మూసీ సుందరీకరణకు 1.50 లక్షల కోట్లా?!
తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్ల ఖర్చయితేనే కాంగ్రెస్ గల్లీనుంచి ఢిల్లీదాకా గగ్గోలుపెట్టింది. అలాంటిది.. మూసీ సుందరీకరణకు రూ.లక్షా యాబైవేల కోట్లా?’
అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మూసీప్రాజెక్టుతో మురిసే రైతులెందరు? నిల్వ ఉంచే టీఎంసీలెన్ని? ఎన్ని ఎకరాలు సాగులోకి వస్తుంది? పంటల దిగుబడి ఎంత
ఆ నీటితో తీర్చే పారిశ్రామిక అవసరాలెంత? కొత్తగా నిర్మించే భారీ రిజర్వాయర్లెన్ని?’ అంటూ ఎక్స్ వేదికగా ఆదివారం ఆయన నిలదీశారు.
మూసీని అందంగా ముస్తాబు చేసేందుకు.. మొన్న.. రూ.50వేలకోట్లు అయితుందన్నారు. నిన్న రూ.70వేల కోట్లు వెచ్చిస్తామన్నారు.
ఇప్పుడు ఏకంగా రూ.1.50లక్షల కోట్లు ఖర్చు చేస్తామంటున్నారు.. పదిహేను పక్కన ఇన్ని సున్నాలా.. అంటూ అంకెలను సూచిస్తూ ఆయన ఎద్దేవా చేశారు.
పుట్టిన గడ్డపై మమకారం లేని సీఎం రేవంత్‌రెడ్డికి.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకన్నా..
మూసీ ప్రాజెక్టుపైనే ఎందుకింత మక్కువో చెప్పాలన్నారు. మూసీ అంచనా వ్యయాన్ని సీఎం మూడింతలు పెంచడం కాంగ్రెస్ ధన దాహానికి సజీవసాక్ష్యమని విమర్శించారు.
Jul 22 2024, 10:56