsagar)గా మారకముందే మురుగును వేగంగా శుద్ధి చేసి వదిలేందుకు వాటర్‌బోర్డు చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జంట జలాశయాల ఎగువ భాగంలో రూ.65 కోట్లతో నాలుగు మురుగునీటి శుద్ధి ప్లాంట్ల(ఎస్టీపీ) నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పాలనాపరమైన అనుమతులు కూడా రావడంతో త్వరలో పనులు ప్రారంభించేందుకు జలమండలి సన్నద్ధమవుతోంది. నెలరోజుల్లో టెండర్‌ ప్రక్రియను పూర్తి చేసి శంకుస్థాపన చేసేందుకు అడుగులేస్తోంది.

జంట జలాశయాల ఎగువ ప్రాంతాల్లో పెద్దఎత్తున ఫామ్‌హౌస్‏లు వెలిశాయి. పలు రిక్రియేషన్‌ సెంటర్లు ఏర్పాటయ్యాయి. దీంతోపాటు ఆయా గ్రామాల నుంచి మురుగునీరంతా ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌(Osmansagar, Himayatsagar)లలో చేరుతోంది.

దీన్ని అరికట్టకపోతే మున్ముందు జలాశయాల ఉనికికే ప్రమాదం ఉన్నందున ఎస్టీపీల నిర్మాణం చేపట్టాలని జలమండలి నిర్ణయించింది. నగరంలోని మణికొండ, సన్‌సిటీ, పాతబస్తీ(Manikonda, Suncity, Old Town)లోని పలు ప్రాంతాలకు ప్రతినిత్యం ఉస్మాన్‌సాగర్‌ నుంచి 97 మిలియన్‌ లీటర్లు, హిమాయత్‌సాగర్‌ నుంచి 36 మిలియన్‌ లీటర్ల నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తున్నారు.

20 ఎంఎల్‌డీల సామర్థ్యం గల ఈ నాలుగు ఎస్టీపీల నిర్మాణానికి రూ.65 కోట్ల మేర వ్యయమవుతుందని అంచనా వేశారు. ఈ పనులను దక్కించుకునే సంస్థ వాటర్‌బోర్డుతో ఒప్పందం చేసుకున్న తర్వాత తొమ్మిది నెలల్లో పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఉస్మాన్‌సాగర్‌ ఎగువన జన్వాడ, హిమాయత్‌నగర్‌ ప్రాంతాల్లో, హిమాయత్‌సాగర్‌ ఎగువన నాగిరెడ్డిగూడ(Nagireddyguda), కాముని నాలా సంగమం వద్ద అవసరమైన భూమిని సేకరించినట్లు తెలిసింది. ఎస్టీపీలు నిర్మించే సంస్థయే రెండేళ్లపాటు పూర్తి నిర్వహణ బాధ్యత వహించాల్సి ఉంటుందని టెండర్‌ నిబంధనల్లో పొందుపరిచారు.

స్టీపీలను నిర్మించనున్నారు. ఉస్మాన్‌సాగర్‌ ఎగువన 9 ఎంఎల్‌డీ(మిలియన్‌ లీటర్‌ ఫర్‌ డే) సామర్థ్యంతో రెండు ఎస్టీపీల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. 4 ఎంఎల్‌డీల సామర్థ్యంలో జన్వాడ వద్ద బుల్కాపూర్‌ నాలా సమీపంలో ఒకటి, చిలుకూరు జోన్‌ పరిధిలోని హిమాయత్‌నగర్‌ వద్ద 5 ఎంఎల్‌డీల సామర్థ్యంతో మరొకటి నిర్మించనున్నారు.

అలాగే హిమాయత్‌సాగర్‌ ఎగువన 11 ఎంఎల్‌డీల సామర్థ్యంతో రెండు ఎస్టీపీలను నిర్మించనున్నారు. అజీజ్‌నగర్‌, బంగళ్‌గూడ, నాగిరెడ్డిగూడ జోన్‌ పరిధిలో నుంచి వచ్చే మురుగును శుద్ధి చేసేలా నాగిరెడ్డిగూడ వద్ద 5ఎంఎల్‌డీల సామర్థ్యంతో ఎస్టీపీని నిర్మించడానికి నిర్ణయించారు. అదేవిధంగా మరో ఎస్టీపీని కోత్వాల్‌గూడ, శంషాబాద్‌, కవాగూడ జోన్ల పరిధిలో నుంచి వచ్చే మురుగును శుద్ధి చేసేలా కాముని నాలా సంగమం వద్ద 6ఎంఎల్‌డీల సామర్థ్యంతో ఎస్టీపీని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

రిల్ హీరో కాదు రియల్ హీరో: మోహన్ లాల్

రిల్ హీరో అంటే సినిమాల్లో హీరోయిన్ క‌ష్టాల్లో ఉంటే గూండాలతో ఫైట్ చేసి ఆమెను కాపాడుతాడు కానీ ఇక్కడ సీన్ రివర్స్ వంద లాది మంది ప్రాణాలను కాపాడడానికి వచ్చి రియ‌ల్ హీరో అనిపించుకున్నారు కేర‌ళ న‌టుడు మోహ‌న్‌ లాల్‌. 

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా లో మోహ‌న్‌లాల్‌పై ఇలాంటి ప్ర‌శ‌సంలే కురుస్తున్నాయి. ఇంత‌కీ ఆయ‌న ఏం చేశా రంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిం దే. ఇటీవ‌ల కురిసిన భారీ వర్షాల కార‌ణంగా వ‌య‌ నాడ్‌లో వ‌ర‌ద బీభ‌త్సం సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే. 

ప్ర‌కృతి వైప‌రీత్యాన్ని కొండ చెరియ‌లు విరిగిప‌డ్డాయి, ఇళ్లు, చెట్లు నేల మ‌ట్టాయి. వేలాది మంది స‌ర్వ‌స్వం కోల్పోయారు. దీంతో వీరిని అండ‌గా నిలిచేందుకు ఆర్మీ రంగంలోకి దిగిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ఆర్మీతో క‌లిసి రెస్యూ ఆప‌రే ష‌న్‌లో భాగమ‌య్యారు హీరో మోహ‌న్‌లాల్‌. 

స్వ‌యంగా గ్రౌండ్‌లోకి దిగి గౌర‌వ లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ హోదాలో స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొన్నారు. ఇప్ప‌ టికే సీఎం స‌హాయ నిధికి రూ. 25 ల‌క్ష‌ల విరాళం అందించిన మోహ‌న్‌లాల్‌, తాజాగా స్వ‌యంగా రంగంలోకి దిగారు. 

కోజికోడ్‌ నుంచి రోడ్డు మార్గంలో వయనాడ్‌కి వచ్చిన మోహన్‌లాల్‌… ఆర్మీ బేస్‌ క్యాంప్‌లో సైనికులను కలిశారు. ఆ తర్వాత ఆర్మీతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. 

తాత్కాలిక బ్రిడ్జ్‌ల నిర్మాణం, బాధితులకు సహాయం చేయడంలో పాలుపంచు కున్నారు. ఈ సంద‌ర్భంగా మోహ‌న్ లాల్ మాట్లాడుతూ.. 

దేశంలో జరిగిన ఘోర విపత్తుల్లో వయనాడ్‌ విధ్వంసం ఒకటన్నారు. సంఘ‌ట‌న స్థ‌లానికి వ‌చ్చి చూస్తే ఏ స్థాయిలో నష్టం జరిగిందో అర్ధమైందన్నారు.

హైదరాబాద్‌లో కలిసిపోతున్న సంగారెడ్డి !

మహానగరం విస్తరిస్తూంటే.. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు శరవేగంగా అందులో కలిసిపోతూంటాయి. హైదరాబాద్ విస్తరణతో … సంగారెడ్డి కూడా కూడా మహానగరంలో భాగంగా మారుతోంది. మొత్తం సంగారెడ్డి జిల్లా పారిశ్రామికంగా అభివృద్ది చెందడానికి హైదరాబాద్ కారణం అవుతోంది.

కొన్ని వేల మంది కార్మికులు రోజూ హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తూంటారు. అయితే ఇప్పుడు ఆ పారిశ్రామిక విప్లవం కారణంగా రియల్ ఎస్టేట్ కూడ పుంజుకుంటోంది. అక్కడే నివాసయోగ్యమైన కాలనీలు పెరిగిపోతున్నాయి.

ఒకప్పుడు హైదరాబాద్‌లో ఓల్డ్ ముంబై హైవే అంటే… చందానగర్ శివారు అనుకునేవారు. కానీ ఇప్పుడు సంగారెడ్డి అనుకునే పరిస్థితి వచ్చింది. చందానగర్..రామచంద్రాపురం, పటాన్ చెరు, ఇస్నాపూర్, కంది, సంగారెడ్డి ఇలా…రియల్ ఎస్టేట్ వ్యాప్తి చెందింది.  హైదరాబాద్ నుంచి సంగారెడ్డి వరకూ రియల్ ఎస్టేట్ వెంచర్లు భారీగా ఉన్నాయి. పెద్ద ఎత్తున స్థలాలు కొనుగోలు చేసిన ఔత్సాహికులు ఇప్పుడిప్పుడే ఇళ్లు కట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. భవిష్యత్ లో సంగారెడ్డి వరకూ మెట్రో వస్తుందన్న అంచనాలు ఉన్నాయి.

పారిశ్రామికంగా సంగారెడ్డి జిల్లా మంచి అభివృద్ధి సాధిస్తోంది. నిజానికి ముందు నుంచీ పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతమే. కానీ కాలుష్యం అన్న పేరు ఉంది. ఇటీవలి కాలంలో కాలుష్యం లేకుండా పరిశ్రమలు జాగ్రత్త పడుతున్నాయి. గతంలో ఫ్యాక్టరీలపై పొగగొట్టాలుండేవి. ఇప్పుడు అలాంటివి లేవు. భారీ పరిశ్రమలు.. చాలా వరకూ కాలుష్యాన్ని నిర్వీర్యం చేసుకునే చర్యలు తీసుకున్నాయి. ఈ కారణంగా హౌసింగ్ ప్రాజెక్టులకూ డిమాండ్ పెరుగుతోంది.

ఇప్పటికే బీహెచ్‌ఈఎల్ నుంచి సంగారెడ్డి వరకూ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడంతో త ధరలు కూడా స్థిరంగా పెరుగుతున్నాయి. ఇస్నాపూర్‌లో ఇప్పిడిప్పుడే కాలనీలు పెరుగుతున్నాయి. అక్కడ రూ. కోటి వరకూ పెట్టుకుంటే విశాలమైన ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది.

 సంగారెడ్డి వరకూ ఈ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు సిటీకి కాస్త దూరంగా అనిపించినా భవిష్యత్‌లో అలాంటి చోట్ల కొనుగోలు చేయడం… కష్టమవుతుంది. ఇప్పుడు కొనుక్కున్నవారే అదృష్టవంతులన్నట్లుగా సీన్ మారిపోతుంది.