రైలుబండి.. కొత్త స్టాపులండి
డిమాండ్ కలిగిన స్టేషన్లలో రైళ్లకు హాల్ట్ కల్పిస్తూ దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగా విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే రైళ్లు కొత్తగా మరో 30 స్టేషన్లలో ఆగనున్నాయి.
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో అనేక స్టేషన్లలో రైళ్లు ఆగనున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం 69 రైళ్లకు సరికొత్తగా హాల్ట్ ఇవ్వగా, ఇందులో విజయవాడ మీదుగా రాకపోకలు సాగించేవి 40కి పైగా ఉన్నాయి. అయితే, దీనిని ప్రయోగాత్మకంగానే అమలు చేస్తున్నారు. డిమాండ్‌ను బట్టి కొంతకాలం తర్వాత పునరాలోచన చేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.
ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు దశలవారీగా ఆయా రైళ్లలో నూతన హాల్ట్‌ను ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్-రాయ్‌పూర్ (రైలు నెంబరు 12771), హెచ్.నిజాముద్దీన్-తిరుపతి (రైలు నెంబరు 12708)కు బెల్లంపల్లిలో హాల్టింగ్ ఇచ్చారు. ఎర్నాకుళం-పాట్నా (రైలు నెంబరు 22699)కు ఖమ్మం స్టేషన్‌లో స్టాపింగ్ ఇచ్చారు. తిరుపతి-సికింద్రాబాద్ (రైలు నెంబరు 12763), విశాఖపట్నం-మహ బూబ్‌నగర్ (రైలు నెంబరు 12861)కు మధిర స్టేషన్‌లో స్టాపింగ్ ఇచ్చారు. హెచ్.నిజాముద్దీన్ (రైలు నెంబరు 12708), ఎర్నాకుళం-పాట్నా (రైలు నెంబరు 22699)కు మంచిర్యాల స్టేషన్‌లో హాల్ట్ ఇచ్చారు.
బెంగళూరు-దానాపూర్ (రైలు నెంబరు 12295), ఎర్నాకుళం-పాట్నా (రైలు నెంబరు 22699)కు రామగుండంలో స్టాపింగ్ ఇచ్చారు. పూరి-తిరుపతి (రైలు నెంబరు 17479), తిరుపతి-కాకినాడ టౌన్ (రైలు నెంబరు 17249), బిలాస్‌పూర్-తిరుపతి (రైలు నెంబరు 17481)కు చినగంజాం స్టేషన్‌లో హాల్ట్ ఇచ్చారు. గుంటూరు-రాయగడ (రైలు నెంబరు 17243)కు భీమడోలు స్టేషన్‌లో హాల్ట్ ఇచ్చారు. గుంటూరు-నరసాపూర్ (రైలు నెంబరు 17281)కు పుట్లచెరువు స్టేషన్‌లో హాల్ట్ ఇచ్చారు. కాత్రా-కన్యాకుమారి (రైలు నెంబరు 16318)కు గూడూరు జంక్షన్‌లో, విజయవాడ-కాకినాడ పోర్టు (రైలు నెంబరు 17257)కు పసివేదల స్టేషన్ లో, విజయవాడ-మచిలీపట్నం (రైలు నెంబరు 07866)కు ఉప్పులూరు స్టేషన్‌లో హాల్ట్ ఇచ్చారు.
భువనేశ్వర్-సికింద్రాబాద్ (రైలు నెంబరు 17015)ను నడికుడి స్టేషన్‌లో, భువనేశ్వర్-సికింద్రాబాద్ (రైలు నెంబరు 17015)కు పిడుగురాళ్ల, సత్తెనపల్లి స్టేషన్లలో స్టాపింగ్ కల్పించారు. నాగర్‌సోల్-నర్సాపూర్ (రైలు నెంబరు 17232)కు కూడా సత్తెనపల్లి స్టేషన్‌తో పాటు నడికుడి, పిడుగురాళ్ల స్టేషన్లలో హాల్ట్ కల్పిం చారు. ధర్మవరం-రేపల్లె (రైలు నెంబరు 17216)కు గిద్దలూరు స్టేషన్‌లో, లింగంపల్లి- నర్సాపూర్ (రైలు నెంబరు 17256), చెంగల్‌పట్టు-కాకినాడ (రైలు నెంబరు 17643)కు మంగళగిరి స్టేషన్‌లో హాల్ట్ కల్పించారు.
ధర్మవరం-మచిలీపట్నం (రైలు నెంబరు 17216)ను మార్కాపురం రోడ్డు స్టేషన్‌లో, భువనేశ్వర్-సికింద్రాబాద్ (రైలు నెంబరు 17015)కు మిర్యాలగూడ స్టేషన్‌లో, నర్సాపూర్-లింగంపల్లి (రైలు నెంబరు 17255)కు నల్గొండ స్టేషన్‌లో, చెంగల్‌పట్టు-కాకినాడ (రైలు నెంబరు 17643)ను న్యూ గుంటూరు స్టేషన్‌లో హాల్ట్ ఇచ్చారు.
యశ్వంత్‌పూర్-మచిలీపట్నం (రైలు నెంబరు 17212)కు కంబం స్టేషన్‌లో హాల్ట్ ఇచ్చారు. నాగర్‌సోల్-నర్సాపూర్ (రైలు నెంబరు 17232)కు మిర్యాలగూడ, నల్గొండలో హాల్ట్ ఇచ్చారు. నాగర్‌సోల్-చెన్నై (రైలు నెంబరు 16004)కు మహబూబ్ నగర్‌లో, సికింద్రాబాద్-రాయ్‌పూర్ (రైలు నెంబరు 17271), రాయ్‌పూర్-సికింద్రాబాద్ (రైలు నెంబరు 17272)కు పెద్దపల్లిలో స్టాపింగ్ ఇచ్చారు. చెన్నై సెంట్రల్-నిజాముద్దీన్ (రైలు నెంబరు 12611), నిజాముద్దీన్-చెన్నై సెంట్రల్ (రైలు నెంబరు 12612)కు వరంగల్‌లో, అహ్మదాబాద్-చె న్నై సెంట్రల్ (12655)కు పెద్దపల్లిలో హాల్ట్ కల్పించారు.
Jul 19 2024, 19:43