/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz Joe Biden: హత్యా రాజకీయాలను అమెరికా సహించదు.. ట్రంప్ ఘటనపై బైడెన్ ఉద్ఘాటన Raghu ram reddy
తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 15 2024, 09:27

Joe Biden: హత్యా రాజకీయాలను అమెరికా సహించదు.. ట్రంప్ ఘటనపై బైడెన్ ఉద్ఘాటన

రిపబ్లికన్ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై(Donald Trump) కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హత్యా రాజకీయాలను అమెరికా ఎన్నిటికీ సహించదని ఉద్ఘాటించారు.

రిపబ్లికన్ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై(Donald Trump) కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

హత్యా రాజకీయాలను అమెరికా ఎన్నిటికీ సహించదని ఉద్ఘాటించారు. ఆయన ఆదివారం ఓవల్ కార్యాలయంలో జాతినుద్దేశించి ప్రసంగించారు.

2020లో బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఓవల్ ఆఫీస్‌లో బైడెన్ మాట్లాడటం ఇది మూడోసారి. ఓవల్ కార్యాలయం జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రసంగాల కోసం ఉద్దేశించింది. కాగా ఈ కార్యాలయం నుంచి అమెరికా అధ్యక్షులు చాలా అరుదుగా ప్రసంగిస్తుంటారు. గతంలో మాజీ అధ్యక్షులు ట్రంప్ రెండు సార్లు, ఒబామా మూడు సార్లు ప్రసంగించారు.

బైడెన్ మాట్లాడుతూ.. "హత్యా రాజకీయాలను సహించం. రాజకీయంగా ఒక్కొక్కరికి ఇష్టాఇష్టాలు ఉండటం సహజం. కానీ ఎప్పుడూ హింసకు దిగొద్దు. హింసకు పాల్పడిన వారిని అమెరికా ఎన్నటికీ క్షమించదు. మనం శత్రువులం కాదు. పొరుగువారం.. ఒకరికొరం స్నేహితులం, సహోద్యోగులం, అమెరికా పౌరులం. మనమంతా ఐక్యంగా నిలబడాలి" అని బైడెన్ పేర్కొన్నారు.

ట్రంప్‌పైకి థామస్‌ మాథ్యూ క్రూక్స్‌ (20) అనే యువకుడు తుపాకీ గురిపెట్టినట్లు భద్రతా దళాలు గుర్తించాయి. రైఫిల్‌తో మాథ్యూ తలను భద్రతాబలగాలు ఛిద్రం చేశాయి.సీక్రెట్‌ ఏజెంట్లు, సెక్యూరిటీ సిబ్బంది ట్రంప్‌ వద్దకు వచ్చి అతనికి వలయంగా నిలబడ్డారు.

ట్రంప్‌ను ఆయన బుల్లెట్‌ప్రూఫ్‌ ఎస్‌యూవీ వద్దకు తీసుకెళ్తుండగా ఆయన తన కుడిచేతి పిడికిలిని పైకెత్తి చూపుతూ ‘‘పోరాడతా (ఫైట్‌)’’ అని నినదించారు. తర్వాత ట్రంప్‌ను చికిత్స నిమిత్తం బట్లర్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని రిపబ్లిక్‌ పార్టీ ప్రతినిధులు తెలిపారు. కాగా దుండగుడి కాల్పుల్లో ర్యాలీలో పాల్గొన్న ఓ వ్యక్తి మరణించాడని, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 15 2024, 09:25

ఆర్టీసీ బస్ ఛార్జీలు భారీగా పెంపు: సీఎం సంతకమే ఆలస్యం

KSRTC: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారథ్యంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. కేఎస్ఆర్టీసీ బస్ ఛార్జీలను భారీగా పెంచడానికి అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసింది. నేడో రేపో దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది.

సరిగ్గా నెల రోజుల కిందటే సిద్దరామయ్య ప్రభుత్వం ఇంధన రేట్లను భారీగా పెంచిన విషయం తెలిసిందే. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై వసూలు చేస్తోన్న సేల్స్ ట్యాక్స్‌ను భారీగా వడ్డించింది. లీటర్‌పై 18.44 శాతం అమ్మకం పన్నును 29.84 శాతానికి పెంచింది.

11 శాతం మేర అమ్మకం పన్నును పెంచినట్టయింది. దీనికి కొనసాగింపుగా కేఎస్ఆర్టీసీ బస్ ఛార్జీలను కూడా పెంచడానికి రంగం సిద్ధం చేసింది.

ఈ విషయాన్ని కేఎస్ఆర్టీసీ ఛైర్మన్ ఎస్ ఆర్ శ్రీనివాస్ తెలిపారు. బస్ ఛార్జీలను పెంచకపోతే సంస్థను నడిపించడం కష్టమని తేల్చి చెప్పారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా కష్టతరమౌతుందని స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఏప్రిల్- మే- జూన్ నెలల్లో 295 కోట్ల రూపాయల నష్టాన్ని చవి చూశామని అన్నారు.

బస్ ఛార్జీలను పెంచాలనే నిర్ణయాన్ని తీసుకోవడానికి డీజిల్ రేటు భారీగా పెరగడమే ప్రధాన కారణం. 2019లో లీటర్ ఒక్కింటికి 60 రూపాయలు ఉన్న డీజిల్ ధర ఇప్పుడు 89 రూపాయలకు చేరిందని గుర్తు చేశారు. బస్సుల కొనుగోలు, ఇతర విడిపరికరాల ధరలు సైతం భారీగా పెరిగాయని, ఉద్యోగులకు జీతాలు పెంచాల్సి ఉందని పేర్కొన్నారు. 2020 తరువాత ఆర్టీసీ ఉద్యోగుల జీతాలను పెంచలేదని, ఈ ఏడాది వాటిని సవరించాల్సి ఉందని వివరించారు.

వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఛార్జీలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరామని అన్నారు. ఇప్పుడున్న ఛార్జీలకు అదనంగా 15 నుంచి 20 శాతం మేరకు ఛార్జీలను పెంచాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి తెలియజేశామని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సైతం రూపొందించామని శ్రీనివాస్ తెలిపారు.

ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను యధాతథంగా ఆమోదిస్తుందని చెప్పారు. టికెట్ల పెంపు మహిళలకు కూడా వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఛార్జీల భారం శక్తి పథకం కింద కవర్ అవుతుందని, ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. మహిళలకు ఉద్దేశించిన ఉచిత ప్రయాణంలో ఎలాంటి మార్పూ ఉండబోదని శ్రీనివాస్ భరోసా ఇచ్చారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 13 2024, 19:32

Ponnam Prabhakar: బస్సులను పెంచుతున్నాం... 1,000 బస్సులను కొనుగోలు చేశాం: మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆయా ప్రాంతాలకు బస్సుల సంఖ్యను పెంచుతున్నామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కొత్తగా 1,000 బస్సులను కొనుగోలు చేశామని, మరో 1,500 బస్సులకు ఆర్డర్ ఇచ్చినట్లు చెప్పారు.

నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నల్గొండ-హైదరాబాద్ నాన్‌స్టాప్ ఏసీ, 3 డీలక్స్ బస్సులను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ... దసరా లోపు నల్గొండ జిల్లాకు 30 ఎక్స్‌ప్రెస్, 30 లగ్జరీ బస్సులను ఇస్తామన్నారు.

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులకు 21 శాతం డీఏ ఇచ్చామని గుర్తు చేశారు. రూ.280 కోట్ల బకాయిల్లో రూ.80 కోట్లు చెల్లించినట్లు తెలిపారు.

మిగిలిన రూ.200 కోట్లను నెలాఖరులోగా చెల్లిస్తామని తెలిపారు. ఆర్టీసీలో 3,035 ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు తెలిపారు.

ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి లగ్జరీ బస్సులు నడుపుతామన్నారు. అన్ని జిల్లా కేంద్రాల నుంచి ఏసీ బస్సులు ప్రారంభిస్తామన్నారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. త్వరలో నల్గొండ జిల్లాకు మరిన్ని బస్సులు తెస్తామన్నారు. కొత్త బస్సుల్లో నల్గొండకు 100 కేటాయించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 13 2024, 19:29

ఫీజురీయింబర్స్‌మెంట్స్ ప్రవేశపెట్టిందే కాంగ్రెస్: రేవంత్ రెడ్డి

తొలిసారి పీజు రీయింబర్స్‌మెంట్స్ ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇంజినీరింగ్ కళాశాలలకు సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. జేఎన్టీయూ పరిధిలో కళాశాలల నిర్వాహకులకు ప్రభుత్వ విధానం తెలియాలన్నారు. ప్రభుత్వ విధానాలు అందరికీ తెలిసేలా ప్రస్తుత కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రతి విషయంలో ప్రభుత్వ విధానం చాలా కీలకమన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్సుమెంట్స్ బకాయిలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కళాశాలలు నిరుద్యోగులను తయారు చేసే పరిశ్రమలుగా ఉండకూడదని వ్యాఖ్యానించారు.

అభివృద్ధి చెందుతున్న దేశానికి సివిల్ ఇంజినీరింగ్ అత్యంత అవసరం అన్నారు. కళాశాలల్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులను కచ్చితంగా నిర్వహించాలన్నారు. ఈ కోర్సులు లేకుంటే దేశం ప్రమాదాన్ని ఎదుర్కొంటుందని హెచ్చరించారు

గత ముఖ్యమంత్రుల నిర్ణయాల కారణంగా మనం ఫార్మా, ఐటీ రంగాల్లో ముందున్నామని ప్రశంసించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని కోర్సులు ఉండాలన్నారు.

ఫార్మా, ఐటీ తర్వాత ఏఐ ప్రపంచాన్ని నడిపించబోతోందన్నారు. రాష్ట్రంలోని కళాశాలల్లో ఏఐకి సంబంధించిన కోర్సులను కూడా ప్రవేశపెట్టాలన్నారు. ఇందుకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటుందని హామీ ఇచ్చారు.

త్వరలో స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీలను ఏర్పాటు చేసి అటానమస్ హోదా ఇస్తామన్నారు. పక్క రాష్ట్రాలతో పోటీపడే విధంగా కాకుండా ప్రపంచంతో పోటీ పడేవిధంగా మనం తయారు కావాలని సూచించారు. తమ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోందన్నారు. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 13 2024, 19:26

Telangana Politics: నాడు హీరో అన్నారు.. నేడు జీరో అంటున్నారు..!

లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్‌ఎస్ మరింత బలహీనపడుతూ వస్తోంది. గతంలో కేసీఆర్‌ను హీరో అంటూ ప్రశంసించిన వాళ్లే.. అధికారం పోయే సరికి.. కేసీఆర్ జీరో అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

2019 ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ సంపూర్ణ మెజార్టీ సాధించినప్పటికీ.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసేలా స్కెచ్ వేసి సక్సెస్ అయ్యారు. ఐదేళ్ల తర్వాత బీఆర్‌ఎస్‌ను గద్దెదించి.. ప్రజలు కాంగ్రెస్‌కు అధికారాన్ని అప్పగించారు. గతంలో కేసీఆర్ కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు పెట్టడంతో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రతీకారం తీర్చుకునే పనిలో పడిందనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ మాత్రం తమ ప్రభుత్వ పనితీరు, ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతున్నారని చెబుతున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు

కేసీఆర్ ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్ ఇవ్వరని.. ఆ పార్టీలో నేతలు ఇమడలేకపోతున్నారని.. త్వరలోనే ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. మరో 15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఖాళీ అవుతుందని.. ఆ పార్టీలో మిగిలేది ఇద్దరు నుంచి ముగ్గురు మాత్రమేనన్నారు. దీంతో కాంగ్రెస్ ఇప్పటికే మిగతా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉన్నట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో దానం నాగేందర్ మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ అండతో అక్రమాలకు పాల్పడిన వాళ్లను వదిలిపెట్టబోమని

అందరి పేర్లు బయటకు తీస్తామని హెచ్చరించారు. కొంతమంది పేర్లను సైతం దానం నాగేందర్ బయటపెట్టారు. జైలుకు వెళ్లి వచ్చినోళ్లు కోట్ల రూపాయిలు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. అందరి సంగతి తేలుస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదే దానం నాగేందర్ బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నంతకాలం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈటల రాజేందర్‌ కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసిన సమయంలోనూ గులాబీ బాస్‌కు మద్దతుగా నిలిచారు. బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్‌, పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక ఎమ్మెల్యే సీటును గెల్చుకోలేదు. దీంతో రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో పాటు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో తన బలాన్ని పెంచుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి పక్యా వ్యూహం రచించినట్లు తెలుస్తోంది.

గ్రేటర్ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లోకి తీసుకొస్తే మంత్రి పదవి ఇస్తామంటూ దానం నాగేందర్‌కు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో గ్రేటర్ పరిధిలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చే పూర్తి బాధ్యతల్ని దానం నాగేందర్ తన భుజస్కందాలపై వేసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని గెలవడంతో పాటు..

రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో మేయర్. ఛైర్మన్ పదవులు గెలవడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. ఓ టార్గెట్‌ను ఫిక్స్ చేసి.. బీఆర్‌ఎస్ మొత్తాన్ని ఖాళీ చేయాలనే హస్తం పార్టీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది త్వరలోనే తేలనుంది

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 13 2024, 19:24

Bypolls: కొనసాగుతున్న ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు.. లీడ్‌లో ఇండియా కూటమి అభ్యర్థులు

లోక్ సభ ఎన్నికల సమరం ముగిసినా.. ప్రస్తుతం మరోసారి ఎన్డీయే, ఇండియా కూటమి నేతలు పోటీ పడుతున్నారు.

దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల(Assembly Bypolls) ఫలితాలు మధ్యాహ్నంకల్లా విడుదల కానున్నాయి.

లోక్ సభ ఎన్నికల సమరం ముగిసినా.. ప్రస్తుతం మరోసారి ఎన్డీయే, ఇండియా కూటమి నేతలు పోటీ పడుతున్నారు. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల(Assembly Bypolls) ఫలితాలు మధ్యాహ్నంకల్లా విడుదల కానున్నాయి.

లోక్ సభ ఎన్నికల తరువాత రెండు కూటమిల తొలి పోటీ ఇదే కావడం విశేషం. వెస్ట్ బెంగాల్‌లోని 4, హిమాచల్‌ ప్రదేశ్‌లోని 3, ఉత్తరాఖండ్‌లోని 2, పంజాబ్, మధ్యప్రదేశ్‌, బిహార్‌, తమిళనాడులోని ఒక్కో స్థానానికి జులై 10న ఉప ఎన్నిక జరిగింది

శనివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమైంది. ఈ రాష్ట్రాల్లో నాలుగింటిలో ఇండియా కూటమి అధికారంలో ఉంది. 3 రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి ఉంది.

ఎన్నికల సంఘం (EC) వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం.. ఉదయం 11 గంటలకు11 స్థానాల్లో ఇండియా కూటమికి చెందిన కాంగ్రెస్, ఆప్, టీఎంసీ, డీఎంకే అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా, బిహార్‌లోని రూపౌలీలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) భాగస్వామి జేడీయూ ఆధిక్యతను ప్రదర్శిస్తోంది

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 13 2024, 19:22

మద్యం మత్తు ఖరీదు 3,321 కోట్లు

సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఖజానాను నింపుకోవడానికి రాష్ట్ర ప్రజలను మత్తులో ముంచుతున్నది. మద్యం అమ్మకాల ద్వారా గత ఏడాది కన్నా రూ.11 వేల కోట్లు అధికంగా..

ఈ ఏడాది రూ.45 వేల కోట్ల ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న రేవంత్‌ సర్కార్‌.. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నది.

సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఖజానాను నింపుకోవడానికి రాష్ట్ర ప్రజలను మత్తులో ముంచుతున్నది.

మద్యం అమ్మకాల ద్వారా గత ఏడాది కన్నా రూ.11 వేల కోట్లు అధికంగా..

ఈ ఏడాది రూ.45 వేల కోట్ల ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న రేవంత్‌ సర్కార్‌..

ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నది. ఇందుకు తాజాగా కాగ్‌ వెల్లడించిన గణాంకాలు అద్దం పడుతున్నాయి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 13 2024, 19:18

ఆ ప్రభుత్వంలో అలా, చంద్రబాబు సారధ్యంలో ఇలా - ఎన్వీ రమణ..!!

అమరావతి నగరంలో నూతన ఆధ్యాత్మిక ఒరవడికి శ్రీకారం చుట్టటం శుభసంకేతమని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.

సమాజంలో ఆధ్యాత్మికతతో పాటు సంస్కృతి, ఆచార వ్యవహారాలను కాపాడటం ఎంతో ముఖ్యమని ఎన్వీ రమణ పేర్కొన్నారు.

ఇందులో ఇస్కాన్ సంస్థ ముందుండటంతో పాటు ఎంతోమందికి అన్నదానం కూడా చేస్తోందన్నారు. సీఎం చంద్రబాబుతో కలిసి జస్టిస్ ఎన్వీ రమణ హరే కృష్ణ గోకుల్ క్షేత్రం సందర్శించారు.

దేవాలయాల్లో కూడా రాజకీయాలు చొరబడి, ఆలయాలు నిర్మించకుండా చేసిన ప్రభుత్వాలను మనం చూశామన్నారు. దేవుడు ఉన్నాడు కాబట్టే ఎన్నో అవరాధాలు అధిగమించి గోకుల క్షేత్రం నిర్మాణానికి చంద్రబాబు సారధ్యంలో మార్గం సుగమమైందన్నారు.

సమాజంలో ఆధ్యాత్మికతతో పాటు సంస్కృతి, ఆచార వ్యవహారాలను కాపాడటం ఎంతో ముఖ్యమన్నారు. ఇందులో ఇస్కాన్ సంస్థ ముందుండటంతో పాటు ఎంతోమందికి అన్నదానం కూడా చేస్తోందన్నారు.

రానున్న రోజుల్లో అన్నా క్యాంటీన్లను సీఎం చంద్రబాబు ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించుడటం శుభపరిణామమని ఎన్వీ రమణ పేర్కొన్నారు. అక్షయపాత్ర ద్వారా గతంలో అన్న క్యాంటీన్లకు ఇస్కాన్ సంస్థ ఎంతో తోడ్పాటునిచ్చిందన్నారు.

ఎవరూ అర్థాకలితో ఉండకూడదనే లక్ష్యంతో ఇస్కాన్ సంస్థ ఎంతోమందికి అక్షయపాత్ర ద్వారా అన్నదానం చేస్తోందన్నారు. దేవుడు ఉన్నాడు కాబట్టే ఎన్నో అవరాధాలు అధిగమించి గోకుల క్షేత్రం నిర్మాణానికి చంద్రబాబు సారధ్యంలో మార్గం సుగమమైందని ఎన్వీ రమణ అన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 13 2024, 18:09

22 నిమిషాల్లో.. 21.24 లక్షలు ఫ్రీజ్‌

సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుకుని లక్షల్లో డబ్బు కోల్పోయిన బాధితులకు ఊరట కల్పించే అంశమిది. బాధితులు డబ్బు కోల్పోయిన వెంటనే గోల్డెన్‌ అవర్‌(Golden hour)లో ఎన్‌సీఆర్‌పీ (నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌)లో, లేదా 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేస్తే ఆయా ఖాతాలను పోలీసులు స్తంభింపజేసే అవకాశం ఉంటుంది.

సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుకుని లక్షల్లో డబ్బు కోల్పోయిన బాధితులకు ఊరట కల్పించే అంశమిది. బాధితులు డబ్బు కోల్పోయిన వెంటనే గోల్డెన్‌ అవర్‌(Golden hour)లో ఎన్‌సీఆర్‌పీ (నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌)లో, లేదా 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేస్తే ఆయా ఖాతాలను పోలీసులు స్తంభింపజేసే అవకాశం ఉంటుంది.

తద్వారా డబ్బును వెనక్కి రప్పించే అవకాశం ఉంటుంది. గత మూడు రోజుల్లో జరిగిన మూడు సంఘటనల్లో బాధితులు గోల్డెన్‌ అవర్‌లో స్పందించడం వల్లే సైబర్‌ నేరగాళ్లు కొల్లగొట్టిన రూ. 21.24లక్షలు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఫ్రీజ్‌ చేశారు. పోగొట్టుకున్న డబ్బును రికవరీ చేయడంతో బాధితుల ఆనందానికి అవధుల్లేవు. పూర్తి వివరాలను సైబర్‌ క్రైమ్‌ డీసీపీ కవిత ధార వెల్లడించారు.

ముంబై క్రైమ్‌ బ్రాంచి పోలీసులం అంటూ మాట్లాడి, మనీల్యాండరింగ్‌(Money laundering) కేసులో మీ పాత్ర ఉన్నట్లు తేలిందని, మీ ఖాతా నుంచి అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగాయని నగరానికి చెందిన ఓ వైద్యుడిని బెదిరించి, భయపెట్టిన సైబర్‌ నేరగాళ్లు జూలై-9న రూ. 17,45,0413 కొల్లగొట్టారు. వెంటనే తేరుకున్న డాక్టర్‌.. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎన్‌సీఆర్‌పీలో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన డ్యూటీ ఆఫీసర్‌ ఎండీ జావీద్‌ బాధితుడు కంప్లైంట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం..

డబ్బులు చెల్లించిన బ్యాంకు ఖాతా నుంచి ఆ డబ్బులు ఏ ఖాతాలకు జమయ్యాయో చూసి వెంటనే వాటిని స్తంభింపజేయాలని సంబంధింత బ్యాంకు అధికారులను సూచించారు. దాంతో బ్యాంకు అధికారులు టెక్నికల్‌ ఎవిడెన్స్‌ ఆధారంగా బాధితుడు పోగొట్టుకున్న రూ. 17.45లక్షల డబ్బును కేవలం 22 నిమిషాల్లోనే ఫ్రీజ్‌ చేశారు. డబ్బును ఫ్రీజ్‌ చేసిన విషయం తెలియగానే బాధితుడి ప్రాణం లేచి వచ్చినట్లయింది

మరో కేసులో ఈనెల 11న సైబర్‌ నేరగాళ్ల బారినపడిన నగరవాసి రూ. 3.79 లక్షలు పోగొట్టుకున్నాడు. బాధితుడు వెంటనే ఎన్‌సీఆర్‌పీ పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు. డ్యూటీలో ఉన్న ఆఫీసర్‌ శ్రీకాంత్‌ నాయక్‌ వెంటసే స్పందించి సంబంధిత బ్యాంకు అధికారులను అప్రమత్తం చేశారు. వారి సహకారంతో కేవలం 21 నిమిషాల్లోనే మొత్తం రూ.3.79 లక్షలు ఫ్రీజ్‌ చేశారు.

మరో కేసులో పోలీసులు బాధితుడు పోగొట్టుకున్న రూ.97,312 రికవరీ చేశారు. 11వతేదీ అర్ధరాత్రి నగరానికి చెందిన వ్యక్తి సైబర్‌ నేరం బారినపడి రూ.97,312లు పోగొట్టుకున్నాడు. వెంటనే తేరుకొని రాత్రిపూట హైదరాబాద్‌ సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. డ్యూటీలో ఉన్న ఆఫీసర్‌ బి.సందీప్‌ వెంటనే స్పందించి టెక్నికల్‌ ఎవిడెన్స్‌ ఆధారంగా ఆ డబ్బును రికవరీ చేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 13 2024, 14:19

మోడీ, అమిత్ షా కోసం షర్మిల రాజకీయం

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిన్న వైఎస్ జగన్ ను, వైసీపీని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వైఎస్సార్ సీపీలో వైఎస్సార్ లేరని, వైఎస్సార్ పై పేటెంట్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని చెప్పారు వైఎస్ షర్మిల. ఇదే సమయంలో ఇప్పుడు చంద్రబాబు తల్లికి వందనం , గతంలో జగన్ అమ్మ ఒడి పథకంలో ప్రజలను మోసం చేశారన్నారు.

జగన్ పై షర్మిల వ్యాఖ్యలకు పేర్ని నాని కౌంటర్ జగన్ చెప్పిన అబద్దాలను తాను కూడా నమ్మి ప్రచారం చేశానని, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబును మోసకారి అంటూ వైసీపీ మీడియా రాయటం విడ్డూరం అన్నారు షర్మిల.

వైఎస్ షర్మిల జగన్ ను, వైసీపీని టార్గెట్ చేసి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. అసలు షర్మిల ఎవరి కోసం రాజకీయం చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు.

షర్మిల రాజకీయం ఎవరికోసం? వైయస్‌ఆర్‌ కాంగ్రెస్, టీడీపీ, జనసేన, బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేసే కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న షర్మిల, ఆ పని కాకుండా అదే బీజేపీ కలిసి ఉన్న ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తూ, వారి చర్యలను సమర్థిస్తూ ప్రతిపక్షంలో ఉన్న పార్టీని విమర్శిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు.

అసలు షర్మిల ఎవరి కోసం రాజకీయాలు చేస్తున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఆమె నిజానికి బీజేపీ, టీడీపీ కోసమే రాజకీయాలు చేస్తున్నారన్నారు.

అడిగిన వారి నుండి ఆన్సర్ లేదు .. షర్మిల కు ఎందుకు మోడీ, అమిత్ షాల కోసం పని చేస్తున్నారన్నారు. తాము అడిగే ప్రశ్నలకు కూటమి నేతలు సమాధానం చెప్పాలి కానీ.. అందుకు భిన్నంగా షర్మిల సమాధానం చెబుతున్నారంటే రాజకీయాలు ఏ స్థాయికి దిగజారాయో అర్థం చేసుకోవాలని పేర్ని నాని పేర్కొన్నారు. చంద్రబాబు రాజకీయంలో షర్మిల పావుగా మారిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల గురించి తాము అడుగుతుంటే.. చంద్రబాబు సమాధానం చెప్పడం లేదని.. ఇప్పుడు షర్మిలను ఉసిగొల్పారన్నారు.

చంద్రబాబును కాపాడటం కోసమే షర్మిల కామెంట్స్ మరోవైపు క్షేత్ర పర్యటనలు, శ్వేతపత్రాల విడుదల పేరుతో తప్పుడు లెక్కలు, అసత్యాలు చెబుతున్నారని, ప్రజలను మభ్య పెట్టె ప్రయత్నం చేస్తున్నారని పేర్ని నాని గుర్తు చేశారు. చంద్రబాబు వైఖరి అలా ఉండగా, విమర్శల నుంచి ఆయనను కాపాడడం కోసమే, ఇప్పుడు షర్మిల ముందుకు వచ్చి మాట్లాడుతున్నట్లుగా ఉందని అన్నారు.