/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz India Playing XI: అభిషేక్ శర్మపై వేటు.. జింబాబ్వేతో నాలుగో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే! Raghu ram reddy
India Playing XI: అభిషేక్ శర్మపై వేటు.. జింబాబ్వేతో నాలుగో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

జింబాబ్వే పర్యటనలో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగే నాలుగో టీ20లో ఆతిథ్య జింబాబ్వేతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సిరీస్‌ను ఓటమితో ప్రారంభించిన టీమిండియా... తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించింది. దాంతో 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది.

ఈ సిరీస్ కైవసం చేసుకోవాలంటే నాలుగో టీ20లో విజయం సాధించడం టీమిండియాకు కీలకం. లేకుంటే ఆఖరి మ్యాచ్ వరకు వేచి చూడాల్సి ఉంటుంది. మరోవైపు జింబాబ్వేకు ఈ మ్యాచ్‌ చావోరేవోలాంటిది. సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిందే. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆశసక్తి నెలకొంది.

టీమ్‌ కాంబినేషన్‌లో మార్పులు..

టీ20 ప్రపంచకప్ విజేతలు అందుబాటులోకి రావడంతో మూడో టీ20లో టీమిండియా నాలుగు మార్పులతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. సంజూ శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్‌ తుది జట్టులోకి రాగా.. రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, సాయి సుదర్శన్ ఉద్వాసనకు గురయ్యారు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ముఖేష్ కుమార్‌కు రెస్ట్ ఇచ్చి ఖలీల్ అహ్మద్‌ను ఆడించారు.

నాలుగో టీ20లో కూడా కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది. టాపార్డర్ మొత్తం ఓపెనర్లతో నిండిపోవడంతో జట్టు సమతూకంపై విమర్శలు వస్తున్నాయి. యశస్వి జైస్వాల్ రాకతో అభిషేక్ శర్మ ఫస్ట్ డౌన్‌లో బరిలోకి దిగాడు. ఓపెనర్ అయిన రుతురాజ్ గైక్వాడ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. గత మ్యాచ్‌లో ఓపెనర్‌గా శతక్కొట్టిన అభిషేక్ శర్మ.. ఫస్ట్ డౌన్ బ్యాటర్‌గా మాత్రం నిరాశపరిచాడు.

అభిషేక్ శర్మపై వేటు..?

ఓపెనింగ్ స్లాట్స్ ఖాళీ లేని నేపథ్యంలో అభిషేక్ శర్మపై వేటు వేసి మిడిలార్డర్ బ్యాటర్ అయిన రియాన్ పరాగ్‌ను తుది జట్టులోకి తీసుకునే ఆలోచన వీవీఎస్ లక్ష్మణ్ సారథ్యంలోని టీమిండియా మేనేజ్‌మెంట్ చేయవచ్చు. మూడో టీ20లో టీమిండియా 23 పరుగుల తేడాతో గెలిచినా.. బ్యాటింగ్ విభాగం తడబడినట్లు అనిపించింది.

ఈ క్రమంలోనే టీమ్ కాంబినేషన్‌ను మరింత పటిష్టం చేయాలనే యోచనలో టీమ్‌మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా గత మూడు మ్యాచ్‌లు ఆడిన ఆవేశ్ ఖాన్‌కు ఈ మ్యాచ్‌ నుంచి విశ్రాంతి కల్పించే అవకాశం ఉంది. అతని స్థానంలో ముఖేష్ కుమార్ రీఎంట్రీ ఇవ్వవచ్చు. మిగతా కాంబినేషన్‌లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. అభిషేక్ శర్మను కొనసాగించాలనుకుంటే మాత్రం బ్యాటింగ్ విభాగంలో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు.

జింబాబ్వేతో నాలుగో టీ20.. భారత తుది జట్టుఅంచనా

యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ/రియాన్ పరాగ్, సంజూ శాంసన్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్/ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్.

TGS RTC: ఫ్రెండ్లీ కండక్టర్ అనూపరాణికి సజ్జనార్ అభినందన

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) కు కండక్టర్లు, డ్రైవర్లే బ్రాండ్ అంబాసిడర్లని ఆ సంస్థ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు.

నిబద్ధతతో, అంకితభావంతో విధులు నిర్వర్తించే సిబ్బంది కారణంగానే ఆర్టీసీ రోజూ లక్షలాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చుతోందంటూ ట్వీట్ చేశారు.

రాజేంద్రనగర్ బస్ డిపో కండక్టర్ అనూపరాణిని ప్రశంసిస్తూ సజ్జనార్ ఈ వ్యాఖ్యలు చేశారు.

గడిచిన 24 ఏళ్లుగా ఆర్టీసీ ప్రయాణికులకు నవ్వుతూ, నవ్విస్తూ సేవ చేస్తున్నారంటూ అనూపరాణిని కొనియాడారు.

అనూపరాణిపై ఓ మీడియా సంస్థ ప్రచురించిన కథనాన్ని ఈ ట్వీట్ తో షేర్ చేశారు.

రాజేంద్ర‌నగర్ బస్ డిపోకు చెందిన రాగమల్ల అనూపరాణి ఫ్రెండ్లీ కండక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొన్నారు.

Sb news

కాఫర్‌ డ్యాంల వద్ద.. ఎక్కువ బోర్‌వెల్స్‌ తవ్వొద్దు!

కాఫర్‌ డ్యాంల పటిష్ఠత తెలుసుకోవడం కోసం వాటికి మూడు మీటర్ల దూరంవరకు భారీలోతులో బోర్‌వెల్స్‌ను వేయవద్దని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి అంతర్జాతీయ నిపుణులు సూచించారు. ప్రాజెక్టు నిర్మాణాల సామర్థ్యం, డయాఫ్రం వాల్‌ మరమ్మతులు, కాఫర్‌ డ్యాంలలో సీపేజీ నివారణ మొదలైనవి పరిశీలించి తగు సూచనలు

కాఫర్‌ డ్యాంల పటిష్ఠత తెలుసుకోవడం కోసం వాటికి మూడు మీటర్ల దూరంవరకు భారీలోతులో బోర్‌వెల్స్‌ను వేయవద్దని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి అంతర్జాతీయ నిపుణులు సూచించారు. ప్రాజెక్టు నిర్మాణాల సామర్థ్యం, డయాఫ్రం వాల్‌ మరమ్మతులు, కాఫర్‌ డ్యాంలలో సీపేజీ నివారణ మొదలైనవి పరిశీలించి తగు సూచనలు చేసేందుకు కేంద్ర జలశక్తి శాఖ అమెరికాకు చెందిన ప్రాజెక్టు నిర్మాణ నిపుణులు జియాన్‌ ఫ్రాంకో డి సిక్కో, డేవిడ్‌ బి పాల్‌..

కెనడా నిపుణులు సీన్‌ హించ్‌బెర్గర్‌, రిచర్డ్‌ డొనెల్లీని నియమించిన సంగతి తెలిసిందే. గత నెల 30వ తేదీన పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి వచ్చిన వీరు.. దెబ్బతిన్న కట్టడాలను ఈ నెల మూడో తేదీ దాకా క్షుణ్ణంగా పరిశీలించారు. కేంద్ర, రాష్ట్ర అధికారులతో సమీక్షించారు. ఈ నెల నాలుగో తేదీన తమ దేశాలకు వెళ్లారు. ఈ నెల 8వ తేదీన పీపీఏకి తమ ప్రాథమిక పరిశీలనలను పంపారు. ఆ అభిప్రాయాలను కేంద్ర జల సంఘానికి పీపీఏ పంపింది. వాటిని పరిశీలించిన జలసంఘం.. ఈ సూచనలను పాటించాల్సిందిగా రాష్ట్ర జల వనరుల శాఖకు తెలియజేయాలని బుధవారం పీపీఏని ఆదేశించింది. నిపుణులు తమ ప్రాథమిక నివేదికను ఈ నెల 16వ తేదీన పంపే వీలుందని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 16 తేదీ నాటికి మొదటి ప్రాథమిక నివేదికను పంపేలా ప్రయత్నిస్తామని నిపుణుల కమిటీ పేర్కొంది. ఈ సలహాలు ఆధారంగా కాఫర్‌ డ్యాం మరమ్మతు పనులకు, సీపేజీని తగ్గించేందుకు ప్రాజెక్టు ఇంజనీరింగ్‌ అధికారులు సమాయత్తమవుతున్నారు.

ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల భూమి పొరల్లో పటిష్ఠతను పరిశీలించేందుకు చానల్‌ 250 మీటర్లు, 290 మీటర్లు, 470 మీటర్లు, 550 మీటర్ల వద్ద నాలుగు బోర్‌వెల్స్‌ వేసినట్లుగా గుర్తించాం. ఇవిగాక.. చానల్‌ 870 మీటర్లు, 1000 మీటర్లు, 1100 మీటర్ల వద్ద కూడా లోతైన బోర్‌వెల్స్‌ను వేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు గమనించాం. కాఫర్‌ డ్యాంలకు మూడు మీటర్ల సమీపం వరకు ఎలాంటి గుంతలు తవ్వొద్దు.

కాఫర్‌ డ్యాం వద్ద 17 చొప్పున బోర్‌వెల్స్‌ వేయాలని అధికారులు భావిస్తున్నారు. అయితే పదేసి చొప్పున వేయడమే మేలు. ఈ బోర్‌వెల్స్‌ నుంచి సేకరించిన మట్టి నమూనాలతోనే పటిష్ఠతను తెలుసుకోవచ్చు. ఎగువ కాఫర్‌ డ్యాం వద్ద 3-4 బోర్‌వెల్స్‌కే పరిమితం కావాలి

ఫిజియో మీటర్లను వీలైనన్ని ఎక్కువ ఏర్పాటు చేయాలి. వైబ్రో స్టోన్‌ కాలమ్స్‌ వద్ద వీటిని అమర్చాలి.

కొత్తగా తవ్వాల్సిన పది బోర్‌వెల్స్‌పై ప్రత్యామ్నాయ ప్రణాళికలను జల వనరుల శాఖ అమలు చేయాలి.

బోర్‌వెల్స్‌ తీసిన గోతులు ఎలా పూడ్చాలో మెథడాలజీని తెలియజేస్తాం.

గ్యాప్‌-1 వద్ద వైబ్రో కంపాక్షన్‌ను మల్టీ చానల్‌ అనాలిసిస్‌ ఆఫ్‌ సర్ఫేస్‌ వేవ్స్‌ (ఎంఏఎ్‌సడబ్ల్యూ) విధానంలో చేయాలి.

జియోటెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్స్‌, జియోలాజికల్‌ పరీక్షలు పునఃసమీక్షించాలి.

ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల మధ్య నిలిచిపోయిన సీపేజీ జలాలను గ్రావిటీ ద్వారా నదిలోకి పంపేయాలి. ఇందుకోసం పంపులను అధికంగా వినియోగించాలి. కేంద్ర జల సంఘంతో సంప్రదింపులు జరుపుతూ.. పీపీఏ పర్యవేక్షణలో సీపేజీని తగ్గించే పనులు చేపట్టాలి.

Farmers: ఆదాయపన్ను చెల్లిస్తే ‘మాఫీ’ ఉండదు!

రుణమాఫీ మార్గదర్శకాలపై కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆదాయపు పన్ను చెల్లింపుదారులను, రాజకీయ నాయకులను, ప్రభుత్వ ఉద్యోగులను పథకం నుంచి మినహాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆదాయపు పన్ను చెల్లింపుదారులను, రాజకీయ నాయకులను, ప్రభుత్వ ఉద్యోగులను పథకం నుంచి మినహాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలుచేసే రైతులు, చిరు ఉద్యోగులకు మాత్రం రుణమాఫీ వర్తింపజేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విధివిధానాలు ఖరారుచేసి, ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపారు. ఈ నివేదికలో పలురకాల ప్రతిపాదనలను వ్యవసాయశాఖ అధికారులు పొందుపరిచినట్లు సమాచారం. రాష్ట్రంలో ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారు ఎంతమంది? పన్ను చెల్లించకపోయినా ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్నవారెందరు? అనే వివరాలకోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం విదితమే! ఆ వివరాలు ఢిల్లీ నుంచి వచ్చాయని, ఆ జాబితాను ప్రభుత్వం ముందు వ్యవసాయశాఖ ఉంచినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం- కిసాన్‌ పథకంలో కూడా ఐటీ చెల్లింపుదారులను, రాజకీయ నాయకులను మినహాయించారు.

ఈ క్రమంలో అధిక ఆదాయం ఉండి.. పన్ను చెల్లించేవారికి రుణమాఫీ వర్తింపజేయాల్సిన అవసరంలేదని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. అయితే పిల్లల చదువుల కోసం, ఇంటి నిర్మానం కోసం రుణాలు తీసుకుంటున్న కొందరు రైతులు కూడా ఐటీ రిటర్నులు దాఖలుచేస్తున్నారు. ఇలాంటివారికి రుణమాఫీ వర్తింపజేయాలని భావిస్తున్నట్లు సమాచారం. రాజకీయ నాయకులు, వివిధ పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిఽధులను కూడా రుణమాఫీ పథకం నుంచి మినహాయించే అవకాశాలున్నాయి. పీఎం- కిసాన్‌ పథకంలో కూడా ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, మునిసిపల్‌ చైౖర్మన్లు... తదితర ప్రజాప్రతినిధులకు పెట్టుబడి సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వటంలేదు. అవే మార్గదర్శకాలను రుణమాఫీ పథకానికి వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వ భావిస్తున్నట్లు తెలిసింది. ఇక ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వచ్చేసరికి.. ఎక్కువ జీతం తీసుకునేవారికి రుణమాఫీ వర్తింపజేసే ఉద్దేశం లేదని, అయితే తక్కువ జీతం తీసుకునే చిరు ఉద్యోగులు రైతుల జాబితాలో ఉంటే... వారి వరకు రుణమాఫీ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం. గత ప్రభుత్వాలు రుణమాఫీ పథకం అమలుచేసిన సందర్భంలో ఈ నిబంధన లేదు.

నిర్ణీత గడువు, కటాఫ్‌ అమౌంట్‌ పెట్టుకొని రుణమాఫీ చేశారు. దాంతో కొందరు బడా బాబులు, భూస్వాములకు కూడా రుణమాఫీ పథకం వర్తించింది. అలాంటివారికి ఇప్పుడు రుణమాఫీ వర్తింపజేస్తే...

ప్రజాధనం దుర్వినియోగం చేసినట్లే అవుతుందని, చిన్న, సన్నకారు రైతులు, అర్హులకు రుణమాఫీ చేస్తే నిధులు సద్వినియోగం చేసినట్లు అవుతుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. కాగా రుణమాఫీ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను రెండు రోజుల్లో విడుదలచేస్తామని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తాజాగా ప్రకటించారు.

దీంతో రుణమాఫీ మార్గదర్శకాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ అమలుకు ఆగస్టు-15 డెడ్‌లైన్‌గా పెట్టుకున్న విషయం విదితమే! ఈ రెండు, మూడు రోజుల్లో మార్గదర్శకాలతో కూడా జీవో విడుదలైతే... పథకాన్ని అమలుచేయటానికి ఇంకా నెల రోజులు మాత్రమే ఉంటుంది.

రుణమాఫీకి రూ. 31 వేల కోట్లు అవసరమవుతాయనే అంచనా ఉండగా... రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని నిధులు సమకూర్చింది. మరో రెండు, మూడు వారాల్లో రుణమాఫీకి సరిపడా నిధులు సమకూర్చుకొని రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేయాలని భావిస్తోంది. మరోవైపు ‘నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్‌ సెంటర్‌’(ఎన్‌ఐసీ)లో... బ్యాంకర్లు, పీఏసీఎ్‌సల నుంచి వచ్చిన రైతులు, రైతుకుటుంబాలు, అప్పుల జాబితాను జల్లెడ పడుతున్నారు. రేషన్‌కార్డు, సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా రైతు కుటుంబాలను డిసైడ్‌ చేస్తున్నారు. ఆధార్‌ కార్డుల ఆధారంగా నంబర్లను సరిపోలుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు కుటుంబానికి రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలనే లక్ష్యంతో ఉన్న నేపథ్యంలో ఈ కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం మార్గదర్శకాలపై కసరత్తు పూర్తిచేసేలోపు... ఎన్‌ఐసీలో డేటా ప్రాసెసింగ్‌ ప్రక్రియను పూర్తిచేయనున్నారు.

తెలంగాణాను హెచ్చరించిన వాతావరణ శాఖ

తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్షాలకు సంబంధించి కీలక అప్డేట్ వెల్లడించింది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల కోసం రైతులు ప్రజలు, ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ ఆశించిన మేర వర్షాలు పడకపోవడంతో ఈ సంవత్సరం

రైతాంగానికి సరిపడా నీరు ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మాసంలో అయినా వర్షాలు కురిస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు.

తెలంగాణాలో నేడు వర్షాలు

ఇదిలా ఉంటే నేడు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణ ప్రభావంతో, నైరుతి రుతుపవనాలు బలపడడంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఏపీ తీరం వెంబడి ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో వర్షాలు పడుతున్నాయి.

హైకోర్టులో సజ్జల, ఆర్కే సహా వైసీపీ నేతలకు రిలీఫ్- టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో..!

ఏపీలో గత వైసీపీ పాలనలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసులో వైసీపీ కీలక నేతలకు ఇవాళ భారీ ఊరట లభించింది.

వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై టీడీపీ ఆఫీసుపై దాడి కేసిన కేసులో ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ఈ కేసులో తమను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం పలువురు వైసీపీ నేతల తరఫున దేవినేని అవినాష్ వేసిన పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టు మరోసారి విచారణ చేసింది.

ఈ కేసులో పోలీసుల తరఫున కేఎం కృష్ణారెడ్డి, అవినాష్ తరఫున సినీయర్ న్యాయవాది రవిచందర్ తమ వాదనలు వినిపించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వైసీసీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పైనా ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణా రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, దేవినేని అవినాష్, జోగి రమేశ్ కు ముందస్తు ఈ నెల 16 వరకూ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

16 వరకూ వీరిపై ఎలాంటి దూకుడు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే తదుపరి విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ఆ లోపు వీరికి ఊరట లభించినట్లయింది.

ఆ చెట్లు చాలా డేంజర్..తక్షణమే తొలగించండి..డిప్యూటీ సీఎం పవన్ ఆదేశం

ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యావరణం పై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ ఓ చెట్టు గురించి మాట్లాడుతూ అది చాలా డేంజర్ వెంటనే తొలగించండి అని అధికారులకు సూచించారు.

ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యావరణం పై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ ఓ చెట్టు గురించి మాట్లాడుతూ అది చాలా డేంజర్ వెంటనే తొలగించండి అని అధికారులకు సూచించారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ చెట్టు గురించి ప్రస్తావించారు. ఈ కోనో కార్పస్ చెట్లను గతంలో తన ఫాంహౌస్‌లో పెంచానని పవన్ తెలిపారు.

అయితే వాటితో ప్రమాదం అని తెలిసి తొలగించాను అన్నారు.

కాకినాడలో మొత్తం 4,602 కానో కాన్ఫరస్ చెట్లు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఈ చెట్లను దశల వారీగా తొలగించాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. ఏడాకుల చెట్టు (కోనో కార్పస్) ప్రజల ఆరోగ్యానికి మంచిది కాదంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడంతో వాటిని తొలగించే పనిలో పడ్డారు అధికారులు.

దక్షిణ అమెరికాకు చెందిన కోనో కార్పస్ జాతి మొక్కల్ని సుందరీకరణ కోసం వాడుతున్నారు. వాటి వలన

భూగర్భజలాలు తగ్గపోతాయని, ప్రజల ఆరోగ్యాలకు కూడా ప్రమాదమని ఓ అధ్యయనంలో తేలింది. దీంతో ఉప ముఖ్యమంత్రి ఆదేశాలను అనుసరించి ఏపీలో వాటిని తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది.

Indigo: ఇండిగోకు షాక్.. హైదరాబాద్ దంపతులకు పరిహారం ఇవ్వాలని ఆదేశం..

ఇండిగో ఎయిర్ లైన్స్ షాక్ తగిలింది. 2021లో హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు విమానంలో ప్రయాణించిన సమయంలో హైదరాబాద్‌కు చెందిన దంపతులకు రూ.10,000 పరిహారం చెల్లించాలని ఇండిగో ఎయిర్‌లైన్స్‌ని వినియోగదారుల ఫోరం ఆదేశించింది.

అపరిశుభ్రమైన విమానం కారణంగా ఈ ఫైన్ విధించారు. ఈ విషయాన్ని ఫిర్యాదుదారు డి రాధాకృష్ణ తెలిపారు.

జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్-1 హైదరాబాద్‌లో విమానంలో అపరిశుభ్రతపై రాధాకృష్ణ ఫిర్యాదు చేశారు.

కోచ్‌లో చెత్త, ప్లాస్టిక్ సీసాలు, ఉపయోగించిన నాప్‌కిన్‌లతో నింపారని ఆయన ఆరోపించారు.

విమానంలో అపరిశుభ్రత కారణంగా, తన జీవిత భాగస్వామికి వికారం, వాంతులు వచ్చినట్లు ఆయన తెలిపారు.

మరోవైపు, విమానంలో పరిస్థితుల కారణంగా తన జీవిత భాగస్వామి ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను ఫిర్యాదుదారు గతంలో ఎన్నడూ ప్రస్తావించలేదని ఇండిగో ఆరోపించింది.

Streetbuzz News

గంజాయి జోలికి పోవద్దు

దండం పెట్టి మరీ వేడుకుంటున్నాను. గంజాయి జోలికి పోవద్దు, మన పిల్లల్ని ఆ ఉచ్చులో దించొద్దు. మరీ ముఖ్యంగా గంజాయి సాగు వద్దే వద్దు’ అని మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రజలను కోరారు.

దండం పెట్టి మరీ వేడుకుంటున్నాను. గంజాయి జోలికి పోవద్దు, మన పిల్లల్ని ఆ ఉచ్చులో దించొద్దు.

మరీ ముఖ్యంగా గంజాయి సాగు వద్దే వద్దు’ అని మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రజలను కోరారు. మన్యంలో గంజాయి నిర్మూలనపై బుధవారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో ఏ అరాచకం జరిగినా గంజాయి ప్రభావమే కారణంగా, దానికి మన జిల్లాయే మూలమనే ప్రచారం జరగడం ఆవేదన

కలిగిస్తోందన్నారు. యువత డబ్బు కోసం గంజాయి ఉచ్చులో చిక్కుకోవద్దని, మరీ ముఖ్యంగా గిరిజనులు అసలు గంజాయి సాగు జోలికి వెళ్లొద్దని అభ్యర్థించారు.

ఎవరైనా డబ్బు ఆశచూపి గంజాయి సాగు చేయాలని గిరిజనులను ప్రోత్సహిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

జిల్లాలో గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అందులో భాగంగా వంద రోజుల్లో గంజాయిని నిర్మూలించాలనే ఆలోచనతో సీఎం చంద్రబాబు ఉన్నారని, అందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తున్నారని తెలిపారు.

Telangana ప్రేమించిన యువతి తల్లిదండ్రులను చంపిన ఉన్మాది.. వరంగల్‌ జిల్లాలో దారుణం

Telangana వరంగల్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతి తల్లిదండ్రులను ఓ ఉన్మాది దారుణంగా హత్య చేశాడు. అడ్డొచ్చిన యువతితోపాటు ఆమె సోదరుడిపై కూడా దాడికి తెగబడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం చింతల్‌తండాకు చెందిన బానోతు శివ, సుగుణ దంపతులు. వీరికి ఇద్దరు సంతానం.

కూతురు దీపికను అదే గ్రామానికి చెందిన యువకుడు బన్నీ ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు.

ఈ క్రమంలో గురువారం ఉదయం దీపిక ఇంటికి వచ్చిన బన్నీ తల్వార్‌తో ఆమె తల్లిదండ్రులపై దాడి చేశాడు.

అడ్డొచ్చిన దీపిక, ఆమె సోదరుడిపై కూడా తల్వార్‌తో బన్నీ దాడి చేశాడు. ఈ ఘటనలో బానోతు శివ, సుగుణ అక్కడికక్కడే మృతిచెందారు. దీపిక, ఆమె సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

నిందితుడు బన్నీని అరెస్టు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.