/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz నీట్‌ పరీక్షలో మాల్​ప్రాక్టీస్‌ జరగలేదు'- సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్​ Raghu ram reddy
నీట్‌ పరీక్షలో మాల్​ప్రాక్టీస్‌ జరగలేదు'- సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్​

Centre Additional Affidavit On NEET UG In SC :నీట్‌ యూజీ 2024 పరీక్షలో మాస్​ మాల్​ప్రాక్టీస్‌ జరిగిందనడానికిగానీ, కొన్ని కేంద్రాల్లో విద్యార్థులు లబ్ధి పొందేలా అక్రమాలు జరిగాయనడానికిగానీ ఆధారాలు లేవని కేంద్రం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది.

మద్రాస్‌ ఐఐటీ నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాల డేటా విశ్లేషణలో, మార్కుల పంపిణీలో అసాధారణ అంశాలేవీ కనిపించలేదని పేర్కొంది.

మార్కులు సాధారణంగానే ఉన్నాయని తెలిపింది. 2024-25 సంవత్సరానికిగానూ అండర్ గ్రాడ్యుయేట్ సీట్లకు సంబంధించిన కౌన్సిలింగ్​ ప్రక్రియ

జూలై మూడో వారం నుంచి నాలుగు రౌండ్లలో నిర్వహించనున్నట్లు సుప్రీంకోర్టుకు సమర్పించిన అదనపు అఫిడవిట్‌లో కేంద్రం వెల్లడించింది.

NEET-UG 2024పై గురువారం సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనున్న నేపథ్యంలో కేంద్రం ఈ అఫిడవిట్‌ సమర్పించింది.

High Court: జడ్జి, కుటుంబ సభ్యుల పేర్లు ఎలా వెల్లడిస్తారు?

ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంలో హైకోర్టు జడ్జి, కుటుంబ సభ్యుల పేర్లు, ఫోన్‌ నంబర్లు ప్రచురించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫోన్‌ట్యాపింగ్‌ కేసును రిపోర్టింగ్‌ చేసేటప్పుడు సంయమనం పాటించాలని ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియాకు సూచించింది.

ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంలో హైకోర్టు జడ్జి, కుటుంబ సభ్యుల పేర్లు, ఫోన్‌ నంబర్లు ప్రచురించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫోన్‌ట్యాపింగ్‌ కేసును రిపోర్టింగ్‌ చేసేటప్పుడు సంయమనం పాటించాలని ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియాకు సూచించింది.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నాయకులు, ప్రముఖులు, వ్యాపారులతోపాటు హైకోర్టు జడ్జి ఫోన్‌ను సైతం ట్యాప్‌ చేశారని వచ్చిన వార్తలను హైకోర్టు సూమోటోగా స్వీకరించి, విచారిస్తోంది. ఈ పిటిషన్‌పై సీజే జస్టిస్‌ అలోక్‌ అరాఽధే, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.

ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌ ఆధారంగా పలు పత్రికల్లో హైకోర్టు జడ్జి, వారి కుటుంబసభ్యుల పేర్లు, ఫోన్‌ నంబర్లు ప్రచురితం అయ్యాయి.

దీనిపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని కౌంటర్‌ దాఖలు చేసినందున ప్రస్తుతానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం లేదని.. మీడియా సంయమనం పాటిస్తుందని విశ్వసిస్తున్నామని పేర్కొంది. తదుపరి విచారణ 23కు వాయిదా వేసింది.

రివర్స్‌లో తిరుగుతున్న భూకేంద్రం.. ఏం జరగబోతోంది?

భూమి ఉపరితలం నుంచి కిందకు వెళ్లే కొద్దీ సగటున ప్రతి 32 మీటర్లకు 1 డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుతుంది. అంటే, భూ ఉపరితలంపై ఉష్ణోగ్రత 13 డిగ్రీలు ఉంటే.. భూ కేంద్రం వద్ద ఏకంగా 6 వేల డిగ్రీలు ఉంటుంది. అంటే, ఇది సూర్యుడి ఉపరితలం వద్ద ఉష్ణోగ్రతకు సమానం. భూమిపైకి ప్రవహించే లావా, గీజర్ల ఆధారంగా లోపలి ఉండే ఉష్ణోగ్రతను అంచనా వేశారు. అయితే, కొన్నాళ్లుగా భూ కేంద్ర మండలం వేగం నెమ్మదించింది.

భూమి కూర్పు మనం అనుకున్నదానికంటే చాలా క్లిష్టంగా ఉంటుంది. ఇది నిరంతరం మారుతూ ఉంటుంది. భూ అంతర్భాగాన్ని భూపటలం (క్రస్ట్), భూప్రచారం (మాంటెల్), భూ కేంద్ర మండలం (కోర్) అనే మూడు జోన్లుగా ఖగోళన శాస్త్రవేత్తలు విభజించారు. అయితే, వీటిలో భూకేంద్ర మండలం (Earth Core) స్వతంత్రంగా తిరుగుతున్నట్టు (భ్రమణం) పలు సిద్ధాంతాలు రుజువు చేశాయి. కానీ, ప్రస్తుతం అంతర్గత భూకేంద్ర మండలం వేగం అనూహ్యంగా నెమ్మదించి, అపసవ్య దిశ (రివర్సు)లో

భూ కేంద్ర మండలం అనేది భూమిలో అత్యంత వేడి ప్రదేశం. ఇక్కడ ఉష్ణోగ్రత సూర్యుడి ఉపరితలంతో సమానంగా ఉంటుంది. భూ అంతర్భాగంలో 5,180 కి.మీ. లోతులో ఉండే ఈ ప్రదేశం ఐరన్, నికెల్ వంటి ఖనిజాలతో నిండి ఉంటుంది. లోపలి కోర్ చుట్టూ ద్రవరూప ఖనిజాల బాహ్య కోర్ ఉంటుంది. ఇది భూమికి మిగిలిన భాగాలతో ఒక అవరోధంగా పనిచేస్తుంది. ఈ అవరోధం వేడి లోహపు బంతిని పోలి ఉంటుంది. అయితే, భూకేంద్ర మండలం స్వతంత్ర భ్రమణానికి మిగిలిన గ్రహంతో సమానంగా ఉండాల్సిన అవసరం లేదు. మనం నివసించే భూమి బయట పొరను భూపటలం (Earth Crust) అంటారు. ఈ పొర భూ ఉపరితలంపై 30 నుంచి 100 కి.మీ. మేర విస్తరించి ఉంటుంది. ఇక్కడ అధికంగా ఉండే మూలకం ఆక్సిజన్ (Oxygen).

డెన్మార్క్‌కు చెందిన భూగర్భ శాస్త్రవేత్త ఇంజే లెహ్‌మాన్ 1936లో తొలిసారిగా ఎర్త్ కోర్ అంతర్గత భాగాన్ని గుర్తించారు. అప్పటి నుంచి భూ కేంద్ర మండలం భ్రమణ వేగం, తిరిగే దిశపై చర్చ జరుగుతూనే ఉంది. ఎందుకంటే తమ అభిప్రాయాన్ని నిరూపించడానికి శాస్త్రవేత్తలకు పరిమిత ఆధారాలు ఉండటమే కారణం. భూ అంతర్గత నమూనాలను ప్రత్యక్షంగా పరిశీలించడం లేదా సేకరించడం అసాధ్యం. చాలా పరిశోధనలు, అధ్యయనాలు వేర్వేరు సమయాల్లో కోర్ గుండా వెళ్లే సారూప్య బలాల తరంగాల మధ్య వైవిధ్యాలపై ఆధారపడి ఉంటాయి.

భూమిపై పదేపదే భూకంపాలు, పేలుళ్ల సమయంలో వచ్చిన సీస్మోగ్రామ్‌ల డేటా గత కొన్ని సంవత్సరాలుగా భూమి ఉపరితలంతో పోలిస్తే ఘన అంతర్గత కోర్ భ్రమణ వేగం నిరంతరం క్షీణిస్తున్నట్లు సూచిస్తుంది’ అని జూన్‌లో ప్రచురించిన నేచర్ జర్నల్‌లో ఫలితాల్లో పేర్కొన్నారు. ఈ పరిశోధన భూ భ్రమణ వేగాన్ని ధ్రువీకరించడమే కాకుండా.. కోర్ క్షీణత కొన్ని దశాబ్దాలుగా మందగించినట్టు 2023లో శాస్త్రవేత్తల చేసిన వాదనకు బలాన్ని ఇస్తోంది. గతేడాది ప్రతిపాదించిన మోడల్ భూమి కోర్ భ్రమణ వేగం.. దిశను వివరించింది.

కోర్ అంతర్గత భాగం భూమి క్రస్ట్ కంటే వేగంగా తిరుగుతుందని, కానీ ఇప్పుడు నెమ్మదిగా తిరుగుతోందని ఆ మోడల్ పేర్కొంది. కొంతకాలం కోర్, భూమి భ్రమణం సరిపోలాయి. తరువాత కోర్ భ్రమణ వేగం రివర్స్ దిశలో కదలడం ప్రారంభించిన తర్వాత మరింత తగ్గిందని తెలిపింది. ఇక, భూమి ఉపరితలం నుంచి లోపలికి వెళ్లే కొద్దీ క్రమంగా ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది.

ఆ రైతులకు రుణమాఫీ, రైతు భరోసా పథకాలు. తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వచ్చినా.. రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. లబ్ధిదారుల జాబితా నుంచి ఎక్కడ తొలగిస్తారోనని వారిలో ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ప్రభుత్వం రకరకాల అభ్యంతరాలను లేవనెత్తుతోంది. తాజాగా మంత్రి చేసిన వ్యాఖ్యలు మరింత గందరగోళాన్ని పెంచాయి.

రైతుబంధు పథకాల అమలుకు తెలంగాణ ప్రభుత్వం పక్కా మార్గదర్శకాలు రూపొందిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి ప్రకటన చేస్తుందో రైతులు నిశితంగా గమనిస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్ శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి ఏం మాట్లాడారోనని రైతులు చూస్తున్నారు. అయితే పంట నమోదు ప్రక్రియను తప్పనిసరి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రైతులకు భరోసా, పంటల బీమాతోపాటు మార్కెటింగ్‌ ప్రణాళికకు పంట నమోదు ప్రక్రియే ప్రాతిపదిక అని స్పష్టం చేశారు.

తుమ్మల మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో తొలి ప్రాధాన్యతనిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 50,000 నుండి రూ. వచ్చే 3 నెలల్లో రైతులకు 60,000 కోట్లు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా, రైతుబీమా పథకాలను 3 నెలల్లో అమలు చేస్తామన్నారు. అంటే సెప్టెంబరు నెలాఖరులోగా రుణమాఫీతోపాటు రైతు భరోసా అమలులోకి వస్తుందని ఆశించవచ్చు.

వాస్తవానికి రైతుబీమాలో కొత్త క్లెయిమ్‌లు పెడితే.. ఇప్పటికే 1222 క్లెయిమ్‌లు.. ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ప్రస్తుతం తెలంగాణలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. దీంతో రైతులు పంటలు నష్టపోతామనే భయంతో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు పంటలకు రైతు బీమాను త్వరగా అమలు చేయాలి. కానీ, ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇచ్చినా, పంట నష్టపోయినప్పుడు క్లెయిమ్ డబ్బులు చెల్లించడం లేదు. ఎందుకంటే పాత క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని పరిష్కరిస్తేనే కొత్త వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చు. దీనిపై మంత్రి స్వయంగా ఆందోళన వ్యక్తం చేశారు.

మొత్తానికి నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో ఓ కీలక అంశం చోటు చేసుకుంది. పంటలను అధికారులు నమోదు చేస్తే ఆ పంటల రైతులకు మాత్రమే రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలు అందుతాయి. రైతులు తమ పంటలను అధికారుల వద్ద నమోదు చేయకుంటే.. అధికారులు ఆ పంటలను ఉన్న పంటలుగా లెక్కించడం లేదు. దాంతో పాటు.. వారికి రుణమాఫీ, రైతుబీమా, పంటల బీమా, రైతుబీమా తదితరాలు వర్తిస్తాయి. కావున రైతులు, అధికారులు దీనిపై దృష్టి సారించాలి. అధికారులు రిజిస్ట్రేషన్ కోసం వస్తే వెంటనే పంట వివరాలు చెప్పాలన్నారు.

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పంటలు, భూములకు సంబంధించి సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వే ఆధారంగానే రైతు భరోసా అమలు చేస్తామన్నారు. సర్వేకు వచ్చే అధికారులు.. రైతులను సముదాయించి వారికి ఎంత భూమి ఉంది, ఏ పంటలు వేశారు. మీరు ఎన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నావు అని కూడా అడుగుతారు. అధికారులు అడిగే ప్రశ్నలకు రైతులు సవివరంగా సమాధానమిచ్చి తమ పంటల నమోదు చేయించుకోవాలి. దీని నుండి అన్ని ప్రణాళికలను పొందవచ్చు.

కేంద్రసాయమే ఆంధ్రప్రదేశ్‌కి ఆక్సిజన్!

ఆర్థిక సంక్షోభం నుంచి ఆంధ్రప్రదేశ్‌ను గట్టెక్కించడం కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ నూతన ప్రభుత్వాలకు పెను సవాలే. విభజన నష్టం నుంచి కోలుకోకుండానే జగన్‌రెడ్డి ఆర్థిక అరాచకత్వం ఏపీని ఆర్థిక సంక్షోభంలోకి...

ఆర్థిక సంక్షోభం నుంచి ఆంధ్రప్రదేశ్‌ను గట్టెక్కించడం కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ నూతన ప్రభుత్వాలకు పెను సవాలే. విభజన నష్టం నుంచి కోలుకోకుండానే జగన్‌రెడ్డి ఆర్థిక అరాచకత్వం ఏపీని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. రూ.13లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి రాష్ట్రం దిగజారింది. ప్రతి ఏటా రూ.40వేల కోట్లకు పైగా అసలు, వడ్డీ చెల్లింపులకే వెచ్చించాల్సిన దుస్థితి. ఇప్పుడీ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే రాష్ట్ర ప్రభుత్వ దీక్షాదక్షతలతో పాటు, కేంద్ర ప్రభుత్వ తోడ్పాటు అవశ్యం. బిహార్ రాష్ట్ర శాసనసభ ప్రత్యేకహోదా తీర్మానం నేపథ్యంలో మళ్లీ ప్రత్యేక హోదా ప్రతిపత్తి చర్చనీయాంశమైంది. దేశంలోని 29 రాష్ట్రాలలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ప్రతిపత్తి ఉంది

మరో 5 రాష్ట్రాలలో (బిహార్, ఏపీ, రాజస్థాన్, గోవా, ఒడిశా) ప్రత్యేక హోదా డిమాండ్ ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్రతిపత్తి హోదా 5 ఏళ్లపాటు ఇస్తామన్నది 20 సెప్టెంబర్, 2013న రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన 6 హామీల్లో ఒకటి. ప్రస్తుతం ఆ హోదా ఉన్న రాష్ట్రాల్లో కూడా కేంద్ర ప్రాయోజిత పథకాల (సిఎస్ఎస్)కే ఇది పరిమితమైంది, ఆయా రాష్ట్రాలకు 90శాతం గ్రాంట్లుగా, 10శాతం రుణంగా కేంద్రం నుంచి అందుతాయి. కొత్త పరిశ్రమలను నెలకొల్పే కంపెనీలకు ఆదాయపన్ను మినహాయింపులు, ఎక్సైజ్ డ్యూటీ రాయితీలు లభిస్తాయి.

ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలవాల్సిన బాధ్యత ఉంది. రాష్ట్ర పునర్విభజన కారణంగా అత్యధిక రాబడినిచ్చే హైదరాబాద్, రంగారెడ్డి రెండు జిల్లాలు తెలంగాణకు పోయిన దరిమిలా ఏపీ కుదేలైంది. రూ.12వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోవడమే కాకుండా, రూ.60వేల కోట్ల ఖర్చులు, వారసత్వ రుణంగా రూ.90వేల కోట్లు సంక్రమించాయి. దీన్ని అధిగమించడానికే ఏపీకి ఐదేళ్ల ప్రత్యేక హోదా హామీ. కానీ వైవి రెడ్డి నేతృత్వంలోని 14వ ఆర్థిక సంఘం సిఫారసులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం దరిమిలా ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయంగా పేర్కొంటూ, దాని స్థానంలో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు

స్పెషల్ కేటగిరీ స్టేటస్‌తో వచ్చే లబ్ధిని స్పెషల్ అసిస్టెన్స్ రూపంలో అందిస్తామని చెప్పడం విదితమే. అయితే అనంతర పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, కేంద్రం నుంచి నిధులు రాబట్టడంపై ఆసక్తి కన్నా సీబీఐ, ఈడీ కేసుల నుంచి బైటపడటంపైనే పూర్తి దృష్టి కేటాయించిన కారణంగా ఆంధ్రప్రదేశ్ అన్నివిధాలా నష్టపోయింది. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ రూపంలో రాష్ట్రాలకు అదనపు నిధులు ఇచ్చినా అక్కడితో సమస్యలు పరిష్కారం అవుతాయా అనేది సందేహాస్పదమే. బడ్జెట్ కేటాయింపుల సమర్ధ వినియోగం ఇక్కడ కీలకమైంది. ఉత్పాదక వ్యయం పెరగాలి, అనుత్పాదక వ్యయం తగ్గాలి, దుబారా వ్యయాన్ని అరికట్టాలి,

శాసనసభ ఆమోదం లేకుండా నిధుల వ్యయానికి అడ్డుకట్ట వేయాలి. కేంద్రం నుంచి అదనపు నిధులు రాబట్టడం ఒక ఎత్తయితే, రాష్ట్రంలో బడ్జెట్ కేటాయింపులను సమర్థంగా వెచ్చించడం మరో ఎత్తు. ఏపీలో గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల వ్యయంలో ఘోరంగా విఫలమైంది. కేంద్రం ఇచ్చే నిధులను భారీఎత్తున దారి మళ్లించింది. ఫలితంగా తర్వాత సంవత్సరాల్లో ఆయా పథకాలకు నిధుల్లో కోత పడిందంటే రాష్ట్ర పాలకుల వైఫల్యమే.

2023 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపుల్లో రూ.92,567కోట్లు ఖర్చు చేయలేకపోయారు. వైద్య, ఆరోగ్య రంగంలోనే రూ.6,576కోట్లు, పట్టణాభివృద్ధి రంగాల్లో రూ.4,655కోట్లు, సాంఘిక సంక్షేమంలో రూ.5,254కోట్లు, వెనుకబడిన వర్గాల సంక్షేమంలో రూ.16,360కోట్లు, నీటిపారుదల శాఖలో రూ.9,034కోట్లు ఖర్చు చేయలేదు. ఈ నిధులన్నీ సమర్థంగా వినియోగిస్తే అసలు ప్రత్యేక హోదా ప్రతిపత్తి అవసరమే లేదని కాగ్ మాజీ డీజీ గోవింద భట్టాఛార్జీ పేర్కొనడం విశేషం. రాష్ట్రంలో ఈ దుస్థితిని చక్కదిద్దకుండా ఒకవేళ అదనపు నిధులిచ్చినా అవీ నిరర్ధకమేనని ఆయన చేసిన వ్యాఖ్యలు గమనార్హం.

అవీ నిరర్ధకమేనని ఆయన చేసిన వ్యాఖ్యలు గమనార్హం. ప్రత్యేకహోదా తెస్తానన్న జగన్మోహన్‌రెడ్డి దాని కోసం కనీస ప్రయత్నం చేయలేదు. దానికి ప్రత్యామ్నాయంగా కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజి ఆర్థికసాయం రాబట్టేందుకూ కృషి చేయలేదు. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీములలో రాష్ట్ర వాటా తెచ్చుకోవడంలో గాని, డివల్యూషన్ పన్నులు 42శాతం నుంచి 41శాతంకు తగ్గినా అడిగిన పాపాన పోలేదు.. సెంట్రల్ పూల్ ఫండ్స్‌లో ఒక శాతం కోతపడ్డా చీమ కుట్టినట్లు లేదు. రెండంకెల వృద్ధిరేటు సింగిల్ డిజిట్‌కు పడిపోవడమే కాదు, తిరోగమన వృద్ధి నమోదైంది. తలసరి ఆదాయం పూర్తిగా క్షీణించింది, అనుత్పాదక వ్యయం పెరిగింది. జగన్ నిర్వాకాల కారణంగా ఏపీ రూ.13లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది.

కేంద్ర పథకాల నిధులను నిర్దేశిత లక్ష్యాల కోసం కాకుండా పెద్దఎత్తున దారి మళ్లించారు. పట్టణాభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులు రూ.13,788కోట్లు ఖర్చు చేయలేకపోయారు. తాగునీటి ప్రాజెక్టులకు ఏఐఐబీ ఇచ్చిన రూ.5,350కోట్లలో గత ఐదేళ్లలో రూ.430కోట్లు కూడా ఖర్చు చేయలేదు. అమృత్ 2వ దశలో రూ.8,078కోట్లకు రూ.360కోట్లే ఖర్చు చేశారు, తొలి దశలోనూ రూ.1000 కోట్లకు పైగా ఖర్చు చేయలేదు. ఎన్‌హెచ్‌ఎం నిధులు రూ.500కోట్లు పక్కదారి పట్టించడం వల్ల తర్వాత ఏళ్లలో రూ.1500కోట్ల నిధులను రాష్ట్రం కోల్పోయింది. నరేగా, నాబార్డు, సిఎస్‌ఎస్, ప్రపంచబ్యాంకు నిధులను దారి మళ్లించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనుల్లో రూ.628కోట్లు ఆదా చేశానని చెప్పి రూ.68వేల కోట్ల నష్టం చేశారు.

జలవనరుల శాఖలో పెండింగ్ బిల్లులే రూ.26వేల కోట్లు ఉన్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులకే రూ.11వేల కోట్లు, ఇతర బిల్లులు రూ.15వేల కోట్లు. రైతులకు ధాన్యం బకాయిలు రూ.1659 కోట్లు పేరబెట్టారు. ఐదేళ్లలో సివిల్ సప్లయిస్ కార్పొరేషన్‌ను రూ.36,300 కోట్ల అప్పుల్లో ముంచేశారు. రాజధాని అమరావతిలో పనులన్నీ ఆపేసి విధ్వంసం సృష్టించారు. రాజధానిలో మౌలిక వసతులకు రూ.50వేల కోట్లు ఖర్చుచేస్తే, పన్నుల రూపంలో రూ.20–30వేల కోట్ల ఆదాయం వచ్చేది. ప్రభుత్వం వద్ద మిగిలే 8వేల ఎకరాలకు అప్పట్లోనే రూ.80వేల కోట్ల విలువ ఉంది, అభివృద్ధి చేస్తే ఇప్పటికే రూ.1,60,000కోట్ల సంపద ఉండేది. అమరావతిలో గత ప్రభుత్వం స్థలాలిచ్చిన 132 సంస్థలను తేవడంలో విఫలమయ్యారు. రూ.57కోట్లు లాభం వచ్చే హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టును రూ.164కోట్ల నష్టంలోకి నెట్టారు. వీటన్నింటినీ చక్కదిద్దాల్సిన బాధ్యత, గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్లీ ట్రాక్‌లో పెట్టాల్సిన కర్తవ్యం నూతన ప్రభుత్వంపై ఉంది.

ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక తన తొలి ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీకి ఇచ్చిన వినతిలో 7 ముఖ్యాంశాలపై కేంద్రం సహాయ సహకారాలు అందించాలి. స్వల్పకాలానికి రాష్ట్రానికి ఆర్థికచేయూతనివ్వడం, పోలవరం ప్రాజెక్టు పనుల పునఃప్రారంభానికి సత్వర చర్యలు, రాజధాని అమరావతిలో మౌలిక వసతులు, ప్రభుత్వ భవనాల పూర్తికి సాయం చేయాలి. పారిశ్రామికాభివృద్ధికి ప్రోత్సాహకాలు, రాష్ట్రాలకు మూలధన వ్యయం అందించే ప్రత్యేక పథకాల కింద అదనపు కేటాయింపులిచ్చి రోడ్లు, వంతెనలు, తాగునీటి, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి. బుందేల్ ఖండ్ ప్యాకేజీ తరహాలో వెనుకబడిన ప్రాంతాలకు మద్దతు, దుగరాజపట్నం పోర్టు పూర్తికి చేయూతనివ్వాలి.

విభజన చట్టంలోని అంశాలను అమలు చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక తోడ్పాటునివ్వాలి... అది ప్రత్యేక హోదా రూపంలోనా, ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ రూపంలోనా పేరేదైనా సత్వర సాయం–సమర్థ వినియోగం అవశ్యం.

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌ను గట్టెక్కించాలంటే దిగువ పేర్కొన్న 15సూత్రాలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని నూతన సీఎం చంద్రబాబుకు లేఖలో విజ్ఞప్తి చేశాం. పన్ను రాబడులను క్రమబద్ధీకరించాలి. డివల్యూషన్ కింద కేంద్రం నుంచి వచ్చే పన్ను రాబడి 41శాతం లేదా 42శాతం ఉండేలా చూడాలి. తెచ్చే రుణాల్లో సహేతుకత, స్థిరత్వం ఉండాలి. కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులు మరిన్ని సాధించాలి. వేజ్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్ కింద తెచ్చేవి జాగ్రత్తగా వాడాలి. రెవిన్యూ ఖర్చులు సాధ్యమైనంత తగ్గించాలి

అర్హులైన వారికే ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేరాలి. మూలధన వ్యయంలో కోతల్లేకుండా చూడాలి. పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీని చేయాలి, ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపర్చాలి. ప్రభుత్వానికి రాబడి పెంచే సహజవనరులను పరిరక్షించాలి. గత ఐదేళ్లలో వైసీపీ నేతలు కొల్లగొట్టిన సంపదను రెవిన్యూ రికవరీ యాక్ట్ కింద రాబట్టాలి. ఎఫ్‌ఆర్‌బీఎం యాక్ట్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆర్థికలోటు, ద్రవ్యలోటు, రెవిన్యూలోటు నియంత్రించాలి. సీఎఫ్‌ఎంఎస్ ద్వారానే అన్ని చెల్లింపులు జరిగేలా చూడాలి. అవినీతికి పూర్తిగా అడ్డుకట్ట వేయాలి.

రైతులకు కావాల్సింది ఇది కదా.. నానో ట్రాక్టర్ ను తయారు చేసిన యువకుడు

రైతులకు గుడ్ న్యూస్. తక్కువ ఖర్చుతో నానో ట్రాక్టర్ ను అందుబాటులోకి తీసుకొచ్చాడు ఓ యువకుడు. ఇది రైతులకు అన్ని రకాల వ్యవసాయ పనుల్లో ఉపయోగపడనున్నది.

వ్యవసాయంలో యంత్ర పరికరాల వినియోగం నానాటికి పెరుగుతున్నది. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక కొత్త కొత్త పరికరాలు పుట్టుకొస్తున్నాయి. దుక్కి దున్నే దగ్గర్నుంచి మొదలుకుని పంట చేతికి వచ్చేంత వరకు మెషిన్లతోనే పనులు కానిస్తున్నారు. అయితే ఈ యంత్ర పరికరాల ధరలు లక్షల్లో ఉండడంతో రైతులు కొనలేని పరిస్థితి నెలకొన్నది. ట్రాక్టర్లు, వరికోత మెషిన్లు ఇంకా ఇతర యంత్ర పరికరాలను కిరాయికి తెచ్చుకుని వ్యవసాయ పనులను చేసుకుంటున్నారు.

ఇదంతా రైతులకు తలకుమించిన భారం అవుతున్నది. ఈ నేపథ్యంలో ఓ యువకుడు వినూత్నమైన ఆవిష్కరణకు తెరలేపాడు. రైతుల కోసం నానో ట్రాక్టర్ ను రూపొందించాడు. ఇది రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నది.

మెకానిక్ పనులు చేసే బ్రహ్మచారి అనే యువకుడు తనకున్న నైపుణ్యంతో నానో ట్రాక్టర్ ను రూపొందించాడు. చేనేత వృత్తి కార్మికుల కష్టాలను తీర్చేందుకు చింతకింది మల్లేశం ఆసు యంత్రాన్ని కనుగొన్న విషయం తెలిసిందే. ఇదే రీతిలో ఇప్పుడు బ్రహ్మచారి కూడా ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి నానో ట్రాక్టర్ ను రూపొందించారు. ఇది చిన్న, సన్నకారు రైతులకు ఎంతగానో ఉపయోగపడనున్నది. ఏ మాత్రం డ్రైవింగ్ అనుభవం లేని రైతు కూడా దీన్ని నడపొచ్చు. అంతర పంటల సాగుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ట్రాక్టర్ టన్ను బరువు వరకు లాగ గలదు. దీనికి డైనమో కూడా బిగించుకోవచ్చు.

ఈ ట్రాక్టర్ తయారు చేయడానికి లక్షా 40వేల రూపాయలు ఖర్చయింది. ఈ ట్రాక్టర్ నడవాలంటే గంటకు లీటర్ డీజిల్ కావాలి. గంటకు 10 నుండి 15 కిలోమీటర్ల స్పీడుతో దూసుకెళ్తుంది. దీనికి ఐదు గేర్లు ఉంటాయి. స్టీరింగ్ దగ్గరే బ్రేక్, గేర్ లు ఉంటాయి. మొత్తం చేతులతోనే ఆపరేట్ చెయ్యొచ్చు.

త్వరలోనే దీనికి హైడ్రాలిక్ సిస్టమ్​ ను కూడా జోడిస్తానంటున్నాడు చారి. అన్ని రకాల వ్యవసాయ పనులకు ఈ నానో ట్రాక్టర్ ఉపయోగకరంగా ఉండనున్నది. మెదట్లో ఒక్క గేరుతో నడిచే నానో ట్రాక్టర్​ తయారు చేశానని. అప్పుడు 75వేల రూపాయలు ఖర్చైందని బ్రహ్మచారి తెలిపారు. దీని వాడకంతో ఖర్చుకూడా తక్కువగా అవుతుండడంతో రైతులకు ఆర్థిక భారం తప్పినట్లు అవుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Adani vs Birla : అదానీ వర్సెస్‌ బిర్లా

దేశీయ సిమెంట్‌ రంగంలో గడిచిన కొన్నేళ్లలో కొనుగోళ్లు, టేకోవర్ల ట్రెండ్‌ ఊపందుకుంది. ముఖ్యంగా దక్షిణాదిలో కొనుగోళ్ల విషయంలో ప్రధానంగా రెండు కంపెనీల మధ్యనే పోటీ నడుస్తోంది. ఒకటి గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ సిమెంట్స్‌. మరొకటి కుమార మంగళం బిర్లాకు చెందిన అలా్ట్రటెక్‌ సిమెంట్‌. వ్యాపార విస్తరణతోపాటు

దేశీయ సిమెంట్‌ రంగంలో గడిచిన కొన్నేళ్లలో కొనుగోళ్లు, టేకోవర్ల ట్రెండ్‌ ఊపందుకుంది. ముఖ్యంగా దక్షిణాదిలో కొనుగోళ్ల విషయంలో ప్రధానంగా రెండు కంపెనీల మధ్యనే పోటీ నడుస్తోంది. ఒకటి గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ సిమెంట్స్‌. మరొకటి కుమార మంగళం బిర్లాకు చెందిన అలా్ట్రటెక్‌ సిమెంట్‌. వ్యాపార విస్తరణతోపాటు మార్కెట్‌పై పట్టుకోసం ఇరు వర్గాలు పోటాపోటీగా దక్షిణాదిలోని సిమెంట్‌ కంపెనీలను కొనుగోలు చేస్తున్నాయి. అలా్ట్రటెక్‌ ఈ మధ్యనే ఇండియా సిమెంట్స్‌లో 23 శాతం వాటాను రూ.1,900 కోట్లకు కొనుగోలు చేయగా..

అంతకు కొన్ని వారాల క్రితం అదానీ సిమెంట్‌లో భాగమైన అంబుజా సిమెంట్‌.. హైదరాబాద్‌కు చెందిన పెన్నా సిమెంట్‌లో 100 శాతం వాటాను రూ.10,420 కోట్లకు చేజిక్కించుకుంది. అంతకంటే ముందే అలా్ట్రటెక్‌.. బీకే బిర్లా గ్రూప్‌నకు చెందిన కేశోరామ్‌ సిమెంట్‌ను హస్తగతం చేసుకుంది. బిర్లాకు చెందిన అలా్ట్రటెక్‌ దేశంలోనే అతిపెద్ద సిమెంట్‌ కంపెనీగా ఉంది. కాగా, స్విట్జర్లాండ్‌కు చెందిన సిమెంట్‌ దిగ్గజం హోల్సిమ్‌ నుంచి అంబుజా సిమెంట్స్‌, ఏసీసీలో మెజారిటీ వాటాను 1,050 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయడం ద్వారా 2022లో అదానీ గ్రూప్‌ సిమెంట్‌ తయారీ రంగంలోకి ప్రవేశించింది.

తద్వారా దేశంలో రెండో అతిపెద్ద సిమెంట్‌ కంపెనీగా అవతరించింది. అప్పటి నుంచే మార్కెట్‌లో అగ్రస్థానం కోసం బిర్లా, అదానీ మధ్య పోటీ ప్రారంభమైంది. అది సిమెంట్‌ రంగంలో కొనుగోళ్లు, విలీనాల ట్రెండ్‌కు బాటలు వేసింది. ఉత్పత్తి సామర్థ్యంతోపాటు మార్కెట్‌ వాటా పెంపు కోసం ఈ రెండు కంపెనీలు వ్యూహాత్మక కొనుగోళ్లకు పాల్పడుతున్నాయని మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొన్నారు.

ఓరియంట్‌ సిమెంట్‌పై బిర్లా కన్ను: కుమార మంగళం బిర్లా తన బంధువైన సీకే బిర్లాకు చెందిన ఓరియంట్‌ సిమెంట్‌ను సైతం కొనుగోలు చేసేందుకు చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. దక్షిణ, పశ్చిమ భారత మార్కెట్లపై ముఖ్యంగా తెలంగాణ, మహారాష్ట్రలో మరింత పట్టుసాధించేందుకు అలా్ట్రటెక్‌కు ఈ డీల్‌ దోహదపడనుంది. ఓరియంట్‌ సిమెంట్‌కు ఒక్కో షేరుకు రూ.350-375 వరకు చెల్లించేందుకు అలా్ట్రటెక్‌ ముందుకొచ్చిందని, ఈ లెక్కన ఓరియంట్‌ మార్కెట్‌ విలువ రూ.7,300-7,800 కోట్లవుతుందని ఓ ఆంగ్ల దినపత్రిక కథనం పేర్కొంది.

శరవేగంగా దిగువ కాఫర్‌ డ్యాం స్లూయిజ్‌ పనులు

పోలవరం ప్రాజెక్టు దిగువ కాఫర్‌ డ్యాం స్లూయిజ్‌ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి

పోలవరం ప్రాజెక్టు దిగువ కాఫర్‌ డ్యాం స్లూయిజ్‌ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి.

రాష్ట్ర భారీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇటీవల పోలవరం ప్రాజెక్టును పరిశీలించి దిగువ కాఫర్‌ డ్యాం వద్ద సీపేజీ జలాలు బయటకు పంపేందుకు నిర్మిస్తున్న స్లూయిజ్‌ పనులను వేగవంతం చేయాలని, వరద ఉధృతి పెరగక మునుపే పూర్తిచేసి గోదావరి జలాలు కాఫర్‌ డ్యాంల మధ్యకు చేరుకోనివ్వకుండా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్‌ అధికారులకు సూచించారు. దీంతో స్లూయిజ్‌ నిర్మాణం పనులు వేగవంతం చేసినట్లు ఈఈ పాండురంగయ్య శనివారం తెలిపారు.

కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అప్రూవల్స్‌ మేరకు పనులు ప్రారంభించామని.. రానున్న రెండ్రోజుల్లో స్లూయిజ్‌ గేట్ల అమరిక పనులు పూర్తవుతాయని, గోదావరి జలాలు కాఫర్‌ డ్యాంల మధ్యకు వచ్చే అవకాశాలు లేవని చెప్పారు. సీపేజీ జలాలను బయటకు పంపడానికి ఏడాది క్రితం ప్రారంభించిన స్లూయిజ్‌ పనులు నత్తనడకన నడిచాయి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన తర్వాత పనులు ఊపందుకుని అప్పుడే గేట్లు బిగించే వరకూ వచ్చింది.

రెండ్రోజుల్లో ఇది పూర్తయితే స్పిల్‌వే బ్యాక్‌ వాటర్‌.. కాఫర్‌ డ్యాంలోకి రాకుండా నివారించవచ్చు, డీవాటరింగ్‌ ద్వారా కాఫర్‌ డ్యాం నడుమ సీపేజీ జలాలను తొలగించవచ్చని.. తద్వారా ఎర్త్‌కం రాక్‌ఫిల్‌ డ్యాం, డయాఫ్రం వాల్‌ పనులకు ఎలాంటి ఆటకం ఉండదని ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు.

Hyderabad: నైనీలో బొగ్గు తవ్వకాలకు లైన్‌క్లియర్‌..

ఒడిసాలోని అంగుల్‌ జిల్లాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైనీ బొగ్గు గనిలో తవ్వకాలకు మార్గం సుగమమైంది. కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో స్పందించిన ఒడిసా సర్కారు ఇటీవల అటవీ అనుమతులు మంజూరు చేసింది.

ఒడిసాలోని అంగుల్‌ జిల్లాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైనీ బొగ్గు గనిలో తవ్వకాలకు మార్గం సుగమమైంది. కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో స్పందించిన ఒడిసా సర్కారు ఇటీవల అటవీ అనుమతులు మంజూరు చేసింది. దీంతో త్వరలో అటవీ భూముల బదిలీ జరగనుంది.

నిజానికి, నైనీ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలు 2022 అక్టోబరులోనే అటవీ అనుమతులు ఇచ్చాయి. కానీ, వన్యప్రాణుల నిర్వహణ ప్రణాళిక(వైల్డ్‌ లైఫ్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌)ను వైల్డ్‌ లైఫ్‌ ఇనిస్టిట్యూట్‌ సిద్ధం చేయకపోవడంతో ఒడిసా ప్రభుత్వం ఇన్నాళ్లూ ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో అంగీకారం తెలపలేదు. దీంతో భూముల బదిలీ జరగలేదు

ఈ అంశమై బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఒడిసా అధికారులతో పలుమార్లు స్వయంగా సమావేశమయ్యారు. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశాయి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా కేంద్ర బొగ్గు, గనుల శాఖకు విజ్ఞప్తి చేశారు.

దీంతో ఒడిసా సీఎంతో మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సమస్య పరిష్కారమయ్యేలా చేశారు. ఆటంకాలు తొలగిపోయిన నేపథ్యంలో నైనీ కోల్‌ బ్లాక్‌కు సంబంధించిన అటవీ భూముల బదిలీ, ఇతర అనుమతుల విషయంలో ఒడిసా ప్రభుత్వాధికారులను సింగరేణి సీఎండీ, డైరెక్టర్లు కలిశారు. వీలైనంత త్వరగా అటవీ భూమి బదలాయింపు చేయాలని కోరారు.

Engineering Colleges: 4వేలకు పైగా సీఎస్‌ఈ సీట్లు..

కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ (సీఎ్‌సఈ), సీఎ్‌సఈ అనుబంధ కోర్సుల్లో గతేడాదికన్నా 4,500 సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ (సీఎ్‌సఈ), సీఎ్‌సఈ అనుబంధ కోర్సుల్లో గతేడాదికన్నా 4,500 సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కోర్‌ బ్రాంచ్‌లు అయిన సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, మెటలర్జీ వంటి ఇంజనీరింగ్‌ కోర్సులను నిర్వహించే కాలేజీలకు మరింత ప్రోత్సాహం ఇవ్వడంలో భాగంగా సీఎ్‌సఈ సీట్లను పెంచేందుకు సర్కారు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఎప్‌సెట్‌ రెండోదశ కౌన్సెలింగ్‌ తర్వాత సీట్ల పెంపు నిర్ణయాన్ని ప్రకటించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

ఈ విద్యా సంవత్సరంలో కోర్‌ బ్రాంచ్‌ల్లో సీట్లు తగ్గించుకొని ఆమేరకు సీట్లను సీఎ్‌సఈలో పెంచుకునేందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ)కి కొన్ని కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. అలాగే, మరికొన్ని కళాశాలలు కోర్‌ బ్రాంచ్‌లను అలాగే కొనసాగిస్తూ అదనంగా సీఎ్‌సఈ కోర్సుల్లో సీట్ల పెంపునకు దరఖాస్తు చేశాయి. ప్రైవేటు కాలేజీల అభ్యర్థనలకు ఏఐసీటీఈ అమోదం తెలిపినప్పటికీ, కోర్‌ బ్రాంచ్‌ ల్లో సీట్ల తగ్గింపునకు సర్కారు విముఖత చూపుతున్నట్టు తెలిసింది.

ఈ క్రమంలో కోర్‌ బ్రాంచ్‌ల సీట్ల తగ్గింపు కోరుకున్న కళాశాలల్లో సుమారు 1,700 సీట్లు తగ్గుతుండగా, కోర్‌ బ్రాంచ్‌లు నిర్వహిస్తున్న కాలేజీలకు సుమారు 4,500 సీఎ్‌సఈ సీట్లకు అనుమతి లభించవచ్చని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే, ఎప్‌సెట్‌ మొదటి దశ కౌన్సెలింగ్‌కు గతేడాది సీట్ల ప్రకారమే కాలేజీలకు అనుమతులు ఇస్తుండగా, రెండో దశ కౌన్సెలింగ్‌ నాటికి సీట్ల పెంపు ఉండే అవకాశం ఉందని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల యాజమాన్యాల సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. కాగా, ఈ నెల 8నుంచి మొదటి విడత వెబ్‌ ఆప్షన్స్‌ ఎక్సర్‌సైజ్‌ ప్రారంభం కానుండడంతో కళాశాలలకు అఫిలియేషన్‌/కోర్సులు/సీట్ల కేటాయింపు వివరాలను శనివారం సాయంత్రం జేఎన్‌టీయూ అధికారులు ఉన్నత విద్యామండలికి సమర్పించారు.