/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz TG: రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు కోమటిరెడ్డి, జూపల్లి Mane Praveen
TG: రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు కోమటిరెడ్డి, జూపల్లి

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో రూ. 56 కోట్ల వ్యయంతో బాలానగర్ - గంగాపూర్ రహదారి విస్తరణ పనులకు (సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్) శంకుస్థాపన చేసిన ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, అనిరుధ్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణామోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

NLG: జిల్లా స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక కార్యక్రమం
నల్లగొండ జిల్లా స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక కార్యక్రమం నల్గొండ పట్టణంలోని విన్నర్స్ తైక్వాండో అకాడమీలో విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వన్ టౌన్ సిఐ  రాజశేఖర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. తైక్వాండో వంటి యుద్ధ విద్యలు నేర్చుకోవడం వలన శారీరకంగా మానసికంగా ఎంతో ఉపయోగపడుతుందని, ఆత్మరక్షణకు తైక్వాండో క్రీడ చాల ముఖ్యం అని, తద్వారా చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారని తెలిపారు.

జిల్లా యువజన మరియు క్రీడల అధికారి ఎండి మగ్బూల్ అహ్మద్ హాజరై మాట్లాడుతూ.. టైక్వాండో క్రీడతో చదువులలో మరియు ఉద్యోగ అవకాశాలలో 2% శాతం రిజర్వేషన్ పొందవచ్చునని తెలిపారు.

కార్యక్రమంలో ది తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ నల్లగొండ జిల్లా కార్యదర్శి ఎండి యునుస్ కమాల్, కోశాధికారి అంబటి ప్రణీత్, సీనియర్ క్రీడాకారులు ఎండి నసీరుద్దీన్, రెఫ్రేలుగా లోకేష్, అశోక్, సరయు, శ్రేష్ట మొదలగు వారు పాల్గొన్నారు.
NLG: గ్రామస్తుల సౌకర్యార్థం ఖాళీ స్థలం కొనుగోలుకు విరాళం ఇచ్చిన మేకల ప్రమోద్ రెడ్డి
మునుగోడు మండలం చల్మెడ గ్రామంలో పీర్ల కొట్టం ముందు, గ్రామస్తుల సౌకర్యార్థం ఖాళీ స్థలం కొనుగోలు కొరకు శనివారం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మేకల ప్రమోద్ రెడ్డి ఒక లక్ష రూపాయలు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ.. ఉత్సవ కమిటీ సభ్యుల కోరిక మేరకు తన రాజకీయ గురువు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సేవా స్పూర్తితో విరాళం ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
NLG: మద్ది కీర్తన అద్భుత ఆటతో నల్గొండ జిల్లా జట్టు విజయం
మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్న 10 వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలికల ఫుట్బాల్ పోటీల్లో.. ఈరోజు  నల్గొండ, ఖమ్మం జిల్లా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో నల్గొండ పట్టణం చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ కు చెందిన మద్ది కీర్తన అద్భుతమైన ఆట తీరుతో 2 గోల్స్ సాధించి నల్లగొండ జిల్లా జట్టును విజయపథంలో నడిపించిందని ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు. గత సంవత్సరం రాష్ట్ర స్థాయి పోటీల్లో నల్గొండ జిల్లా జట్టు ద్వితీయ స్థానం సాధించడంలో మద్ది కీర్తన పాత్ర ఎంతో గొప్పదని తెలియజేశారు.
NLG: కస్తూర్భా బాలికల విద్యాలయాలకు చేయూతనిస్తున్న కస్తూరి ఫౌండేషన్
నాంపల్లి మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో నీటి వసతి  లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని పాఠశాల సిబ్బంది ద్వారా తెలుసుకొని వెంటనే బోర్ వేసి మోటార్ బిగించి,కరెంట్ పోయిన సమయంలో ఇబ్బందులు కలగకుండా ఇన్వెర్టర్ మరియు మైక్ సెట్ ఇచ్చారు. కృతజ్ఞలగా ఈరోజు పాఠశాలలో పాఠశాల స్పెషల్ ఆఫీసర్ విజయ శ్రీ  అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీ చరణ్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కస్తూరి  శ్రీ చరణ్  మాట్లాడుతూ.. గత కొన్ని సం.ల నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా   కస్తూరి ఫౌండేషన్  సేవలందిస్తున్నారు. ఫౌండేషన్ ప్రారంభించిన నాటి నుండి అనేక  సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. కస్తూరి ఫౌండేషన్ ఒక విద్యారంగాన్ని బాగుపర్చడమే కాకుండా కరోనా సమయంలో పాఠశాలను సానిటైషన్ చేయడం, నిరు పేద కుటుంబాలకు కస్తూరి కళ్యాణమస్తు ద్వారా పెళ్లిళ్లకు పుస్తె, మెట్టలు అందించామన్నారు. పేదరికంతో ఏ విద్యార్థి కూడా చదువుకు దూరం కావొద్దనే ఉద్దేశ్యంతోనే మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మన ఊరి బడులను మనమే బాగుపర్చుకోవాలని, తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్మాణం ఉంటుందన్నారు. ఈ విద్యా సంవత్సరంలో మా ఫౌండేషన్ బాలికల విద్యపై, అంగన్వాడి పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టమాన్నారు.బాలికల కోసం సానిటరీ కిట్స్ ,అంగన్వాడీ భవనాలను మరమ్మత్తు చేయడం ,నూతన అంగన్వాడీ భవనాలు నిర్మించడం జరుగుతుంది అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం కస్తూర్భా విద్యాలయాలను పట్టించుకొని మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.నేటి సమాజంలో అన్ని రంగాల్లో మహిళలు ముందున్నారని గుర్తు చేస్తూ మీరు కష్ట పడి చదివి ఉన్నత స్థాయికి ఎదిగి సమాజ సేవా చేయాలని విద్యార్థులను కోరారు. మనలో బలమైన సంకల్పం ఉంటే ఏదైన సాధించగలమని అదే సంకల్పంతో విద్యార్థులు కష్ట పడి చదివి మంచి మార్కులు సాధించాలన్నారు . కస్తూరి శ్రీ చరణ్ చేతుల మీదగా పాఠశాలోని విద్యార్దినలకు నోట్ బుక్స్,స్టేషనరీ సామగ్రి, జూట్ బాగ్స్,గ్రామర్ బుక్స్,డిక్షనరీ బుక్స్ అందజేశారు.

ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయిలు మల్లికార్జున్, ఫౌండేషన్ సభ్యులు యుగేందర్, సాగర్ల లింగయ్య,కంచర్ల రామకృష్ణ, మహేష్ పిన్నింటి నరేందర్ రెడ్డి,సమ్మిడి నవీన్ రెడ్డి,వీరమళ్ల కార్తిక్,స్థానిక యువకులు కర్నాటి శ్రీహరి, మట్టిపల్లి శ్రీశైలం , నాంపల్లి సతీష్, శ్రీకాంత్,  పేసర్ల హరీష్, ముక్కాముల రాజు, రామకృష్ణ మరియు పాఠశాల ఉపాద్యాయులు, గ్రామ యువకులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం నుండి వయా అనాజ్ పూర్ మీదగా హయత్ నగర్ వరకు బస్ పున:ప్రారంభం
ఇబ్రహీంపట్నం TGRTC డిపో వారు హయత్ నగర్ వరకు ఏర్పాటు చేసిన బస్ ను శుక్రవారం అనాజ్ పూర్ గ్రామ పంచాయితీ వద్ద గ్రామస్థులు గ్రామ పెద్దలు ఇబ్రహీంపట్నం డిపో అధికారులతో కలిసి ప్రారంభించారు. గతంలో బస్ సౌకర్యం ఉండగా రోడ్డు మరమత్తుల కారణంగా నిలిపివేయగా, ఇటీవల అనాజ్ పూర్ గ్రామ పెద్దలు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా అధికారులతో మాట్లాడి బస్ ని పున:ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు రైతులు స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి ఇబ్రహీంపట్నం డిపో అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదములు తెలిపారు.
నల్లగొండ జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ  వర్కింగ్ ప్రెసిడెంట్ గా కందిమళ్ల నాగమణి రెడ్డి నియామకం
నల్లగొండ జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ  వర్కింగ్ ప్రెసిడెంట్ గా నల్లగొండ పట్టణానికి చెందిన కందిమళ్ల నాగమణి రెడ్డిని, జిల్లా కాంగ్రెస్ కమిటీ మహిళా విభాగం అధ్యక్షురాలు గోపగాని మాధవి సమక్షంలో, రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  నియమించి నేడు హైదరాబాద్లో నియామక పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్లగొండ జిల్లాలోని ఎంపీ లు మరియు ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లకు, కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్, జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ పట్టణ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్  మరియు మహిళా కాంగ్రెస్ కమిటీ సభ్యులకు పేరు పేరునా కృతజ్ఞతలు అని తెలియజేసారు.
NLG: విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లు  పంపిణీ చేసిన పెట్రోల్ బంక్ కోటేష్
మర్రిగూడ మండలం శివన్నగూడ పెట్రోల్ లో  పనిచేస్తున్న చండూరు మండలం దోనిపాముల గ్రామస్తుడు కోటేష్.. ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా ధోనిపాముల, జోగిగూడెం, నెర్మట,  బంగారుగడ్డ, ఇడికూడ, లెంకలపల్లి, సరంపేట, శివన్నగూడ గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు దాదాపు 1500 మందికి పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, పలకలు పంపిణీ చేశారు. అదేవిధంగా స్వీట్లు పంపిణీ చేశారు. అయితే పేదరికంలో ఉండి కూడా విద్యార్థుల కోసం తను దాచుకున్న డబ్బులతో విద్యా సామాగ్రిని పంపిణీ చేయడం పట్ల పలు గ్రామాల ప్రజలు ఆయనను అభినందిస్తున్నారు.
రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీల్లో పాల్గొంటున్న ఉమ్మడి నల్గొండ జిల్లా బాలికల జట్టు
నల్గొండ జిల్లా:
ఈరోజు నుండి 14వ తేదీ వరకు మహబూబ్నగర్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీల్లో పాల్గొనడానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా చెందిన 20 మంది క్రీడాకారిణుల జట్టును పంపించడం జరిగిందని ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు. ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ.. గత సంవత్సరం మన జిల్లా జట్టు ఎంతో అద్భుతంగా ఆటతీరుతో రాష్ట్రస్థాయి పోటీల్లో ద్వితీయ స్థానం పొందిందని, ఈసారి కూడా అద్భుతమైన ఫలితాలను సాధిస్తుందని తెలియజేస్తూ, అసోసియేషన్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని తెలిపారు.
NLG: వన్ టౌన్ నూతన సిఐ రాజశేఖర్ రెడ్డి ని కలిసిన బంజారా నాయకులు
నల్లగొండ పట్టణం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గా బాధ్యతలు స్వీకరించిన రాజశేఖర్ రెడ్డి ని, ఇవాళ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కార్మిక విభాగం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా  అధ్యక్షులు కేళావత్ నాగేష్ నాయక్, రాజశేఖర్, సాగర్ పాల్గొన్నారు.