/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz ఈ ప్రాంతాల్లో నేడు, రేపు భారీ వర్షాలు.. 11 జిల్లాల్లో ఆరంజ్ అలర్ట్ Raghu ram reddy
ఈ ప్రాంతాల్లో నేడు, రేపు భారీ వర్షాలు.. 11 జిల్లాల్లో ఆరంజ్ అలర్ట్

భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. ఉత్తర తెలంగాణా లోని 11 జిల్లాలలో ఈనెల 20 , 21 తేదీలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిందన్నారు.జూలై 20, 21 తేదీలలో 11 జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సీఎస్‌లో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

పెద్దపల్లి, కరీంనగర్, ములుగు, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, హన్మకొండ, జగిత్యాల, ఖమ్మం,కొత్తగూడెం, నిర్మల్ జిల్లాల్లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ జిల్లాల కలెక్టర్లు ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా సంబంధిత ప్రభుత్వ విభాగాలతో కలసి ముందు జాగ్రత చర్యలు తీసుకోవాలని తెలియ చేశారు. ప్రధానంగా వాగుల వద్ద తగు బందోబస్తును ఏర్పాటు చేసి, ప్రమాదకరంగా ప్రవహించే వాగులను ప్రజలు దాటకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ 11 జిల్లాల కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని, పోలీస్ తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలన్నారు. ఏ విధమైన సహాయం కావాలన్న రాష్ట్ర రాజధానికి ఏ సమయంలోనైనా సంప్రదించవచ్చునని ఆమె అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెద్ద వాగు కు వచ్చిన ఆకస్మిక వరదల వల్ల చిక్కుకుపోయిన దాదాపు 40 మందికి ఏవిధమైన అపాయం జరుగకుండా వివిధ శాఖల సమన్వయంతో కాపాడినందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ను శాంతి కుమారి అభినందించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాకలో బానరి రాజు అనే వ్యక్తి వాగులో చేపల వేటకు వెళ్లి గల్లంతైనట్లు తెలుస్తోంది.

పడవల సహాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పలుచోట్ల పత్తి, వరి చేళ్లు మునిగిపోయాయి. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్ జిల్లాలో చెరువులు, కుంటలు వర్షపు నీటితో నిండిపోతున్నాయి.

భారీ వర్షాలతో పెద్దపల్లి జిల్లా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. రామగుండం రీజీయన్ లో నాలుగు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో రోజుకు 80 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడింది.

మంచిర్యాలలోని ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులలో ఉత్పత్తి నిలిచిపోయింది. శ్రీరాంపూర్, ఇందారం, ఆర్కేపీ, మందమర్రి, ఖైరీగూడ గనుల్లోకి వర్షపు నీరు చేరడంతో 60వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి కి విఘాతం ఏర్పడింది. సంస్థకు 10 కోట్ల మేర నష్టం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.

నటాషాకు దెబ్బకు భారీగా ఆస్తులు పొగొట్టుకున్న హార్దిక్ పాండ్యా..?

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాకు విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించారు. తన సోషల్ మీడియా ద్వారా విడుకుల గురించి ఓ ప్రకటన చేశారు. ఇది తమకు చాలా కఠినమైన నిర్ణయమని పేర్కొన్నారు. ఇద్దరూ విడిపోయినా.. తమ మూడేళ్ల కొడుకు అగస్త్య బాధ్యతలను తల్లిదండ్రులుగా కొనసాగిస్తామని తెలిపారు. నటాషా సైతం విడాకులపై తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. మేము కలిసి ఉండేందుకు చాలా ప్రయత్నం చేసాము.

మా ఇద్దరికి ఇది కఠినమైన నిర్ణయమే.. కానీ మా ఇద్దరికీ ఇది మంచి ప్రయోజనం చేకూరుస్తుందని మేము నమ్ముతున్నాము. మేము కలిసి ఆనందించిన సమయం, పరస్పర గౌరవం, ఒక కుటుంబంగా ఎదిగాము.

ఈ ప్రయాణాన్ని మేము సంతోషించాము. మా అబ్బాయి అగస్త్యకు మంచి కో పేరెంట్స్ గా ఉంటామని ఆమె తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. హార్దిక్ పాండ్యా హీరోయిన్ నటాషా స్టాంకోవిచ్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు.

2020లో ఈ జంట వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందు రెండేళ్లు డేటింగ్ చేసిన వీరిద్దరు.. పెళ్లికి ముందే కమిట్ అయ్యారని తెలుస్తోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. హార్దిక్ పాండ్యా,నటాషా స్టాంకోవిచ్‌లు పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే నటాషా తల్లి కాబోతుందనే వార్త బయటకు వచ్చింది. ఇక పెళ్లి తర్వాత ఈ జంట తమ దాంపత్య జీవితాన్ని బాగానే ఎంజాయ్ చేశారు. అయితే ఇటీవల వీరి కాపురంలో విభేదాలు తలెత్తాయి.

హార్దిక్ పాండ్యా ,నటాషాల మధ్య అభిప్రాయభేదాలు రావడంతో వీరు విడాకులు బాట పట్టారు. నటాషాకు భరణం అధికంగా దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. నటాషా సెర్బియాకు చెందిన మహిళ కావడంతో భరణం అధికంగా అడిగే అకవాశాలు ఉన్నాయని న్యాయ నిపుణలు చెబుతున్నారు. హార్దిక్ పాండ్యా తన ఆస్తిలో 70 శాతం నటాషాకి ఇవ్వవలసి ఉంటుందని తెలుస్తోంది. ఈ కారణాలన్నింటి వల్లే పాండ్యా ఫ్యామిలీ ఈ విషయం గురించి ఎక్కడా మాట్లాడడం లేదని తెలుస్తోంది.

2024 లెక్కల ప్రకారం హార్దిక్ పాండ్యా నికర విలువ సుమారు రూ.91 కోట్లుగా అంచనా వేయబడింది. గ్రేడ్ A కేటగిరీ కింద బీసీసీఐ నుంచి ఏడాదికి అతను వార్షిక రూ. 5 కోట్లు తీసుకుంటున్నాడు. ఇక ఐపీఎల్ ద్వారా రూ. 15 కోట్ల వరకు తీసుకుంటున్నారని ఓ అంచనా.ఇటీవలి T20 ప్రపంచ కప్ విజయం కూడా అతని ఆదాయాన్ని మరింత పెంచింది. వడోదరలో విలాసవంతమైన ఇల్లుతో పాటు, రేంజ్ రోవర్ ,రోల్స్ రాయిస్ వంటి 8 ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి.

ఇవన్ని పరిగణలోకి తీసుకుంటే హార్దిక్ ఆస్తులు విలువ రూ. 120 కోట్ల వరకు ఉండవచ్చు. ఈ ఆస్తులన్నీ పరిగణలోకి తీసుకునే నటాషా హార్దిక్ నుంచి భారీ భరణం పొంది ఉంటుందని తెలుస్తోంది. అధికారికంగా దీనిపై లెక్కలు బయటకు రానప్పటికి, భరణం విలువ 30 నుంచి 40 కోట్ల వరకు ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

బంగ్లాదేశ్లో కర్ఫ్యూ- రంగంలోకి సైన్యం.. నిరసనలకు 109మంది బలి!

1971లో పాకిస్థాన్తో జరిగిన విమోచన యుద్ధంలో పాల్గొన్న సైనికుల పిల్లలతో సహా ప్రభుత్వ ఉద్యోగాల్లో సగానికి పైగా నిర్దిష్ట వర్గాల రిజర్వేషన్ కోసం ప్రవేశపెట్టిన కోటా విధానానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో జరుగుతున్న నిరసనలు తీవ్రస్థాయికి చేరాయి. పరిస్థితులు చెయ్యి దాటిపోవడంతో ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దింపింది. దేశవ్యాప్తంగా కర్ఫ్యూని విధించింది.

కర్ఫ్యూ నేపథ్యంలో రాజధాని నగరం ఢాకాలో బహిరంగ సభలపై నిషేధం పడింది. ర్యాలీలను సైతం నిషేధించారు. ప్రజా భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు బంగ్లాదేశ్ అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ నిరసనకారులు వెనక్కి తగ్గలేదు! భారీ ఎత్తున్న రోడ్ల మీదకు వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. ఫలితంగా పలు ప్రాంతాల్లో పోలీసులు- ఆందోళనకారుల మధ్య ప్రతిష్ఠంభన కనిపించింది.

బంగ్లాదేశ్లో నిరసనలు చేస్తున్న వారిలో ఎక్కువగా విద్యార్థులే ఉన్నారు. కోటా వ్యవస్థను తీసివేయాలని డిమాండ్ చేస్తూ.. షేక్ హసీనా 15ఏళ్ల ప్రభుత్వానికి సవాలు విసురుతున్నారు. నిరసనలను నియంత్రించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషిచేస్తున్నా, అవి మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.

బంగ్లాదేశ్ నిరసనల్లో ఇప్పటివరకు 109మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 50మందికిపైగా మంది ప్రజలు ఒక్క శుక్రవారమే మరణించారు. వీరిలో చాలా మంది పోలీసుల తూటాలకు ప్రాణాలు విడిచిన వారే ఉన్నారు. గురువారం మరో 25మంది ప్రాణాలు కోల్పోయారు. విద్యార్థులపై కాల్పుల విషయంపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల చీఫ్ వొల్కర్ టర్క్ స్పందించారు. విద్యార్థులపై దాడులు చేయడం షాకింగ్, ఆమోదయోగ్యం కాని విషయం అన్నారు.

కానీ బంగ్లాదేశ్లో పరిస్థితులు రోజురోజుకు ఆందోళనకరంగా మారుతున్నాయి. నర్సింగ్ది జిల్లాలోని జైలులోకి చొరబడిన నిరసనకారులు ఖైదీలను విడుదల చేశారు. అనంతరం ఆ జైలుకు నిప్పంటించారు. వందకుపైగా మంది ఖైదీలు తప్పించుకున్నట్టు అధికారులు భావిస్తున్నారు.

ఇక ప్రభుత్వ ఆస్తులే లక్ష్యంగా నిరసనకారులు పేట్రేగిపోతున్నారు. పోలీసు భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేస్తున్నారు.

ఈ నిరసనలకు మూలమైన 'కోటా' వ్యవస్థపై పలు ఆరోపణలు వస్తున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన వారికే ఈ కోటాలో ప్రయోజనాలు జరుగుతాయని అంటున్నారు. ఇంతకాలం తనకు విధేయులుగా నిలిచిన వారికి రివార్డులు ఇచ్చేందుకే ఈ కోటా వ్యవస్థను షేక్ హసీనా తీసుకొచ్చినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు ఈ కోటాను ఆ దేశ సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. కానీ సుప్రీంకోర్టు తీర్పును ప్రభుత్వం సవాలు చేసింది.

షేక్ హసీనా 2009 నుంచి బంగ్లాదేశ్ని పాలిస్తున్నారు. ఇటీవలే ముగిసిన ఎన్నికల్లో, ఎలాంటి విపక్షం లేకుండా మరోసారి విజయం సాధించారు.

బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ జీవిస్తున్న భారతీయులు, చదువుకుంటున్న విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని విదేశాంగశాఖ స్పష్టం చేసింది. కాగా నిరసనల నుంచి బయటపడేందుకు భారత విద్యార్థులు అన్ని విధాలుగా కృషి చేస్తున్నారు. ఏది దొరికితే అది పట్టుకుని సరిహద్దును దాటుతున్నారు. ఇప్పటికే 300మంది విద్యార్థులు భారత్కు చేరుకున్నారు.

ఈ 300 మందిలో చాలా మంది ఎంబీబీఎస్ చదువుకుంటున్న వారే ఉన్నారు. వీరందరు యూపీ, హరియాణా, మేఘాలయ, జమ్ముకశ్మీర్కి చెందినవారు.

మంగళవారం వరకు పరిస్థితులు బాగానే ఉన్నట్టు, కానీ ఆ తర్వాత ఒక్కసారిగా ఉద్రిక్తత పెరిగినట్టు విద్యార్థులు చెబుతున్నారు. అందుకే బంగ్లాదేశ్ని తాత్కాలికంగా వదిలి వచ్చినట్టు స్పష్టం చేశారు.

Runa Mafi | మాఫీకి మరో మెలిక.. రుణమాఫీ కాకుంటే ఫిర్యాదు చేయాలట.. నెలరోజుల్లో చెప్తామంటున్న సర్కార్‌

రైతుమాఫీపై వ్యవసాయ శాఖ శుక్రవారం తాజా ఆదేశాలు జారీ చేసింది. ఎవరైన రైతులకు రుణమాఫీ కాకపోతే, ఆయా రైతులు మండల వ్యవసాయాధికారులను కలిసి ఫిర్యాదుచేయాలని మెలిక పెట్టింది.

రైతు రైతుమాఫీపై వ్యవసాయ శాఖ శుక్రవారం తాజా ఆదేశాలు జారీ చేసింది. ఎవరైన రైతులకు రుణమాఫీ కాకపోతే, ఆయా రైతులు మండల వ్యవసాయాధికారులను కలిసి ఫిర్యాదుచేయాలని మెలిక పెట్టింది. ఆయా ఫిర్యాదులను 30 రోజుల్లోగా పరిష్కరిస్తామని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఆదేశాలను ఇప్పటికే జిల్లా వ్యవసాయాధికారులకు జారీ చేసినట్టు పేర్కొన్నది.

ఎవరైనా రైతులకు రూ.లక్ష వరకు రుణమాఫీ జరగకపోతే, ఆయా రైతులు ఆందోళన చెందకుండా మీ పరిధిలోని మండల వ్యవసాయ అధికారిని సంప్రదించగలరు. రైతు రుణమాఫీ-2024కు గాను ప్రతి మండలంలో రుణమాఫీ ఫిర్యాదుల విభాగాన్ని మండల వ్యవసాయ అధికారిని నోడల్‌ ఆఫీసర్‌గా జూలై 18న ఏర్పాటు చేయడం జరిగింది.

దీనికి సంబంధించిన ఆదేశాలను జిల్లా వ్యవసాయ అధికారి జిల్లాలో ఉన్న ప్రతి మండల వ్యవసాయ అధికారికి అదే రోజున జారీ చేయడం జరిగింది. రైతులు ఇచ్చిన ఫిర్యాదులను ప్రభుత్వం నిర్దేశించిన 30 రోజుల్లోగా పరిశీలించి పరిష్కరించడం జరుగుతుంది. పంటరుణం తీసుకున్న, రుణమాఫీకి అర్హులైన (తేదీ 12-12-2018 నుంచి 9-12-2023 మధ్య కాలంలో రైతులు పంట రుణం తీసుకున్న పంట రుణమాఫీ 2024కు అర్హులు) ప్రతి రైతుకు సంబంధించిన పంట రుణం సమాచారం, స్థితి తెలుసుకోవడానికి జిల్లాలో క్లస్టర్‌ పరిధిలో ఉన్న ప్రతి వ్యవసాయ విస్తర్ణ అధికారికి, మండల పరిధిలో ఉన్న ప్రతి మండల వ్యవసాయ అధికారికి లాగిన్స్‌ వ్యవసాయ శాఖ నుంచి ఇచ్చాం. రైతులు ఆధార్‌ నంబర్‌ను ఏఈవో, లేదా ఎంఈవోకు ఇస్తే పంట రుణమాఫీ 2024 రైతు సమాచారాన్ని తెలుసుకోవచ్చు’ అని జిల్లా వ్యవసాయ అధికారుల నుంచి ప్రకటనలు వెలువడ్డాయి. దీనిని బట్టి రైతుల్లో కొందరికి రుణమాఫీ జరగలేదని స్పష్టం అవుతున్నదని నిపుణులు చెప్తున్నారు.

రుణమాఫీ జాబితాలో పేర్లు రాని రైతులు శుక్రవారం మండల, జిల్లా వ్యవసాయ కార్యాలయాలకు వెళ్లారు. తమ పేర్లు ఎందుకు రాలేదని అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం రాష్ట్రంలో ఏ వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని పరిశీలించినా ఇదే దృశ్యం కనిపించింది. వారికి ఏమని సమాధానం చెప్పాలో తెలియక వ్యవసాయ అధికారులు తలలు పట్టుకున్నారు. రైతుల ఆధార్‌ వివరాలతో డాటాబేస్‌ను చెక్‌ చేసి, రుణమాఫీ కానివారి నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. ఈ ఫిర్యాదులను ఏం చేస్తారని ప్రశ్నిస్తే.. పై అధికారులకు పంపుతామని, ఎప్పుడు మాఫీ అవుతుందో తెలియదని సమాధానం వచ్చింది. మరికొన్నిచోట్ల రైతులు బ్యాంకులకు వెళ్లి తమ ఖాతాలోని రుణం మాఫీ అయ్యిందో లేదో మరోసారి చూడాలని అధికారులను విజ్ఞప్తిచేయడం కనిపించింది. కరీంనగర్‌ జిల్లాలో కొందరు బ్యాంకర్లు ‘ఇప్పుడు వచ్చింది మొదటి జాబితా మాత్రమే. త్వరలో కొత్త జాబితా వస్తుంది. అందులో మీ పేర్లు ఉండే అవకాశం ఉన్నది’ అంటూ సముదాయించి పంపుతున్నారు. ఇది వాస్తవమేనా? అని ‘నమస్తే తెలంగాణ’ ఆరా తీయగా ‘మా పై అధికారులు కూడా ఇదే చెప్తున్నారు. మార్పులు, చేర్పులతో త్వరలో కొత్త జాబితా వస్తుందని చెప్తున్నారు’ అని ఒక బ్యాంకు అధికారి పేర్కొన్నారు.

రాష్ట్రంలో పంట రుణాల మంజూరు ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నది. రైతుల పంట రుణం వివరాలు, వారి బ్యాంకు ఖాతా నంబర్‌, ఆధార్‌, పాస్‌బుక్‌ నంబర్‌.. వంటివన్నీ బ్యాంకర్ల దగ్గర ఉన్నాయి. ఈ వివరాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖకు, రెవెన్యూ శాఖకు చేరుతున్నాయి. ఈ వివరాలన్నీ ఆన్‌లైన్‌లో పక్కాగా ఉంటాయి కాబట్టి.. ఒక్క క్లిక్‌తోనే డాటా మొత్తం వస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఇంత పక్కాగా వివరాలు ఉన్నా లోపాలు ఎందు కు జరిగాయని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం డిసెంబర్‌లో అధికారంలోకి రాగానే రుణమాఫీ కసరత్తు మొదలుపెట్టింది. అప్పటినుంచే రైతుల వివరాలు సేకరించి, పరిశీలిస్తున్నది. ఏడు నెలల సమయం దొరికినా, ఎందుకు కచ్చితమైన వివరాలు సేకరించలేకపోయారని ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. రుణమాఫీ కానివారు మండల కార్యాలయంలో ఫిర్యాదు చేయాలనడంపై రైతులు మండిపడుతున్నారు. వివరాలన్నీ బ్యాంకుల దగ్గర ఉన్నప్పుడు ఎందుకు మళ్లీ దరఖాస్తు చేయాల ని ప్రశ్నిస్తున్నారు. వీటిపై ఎప్పుడు మోక్షం కలుగుతుందో? ఎప్పుడు మాఫీ అవుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

నా పేరుమీద లక్షా అరవై వేల రూపాయలు, భార్యపేరు మీద అరవై వేల రూపాయలు పంట రుణం తీసుకున్నం. ఇప్పటి వరకు పైసలు పడలేదు. రుణమాఫీ సంగతి ఏందో తెలుసుకుందామని హుస్నాబాద్‌ ఎస్బీఐ బ్యాంకుకు వచ్చిన. రుణమాఫీ జరగలేదని చెప్పిన. మెసేజ్‌ కూడా రాలేదని ఫోన్‌ చూపించిన. మాకు రుణమాఫీ రాకుంటే సీఎం రేవంత్‌రెడ్డి దాక పోతం. అస్సలు ఊకోం. మాకెందుకు పైసలు రావద్దు? అర్హతలన్నీ ఉన్నప్పుడు రావాల్సిందే. నలుగురిని కూడగట్టుకొని హైదరాబాద్‌ దాక పోత. అస్సలు ఇడిసిపెట్టేదేలేదు.

భాగ్యనగర వాసులకు శుభవార్త.. అందుబాటులోకి మరో ఫ్లై ఓవర్

డా చౌరస్తా వద్ద రూ. 28 కోట్ల 50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన ఫ్లై ఓవర్‌ను రేపు(శనివారం 20.07.2024) ఉదయం 11.00 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CMRevanth Reddy) ప్రారంభించన్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పాల్గొంటారు.

ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. HCU బస్టాండ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు వయా వట్టినాగుల పల్లి మీదుగా గోపన్ పల్లి తండా వద్ద ఫ్లై ఓవర్‌‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.

ప్రజా సౌకర్యార్థం, ట్రాఫిక్ రహిత సమాజానికి ఫ్లై ఓవర్‌ని నిర్మించినట్లు వివరించారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గాంధీ పిలుపునిచ్చారు. గోపన్ పల్లి తండా చౌరస్తా వద్ద Y ఆకారంలో ఫ్లై ఓవర్‌ను నిర్మించినట్లు తెలిపారు. త్వరలోనే ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని, ఎన్నో ఏళ్ల సమస్య పరిష్కరమవుతుందని తెలిపారు. ట్రాఫిక్ రహిత సమాజం కోసం అద్భుతమైన ఫ్లై ఓవర్‌ ను నిర్మించినట్లు చెప్పారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు తీరుతాయన్నారు. ప్రజలకు ట్రాఫిక్ రహిత , ఫ్రీ సిగ్నల్ కోసం ఫ్లై ఓవర్ చేపట్టినట్లు తెలిపారు

IT హబ్ హైటెక్ సిటీ , ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి IT ప్రాంతాలు, రద్దీ ఉండే ప్రాంతాల వారికి అన్ని హంగులతో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి , ప్రజల ట్రాఫిక్ సమస్యల ఇబ్బందులను గట్టెకించే విధంగా కృషి చేస్తామని తెలిపారు.

నియోకజకర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి గౌరవ కార్పొరేటర్లు , ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు తప్పకుండా ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తెలిపారు.

కరీంనగర్‌లో 11 మంది ఎస్సైల బదిలీలు..

కరీంనగర్ కమీషనరేట్ పరిధిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 11 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ శుక్రవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఉత్తర్వుల ప్రకారం టాస్క్ ఫోర్స్ లో పనిచేస్తున్న ఎస్.శ్రీధర్ ను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు, కమిషనరేట్ ఆఫీస్ నందు పనిచేస్తున్న జి.అనూష ను చొప్పదండి ఎస్సైగా

చొప్పదండి ఎస్సైగా పనిచేస్తున్న ఉపేంద్రాచారి ని కరీంనగర్ ట్రాఫిక్ విభాగానికి , కమిషనరేట్ ఆఫీస్ నందు పనిచేస్తున్న యూనస్ అహ్మద్ అలీ ని హుజురాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కు

కమిషనరేట్ ఆఫీస్ నందు పనిచేస్తున్న టి.వివేక్ ను జమ్మికుంట పోలీస్ స్టేషన్ కు , కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పి.

అభిలాష్ ని కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు, జమ్మికుంట పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్. రాజేష్ ను వీఆర్ కరీంనగర్ కు, కమిషనరేట్ ఆఫీస్ నందు పనిచేస్తున్న ఎన్. శ్రీనివాస్ ను కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ కు

హుజురాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న జి. సాంబయ్య ను సీసీఎస్ పోలీస్ స్టేషన్ కు

కరీంనగర్ వీఆర్ లో ఉన్న ఎస్. హనుమంతరావును పోలీస్ కంట్రోల్ రూమ్ కు బదిలీ చేశారు.

ఏపీలో ఆటవిక పాలన సాగుతోంది - దాడులపై ఢిల్లీలో ధర్నా చేస్తాం - వైఎస్ జగన్

వైసీపీ అధినేత జగన్ వినుకొండకు చేరుకున్నారు. హత్యకు గురైన రషీద్‌ కుటుంబాన్ని పరామర్శించారు. అతని కుటుంబ సభ్యులను ఓదార్చి.. ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా జాతీయ మీడియా(ఇండియా టుడే)తో మాట్లాడిన జగన్… ఏపీలో జరుగుతున్న దాడులపై ప్రధాని మోదీతో పాటు పలువురిని కలుస్తామన్నారు. పార్టీలోని ప్రజాప్రతినిధులతో కలిసి వచ్చే బుధవారం ఢిల్లీలో ధర్నా చేస్తామని ప్రకటించారు.

వినుకొండలో మాట్లాడిన జగన్... రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో లా అండ్ అర్డర్ లేదన్నారు. పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్రను పోషిస్తున్నారని దుయ్యబట్టారు. దొంగ కేసులు నమోదు చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ 45 రోజుల టీడీపీ పాలనలో ఏకంగా 36 రాజీకీయ హత్యలు జరిగాయి. 300కుపైగా హత్యాయత్నాలు జరిగాయి. టీడీపీ వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 506 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇవి కాక వెయ్యికి పైగా దౌర్జన్యాలు, దాడులు చేశారు” అని వైఎస్ జగన్ ఆరోపించారు.

రాష్ట్రంలో చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోయాయి. వైసీపీ పాలనలో ఇలాంటి పరిస్థితులు లేవు. దిశా యాప్ తో ఫిర్యాదులు స్వీకరించాం. గత ప్రభుత్వం సకాలంలో విద్యా, వసతి దీవెన ఇచ్చాం. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వటం లేదు. జగనే ఉండి ఉంటే రైతు భరోసాతో పాటు సున్నా వడ్డీ డబ్బులు, మత్స్యకార డబ్బులు వచ్చేవి. అబద్ధాలు చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన హామీలను విస్మరించే పనిలో ఉన్నాడు. చెప్పిన హామీల గురించి ప్రజలు అడిగే పరిస్థితులు ఉన్నాయి" అని జగన్ వ్యాఖ్యానించారు.

ఏపీలో జరుగుతున్న రాజకీయ దాడులపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తామని జగన్ తెలిపారు. గవర్నర్ ప్రసంగాన్ని కూడా అడ్డుకుంటామని పేర్కొన్నారు. ఇదే కాకుండా మంగళవారమే వైసీపీ నేతలు ఢిల్లీకి చేరుకొని బుధవారం ధర్నా చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రపతితో పాటు ప్రధాని మోదీ, అమిత్ షాను కలుస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని పరిస్థితులపై నివేదిస్తామని వివరించారు.

ఏపీలో రాష్ట్రపతి పాలనను విధించాలనే అంశంపై ఢిల్లీలో ఫిర్యాదు చేస్తామని జగన్ తెలిపారు. రషీద్ హత్య కేసులో పోలీసులు తీరు దారుణంగా ఉందన్నారు. లేని కేసులు ఉన్నాయని పేర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులను సీఎం చంద్రబాబు ఖండించి… ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని పోలీసులు సరైన మార్గంలో నడవాలని డిమాండ్ చేశారు.

మరోవైపు వైఎస్ జగన్ భద్రత కుదించారని వైసీపీ ఆరోపించింది. జగన్‌కు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయించడంతో మరో ప్రైవేట్ వాహనంలో వినుకొండకు ప్రయాణించారు. భద్రత కుదింపుపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చే భద్రత కంటే ఎక్కువ భద్రత కల్పిస్తున్నామని ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 

మాజీ సిఎంలకు ఇచ్చే భద్రత కంటే ఎక్కువే జగన్‌కు ఇస్తున్నట్టు ఏపీ సిఎంఓ వర్గాలు చెప్పాయి. వైఎస్ జగన్ కు పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారని, రిపేర్లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వడంతో ఇబ్బందులు తలెత్తాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దారిలో పలుమార్లు బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయించడంతో మధ్యలోనే బుల్లెట్ ప్రూఫ్ వాహనం నుంచి దిగిన జగన్… మరో వాహనంలో వినుకొండకు చేరుకున్నారు.

ప్లేస్కూల్స్ తరహా బోధన, పాఠశాలలకు రవాణా సౌకర్యం.. విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

తెలంగాణలో విద్యా విధానాన్ని సమూలంగా మార్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని గ్రామాల్లో 3వ తరగతి వరకు అంగన్‌వాడీల్లోనే ప్లేస్కూల్ తరహా బోధన, ఆ తర్వాత 4 నుంచి సెమీ రెసిడెన్షియల్స్ స్కూళ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పించాలన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, విద్యా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంతో కలిసి తెలంగా విద్యా విధానంపై సమీక్ష నిర్వహించారు.

తెలంగాణలో విద్యా విధానాన్ని సమూలంగా మార్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని గ్రామాల్లో 3వ తరగతి వరకు అంగన్‌వాడీల్లోనే ప్లేస్కూల్ తరహా బోధన, ఆ తర్వాత 4 నుంచి సెమీ రెసిడెన్షియల్స్ స్కూళ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పించాలన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, విద్యా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంతో కలిసి తెలంగా విద్యా విధానంపై సమీక్ష నిర్వహించారు.

అంగన్‌వాడీల్లో ప్లేస్కూల్ తరహా బోధన

అన్ని నియోజకవర్గాల్లో సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లు

విద్యా విధానంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

రేపటి నుండే అమెజాన్ ప్రైమ్ డే సేల్ | మీ విష్ లిస్ట్ రెడీనా?? లేదంటే ఇప్పుడే ఆఫర్లేంటో ఒకసారి చూసెయ్యండి!

డీల్స్ చూడండి

రేపటి నుండే అమెజాన్ ప్రైమ్ డే సేల్ | మీ విష్ లిస్ట్ రెడీనా?? లేదంటే ఇప్పుడే ఆఫర్లేంటో ఒకసారి చూసెయ్యండి!

ప్రెగ్నెన్సీలో దంతాలు, చిగుళ్ళని కాపాడుకోండిలా

డీల్స్ చూడండి

ప్రభుత్వ పాఠశాలల తీరుతెన్నులు మారాలని, విద్యా వ్యవస్థ సమూలంగా మారాలని తల్లిదండ్రులు ఎంతో కాలంగా కోరుకుంటారు. ఆ దిశగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా, ముఖ్యంగా ప్రభుత్వ బడుల్లో బోధన విషయంలో సరికొత్త విధానంతో ముందుకు వెళ్లాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని విద్యా శాఖ ముఖ్య కారదర్శి బుర్రా వెంకటేశం, ఇతర ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఈ సందర్భంగా బుర్రా వెంకటేశం చేసిన పలు ప్రతిపాదనలను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆసక్తిగా విన్నారు.

రాష్ట్రంలో సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యార్థులు పాఠశాలలకు చేరుకునేలా రవాణా సౌకర్యాలు సైతం కల్పించే విధానాలను కూడా సూచించాలన్నారు. ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్‌కు సమాంతరంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లు ఉండాలని సూచించారు.

ప్లే స్కూళ్ల తరహాలో అంగన్‌వాడీలను నిర్వహించాలని, ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. చిన్న పిల్లలకు, వారి తల్లిదండ్రులకు సౌకర్యవంతంగా ఉండేలా 3వ తరగతి వరకు అంగన్‌వాడీ కేంద్రాలలోనే ప్లే స్కూల్ తరహాలో విద్యా బోధన చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అంగన్‌వాడీలలో ఇప్పుడున్న సిబ్బందికి అదనంగా విద్యా బోధన కోసం ప్రత్యేకంగా ఒక టీచర్‌ను నియమించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

పాఠశాలలకు రవాణా సదుపాయం

3వ తరగతి వరకు అంగన్‌వాడీ ప్లే స్కూల్‌లో బోధన తర్వాత విద్యార్థులు 4వ తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్‌లో చదువుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ దిశగా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఆయా గ్రామాల నుంచి విద్యార్థులు సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లకు వెళ్లివచ్చేందుకు ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

ఫ్యాషన్ షో జరుగుతోందా? లాయర్ వస్త్రధారణపై సీజేఐ ఆగ్రహం

సుప్రీం కోర్టు(Supreme Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ న్యాయవాదిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా లాయర్ వస్త్రధారణపై సీజేఐ మండిపడ్డారు.

అయితే, కోర్టుకు హాజరయ్యే లాయర్లు తప్పనిసరిగా ధరించాల్సిన నెక్‌బ్యాండ్‌ ఆ న్యాయవాది ధరించలేదు. దీంతో, సీజేఐ న్యాయవాదిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మీ మెడ చుట్టూ ఉండే బ్యాండ్ ఎక్కడ ఉంది? ఇక్కడేమైనా ఫ్యాషన్ షో జరుగుతోందా?” అని ప్రశ్నించారు.

ఈమెయిల్ పంపాలని ఆదేశించారు. హడావిడిగా వచ్చానని న్యాయవాది చెప్పినప్పుడు మరింత కఠినంగా సీజేఐ సమాధానమిచ్చారు.

క్షమించండి, మీరు సరైన వస్త్రధారణలో లేకుంటే కేసు వినేది లేదు" అని స్పష్టం చేశారు.

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (Bar Council)నిబంధనల ప్రకారం కోర్టుకు హాజరయ్యే న్యాయవాదులకు డ్రెస్ కోడ్‌ తప్పనిసరి. సుప్రీంకోర్టు, హైకోర్టు, కింది కోర్టులు, ట్రైబ్యునల్స్ లేదా అథారిటీలలో హాజరయ్యే న్యాయవాదాలు డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

సేమ్ ఓదార్పు !

ఎవరైనా విషాదంలో మునిగిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి ఊరేగింపుగా వెళ్తారా ?. కేరింతలు.. జయజయధ్వానాలు చేయించుకుంటూ బలప్రదర్శన చేసుకుంటూ వెళ్తారా

చనిపోయిన వ్యక్తి కుటుంబం బాధల్లో ఉంటే రాజకీయంగా బలప్రదర్శనకు.. శవ రాజకీయానికి వాడుకంటారా అసలు అలాంటి ఆలోచన కూడా ఎవరికీ రాదు. కానీ అది జగన్ కు పెటేంట్ స్టైల్ ఓదార్పు. వైఎస్ చనిపోయినప్పుడు అదే చేశారు. ఇప్పుడు వినుకొండలో రషీద్ అనే వ్యక్తి చనిపోయినా అదే చేశారు.

ఉదయం ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి అదే పని. నేరుగా వినుకొండ వెళ్లకుండా.. చిలుకలూరిపేట..నర్సరావుపేట అంటూ చుట్టూ తిరిగి.. ప్రతి పాయింట్ లోనూ నేతలతో జన సమీకరణ చేయించుకుని ఎన్నికల సమయంలోలా ..

అభివాదాలు చేసుకుంటూ పోయారు. ఆయన మొహంలో చిరునవ్వు ఎక్కడా తగ్గలేదు. ఆయన తీరు చూసి హత్యకు గురైన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్నట్లుగా లేదని శవ రాజకీయం చేయడానికి అవసరమైన సరంజామా దొరికినట్లు ఆనందంగా ఉందన్నట్లుగా ఉందని ఎవరికైనా అనిపిస్తుంది.

అతి స్లోగా వెళ్లి సాయంత్రం ఐదు గంటల సమయంలో వినుకొండ చేరుకున్నారు. దానికీ ఆయన పోలీసుల్నే నిందించారు. వాహనం మంచిది ఇవ్వలేదని.. కాన్వాయ్ ను అడ్డుకున్నారని రకరకాల ఆరోపణలు చేశారు.

డిసెంబర్‌లో తాను ప్రారంభించాలనుకుంటున్న ఓదార్పు యాత్రకు శాంపిల్ గా… ఈ యాత్రను టెస్ట్ రన్ చేసినట్లుగా ఉందన్న సెటైర్లు వైసీపీలోనే వినిపించారు.