/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz ఈమె అతి తెలివికి దండం పెట్టొచ్చు.. వాషింగ్ మెషిన్‌ను ఎలా వాడిందో చూస్తే.. Raghu ram reddy
తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 30 2024, 15:10

ఈమె అతి తెలివికి దండం పెట్టొచ్చు.. వాషింగ్ మెషిన్‌ను ఎలా వాడిందో చూస్తే..

ఇళ్లల్లో వస్తువులను చిత్రవిచిత్రంగా వాడే వారిని రోజూ చూస్తూనే ఉంటాం. కొందరు కూలర్‌ను ఫ్రిడ్జ్‌లా మార్చి పండ్లు, కూరగయలు పెడుతుంటారు. ఇంకొందరు ఫ్రిడ్జి నుంచి వచ్చే చల్లదనంతో ఇంటిని ఏసీలా మార్చుతుంటారు.

మరొక మహిళేమో.. ఇటుకలతో ఏకంగా వాషింగ్‌మెషిన్ తరహాలో నిర్మాణం చేపడుతుంది. ఇలాంటి వీడియోలు రోజూ చూస్తూనే ఉన్నాం. తాజాగా, ఓ మహిళ వాషింగ్ మెషిన్‌ను వాడిన విధానం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ వాషింగ్ మెషిన్‌ను (Washing machine) వాడే విధానం చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు.

సాధారణంగా ఎవరైనా వాషింగ్‌మెషిన్‌ను బట్టలు ఉతికేందుకు ఉపయోగిస్తారు. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది.

వాషిన్‌మెషిన్‌ను ఓపెన్ చేసిన ఆమె.. ముందుగా అందులో నీరు పోసి, తర్వాత అందులో లిక్విడ్ పోస్తుంది. ఆ తర్వాత ఏకంగా ఇంట్లోని (Woman putting dishes in washing machine) వంట పాత్రలన్నీ అందులో పడేస్తుంది. ఫైనల్‌గా మిషిన్ ఆన్ చేయగా.. గిరాగిరా వేగంగా తిరిగి పాత్రలు క్లీన్ అవుతాయి. ఇలా దుస్తులను వేయాల్సిన మిషిన్‌లో పాత్రలు వేసి శుభ్రం చేసింది. ఈమె అతి తెలివి చూసి అంతా అవాక్కవుతున్నారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. వాషింగ్‌మెషిన్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది అంటూ కొందరు

ఈమె అతి తెలివికి హ్యాట్సాప్ అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 30 2024, 15:05

ఇద్దరు ఆర్డీవోలపై వేటు

వేత కేసులో ఇద్దరు ఆర్డీవోలను, ఒక సీనియర్‌ అసిస్టెంట్‌ను సస్పెండ్‌ చేశారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సిసోడియా నివేదికల ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో మదనపల్లె ఆర్డీవోగా పనిచేసిన మురళి, ప్రస్తుత ఆర్డీవో హరిప్రసాద్‌తో పాటు సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్ట్టెంట్‌ గౌతంతేజ్‌లను సస్పెండు చేసింది. ఇదే కేసులో ఇటీవల మదనపల్లె వన్‌టౌన్‌ సీఐ వలీబషును వీఆర్‌కు పంపి, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండు చేశారు.

మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయాన్ని కర్నూలు రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌ సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం తమ అదుపులో అనుమానితులు ఎవరూ లేరన్నారు. ఎఫ్‌ఎ్‌సఎల్‌ (ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌) నివేదిక రాగానే 15 రోజుల్లో నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామన్నారు. మాధవరెడ్డి ఇంట్లో 500 వరకు ఇళ్ల స్థలాలు, భూముల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో శశికాంత్‌ ఇంట్లో మదనపల్లెకు చెందిన భూముల రికార్డులు దొరికాయన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి పీఏ తుకారం ఇంట్లోనూ, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి ఇంట్లోనూ సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే నవాజ్‌బాషా ఇంట్లో కొన్ని రికార్డులు స్వాధీనం చేసుకున్నామని, ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఫైళ్ల కాల్చివేత కేసును అన్ని కోణాల్లో సాంకేతిక సహకారంతో పరిశోధిస్తున్నట్లు వివరించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించినట్లు తెలిపారు. సెల్‌ టవర్‌ డంప్స్‌ తీశామని, 2000కు పైగా ఫోన్‌ కాల్‌డేటాను పరిశీలించినట్లు తెలిపారు. వాట్సా్‌పలకు సంబంధించి ఐపీడీఆర్‌ను కూడా పరిశీలించినట్లు చెప్పారు. ఇప్పటికే అనుమానితుల ఇళ్లను సోదా చేసి విలువైన ఆధారాలు సేకరించినట్లు ప్రకటించారు. పరిశోధనకు ఉపయోగపడే డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కొత్తగా 8 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో సీఐడీ అధికారుల సహకారంతో 15 బృందాలు విచారణ చేసినట్లు తెలిపారు.

సోమవారం మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు ప్రజలు పోటెత్తారు. గత ఐదేళ్లలో వైసీపీ నాయకుల వేఽధింపులకు గురైన బాధితులు వెల్లువలా వచ్చారు. సబ్‌కలెక్టర్‌ మేఘస్వరూ్‌పకు సుమారు 150 మంది బాధితులు తమ సమస్యలపై ఫిర్యాదులు అందజేశారు. వైసీపీ నాయకులు తమ భూములు ఆక్రమించారని, దౌర్జన్యంగా లాక్కున్నారని, విలువైన భూములను అతి తక్కువ ధరకే కాజేశారని.. చాలా వరకు ఇలాంటి ఫిర్యాదులే ఉన్నాయి.

మదనపల్లె సబ్‌ డివిజన్‌లోని భూబాధితులు ఆగస్టు 4వ తేదీ మదనపల్లె సబ్‌ కలెక్టరేట్‌కు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చని, తమ పార్టీ అండగా ఉంటుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. సోమవారం స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఫైళ్లు దహనమైన గదిని, కాలిన కాగితాలను, పరిసరాలను ఆయన పరిశీలించారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలోకి పోలీసులు అనుమతించకుండా ఆయనను అడ్డుకోవడంతో సీపీఐ నాయకులు పోలీసులను తోసుకుని వెళ్లి కార్యాలయంలో జరిగిన సంఘటనను పరిశీలించారు. అనంతరం ఆయన పోలీసుల తీరుపై మండిపడ్డారు. అంతజాగ్రత్తగా పోలీసులు ఉంటే ఇప్పటికే నిందితులను పట్టుకోవచ్చు కదా అని ప్రశ్నించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కొందరు ఉద్దేశపూర్వకంగానే స్వార్థ ప్రయోజనాల కోసం పైళ్లు కాల్చినట్లు సంఘటనను చూస్తే అర్థం అవుతుందన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ప్రజలను అన్నివిధాలా దోచుకున్నారని ఆరోపించారు. నిరుపేదల భూములను ఆక్రమించి వారిపైనే దౌర్జన్యం చేసి కేసులు కట్టిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు.

పట్టణంలోని కదిరి రోడ్డులో సర్వే నంబరు 145/6లో 22 సెంట్ల భూమిని నా భర్త మల్లికార్జున కొనుగోలు చేశారు. ఈ స్థలంపై కన్నేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య స్వర్ణలత, పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకానాథరెడ్డి మదనపల్లె తహసీల్దార్‌ కార్యాలయంలో మా స్థలం సబ్‌డివిజన్‌ ఫైలు మాయం చేశారు. ఈ స్థలంపై హక్కులేని వారి వద్ద కొనుగోలు చేసినట్లు రిజిస్ర్టేషన్‌ చేయించుకుని, మా స్థలాన్ని కబ్జా చేశారు.

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య స్వర్ణలతకు అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం వీరబల్లి గ్రామంలో ఐదెకరాల విస్తీర్ణం ఉన్న చెరువును రెవెన్యూ అధికారులు కేటాయించారు. ఆపై ఆ చెరువును 2023లో ఫ్రీహోల్డ్‌గా చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అత్తగారి ఊరు వీరబల్లి. ఈ గ్రామ పరిధిలోని సుగాలితాండా సమీపంలో ఐదెకరాల విస్తీర్ణంలో ఉన్న ఎర్రదిబ్బ చెరువును పెద్దిరెడ్డి భార్య పేరుతో కేటాయించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 30 2024, 14:14

ఇంటి పత్రాలు రెడీగా ఉంచుకోండి...

పన్ను లెక్కను పక్కాగా కట్టేందుకు జీహెచ్‌ఎంసీ(GHMC) సిద్ధమైంది. ఇందులో భాగంగా భవన నిర్మాణ అనుమతుల వివరాలు, నివాసయోగ్య పత్రం(ఓసీ), తాజా ఆస్తి పన్ను చెల్లింపు రశీదు, నీటి, విద్యుత్‌ బిల్లులు, యజమాని గుర్తింపు కార్డు, వాణిజ్య భవనమైతే ట్రేడ్‌ లైసెన్స్‌ వివరాలు సేకరించనున్నారు.

పన్ను లెక్కను పక్కాగా కట్టేందుకు జీహెచ్‌ఎంసీ(GHMC) సిద్ధమైంది. ఇందులో భాగంగా భవన నిర్మాణ అనుమతుల వివరాలు, నివాసయోగ్య పత్రం(ఓసీ), తాజా ఆస్తి పన్ను చెల్లింపు రశీదు, నీటి, విద్యుత్‌ బిల్లులు, యజమాని గుర్తింపు కార్డు, వాణిజ్య భవనమైతే ట్రేడ్‌ లైసెన్స్‌ వివరాలు సేకరించనున్నారు. ఎంపికైన ఏజెన్సీ సిబ్బంది క్షేత్రస్థాయిలో సమాచారం తీసుకుంటారని అధికారులు చెబుతున్నారు.

ప్రతీ భవనం నుంచి ఆస్తిపన్ను, వాణిజ్య సంస్థల నుంచి ట్రేడ్‌ లైసెన్స్‌ రుసుము వసూలు చేయాలని బల్దియా లక్ష్యంగా పెట్టుకుంది. ఉప్పల్‌, హయత్‌నగర్‌, హైదర్‌నగర్‌, కూకట్‌పల్లి(Uppal, Hayatnagar, Hydernagar, Kukatpally), కేపీహెచ్‌బీ కాలనీ, మియాపూర్‌, చందానగర్‌ ప్రాంతాల్లో సర్వే ప్రారంభించనున్నారు. దశల వారీగా ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి కాట తెలిపారు. సిబ్బందికి వివరాలు ఇచ్చి పౌరులు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

బిల్‌ కలెక్టర్లు, ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లపై ఫిర్యాదుల నేపథ్యంలో ఆస్తిపన్ను మదింపునకు మాన్యువల్‌గా దరఖాస్తు విధానం నిలిపివేశారు. ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ అసెస్‏మెంట్‌ పద్ధతిని కొనసాగించారు. దీంతో గతంతో పోలిస్తే మదింపు జరుగుతున్న భవనాల సంఖ్య తగ్గిందని, ఈ ప్రభావం ఆదాయంపైనా పడుతోందని భావించిన జీహెచ్‌ఎంసీ మాన్యువల్‌(GHMC Manual)గా దరఖాస్తుల స్వీకరణను తిరిగి ప్రారంభించింది. సర్కిల్‌, జోనల్‌ కార్యాలయాల్లో పౌరుల నుంచి అసెస్‏మెంట్‌ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటి వరకు పన్ను చెల్లించని భవనాలను గుర్తించి దరఖాస్తు చేసుకోవాలని యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. డ్రోన్‌, క్షేత్రస్థాయి సర్వే నేపథ్యంలో యజమానుల నుంచి అసె్‌సమెంట్‌ దరఖాస్తులు తీసుకుంటున్నారు

డ్రోన్‌, క్షేత్రస్థాయి సర్వేతో భవనాల పక్కాగా లెక్క తేలడంతోపాటు.. ఎన్ని నిర్మాణాల నుంచి పన్ను వసూలవుతోంది..? ఇప్పటికీ మదింపు జరగని భవనాలెన్ని..? అన్న దానిపై స్పష్టత రానుంది. నివాస కేటగిరీలో పన్ను చెల్లిస్తు.. నివాసేతర అవసరాలకు వినియోగిస్తోన్న నిర్మాణాలనూ గుర్తిస్తారు.

శాటిలైట్‌ చిత్రాలతోపాటు, డ్రోన్‌ సర్వే ద్వారా ఏరియాల వారీగా భవనాలు, ఎన్ని అంతస్తులున్నాయన్నది తేలుతుంది. భవన నిర్మాణ విస్తీర్ణం ఎంత..? పన్ను ఎంత విస్తీర్ణానికి చెల్లిస్తున్నరనేది నిర్ధారించేందుకు కొలతలూ తీసుకుంటారని రెవెన్యూ విభాగం అధికారొకరు తెలిపారు. వీటి ఆధారంగా సవరణ మదింపు చేపడతారు. నిర్ణీత స్థాయి కంటే ఎవరైనా ఎక్కువ పన్ను చెల్లిస్తోన్నా.. దానినీ సవరిస్తారు. అనుమతి లేని నిర్మాణాలకు 100 శాతం పెనాల్టీ విధిస్తారు.

ఇప్పటి వరకు మదింపు జరగని భవనాలను పన్ను పరిధిలోకి తీసుకువచ్చి జీహెచ్‌ఎంసీ చట్టం 1955 ప్రకారం ఒకటిన్నర నుంచి రెండున్నర సంవత్సరాల పెనాల్టీతో పన్ను నిర్ణయిస్తారు. ట్రేడ్‌ లైసెన్స్‌ లేకుండా వ్యాపారం చేస్తోన్న సంస్థల లెక్కలూ సర్వేతో తేలనున్నాయి.

ప్రస్తుతం 80 వేల ట్రేడ్‌ లైసెన్స్‌లు ఉండగా.. వీటి సంఖ్య రెండు లక్షలకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో కూలిన భవనాల పీటీఐఎన్‌లూ సర్వే అనంతరం తొలగించే అవకాశముంది. దీంతో ప్రస్తుతం గ్రేటర్‌లో ఎన్ని భవనాలున్నాయి..? మదింపు జరిగినవి..? ఎంత మంది పన్ను చెల్లిస్తున్నారు..? అన్న దానిపై స్పష్టత రానుంది

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 30 2024, 14:04

అండగా ఉంటామని ప్రధాని మోదీ భరోసా

కొండచరియలు విరిగిపడటంతో వయనాడులో పరిస్థితి భీతావాహంగా మారింది. మెప్పాడిలో గల పలు ప్రాంతాల్లో కొండచరియలు నేరుగా ఇళ్లపై పడ్డాయి. దీంతో 24 మంది వరకు చనిపోయారని అధికారులు ప్రకటించారు.

వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా కేరళ ప్రభుత్వం ఆర్మీ సాయం కావాలని కోరింది.

కొండచరియలు విరిగిపడటంతో వయనాడులో (Wayanad) పరిస్థితి భీతావాహంగా మారింది. మెప్పాడిలో గల పలు ప్రాంతాల్లో కొండచరియలు నేరుగా ఇళ్లపై పడ్డాయి.

దీంతో 43 మంది వరకు చనిపోయారని అధికారులు ప్రకటించారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా కేరళ ప్రభుత్వం ఆర్మీ సాయం కావాలని కోరింది. దాంతో భారత ఆర్మీ రంగంలోకి దిగింది. కొండచరియలు విరిగిపడటంతో మండక్కై, చూరల్‌మాల, అట్టమాల, నూల్పూజ గ్రామాల్లో పరిస్థితి దయనీయంగా మారింది

వయనాడులో కొండచరియల బీభత్సం సృష్టించడంతో ఆర్మీ 225 మంది సిబ్బందిని పంపించింది. వీరిలో వైద్య సిబ్బంది కూడా ఉన్నారు. ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఎంఐ-17, ఏఎల్‌హెచ్ హెలికాప్టర్ల సేవలను వినియోగిస్తున్నారు.

పరిస్థితి తీవ్రతత దృష్ట్యా భారత నౌకాదళం సేవలను వినియోగించుకుంటామని కేరళ మంత్రి వీణ జార్జ్ ప్రకటించారు. కొండచరియల విరిగిపడటంతో మలప్పురంలోని నీలంబర్ ప్రాంతానికి వెళ్లే వంతెన కొట్టుకొని పోయింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 30 2024, 13:59

కాంగ్రెస్‌కు షాక్.. BRS గూటికి గద్వాల ఎమ్మెల్యే

బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. ఇవాళ తిరిగి ఆయన సొంత గూటికి చేరుకున్నారు. కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే ఆయన సొంతగూటికి చేరుకున్నారు.

తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసిందే. పది మంది ఎమ్మెల్యేలు వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు.

అయితే అనుహ్యంగా ఆయన తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు, మరోవైపు రెండో విడత రుణమాఫీ కార్యక్రమం జరగుతున్న సమయంలోనే బండ్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అయ్యారు.

అసెంబ్లీలోని బీఆర్ఎస్‌ఎల్పీ కార్యాలయంలో కేటీఆర్‌తో సమావేశమయ్యారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని కృష్ణమోహన్ రెడ్డి కేటీఆర్‌కు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో తాను ఇమడలేక పోతున్నట్లు ఆయన వెల్లడించనట్లు సమాచారం. కాగా, బండ్ల చేరికను కేటీఆర్ స్వాగతించారు. కేటీఆర్‌తో సమావేశం అనంతరం బండ్ల మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. తాను తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుకుంటున్నట్లు వెల్లడించారు. త్వరలోనే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎంను కలవనున్నట్లు బండ్ల వెల్లడించారు. ఓ వైపు సీఎం రేవంత్ సహా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రెండో విడత రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొనగా.. అనుహ్యంగా బండ్ల యూ టర్న్ తీసుకోవటం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది.

నెల తిరక్కుండానే యూటర్న్..

2023 అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల శాసనసభ నియోజకవర్గం నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు.

అయితే ఇటీవల ఆయన బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పి అధికార పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కార్యకర్తలు, నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్లు వెల్లడించారు.

అయితే ఆయన పార్టీ మారి నెల రోజులు కాకముందే యూటర్న్ తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని అధికార పార్టీ నేతలు చెబుతున్న తరుణంలో కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే తిరిగి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లడం చర్చనీయాంశమైంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 30 2024, 13:28

గ్రేటర్ చుట్టుపక్కల HMDA పూలింగ్ ప్రాజెక్ట్స్ !

హైదరాబాద్ చుట్టుపక్కల హౌసింగ్ ప్రాజెక్టుల్ని పెంచేందుకు హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్‌మెంట్ అధారిటీ.. కొత్త ప్రయత్నాలు చేస్తోంది. కొత్త లే-అవుట్లను డెవలప్‌ చేయాలని నిర్ణయించుకుంది. రైతుల నుంచి పూలింగ్ పద్దతిలో భూములను సేకరించి డెవలప్ చేసి.. తన వాటాగా వచ్చిన భూమిని విక్రయించి ఆదాయం పెంచుకోవాలనుకుంటోంది.

నిజానికి ఏపీ రాజధాని అమరవతికి పూలింగ్ పద్దతి సక్సెస్ అయిన తర్వాత హెచ్‌ఎండీఏ కూడా అదే చేయాలనుకుంది. కానీ ల్యాండ్ డెవలప్‌మెంట్‌లో తమ వాటా పెంచాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌కు గత సర్కార్‌ ఓకే చెప్పడంతో రైతుల వాటా 60శాతానికి పెరిగింది.

హెచ్‌ఎండీఏకు ఇవ్వడం వల్ల.. రైతులకు అనేక మేళ్లు జరుగుతాయి. భూములు ఇచ్చే వారికి ఆర్ధికపరమైన ఇబ్బందులు రాకుండా అన్ని రకాల అనుమతుల వ్యవహారాలను హెచ్‌ఎండీఏ పర్యవేక్షిస్తుంది. సాధారణంగా వ్యవసాయ భూములను లే-అవుట్లుగా మార్చాలంటే నాలా చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.

కాని హెచ్‌ఎండీఏకు భూములు అప్పజెప్పితే వాటికి నాలా చార్జీలతో పాటు పాటు ల్యాండ్ యూజ్ కన్వర్షన్ చార్జీలను హెచ్‌ఎండీఏ భరిస్తుంది. అంతే కాకుండా రిజిస్ట్రేషన్ ఖర్చులు సైతం హెచ్‌ఎండీఏ చెల్లించాలని నిర్ణయించడంతో రైతులపై భారం మరింత తగ్గనుంది.

ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ల వద్ద ఎక్కువ లే-అవుట్లు ఉండేలా హెచ్‌ఎండీఏ ప్రణాళికలు రెడీ చేసుకుంది. హెచ్‌ఎండీఏ అమ్ముతుంది కాబట్టి లిటిగేషన్ లేని ల్యాండ్ లభిస్తుంది. అందుకే కార్పొరేట్ సంస్థలు అందులో కొనుగోలుకు ఆసక్తి చూపుతాయి. అలాగే మధ్యతరగతి ప్రజలకూ అందుబాటులో ఉంటే ఇళ్ల స్థలాలను కూడా హెచ్‌ఎండీఏ రెడీ చేయనుంది. ఇప్పటికే సిటీ చుట్టూ ఉండే ప్రాంతాల్లో ఇప్పటికే దాదాపు వెయ్యి ఎకరాలకు పైగా భూమిని డెవలప్‌మెంట్‌ కోసం అధికారులు గుర్తించారు.

మొత్తంగా హైదరాబాద్ చుట్టూ దాదాపు 11వేల ఎకరాల భూమిని హెచ్‌ఎండీఏ సేకరించి డెవలప్ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. హెచ్‌ఎండీఏ. ఇలా చేయడం ద్వారా ఇటు ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు…

ప్రజలకు క్లియర్ టైటిల్ ఉండే భూములు సరైన ధరల్లో దొరికేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్టు ఎంత వేగంగా ముందుకు వెళ్తే అంతే వేగంగా హైదరాబాద్ నగరం ఔటర్ చుట్టూ విస్తరిస్తుంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 30 2024, 13:23

పోలవరం ఎమ్మెల్యే బాలరాజు కారుపై దాడి, ఖండించిన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌

ఆకతాయిలు రాళ్లు రువ్వడంతో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు కారు అద్దాలు పగిలిపోయాయి. సోమవారం సాయంత్రం బర్రింకల పాడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే వాహనం గ్రామంలో వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో కారు అద్దాలు పగిలిపోయాయి.

ఎమ్మెల్యే వాహనంపై దాడి చేశారని డ్రైవర్‌ ఫిర్యాదు చేయడంతో ఎస్పీ ప్రతాప్ కిషోర్ స్పందించారు. పోలవరం డిఎస్పి సురేష్ రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటన జరిగిన ప్రాంతంలో జీలుగుమిల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ విచారణ జరిపారు.

కారు అద్దాల పగిలిన ప్రదేశంలో అంతగా అనుమానించాల్సిన పరిస్థితులు లేవని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనలో పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు పోలీసు అధికారులు సన్నద్ధం అయ్యారు.

కారు పై రాయి పడడంతో వెనకగా ఉన్న అద్దాలు బ్రేక్ అయ్యాయి. సంఘటన చోటు చేసుకున్న ప్రాంతంలో హాస్టల్ భవనాలు ఉన్నాయి

సోమవారం రాత్రి పోలవరం ఎమ్మెల్యే కారులో డ్రైవర్, వ్యక్తిగత సహాయకులు వెళుతుండగా బర్రింకలపాడు జంక్షన్ దగ్గర ఒక రాయి కార్ వెనుక మిర్రర్ కి తగిలి కార్ అద్దం పగిలింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కలుగలేదని పోలీసులు ప్రకటన విడుదల చేవారు.

ఘటన జరిగిన ప్రదేశంలో వసతిగృహం ఉందని తెలిపారు. ఆకతాయిలు విసిరిందా, ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా విసిరారా అన్నది పోలీస్ లు విచారిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారిస్తున్నామని పోలవరం డిఎస్పీ తెలిపారు.

పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వాహనంపై చోటు చేసుకున్న రాళ్ళ దాడిని డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ ఖండించారు. బర్రింకలపాడు గ్రామంలో కొందరు వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారని దాడి సమయంలో ఎమ్మెల్యే బాలరాజు వాహనంలో లేకపోవడం వల్ల ఎలాంటి హాని జరగలేదని తెలిపారు. ఈ ఘటనకు కారకులైన వారిని పోలీసులు తక్షణమే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 30 2024, 13:19

ఝార్ఖండ్‌ లో రైలు ప్రమాదం.. ఒకరి మృతి.. 60 మందికి గాయాలు

ఝార్ఖండ్‌ లో మరో రైలు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని చక్రధర్‌పూర్‌కు సమీపంలో ముంబై వెళ్తున్న హౌరా-సీఎస్ఎంటీ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.

ఆగ్నేయ రైల్వే పరిధిలోని రాజ్‌ఖర్సావాన్, బడాబాంబో స్టేషన్ల మధ్య తెల్లవారుజామున 3:45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

18 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. సుమారు 60 మంది గాయపడినట్టు సమాచారం.

ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స్థానిక పోలీసులు, రైల్వే ఉద్యోగులు చురుగ్గా రెస్క్యూ చర్యలను కొనసాగిస్తున్నారు.

కాగా పట్టాలు తప్పిన గూడ్స్ రైలు వ్యాగన్‌లను ఢీకొట్టడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

రైల్వే సమాచారం ప్రకారం హౌరా నుంచి ముంబై వెళ్తున్న రైలు సోమవారం రాత్రి 11:02 గంటలకు టాటానగర్‌కు చేరుకోవాల్సి ఉండగా.

చాలా ఆలస్యంగా రాత్రి 2:37 గంటలకు చేరుకుంది. 2 నిమిషాలు ఆగిన తర్వాత తదుపరి స్టేషన్ చక్రధర్‌పూర్‌కి బయలుదేరింది. అయితే స్టేషన్‌కు చేరుకోక ముందే ప్రమాదానికి గురైంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 30 2024, 13:16

వయనాడ్ ఘటనపై స్పందించిన రాహుల్.. తీవ్ర ఆవేదనకు గురయ్యా

కేరళలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా వయనాడ్‌ను అయితే వరదలు చుట్టుముట్టాయి. దీంతో పెను ప్రమాదకరంగా మారాయి. కేరళలోని వాయనాడ్‌ ప్రాంతంలో భారీగా వరదలు వచ్చాయి.

కేరళలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా వయనాడ్‌ను అయితే వరదలు చుట్టుముట్టాయి. దీంతో పెను ప్రమాదకరంగా మారాయి. కేరళలోని వాయనాడ్‌ ప్రాంతంలో భారీగా వరదలు వచ్చాయి. దీంతో కొండచరియలన్నీ విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. మృతులకు 2 లక్షలు, గాయపడిన వారికి 50 వేల పరిహారాన్ని ప్రధాని మోదీ కార్యాలయం ప్రకటించింది. వాయనాడ్ ఘటనపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. వాయనాడ్‌లోని మెప్పాడి సమీపంలో భారీగా కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర వేదనకు గురయ్యానని తెలిపారు. తమ వాళ్ళను కోల్పోయిన కుటుంబాలకు రాహుల్ గాంధీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇంకా చిక్కుకున్న వారిని త్వరలోనే సురక్షిత ప్రాంతాలకు తీసుకువస్తారని ఆశిస్తున్నానని రాహుల్ అన్నారు

కేరళ ముఖ్యమంత్రితో పాటు వయనాడ్ జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడానని తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. కావల్సిన సాయం అందజేస్తామని తనకు హామీ ఇచ్చారని రాహుల్ పేర్కొన్నారు. అన్ని ఏజెన్సీలతో సమన్వయం ఉండేలా చూసుకోవాలని, కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేయాలని సహాయక చర్యలకు అవసరమైన ఏదైనా సహాయం గురించి మాకు తెలియజేయాలని కోరానని తెలిపారు.

తాను కేంద్ర మంత్రులతో మాట్లాడి వాయనాడ్‌కు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని కోరతానన్నారు. రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లలో అడ్మినిస్ట్రేషన్‌‌కు సహాయం చేయాలని తాను కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కోరుతున్నానని రాహుల్ పేర్కొన్నారు

వాయనాడ్‌లోని ముండకై, మెప్పాడి, చురల్‌మల ప్రాంతాల్లో భారీగా వరదలు వచ్చాయి. రాత్రి ఒంటి గంట సమయంలో ముండకై ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఉదయం 4:10 గంటలకు ముండకై ప్రాంతంలో కొండ చరియలు విరిగి పడ్డాయి.

భారీగా వరదలు, కొండచరియలు విరిగి పడడంతో అనేక ఇళ్లు కొట్టుకు పోయాయి. భారీ వరదలతో రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. రహదారులు, వంతెనలు కొట్టుకు పోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. కొండ చరియలు విరిగి పడడం, ఇళ్లు కొట్టుకుపోవడంతో భారీ ప్రాణనష్టం వాటిల్లింది.

ఇప్పటి వరకూ 19 మంది మృతి, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇళ్లు కొట్టుకుపోవడంతో అనేక మంది గల్లంతయ్యారు. సహాయక చర్యలను అగ్నిమాపక, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ప్రారంభించాయి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 30 2024, 13:04

ఒకే గ్రామం నుంచి 20 వేల మంది జవాన్లు!

35 మంది కర్నల్స్‌, 42 మంది లెఫ్టినెంట్‌ బ్రిగేడియర్‌ స్థాయి అధికారులు, 20 వేల మంది జవాన్లు.. వీరంతా ఒకే గ్రామానికి చెందినవారంటే నమ్మగలరా? అవును.

ఇది నిజమే. ఉత్తరప్రదేశ్‌లోని గాజీపూర్‌లో ఉన్న గహ్మర్‌.. భారత సైన్యంలోకి అత్యధిక మంది సైనికులను పంపిన గ్రామంగా నిలుస్తున్నది.

 35 మంది కర్నల్స్‌, 42 మంది లెఫ్టినెంట్‌ బ్రిగేడియర్‌ స్థాయి అధికారులు, 20 వేల మంది జవాన్లు.. వీరంతా ఒకే గ్రామానికి చెందినవారంటే నమ్మగలరా? అవును. ఇది నిజమే. ఉత్తరప్రదేశ్‌లోని గాజీపూర్‌లో ఉన్న గహ్మర్‌.. భారత సైన్యంలోకి అత్యధిక మంది సైనికులను పంపిన గ్రామంగా నిలుస్తున్నది. ఇక్కడి యువతకు భారత సైన్యంలో చేరటం తప్ప.. మరో లక్ష్యం లేదు.

ఆ గ్రామంలోని 15వేల మందికిపైగా రిటైర్డ్‌ జవాన్లే వారికి స్ఫూర్తి. ‘కార్గిల్‌ విజయ్‌ దివస్‌’ సందర్భంగా, అత్యధిక సంఖ్యలో జవాన్లను పంపిన గ్రామంగా ‘గహ్మర్‌’ పేరు మీడియాలో మారుమోగుతున్నది.

ప్రస్తుతం ఈ గ్రామానికి చెందిన 5 వేల మంది సైన్యంలో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నారు.. గ్రామాన్ని 22 ప్రాంతాలుగా విడగొట్టి.. ప్రతి ఒక్క ఏరియాకు ఓ జవాన్‌ పేరు పెట్టారు.

ఆర్మీలో ఎంపికయ్యేందుకు, ఊళ్లో ఉన్న యువత అంతా తెల్లవారుజామున 4 గంటలకు మేల్కొని..

కసరత్తు మొదలుపెడతారు. వీరి శిక్షణ కోసం గ్రామంలోని రిటైర్డ్‌ జవాన్లు 1,600 మీటర్ల రన్నింగ్‌ ట్రాక్‌ను నిర్మించారు. గొప్ప సైనిక వారసత్వాన్ని కొనసాగిస్తున్నారని ఆ గ్రామస్థులపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.