పింఛన్‌దారులకు అలర్ట్.. పెన్షన్లకు సంబంధించి కీలక అప్‌డేట్.. ఆ సమస్యలకు చెక్..
ఏపీలో పింఛన్‌దారులకు అలర్ట్. పింఛన్ల బదిలీకి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. వ్యక్తిగత కారణాలు, ఆరోగ్య సమస్యలు సహా వేరే ప్రాంతాల్లో ఉన్న వారు పింఛన్లు తీసుకోవటంలో ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో ఇలాంటి ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న అధికారులు.. పింఛన్ల బదిలీకి అవకాశం ఇచ్చారు. పింఛన్లు వేరే చోటుకు బదిలీ చేయాలనుకుంటున్న లబ్ధిదారులు ప్రస్తుతం పింఛన్ అందుకుంటున్న సచివాలయంలో ఇందు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

ఏపీలో పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పెంచిన పింఛన్లను ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం.. లబ్ధిదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా పింఛన్లను బదిలీ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
కొంతమంది పింఛన్‌దారులు ఉపాధి లేదా ఇతరత్రా అవసరాల కోసం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి అక్కడే నివశిస్తూ ఉంటారు. అయితే అలాంటి వారంతా ఒకటో తేదీ వస్తోందంటే పింఛన్ కోసం తిరిగి సొంతూర్లకు రావాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పింఛన్లను బదిలీ చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.
లబ్ధిదారులు ప్రస్తుతం తాము నివసిస్తున్న లేదా తమకు కావాల్సిన చోటుకే పింఛన్లను బదిలీ చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రస్తుతం పింఛన్ తీసుకుంటున్న గ్రామ లేదా వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సచివాలయంలో పెన్షన్ల బదిలీ ఆప్షన్‌ను ప్రస్తుతం ఓపెన్ చేశారు. దీనివలన పింఛన్ బదిలీ కోసం దరఖాస్తు చేసేందుకు వీలవుతుంది. అయితే పింఛన్ బదిలీ కోసం దరఖాస్తు చేసే సమయంలో పింఛన్ ఐడీతో పాటుగా ఎక్కడికైతే బదిలీ చేయాలని దరఖాస్తు చేసుకుంటున్నారో ఆ జిల్లా, మండలం, సచివాలయం పేర్లు, ఇతర గుర్తింపు కార్డులు అవసరం అవుతాయని అధికారులు చెప్తున్నారు.
మరోవైపు ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రూ.4000 పింఛన్ అందిస్తోంది. వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. ఈ నెల కూడా ఆగస్ట్ ఒకటో తేదీనే 95 శాతం మందికి పింఛన్లను పంపిణీ చేశారు. సాంకేతిక అంశాలు సహా ఇతరత్రా కారణాలతో ఒకటో తేదీ పంపిణీ చేయలేని వారికి రెండో రోజు అందజేశారు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఒకటో తేదీనే అటు పింఛన్లు, ఇటు ఉద్యోగులకు జీతాలు అందించామని టీడీపీ నేతలు చెప్తున్నారు.
Aug 04 2024, 15:18