/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz 96 మంది డీఎస్పీలు ‘బదిలీ’ Raghu ram reddy
తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 01 2024, 14:02

96 మంది డీఎస్పీలు ‘బదిలీ’

రాష్ట్రవ్యాప్తంగా 96 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

రాష్ట్రవ్యాప్తంగా 96 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అందులో... వైసీపీ హయాంలో అడ్డగోలుగా వ్యవహరించడంతోపాటు వివిధ కారణాలతో ఏకంగా 57 మందికి పోస్టింగ్‌ ఇవ్వకుండా పోలీసు ప్రధాన కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమల రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

సబ్‌ డివిజనల్‌ అధికారులతోపాటు సీఐడీ, ఇంటెలిజెన్స్‌, విజిలెన్స్‌లో పనిచేస్తున్న కొందరు డీఎస్పీలకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. వీరిలో శాంతి భద్రతల విభాగంలో పని చేస్తూ వైసీపీతో అంటకాగిన వారు

చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు లక్ష్యంగా ఏర్పాటు చేసిన ‘సిట్‌’, ఇంటెలిజెన్స్‌లో ఉంటూ పీఎస్సార్‌ ఆంజనేయులు కనుసన్నల్లో పని చేసిన వారు, సీఐడీలో విధులు నిర్వహిస్తూ తప్పుడు కేసులు పెట్టిన అధికారులు ఉన్నారు.

శాంతిభద్రతల విభాగంలో 35 సబ్‌ డివిజన్లకు చెందిన 22 మంది డీఎస్పీలను అక్కడి నుంచి తప్పించారు. గన్నవరం డీఎస్పీగా ఉన్న జయసూర్యను మాత్రం భీమవరం బదిలీ చేశారు. మిగిలిన 21 మందికి కొత్తగా డీఎస్పీ పోస్టింగ్‌ లభించింది. వీరంతా ఐదేళ్లుగా లూప్‌లైన్‌లో ఉన్న వారే.

శాంతి భద్రతల విభాగంలో పని చేస్తూ... బదిలీ అయి పోస్టింగ్‌ దక్కని వారిలో... వై.శృతి (శ్రీకాకుళం), జి.నాగేశ్వర రెడ్డి (కాశీబుగ్గ), డి. బాలచంద్రారెడ్డి (టెక్కలి), ఎ.ఎస్‌, చక్రవర్తి(చీపురుపల్లి), హనుమంతరావు (కాకినాడ), విజయ్‌ పాల్‌ (రాజమండ్రి సెంట్రల్‌), అంబికా ప్రసాద్‌ (రాజమండ్రి దక్షిణ), పి. శ్రీకాంత్‌(గుడివాడ), నారాయణ స్వామి రెడ్డి (భీమవరం), మురళీ కృష్ణా రెడ్డి (విజయవాడ వెస్ట్‌), ఎం. రమేశ్‌ (తెనాలి), రవికాంత్‌ (గుంటూరు నార్త్‌), మహబూబ్‌ బాషా (గుంటూరు సౌత్‌), శ్రీనివాసరావు (గురజాల), కిశోర్‌ బాబు (ఒంగోలు), అశోక్‌ వర్ధన్‌ (దర్శి), బాలసుందర్‌ రావు (మార్కాపురం), వీరాంజనేయ రెడ్డి (నెల్లూరు రూరల్‌), బాజీజాన్‌ సైదా (పెనుకొండ), సూర్యనారాయణ రెడ్డి (గూడూరు), శ్రీనివాస రెడ్డి (నాయుడు పేట), ఉమా మహేశ్వర రెడ్డి (శ్రీకాళ హస్తి), శ్రీనివాస రెడ్డి (డోన్‌), శ్రీనివాసులు (ఏలూరు), ప్రసాద రెడ్డి (మదనపల్లె), వినోద్‌ కుమార్‌ (పులివెందుల), మురళీధర్‌ (ప్రొద్దుటూరు), శివభాస్కర్‌ రెడ్డి (గుంతకల్‌), బి. శ్రీనివాసులు(కళ్యాణదుర్గం), వాసుదేవన్‌ (పుట్టపర్తి), విజయ శేఖర్‌ (కర్నూలు), రవీంద్రనాథ్‌ రెడ్డి (నంద్యాల) ఉన్నారు. వీరిలో చాలామంది గత ప్రభుత్వంలో వైసీపీ భక్తులుగా పనిచేసినట్లు ఆరోపణలున్నాయి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 01 2024, 13:49

సగానికి పైగా నిండిన సాగర్‌..

కృష్ణమ్మ ఉధృతికి నాగార్జున సాగర్‌లో నీటిమట్టం పెరుగుతోంది. ఎగువన శ్రీశైలం నుంచి 8 గేట్ల ద్వారా 2.16 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు సగానికి పైగా నిండింది.

కృష్ణమ్మ ఉధృతికి నాగార్జున సాగర్‌లో నీటిమట్టం పెరుగుతోంది. ఎగువన శ్రీశైలం నుంచి 8 గేట్ల ద్వారా 2.16 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.

ప్రాజెక్టు సగానికి పైగా నిండింది. 312.05 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో ప్రస్తు తం 161.97 టీఎంసీల నీరు ఉంది.

కృష్ణాబేసిన్‌లో సాగర్‌ దిగువన ఉన్న పులిచింతల మినహా మిగిలిన ప్రాజెక్టులన్నీ దాదాపు గా నిండాయి. గోదావరి బేసిన్‌లో సాగునీటిని అందించే కీలక ప్రాజెక్టు ల్లో తప్పిస్తే.. మిగతా ప్రాజెక్టుల్లో వచ్చిన నీటిని వచ్చినట్లు గానే విడుదల చేస్తున్నారు.

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం స్వల్పం గా తగ్గుతోంది. బుధవారం సాయంత్రం 44.9 అడుగుల నీటి మట్టం నమోదైంది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

కాగా, గురువారం ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించ నున్నారు. ఈ సందర్భంగా కృష్ణమ్మకు జలహారతి ఇవ్వనున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 01 2024, 13:46

అవసరమైతే ఆర్డినెన్స్ తెస్తాం: ఎస్సీ వర్గీకరణపై రేవంత్ రెడ్డి తాజా ప్రకటనలు

ఎస్సీ, ఎస్టీల ఉప వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలను జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీల ఉప వర్గీకరణకు ఆమోదం తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలో ఏర్పాటైన ఏడుమంది సభ్యుల ధర్మాసనం ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతుల్లో మరింత వెనుకబడిన వారికి ప్రత్యేక కోటాలను మంజూరు చేయడంపై దాఖలైన పిటీషన్లపై విచారించడానికి ఏడుమంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఏర్పాటైంది. ఇందులో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ బీఆర్ గవై, జస్టిస్ విక్రాంత్ నాథ్, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం దీనిపై తుది తీర్పు ఇచ్చింది.

ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణను రాష్ట్రాలు చేయొచ్చని స్పష్టం చేసింది. కళాశాలలు, ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని స్పష్టం చేసింది. దీనిపై 2004లో అయిదుమంది న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.

దీనిపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి. ఎస్సీ వర్గీకరణ కోసం సుదీర్ఘకాలంగా పోరాటం సాగిస్తూ వస్తోన్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ.. ఈ తీర్పును కన్నీటితో స్వాగతించారు. వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకే ఉందని సుప్రీంకోర్టు చెప్పడం తమ పోరాటానికి నిదర్శనమని అన్నారు.

వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణ చేయడానికి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇప్పటికే జారీ చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్‌లో కూడా మాదిగ, మాల ఉప కులాలకు రిజర్వేషన్లు అమలు చేయడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటామని, దీనికోసం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి తాము వర్గీకరణను అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో తాము అన్ని రాష్ట్రాల కంటే ముందుంటామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణకు మాదిగ, మాల ఉప కులాలకు వర్గీకరణకు వాయిదా తీర్మానం ఇస్తే గత ప్రభుత్వం సంపత్ కుమార్‌ను సస్పెండ్ చేసిందని గుర్తు చేశారాయన.

తాము అధికారంలోకి వచ్చిన అతి కొద్దిరోజుల్లోనే అంటే.. 2023 డిసెంబర్ 23వ తేదీన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, అడ్వకేట్ జనరల్‌ను సుప్రీంకోర్టుకు పంపించామని, వర్గీకరణపై సుప్రీంకోర్టులో న్యాయ నిపుణులతో వాదనలు వినిపించామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించిందని రేవంత్ రెడ్డి చెప్పారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 01 2024, 13:32

సంజయ్‌, పొన్నవోలుకు హైకోర్టు నోటీసులు

దర్యాప్తు దశలో ఉన్న స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసు వివరాలను నిబంధనలకు విరుద్ధంగా మీడియాకు వెల్లడించడంతో పాటు అందుకోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వ్యవహారంలో సీఐడీ పూర్వ అడిషనల్‌ డీజీ సంజయ్‌, మాజీ అడిషనల్‌ ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి బుధవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

దర్యాప్తు దశలో ఉన్న స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసు వివరాలను నిబంధనలకు విరుద్ధంగా మీడియాకు వెల్లడించడంతో పాటు అందుకోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వ్యవహారంలో సీఐడీ పూర్వ అడిషనల్‌ డీజీ సంజయ్‌, మాజీ అడిషనల్‌ ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి బుధవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

వీరితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శికి కూడా నోటీసులు ఇచ్చింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను సెప్టెంబరు 9కి వాయిదా వేసింది. 

ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ ఆర్‌. ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

టీడీపీ అధినేత చంద్రబాబుపై నాడు దాఖలు చేసిన స్కిల్‌ కేసు వివరాలను పత్రికా సమావేశాలు నిర్వహించి వెల్లడించడం ద్వారా నిబంధనలు అతిక్రమించిన సంజయ్‌, పొన్నవోలు సుధాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ

ఏపీ యునైటెడ్‌ ఫోరం ఫర్‌ యునైటెడ్‌ క్యాంపెయిన్‌ అధ్యక్షుడు ఎన్‌.సత్యనారాయణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేశారు. ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు రాగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎం.గిరిబాబు వాదనలు వినిపించారు.

ఆంగ్లంలో తర్జూమా చేసిన వివరాలను కోర్టు ముందు ఉంచామన్నారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 01 2024, 13:26

హమాస్ చీఫ్ హత్య.. ఇజ్రాయేల్‌పై దాడికి ఇరాన్ సుప్రీమ్ ఖమేనీ ఆదేశాలు

పశ్చిమాసియా మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఉద్రిక్తతలకు ఆజ్యం పోసేలా హమాస్‌ అగ్రనేత ఇస్మాయిల్‌ హనియా (62)ను ఇజ్రాయేల్‌ అంతం చేసింది. లెబనాన్‌‌లో హెజ్‌బొల్లా ఉగ్రవాద కమాండర్‌ ఫాద్‌ షుక్ర్‌యే లక్ష్యంగా దాడులు టెల్ అవీవ్ జరిపిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దాడి చోటుచేసుకోవడం గమనార్హం. ఈ దాడికి ఇరాన్‌ వేదిక కావడం చర్చకు తెరతీసింది. అందరూ అనుకున్నట్టుగానే ఇరాన్ దీనిని తీవ్రంగా పరిగణించి, ప్రతీకారం తీర్చుకోడానికి సిద్ధమైంది.

హామాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యతో ఇరాన్, ఇజ్రాయేల్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. తమ భూభాగంలోనే హమాస్ నేతను హత్యచేయడాన్ని ఇరాన్ జీర్ణించుకోలేపోతోంది. ఇరాన్ రాజధాని నగరం టెహ్రాన్‌లో మంగళవారం జరిగిన దాడిలో ఇస్మాయిల్ చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇజ్రాయేల్‌పై ప్రతీకారానికి ఇరాన్ సిద్ధమయ్యింది. టెల్ అవీవ్‌పై నేరుగా దాడికి ఇరాన్ సుప్రీమ్ నేత అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశాలు ఇచ్చినట్టు ఆ దేశ అధికారులను, రివల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన ఇద్దరు సభ్యులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.

హనియా హత్యకు గురైనట్టు ప్రకటన చేసిన కొద్దిసేపటికే బుధవారం ఉదయం జాతీయ భద్రతా మండలి అత్యవసర సమావేశం ఏర్పాటుచేసిన ఖమేనీ.. ఈ మేరకు ఆదేశాలు జరాచేసినట్టు పేర్కొంది. ఇస్మాయిల్‌ను ఇజ్రాయేల్ హత్య చేసిందని ఇరాన్, హమాస్ ఆరోపిస్తున్నాయి. గత అక్టోబరు నుంచి గాజాలో ఇజ్రాయేల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతుండగా.. ఈ ఆరోపణలపై ఇప్పటి వరకూ టెల్ అవీవ్ స్పందించలేదు. ఖండించడంగానీ తామే దాడిచేశామనిగానీ చెప్పలేదు. ఇరాన్ అధ్యక్షుడి ప్రమాణస్వీకారానికి హాజరై ఇంటికి తిరిగొచ్చిన వెంటనే హమాస్ చీఫ్‌‌ హత్యకు గురయ్యారు.

న్యూయార్క్ టైమ్స్ ప్రకారం.. ఇరాన్ అణు శాస్త్రవేత్తలు, సైనిక కమాండర్లతో సహా విదేశాలలో శత్రువులను చంపిన సుదీర్ఘ చరిత్ర ఇజ్రాయెల్‌కు ఉంది. గాజాలో దాదాపు 10 నెలల యుద్ధం తర్వాత ఇరాన్ సమతౌల్యతను సాధించడానికి ప్రయత్నించింది. ఈ ప్రాంతంలో దాని మిత్రదేశాలు, తీవ్రంగా పెరిగిన శత్రువుల దాడులతో ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెరిగింది. అదే సమయంలో రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం మొదలయ్యింది.

విదేశాల్లో ఇటీవల ఇజ్రాయేల్‌ జరిపిన అతిపెద్ద దాడి సిరియా రాజధాని డమాస్కస్‌లోది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఈ దాడిలో ఇరాన్ సైనిక కమాండర్‌‌లు హతమయ్యారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై వందల కొద్దీ క్షిపణులు, డ్రోన్‌లను ప్రయోగించింది.

ఇరాన్ ప్రతిస్పందన ఎంత శక్తివంతంగా ఉంటుంది.. తీవ్రతరం కాకుండా ఉండటానికి అది మరోసారి దాడులు కొనసాగిస్తుందా అనేది అస్పష్టంగా ఉంది. ఇరాన్ సైనిక కమాండర్లు ఇజ్రాయేల్ రాజధాని టెల్ అవీవ్, హైఫా సమీపంలోని సైనిక లక్ష్యాలపై డ్రోన్లు, క్షిపణులతో మరొక దాడిని పరిశీలిస్తున్నారు.. కానీ పౌర లక్ష్యాలపై దాడులను నివారించడం ఒక పాయింట్’ ఇరాన్ అధికారులు చెప్పారు.

తీవ్రత ఎక్కువగా ఉండేందుకు యెమెన్, సిరియా సహా మిత్రదేశాల దళాలను సమన్వయం చేసుకుని.. సరిహద్దుల నుంచి దాడి పరిశీలనలో ఉందని, దీనిపై తుది నిర్ణయం ఖమేనీదే అని చెప్పాయి. ఒకవేళ యుద్ధం తీవ్రమై, ఇజ్రాయెల్‌పై దాడి, ప్రతిదాడులకు రెండింటికీ ప్రణాళికలను సిద్ధం చేయాలని రివల్యూషనరీ గార్డ్స్, సైన్యానికి సూచించారు.

హామాష్ చీఫ్ హత్యపై చేసిన బహిరంగ ప్రకటనలో ఇరాన్ నేరుగా ప్రతీకారం తీర్చుకుంటుందని ఖమేనీ సంకేతాలు ఇచ్చారు.. ‘అతడి రక్తానికి ప్రతీకారం తీర్చుకోవడం మా బాధ్యత’ అని నొక్కిచెప్పారు. తమ భూభాగంలో జరిగిన ఈ ఘటనతో ఇజ్రాయేల్ కఠినమైన శిక్షను స్వీకరించడానికి వేదికను ఏర్పాటు చేసిందని ఇరాన్ సుప్రీమ్ అన్నట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.

ఖమేనీతో పాటు ఇరాన్ నూతన అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, విదేశాంగ శాఖ, రివల్యూషనరీ గార్డ్స్, ఐరాసలోని ఇరాన్ మిషన్ సైతం ఇస్మాయిల్ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయేల్‌పై దాడి చేస్తామని ప్రకటించాయి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 01 2024, 13:22

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీం కీలక తీర్పు

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది..

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. 6:1 మెజారిటీతో సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. గురువారం నాడు వర్గీకరణపై సుదీర్ఘ విచారణ జరిపిన ఏడుగురు సభ్యుల ధర్మాసనం.. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ సమర్థనీయమని స్పష్టం చేసింది. కాగా.. ఈ వర్గీకరణను మెజారిటీ సభ్యులు సమర్థించగా.. జస్టిస్‌ బేలా త్రివేది మాత్రం వ్యతిరేకించారు. ఎస్సీలు చాలా వెనుకబడిన వర్గాలుగా ఉన్నారని.. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ అవసరం ఉందని.. వర్గీకరణచేసే వెసులుబాటు రాష్ట్రాలకు ఉండాలని సుప్రీం స్పష్టం చేసింది. ఈ మేరకు 2004లో ఐదుగురు సభ్యులు ఇచ్చిన తీర్పును తాజా తీర్పు తర్వాత ధర్మాసనం పక్కనబెట్టింది. ఈ తీర్పును అనుసరించి తదుపరి మార్గదర్శకాలను అనుసరించాలని ప్రభుత్వాలకు న్యాయస్థానం సూచించింది.

సామాజిక న్యాయం లక్ష్యంగా భారత రాజ్యాంగం దేశంలో విడిపోయి ఉన్న కులాలను చాలా శాస్త్రీయంగా అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎఫ్.సి.లుగా వర్గీకరించింది. షెడ్యూల్ కులాలకు సంబంధించి అంటరానితనానికి గురవుతున్న కులాలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి వారికి రిజర్వేషన్ అవకాశాలు కల్పించింది. అయితే ఇలా కులపరంగా రిజర్వేషన్ పొందుతున్న తరగతుల్లో మాలలే అగ్ర భాగాన ఉన్నారని ఆరోపిస్తూ, ఈ తేడాను సవరించాలని ఎమ్మార్పీఎస్ ఉద్యమం చేస్తూ ఎ, బి, సి, డి కేటగిరీల వారీగా ఎస్సీలను వర్గీకరించాలని కొన్నేళ్లుగా ప్రభుత్వాలు, న్యాయస్థానాలను కోరుతూ వస్తోంది. ఇదిలా ఉంటే.. పంజాబ్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ద పంజాబ్‌ షెడ్యూల్డ్‌ క్యాస్ట్స్‌ అండ్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ (రిజర్వేషన్‌ ఇన్‌ సర్వీసెస్‌) యాక్ట్‌-2006’ను సవాలు చేస్తూ పదుల సంఖ్యలో ధర్మాసనంకు పిటిషన్లు వచ్చాయి. ఇందులో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిటిషినర్‌గా ఉన్నారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎస్సీలకు 22.5% రిజర్వేషన్‌ కల్పిస్తుండగా.. పంజాబ్‌లో అది 25శాతంగా ఉంది. పంజాబ్‌ రిజర్వేషన్ల చట్టంలోని సెక్షన్‌ 4(5) ప్రకారం.. ఎస్సీ రిజర్వేషన్లలో వాల్మీకి, మజ్హబీ సిక్కులు పోటీలో ఉంటే.. వారికి ప్రాధాన్యతనిస్తూ 50% కోటాను కేటాయించాలి. ఈ చట్టం వల్ల ఎస్సీల్లోని ఇతర కులస్థులు ఉద్యోగావకాశాలను కోల్పోతున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ పంజాబ్‌-హరియాణా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. 2010లో పంజాబ్‌ సర్కారుకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పునిచ్చింది. 2011లో పంజాబ్‌ సర్కారు దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లగా.. ఇతర పిటిషనర్లు సైతం వ్యాజ్యాలను దాఖలు చేశారు. 2020 ఆగస్టు 27న జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా(ప్రస్తుతం రిటైర్‌ అయ్యారు) నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ విషయాన్ని పరిశీలించేందుకు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం అవసరమని స్పష్టం చేశారు. అసలు.. రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీల వర్గీకరణ చేయొచ్చా? అనే అంశంపై న్యాయపరమైన ప్రశ్నలను పరిశీలించేందుకు ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. ఇందులో చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌తోపాటు.. జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ బేలా.ఎం.త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా, జస్టిస్‌ సతీశ్‌చంద్ర మిశ్రాల ధర్మాసనం ఈ విచారణను ప్రారంభించింది.

ఈ కేసులో పిటిషనర్లు 2004 నాటి ‘ఈవీ చిన్నయ్య వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’ కేసులో సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పును ఉటంకించారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీల్లో వర్గీకరణ చేయడం రాజ్యాంగ విరుద్ధమని, అలాంటి నిర్ణయాలు భారత రాజ్యాంగంలోని 14వ అధికరణ(చట్టం ముందు అంతా సమానులే)ను ఉల్లంఘిస్తోందని 2004 నాటి తీర్పు స్పష్టం చేస్తోంది. దీనికి తోడు.. ఎస్సీ కులాల గుర్తింపు బాధ్యత పార్లమెంట్‌కు మాత్రమే ఉంటుందని, ఆయా కులాలను రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 341 మేరకు రాష్ట్రపతి మాత్రమే నోటిఫై చేస్తారని పిటిషనర్లు తమ వ్యాజ్యాల్లో పేర్కొనడం జరిగింది. ఇదంతా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగింది. ఈ క్రమంలోనే.. ఇవాళ 2004 నాటి ఈవీ చిన్నయ్య తీర్పును వ్యతిరేకిస్తూ.. రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేసుకునేందుకు అనుమతి కల్పిస్తున్నట్లు సీజేఐ ధర్మాసనం స్పష్టంచేసింది.

ఎస్సీ రిజర్వేషన్లలో క్యాటగిరి చేసుకునే అంశంపై పంజాబ్ ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎమ్మార్పీఎస్ సుప్రీంకోర్టు ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజా తీర్పుతో ఆయా వర్గాలు, నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ తీర్పును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతిస్తున్నట్లు తెలిపారు. పేదలకు న్యాయం జరగాలన్నదే మోదీ సర్కార్ ఉద్దేశమని.. ప్రభుత్వ ఫలాలు అందరికీ అందాలని చెప్పుకొచ్చారు.

మరోవైపు.. సుప్రీంకోర్టు తీర్పుపై ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ స్పందిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. మీడియా ఎదుటే ఆయన కంటనీరు పెట్టుకున్నారు. ‘మా 30 ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బతికించింది. ఈ ప్రక్రియ వేగవంతానికి ప్రధాని నరేంద్ర మోదీ చొరవ తీసుకున్నారు. అమిత్‌షా, వెంకయ్యనాయుడు, కిషన్‌రెడ్డికి ధన్యవాదాలు. వర్గీకరణ చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ విజయాన్ని అమరులకు అంకితం ఇస్తున్నాం. రిజర్వేషన్ల సిస్టమ్ ఇప్పుడు రెండో అడుగు వేయబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అనివార్యం. వర్గీకరణకు సంబంధించిన జీవోలు వచ్చిన తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఉద్యోగ నోటిఫికేషన్లు సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. రీ-నోటిఫికేషన్లు ఇవ్వాలి’ అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మందకృష్ణ మాదిగ కోరారు. వర్గీకరణకు జనాభా లెక్కలతో పనిలేదని మరోసారి గుర్తు చేశారు. త్వరలో విజయోత్సవ సభ.. ఇందుకు సహకరించిన వారికి కృతజ్ఞత సభలు ఉంటాయని మందకృష్ణ వెల్లడించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 30 2024, 20:22

జనసేన పార్టీ ఎమ్మెల్యే కారుపై దాడి.. పవన్ కళ్యాణ్ సీరియస్..

ఏలూరు జిల్లా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు.

కారులో ఇంటికి వెళ్తుండగా జీలుగుమిల్లి మండలం బర్రిలంకలపాడు సమీపంలో దాడి జరిగింది.

ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. దాడిని తీవ్రంగా ఖండించారు.

ఘటనకు కారకులైన వారిని పోలీసులు తక్షణమే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు..

Sb news

Sb news

Sb news

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 30 2024, 15:16

ధరల పోటీ తట్టుకోలేక పోతున్నాం

ఇండియా సిమెంట్స్‌ (ఐసీఎల్‌) అమ్మకానికి దారితీసిన పరిస్థితులను ఆ సంస్థ అధినేత ఎన్‌ శ్రీనివాసన్‌ తనకు సన్నిహితులైన 300 మంది ఉద్యోగులతో పంచుకున్నారు. ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోయి ధరల విషయంలో పోటీ సంస్థలతో పోటీపడలేకే కంపెనీని అమ్మాల్సి వచ్చిందని వారితో భావోద్వేగంతో చెప్పారు.

కంపెనీ యాజమాన్యం చేతులు మారినా ఐసీఎల్‌ ఉద్యోగుల ఉద్యోగ భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదని హామీ ఇచ్చారు.

కంపెనీ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు, భూములు అమ్మేందుకు చేసిన ప్రయత్నాలూ ఫలించలేదన్నారు. కంపెనీ అమ్మకానికి ఇది కూడా ఒక కారణమన్నారు. ‘ధరలు తగ్గించి మన పోటీ సంస్థలు మనల్ని తొక్కేయగలవు. వారితో పోలిస్తే మన ఉత్పత్తి వ్యయం కొద్దిగా ఎక్కువ.

దాన్ని తగ్గించేందుకు చేసిన ప్రయాత్నాలు పెద్దగా ఫలించలేదు. అందుకే ఇండియా సిమెంట్స్‌ను అమ్మేయాల్సి వస్తోంది’ అని శ్రీనివాసన్‌ తనను కలిసిన ఉద్యోగులతో భావోద్వేగంతో చెప్పారు. దీంతో గత 55 సంవత్సరాలుగా సిమెంట్‌ పరిశ్రమతో ఆయనకు ఉన్న అనుబంధం ముగియబోతోంది.'

ఇండియా సిమెంట్స్‌ (ఐసీఎల్‌) షేర్లను డీలిస్ట్‌ చేసే ఆలోచన లేదని అలా్ట్రటెక్‌ సిమెంట్‌ ప్రకటించింది. కంపెనీ ఈక్విటీలో మెజారిటీ వాటా తమ హస్తగతమైనా.. ఐసీఎల్‌ ప్రత్యేక లిస్టెడ్‌ కంపెనీగానే కొనసాగుతుందని రెగ్యులేటరీ సంస్థలకు తెలిపింది.

ఐసీఎల్‌ ప్రధాన ప్రమోటర్‌ ఎన్‌ శ్రీనివాసన్‌, ఆయన కుటుంబసభ్యుల నిర్వహణలోని ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) క్రికెట్‌ టీమ్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎ్‌సకే) యాజమాన్యంలోనూ ఎలాంటి మార్పు ఉండదని ప్రకటించింది.

ఐసీఎల్‌ ఈక్విటీలో మరో 26 శాతం వాటా కోసం తాము చేసే ఓపెన్‌ ఆఫర్‌ను యాక్సిస్‌ క్యాపిటల్‌ నిర్వహిస్తుందని తెలిపింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 30 2024, 15:10

ఈమె అతి తెలివికి దండం పెట్టొచ్చు.. వాషింగ్ మెషిన్‌ను ఎలా వాడిందో చూస్తే..

ఇళ్లల్లో వస్తువులను చిత్రవిచిత్రంగా వాడే వారిని రోజూ చూస్తూనే ఉంటాం. కొందరు కూలర్‌ను ఫ్రిడ్జ్‌లా మార్చి పండ్లు, కూరగయలు పెడుతుంటారు. ఇంకొందరు ఫ్రిడ్జి నుంచి వచ్చే చల్లదనంతో ఇంటిని ఏసీలా మార్చుతుంటారు.

మరొక మహిళేమో.. ఇటుకలతో ఏకంగా వాషింగ్‌మెషిన్ తరహాలో నిర్మాణం చేపడుతుంది. ఇలాంటి వీడియోలు రోజూ చూస్తూనే ఉన్నాం. తాజాగా, ఓ మహిళ వాషింగ్ మెషిన్‌ను వాడిన విధానం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ వాషింగ్ మెషిన్‌ను (Washing machine) వాడే విధానం చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు.

సాధారణంగా ఎవరైనా వాషింగ్‌మెషిన్‌ను బట్టలు ఉతికేందుకు ఉపయోగిస్తారు. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది.

వాషిన్‌మెషిన్‌ను ఓపెన్ చేసిన ఆమె.. ముందుగా అందులో నీరు పోసి, తర్వాత అందులో లిక్విడ్ పోస్తుంది. ఆ తర్వాత ఏకంగా ఇంట్లోని (Woman putting dishes in washing machine) వంట పాత్రలన్నీ అందులో పడేస్తుంది. ఫైనల్‌గా మిషిన్ ఆన్ చేయగా.. గిరాగిరా వేగంగా తిరిగి పాత్రలు క్లీన్ అవుతాయి. ఇలా దుస్తులను వేయాల్సిన మిషిన్‌లో పాత్రలు వేసి శుభ్రం చేసింది. ఈమె అతి తెలివి చూసి అంతా అవాక్కవుతున్నారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. వాషింగ్‌మెషిన్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది అంటూ కొందరు

ఈమె అతి తెలివికి హ్యాట్సాప్ అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 30 2024, 15:05

ఇద్దరు ఆర్డీవోలపై వేటు

వేత కేసులో ఇద్దరు ఆర్డీవోలను, ఒక సీనియర్‌ అసిస్టెంట్‌ను సస్పెండ్‌ చేశారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సిసోడియా నివేదికల ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో మదనపల్లె ఆర్డీవోగా పనిచేసిన మురళి, ప్రస్తుత ఆర్డీవో హరిప్రసాద్‌తో పాటు సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్ట్టెంట్‌ గౌతంతేజ్‌లను సస్పెండు చేసింది. ఇదే కేసులో ఇటీవల మదనపల్లె వన్‌టౌన్‌ సీఐ వలీబషును వీఆర్‌కు పంపి, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండు చేశారు.

మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయాన్ని కర్నూలు రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌ సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం తమ అదుపులో అనుమానితులు ఎవరూ లేరన్నారు. ఎఫ్‌ఎ్‌సఎల్‌ (ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌) నివేదిక రాగానే 15 రోజుల్లో నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామన్నారు. మాధవరెడ్డి ఇంట్లో 500 వరకు ఇళ్ల స్థలాలు, భూముల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో శశికాంత్‌ ఇంట్లో మదనపల్లెకు చెందిన భూముల రికార్డులు దొరికాయన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి పీఏ తుకారం ఇంట్లోనూ, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి ఇంట్లోనూ సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే నవాజ్‌బాషా ఇంట్లో కొన్ని రికార్డులు స్వాధీనం చేసుకున్నామని, ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఫైళ్ల కాల్చివేత కేసును అన్ని కోణాల్లో సాంకేతిక సహకారంతో పరిశోధిస్తున్నట్లు వివరించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించినట్లు తెలిపారు. సెల్‌ టవర్‌ డంప్స్‌ తీశామని, 2000కు పైగా ఫోన్‌ కాల్‌డేటాను పరిశీలించినట్లు తెలిపారు. వాట్సా్‌పలకు సంబంధించి ఐపీడీఆర్‌ను కూడా పరిశీలించినట్లు చెప్పారు. ఇప్పటికే అనుమానితుల ఇళ్లను సోదా చేసి విలువైన ఆధారాలు సేకరించినట్లు ప్రకటించారు. పరిశోధనకు ఉపయోగపడే డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కొత్తగా 8 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో సీఐడీ అధికారుల సహకారంతో 15 బృందాలు విచారణ చేసినట్లు తెలిపారు.

సోమవారం మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు ప్రజలు పోటెత్తారు. గత ఐదేళ్లలో వైసీపీ నాయకుల వేఽధింపులకు గురైన బాధితులు వెల్లువలా వచ్చారు. సబ్‌కలెక్టర్‌ మేఘస్వరూ్‌పకు సుమారు 150 మంది బాధితులు తమ సమస్యలపై ఫిర్యాదులు అందజేశారు. వైసీపీ నాయకులు తమ భూములు ఆక్రమించారని, దౌర్జన్యంగా లాక్కున్నారని, విలువైన భూములను అతి తక్కువ ధరకే కాజేశారని.. చాలా వరకు ఇలాంటి ఫిర్యాదులే ఉన్నాయి.

మదనపల్లె సబ్‌ డివిజన్‌లోని భూబాధితులు ఆగస్టు 4వ తేదీ మదనపల్లె సబ్‌ కలెక్టరేట్‌కు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చని, తమ పార్టీ అండగా ఉంటుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. సోమవారం స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఫైళ్లు దహనమైన గదిని, కాలిన కాగితాలను, పరిసరాలను ఆయన పరిశీలించారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలోకి పోలీసులు అనుమతించకుండా ఆయనను అడ్డుకోవడంతో సీపీఐ నాయకులు పోలీసులను తోసుకుని వెళ్లి కార్యాలయంలో జరిగిన సంఘటనను పరిశీలించారు. అనంతరం ఆయన పోలీసుల తీరుపై మండిపడ్డారు. అంతజాగ్రత్తగా పోలీసులు ఉంటే ఇప్పటికే నిందితులను పట్టుకోవచ్చు కదా అని ప్రశ్నించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కొందరు ఉద్దేశపూర్వకంగానే స్వార్థ ప్రయోజనాల కోసం పైళ్లు కాల్చినట్లు సంఘటనను చూస్తే అర్థం అవుతుందన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ప్రజలను అన్నివిధాలా దోచుకున్నారని ఆరోపించారు. నిరుపేదల భూములను ఆక్రమించి వారిపైనే దౌర్జన్యం చేసి కేసులు కట్టిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు.

పట్టణంలోని కదిరి రోడ్డులో సర్వే నంబరు 145/6లో 22 సెంట్ల భూమిని నా భర్త మల్లికార్జున కొనుగోలు చేశారు. ఈ స్థలంపై కన్నేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య స్వర్ణలత, పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకానాథరెడ్డి మదనపల్లె తహసీల్దార్‌ కార్యాలయంలో మా స్థలం సబ్‌డివిజన్‌ ఫైలు మాయం చేశారు. ఈ స్థలంపై హక్కులేని వారి వద్ద కొనుగోలు చేసినట్లు రిజిస్ర్టేషన్‌ చేయించుకుని, మా స్థలాన్ని కబ్జా చేశారు.

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య స్వర్ణలతకు అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం వీరబల్లి గ్రామంలో ఐదెకరాల విస్తీర్ణం ఉన్న చెరువును రెవెన్యూ అధికారులు కేటాయించారు. ఆపై ఆ చెరువును 2023లో ఫ్రీహోల్డ్‌గా చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అత్తగారి ఊరు వీరబల్లి. ఈ గ్రామ పరిధిలోని సుగాలితాండా సమీపంలో ఐదెకరాల విస్తీర్ణంలో ఉన్న ఎర్రదిబ్బ చెరువును పెద్దిరెడ్డి భార్య పేరుతో కేటాయించారు.