/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz Andhra Pradesh : నేడు ఏపీలో టెట్ నోటిఫికేషన్ Raghu ram reddy
Andhra Pradesh : నేడు ఏపీలో టెట్ నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ లో నేడు టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. మెగా డీఎస్సీ త్వరలో నిర్వహించనున్న సందర్భంలో టెట్ ను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈరోజు టెట్ నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నారు.

ఈ నెల 3వ తేదీ నుంచి పదహారో తేదీ వరకూ దరఖాస్తు రుసుము చెల్లించేందుకు అవకాశం కల్పించారు.

అలాగే నాలుగో తేది నుంచి పదిహేడో తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆగస్టు నెలలో టెట్ పరీక్ష నిర్వహించనున్నారు.

ఆన్ లైన్ విధానంలో ఈ టెట్ పరీక్ష జరుగుతుందని విద్యాశాఖ కమిషనర్ సురేష్ మీడియాకు తెలిపారు. మెగా డీఎస్సీకి, టెట్ కు మధ్య నెల రోజుల వ్యవధి ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఏపీలో మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకాన్ని చంద్రబాబు చేసిన సంగతి తెలిసిందే.

దాదాపు పదహారు వేల పోస్టుల భర్తీ చేయనున్న నేపథ్యంలో టెట్ ను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఈరోజు నోటిఫికేషన్ విడుదల కానుంది.

తెలంగాణ నుంచి ఏపీకి ఎన్ని డబ్బులు రావాలో తెలుసా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి పది సంవత్సరాలు పూర్తయ్యాయి. విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రెండు రాష్ట్రాలకు ఒకే రాజధానిగా హైదరాబాద్ పది సంవత్సరాలపాటు వ్యవహరించింది. ఇకనుంచి ఒక్క తెలంగాణకే రాజధానిగా వ్యవహరించనుంది.

రాష్ట్రాన్ని విభించిన సమయంలో ఎన్నో సమస్యలు ఉత్పన్నమయ్యాయి. వాటిల్లో కొన్నింటిని ఇరు రాష్ట్రాలు పరిష్కరించుకున్నాయికానీ మరికొన్నింటిపై మాత్రం సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి. వీటిల్లో తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన నిధుల కేసు కూడా ఉందని ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు.

రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ లెక్కల ప్రకారం ఏపీకి రూ.5,170 కోట్లు రావాల్సి ఉందని, ఇరు రాష్ట్రాలకు చెందిన ఉమ్మడి ఆస్తులపై సుప్రంకోర్టుతోపాటు హైకోర్టుల్లో కూడా కేసులున్నాయని మంత్రి వెల్లడించారు. వీటిని సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి నిధులను ఏపీకి తీసుకువచ్చేలా కృషిచేయాలని అధికారులకు సూచించారు.

వేల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులున్న సంస్థల విషయంలో కూడా ఏపీ, తెలంగాణ మధ్య ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా 9, 10 షెడ్యూళ్లలో ఉన్న సంస్థల విషయంలోని సమస్యలు మాత్రం పరిష్కారమవడంలేదు.

Pawan Kalyan: తెలంగాణ జనసేన నేతలతో పవన్ కల్యాణ్ భేటీ?

హైదరాబాద్: ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ ఆదివారం హైదరాబాద్ మాదాపూర్ తన నివాసంలో ఉన్నారు. కొండగట్టు గట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు హైదరాబాద్‌లోనే ఆయన ఉండనున్నారు.

ఏపీ ఉప ముఖ్యమంత్రి (Deputy CM), జనసేన పార్టీ అధినేత (Janasena Chief), సినీ నటుడు (Tolly Wood Hero) పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఆదివారం హైదరాబాద్ మాదాపూర్ తన నివాసంలో ఉన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని శనివారం రాత్రి హైదరాబాద్ (Hyderabad) చేరుకున్నారు. ఈరోజు హైదరాబాద్‌లోనే ఆయన ఉండనున్నారు. తెలంగాణ జనసేన నేతలతో (Telangana Jasena Leaders) పవన్ సమావేశమైయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సోమవరం సొంత నియోజకవర్గం పిఠాపురం వెళ్ళనున్నారు. సామాజిక పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు.

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ శనివారం జగిత్యాల జిల్లా, మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. తాను ఇలవేల్పుగా కొలిచే ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో దీక్షా వస్త్రాలు, తలపాగాతో ఆలయానికి వచ్చిన పవన్‌ కల్యాణ్‌కు మేళతాళాలతో అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. జగిత్యాల కలెక్టర్‌ సత్యప్రసాద్‌, ఎస్పీ అశోక్‌కుమార్‌ పవన్‌ కల్యాణ్‌కు పూలమొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం పవన్‌ కల్యాణ్‌ కొండగట్టు అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ గోత్రనామాలతో అర్చకులు పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందించారు. ఆశీర్వచనం అందించి శేష వస్త్రాన్ని, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

కాగా గతేడాది పవన్‌ కల్యాణ్‌ తన ప్రచార వాహనం వారాహికి కొండగట్టులోనే పూజలు చేసి.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తాను ఆశించిన ఫలితాలు రావడంతో అంజన్నకు మొక్కులు చెల్లించుకున్నారు.

బిహార్‌కు ప్రత్యేక హోదా

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో మూడోసారి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన జనతాదళ్‌ (యునైటెడ్‌) పార్టీ తన డిమాండ్లను సాధించుకునే దిశగా అడుగులు వేస్తోంది.

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో మూడోసారి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన జనతాదళ్‌ (యునైటెడ్‌) పార్టీ తన డిమాండ్లను సాధించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తమ రాష్ట్రం బిహార్‌కు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని పునరుద్ఘాటిస్తూ కేంద్రాన్ని తాజాగా డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శనివారం పార్టీ అధ్యక్షుడు, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసింది.

పేపర్‌ లీక్‌ కేసుల్లో దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. అలాగే పరీక్షా పేపర్ల లీకేజీలకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో పటిష్ఠ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. ఎన్డీఏ ప్రభుత్వంలో జేడీయూ కీలక భాగస్వామిగా మారిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో ఈ పార్టీ 12 సీట్లను గెలుచుకుంది. దీంతో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో పార్టీ కీలకమైంది. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఈ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో పార్టీ భాగస్వామ్యం నేపథ్యంలో తమ పార్టీ బాధ్యతతోపాటు ప్రజల అంచనాలు కూడా పెరిగిపోయాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్‌ చేస్తూ గత ఏడాది బిహార్‌ కేబినెట్‌ తీర్మానాన్ని ఆమోదించింది.

అయితే ఇప్పుడు కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి జేడీయూ కీలకంగా మారిన నేపథ్యంలో ఈ డిమాండ్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉండగా.. జేడీయూ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్‌ కుమార్‌ ఝాను శనివారం నియమించారు. బీజేపీతో ఈయనకు మంచి సంబంధాలున్న నేపథ్యంలో ఆయనకు ఈ పదవి కట్టబెట్టినట్టు తెలుస్తోంది. పార్టీ డిమాండ్లను నెరవేర్చుకోవడంలో ఈయన సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని భావిస్తున్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ.. బిహార్‌పై ఎల్లప్పుడూ దృష్టిసారిస్తారని, ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ కోసం పార్టీ చేస్తున్న డిమాండ్‌ నెరవేరుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్‌ను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచుతూ బిహార్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇటీవల పట్నా హైకోర్టు కొట్టివేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన జేడీయూ.. రాష్ట్ర చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కేంద్రాన్ని కోరింది. దీని వల్ల న్యాయ సమీక్షకు అవకాశం ఉండదని భావిస్తోంది.

బిహార్‌లో మరో బ్రిడ్జి కూలిపోయింది. కేవలం తొమ్మిది రోజుల్లో ఈ రాష్ట్రంలో ఐదు బ్రిడ్జిలు కూలిపోయి రాష్ట్రంలో పనుల నాణ్యతను ప్రశ్నిస్తున్నాయి. బిహార్‌లోని మధువని జిల్లాలో నాలుగు పిల్లర్ల ఓ బ్రిడ్జి భారీ వర్షాలకు శుక్రవారం కూలిపోయింది. నేపాల్‌ సరిహద్దుకు దగ్గరగా ఉన్న మాదేపూర్‌ బ్లాక్‌లో భుతహి నదిపై 75 మీటర్ల పొడవైన ఈ బ్రిడ్జిని రూ.3 కోట్ల ఖర్చుతో 2021 నుంచి నిర్మిస్తున్నారు. భారీ వర్షాలకు నదిలో ప్రవాహం పెరిగి ఓ వైపు పిల్లర్‌ కొట్టుకుపోవడంతో బ్రిడ్జి కూలిపోయినట్లు బిహార్‌ ప్రజా పనుల శాఖ అధికారులు చెబుతున్నారు. కూలిన బ్రిడ్జి కనిపించకుండా కాంట్రాక్టర్‌ టార్పాలిన్‌ కప్పారు.

Telangana: కాంగ్రెస్‌లోకి మరో ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ‘కారు’ (BRS) పార్టీకి అడుగడుగునా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి.! అసెంబ్లీలో అట్టర్ ప్లాప్ కావడంతో పార్లమెంట్ ఎన్నికల్లో అయినా పరువు నిలబెట్టుకుందామని భగీరథ ప్రయత్నాలు చేసి అడ్రస్ లేకుండా పోయింది.!..

ఇప్పటికే.. బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, కాలె యాదయ్యలు పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో ఒకరు హ్యాట్రిక్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కాగా.. మరో ఇద్దరు హైదరాబాద్ సిటీకి చెందిన వారేనని.. ఇంకో ఇద్దరు హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల ఎమ్మెల్యేలు అని లీకులు వస్తున్నాయి.

దీంతో ఆ ఐదుగురు ఎవరబ్బా..? అని తెలుసుకోవడానికి జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే జులై మొదటి వారం లేదా.. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక తర్వాత ఈ చేరికలు ఉంటాయని వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే సంఖ్య పెరగొచ్చే కానీ.. తగ్గే అవకాశం అస్సలు లేదని కాంగ్రెస్ నేతలు కొందరు చెబుతున్న పరిస్థితి.

గులాబీ దళం ఖాళీ అయ్యి, కాంగ్రెస్ హౌస్‌ఫుల్ అవుతుండటంతో ఈ మధ్యనే ఎమ్మెల్యేలతో ఎర్రవల్లిలోని ఫామ్‌ హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక సమావేశం నిర్వహించారు. పార్టీని వీడొద్దని ఒకటికి పది సార్లు ఎమ్మెల్యేలకు చెప్పారు గులాబీ బాస్. ‘అబ్బే.. అస్సలు మారే ప్రసక్తే లేదు సార్.. మీ వెంటే ఉంటాం’ అని చెప్పిన రోజుల వ్యవధిలోనే ఎమ్మెల్యేలు జంప్ అయిపోతుండటం గమనార్హం. ఎప్పుడు ఎవరు పార్టీ వీడుతారో..? పార్టీలో ఉండేదెవరో..? పోయేదెవరో..? అని పెద్ద చర్చే జరుగుతోంది. దీంతో గులాబీ పార్టీలో గుబులు మొదలైంది. బీఆర్ఎస్‌లో ఆఖరికి ఆ నలుగురు మాత్రమే మిగులుతారని కాంగ్రెస్ నుంచి విమర్శలు, అంతకుమించి ఆరోపణలు పెద్ద ఎత్తునే వస్తున్నాయ్. ఆ నలుగురు మరెవరో కాదని.. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావులు అని కాంగ్రెస్ మంత్రులే కామెంట్స్ చేస్తున్నారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం మరకు ఫామ్ హౌస్‌లో కేసీఆర్‌ మాట్లాడిన మాటలు కొన్ని లీకయ్యాయి. ‘ఒకటి రెండు నెలలు ఓపిక పట్టండి.. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఉండదు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ జిల్లాలకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మనతో టచ్‌లో ఉన్నారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి చెందిన కీలక నేతలతో టచ్‌లో ఉన్నాం. రెండు నెలల తర్వాత అధికారంలోకి వస్తాం. ముఖ్యమంత్రి పదవిపై నాకు ఆశ లేదు. ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుతారు. నేను మీకు మార్గదర్శిగా ఉంటాను. కాంగ్రెస్‌లో చేరుతున్న మన ఎమ్మెల్యేలను న్యాయస్థానం ద్వారా అనర్హులుగా ప్రకటింపజేస్తాం. ఢిల్లీకి చెందిన పెద్ద లాయర్‌తో మాట్లాడాం. ఇంతకంటే ఎక్కువ చెప్పను. చెబితే రహస్యాలు లీక్‌ అవుతాయి’ అని కేసీఆర్‌ ఫాంహౌస్‌కు పిలిపించుకున్న తన పార్టీ ఎమ్మెల్యేలతో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇది ఎంతవరకూ నిజమో కానీ.. జంపింగ్‌లు మాత్రం అస్సలు ఆగట్లేదు. ఇలాంటి వార్తలు వచ్చినప్పుడల్లా ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు వీడుతున్నారే తప్ప.. పార్టీలో ఉండటానికి ప్రయత్నాలు చేయట్లేదు. తెలంగాణ రాజకీయాల్లో మున్ముందు ఇంకా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాల్సిందే మరి.

Telangana: కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్..

తెలంగాణలో(Telangana) కాంగ్రెస్‌(Congress) ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్(BRS) చేసిన పనులనే కాంగ్రెస్ చేస్తోందని విమర్శించారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ దుర్మార్గాలకు పాల్పడుతోందని ఆరోపించారు.

తెలంగాణలో(Telangana) కాంగ్రెస్‌(Congress) ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్(BRS) చేసిన పనులనే కాంగ్రెస్ చేస్తోందని విమర్శించారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ దుర్మార్గాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే నిధులు వస్తున్నాయని.. బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు ఇవ్వడం లేదని కేంద్ర మంత్రి ఆరోపించారు.

తాము కూడా అలాగే వ్యవహరిస్తే.. తెలంగాణ అభివృద్ధి జరగదని హెచ్చరించారు. కాంగ్రెస్ ఎంపీలకు తాము నిధులు ఇవ్వకపోతే ఏం చేస్తారని ప్రశ్నించారు బండి సంజయ్. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా అవమానిస్తారా? అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. కేసీఆర్ మీద తిరగబడినట్లే కాంగ్రెస్ ప్రభుత్వంపైనా తిరుగుబాటు చేస్తారని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అందరికీ సమానంగా నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. సింగరేణి విషయంలో బీఆర్‌స్ దారిలోనే కాంగ్రెస్ నడుస్తోందని వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తుపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. పవన్ కల్యాణ్ ప్రతిపాదనపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. జనసేనతో బీజేపీ పొత్తుపై కిషన్ రెడ్డి, జేపీ నడ్డా ఆలోచిస్తారని చెప్పారు.

బీజేపీతో జనసేన పొత్తు తన పరిధిలో లేదని.. దానిపై తానేమీ మాట్లాడనని బండి సంజయ్ స్పష్టం చేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, బీజేపీ కూటమిగా ఉన్న విషయం తెలిసిందే. అదే పొత్తు తెలంగాణలోనూ కొనసాగించాలని జనసేనాని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. అయితే, దీనిపై బీజేపీలో మాత్రం భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. మరి రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సిందే.

AP News: పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి..

విశాఖ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం పెన్షన్ల పంపిణీకి అదికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో సచివాలయాల వారీగా నగదు డ్రా చేసి సోమవారం కార్యదర్శులు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేయనున్నారు.

విశాఖ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఆదేశాల ప్రకారం పెన్షన్ల పంపిణీకి (Distribution of pensions) అదికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో సచివాలయాల వారీగా నగదు డ్రా చేసి సోమవారం కార్యదర్శులు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేయనున్నారు. 4 వేల రూపాయలతో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఏరియర్స్ మూడు వేలు కలిపి మొత్తం రూ. 7 వేలు పంపిణీ చేయనున్నారు. జీవీఎంసీ పరిధిలో 1 లక్ష 46 వేల 930 మందికి..100.91 కోట్లు పంపిణీ చేయనున్నారు

జీవీఎంసీ పరిధిలోని 1,46,930 మంది పెన్షన్‌దారులకు సోమవారం రూ.100.91 కోట్లు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. కూటమి అధికారంలోకి వస్తే పింఛన్‌ను మూడు వేల నుంచి రూ.నాలుగు వేలకు పెంచుతామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఆ మేరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెన్షన్‌ పెంపుపైనే చంద్రబాబు తొలిసంతకం చేశారు

విశాఖ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం పెన్షన్ల పంపిణీకి అదికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో సచివాలయాల వారీగా నగదు డ్రా చేసి సోమవారం కార్యదర్శులు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేయనున్నారు.

జూలై ఒకటో తేదీన రూ.నాలుగు వేలతోపాటు ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించిన ఎరియర్స్‌ రూ.మూడు వేలు కలిపి రూ.ఏడు వేలు అందజేయనున్నారు. ఈ మేరకు వార్డు సచివాలయ పరిధిలో ఎంతమందికి పెన్షన్‌ అందజేయాలి, ఎంత మొత్తం అవసరమనే దానిపై అధికారులు ముందుగానే లెక్కలు సిద్ధం చేశారు. ఆదివారం బ్యాంకులు సెలవు కావడంతో శనివారమే పెన్షన్ల పంపిణీకి అవసరమైన డబ్బును బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేయాలని సంబంధిత కార్యదర్శులను అధికారులు ఆదేశించారు. వార్డు సచివాలయ కార్యదర్శులు తమకు కేటాయించిన పెన్షన్‌దారుల ఇళ్లకు ఒకటో తేదీ ఉదయాన్నే వెళ్లి పెన్షన్‌ అందజేయనున్నారు. జోన్‌-1 (భీమిలి) పరిధిలో 8,722 మందికి రూ.5,97,89,500, జోన్‌-2 (మధురవాడ) పరిధిలో 20,378 మందికి రూ.13,99,07,500, జోన్‌-3 (ఆశీల్‌మెట్ట) పరిధిలో 15,389 మందికి రూ.10,61,27,00, జోన్‌-4 (సూర్యాబాగ్‌) పరిధిలో 16,014 మందికి రూ.11,03,99,500, జోన్‌-5 (జ్ఞానాపురం) పరిధిలో 27,424 మందికి రూ.18,84,77,000, జోన్‌-6 (గాజువాక) పరిధిలో 32,179 మందికి రూ.22,09,25,500, జోన్‌-7 (అనకాపల్లి) పరిధిలో 10,057 మందికి రూ.6,84,500, జోన్‌-8 (పెందుర్తి) పరిధిలో 16,767 మందికి రూ.11,51,68,000 అవసరమని ఆయా జోనల్‌ కమిషనర్లు నివేదికలు సమర్పించారు. అలాగే విశాఖ జిల్లా పరిధిలోని పెందుర్తి మండలంలో 8,113 మందికి రూ.5,24,79,500, పద్మనాభం మండలంలో 8,821 మందికి రూ.5,97,92,000, ఆనందపురం మండలంలో 6,191 మందికి రూ.4,11,93,000, పెందుర్తి మండలంలో 4,241 మందికి రూ.2,78,96,000 పెన్షన్‌ కింద పంపిణీ చేయనున్నారు.

ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. డీఏ ఏకంగా 16 శాతం పెంపు..!

తమ ఉద్యోగులకు రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. 5వ, 6వ పే కమిషన్ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల డీఏను 16 శాతం పెంచుతున్నట్లు సీఎం భజన్‌ లాల్ శర్మ ప్రకటించారు. డీఆర్ తొమ్మిది శాతం పెంచినట్లు తెలిపారు.

తమ ఉద్యోగులకు రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. 5వ, 6వ పే కమిషన్ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల డీఏను 16 శాతం పెంచుతున్నట్లు సీఎం భజన్‌ లాల్ శర్మ ప్రకటించారు. డీఆర్ తొమ్మిది శాతం పెంచినట్లు తెలిపారు.

ఈ ఏడాది రెండో డీఏ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర నెలలో కేంద్రం నుంచి గుడ్‌న్యూస్ వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది మొదటి డీఏ పెంపు ప్రకటన మార్చిలో రాగా.. జనవరి నెల నుంచి అమలులోకి వచ్చింది.

ఈసారి కూడా ప్రకటన ఎప్పుడు వచ్చినా.. జూలై 1వ తేదీ నుంచి అమలు చేయనున్నారు. మొదటి డీఏ 4 శాతం పెంపుతో మొత్తం 50 శాతానికి చేరింది. మరోసారి కూడా నాలుగు శాతం పెంచే అవకాశాలు ఉండడంతో 54 శాతానికి చేరనుంది. మరోవైపు కొన్ని రాష్ట్రాలు తమ ఉద్యోగులకు అలవెన్సులు ప్రకటిస్తున్నాయి. రాజస్థాన్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది.

5వ, 6వ పే కమిషన్ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల కరువు భత్యాన్ని 16 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు పెన్షనర్ల డియర్‌నెస్ అలవెన్స్‌ను కూడా తొమ్మిది శాతం పెంచినట్లు వెల్లడించారు.

పది’ పాట్లు..!

మార్కెట్‌లో చిల్లర కష్టలు పెరిగాయి. 5, 10 రూపాయల కొరత పెరిగిపోతోంది. వ్యాపారులు, వినియోగదారుల మధ్య ‘చిల్లర’ రచ్చకు దారితీస్తోంది. మార్కెట్లోకి పది రూపాయల నాణేలు వచ్చినప్పటికీ..

మార్కెట్‌లో చిల్లర కష్టలు పెరిగాయి. 5, 10 రూపాయల కొరత పెరిగిపోతోంది. వ్యాపారులు, వినియోగదారుల మధ్య ‘చిల్లర’ రచ్చకు దారితీస్తోంది. మార్కెట్లోకి పది రూపాయల నాణేలు వచ్చినప్పటికీ.. వాటిని ఎవరూ స్వీకరించడం లేదు. మరోవైపు పది నోట్లను సరఫరా చేయలేక బ్యాంకర్లు చేతులెత్తేస్తున్నారు. ఆర్బీఐ నుంచి సరఫరా లేనప్పుడు తామేం చేస్తామని చెబుతున్నారు.

మార్కెట్‌లో పదుల కొరత ఏడాదిగా కొనసాగుతోంది. నోట్ల రద్దు తర్వాత పరిస్థితి గాడిన పడుతుందనుకున్న సమయంలో చిన్న నోట్ల కొరత పెరుగుతుండడం తో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. టీ స్టాల్స్‌, కిరణా షాపుల్లో వ్యాపారమంతా రూ.10తోనే మొదలవుతుంది. పెద్దమొత్తం బిల్లులకు పెద్దనోట్లు ఇచ్చినప్పుడు ఎలాంటి సమస్య ఉత్పన్నం కావడం లేదు. చిన్న చిన్న బేరాల విషయంలో మాత్రం వివాదాలు జరుగుతున్నాయి.

సాధారణంగా కొత్త కరెన్సీని ఆర్‌బీఐ విడుదల చేసినప్పుడు బ్యాంకుల వద్ద నుంచి.. రూ.5, రూ.10, రూ.20, రూ.50నోట్లను తీసుకుని భద్రపరుచుకుంటారు. ఐదు రూపాయల నోట్ల ముద్రణ ఆగిపోయిన తర్వాత నాణేలు మనుగడలోకి వచ్చాయి. వాటి లభ్యత కూడా క్రమంగా తగ్గుతోంది. ఆర్‌బీఐ పది రూపాయల నోట్లతోపాటు నాణేలు కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. కానీ, నోట్లలో జరిగినన్ని లావాదేవీలు నాణేలతో జరగడం లేదు. పది రూపాయలు చిల్లర ఇవ్వాల్సిన స్థానంలో నాణేలు ఇస్తుంటే వినియోగదారులు గానీ, వ్యాపారస్తులుగానీ తీసుకోవడం లేదు. దీంతో సమస్య తీవ్రమవుతోంది.

ఆర్‌బీఐ ముద్రించిన కరెన్సీని వ్యతిరేకించడం నేరమని న్యూమి్‌సమ్యాటిక్‌ నిపుణుడు ప్రసాద్‌ అన్నారు. వ్యతిరేకించిన వారిపై చర్యలు తీసుకునే అధికారం ఆర్‌బీఐకి ఉందన్నారు. ‘అన్ని రాష్ట్రాల్లోను పది రూపాయల నాణేల చలామణి అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు దీనిపై అపోహలున్నాయి. ఐదు రూపాయల నాణేలు విడుదలైన కొత్తలో నకిలీ నాణేలు బయటకు వచ్చాయి. ఇప్పుడు పది రూపాయల నాణెం విషయంలోనూ అదే అనుమానాలున్నాయి. ప్రజల్లో ఈ నాణెం మనదేశానిది కాదన్న భావన ఉంది’ అని ప్రసాద్‌ చెప్పారు. మార్కెట్లో పది రూపాయల నోట్ల కొరత ఉన్నమాట వాస్తవమేనని, దీనికి ఆర్‌బీఐ కారణమని మరో న్యూమి్‌సమ్యాటిక్‌ నిపుణుడు రామకృష్ణ అన్నారు. పది రూపాయల నాణేలను చలామణిలోకి తీసుకురావడం కోసం హైదరాబాద్‌లోని ఆర్‌బీఐ రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.10 నోట్ల సరఫరాను బాగా తగ్గించిందని వెల్లడించారు.

కంటోన్మెంట్ ప్రజలకు శుభవార్త.. ఏళ్లనాటి కల నెరవేరింది.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలకు కేంద్ర రక్షణ శాఖ శుభవార్త వినిపించింది. ఏళ్లుగా ఎదురుచూస్తున్న కంటోన్మెంట్ ప్రాంత ప్రజల కల నెరవేరింది. కంటోన్మెంట్ ప్రాంతాలను గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయటానికి కేంద్ర రక్షణ శాఖ మొత్తానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్.. తన అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. కంటోన్మెంట్ ప్రాంత ప్రజలు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన కల ఎట్టకేలకు నెరవేరింది.

రేవంత్ రెడ్డి సర్కార్ చొరవతో కంటోన్మెంట్ ఏరియాలో సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాలను మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విలీనం చేయడానికి మొత్తానికి.. కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్‌ ద్వారా ప్రకటించింది. ట్వీట్‌తో పాటు కేంద్ర రక్షణ శాఖ విడుదల చేసిన గెజిట్‌‌ను కూడా జత చేసింది.

కేంద్ర రక్షణ మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చేసిన విజ్ఞప్తి ఫలించిందని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్‌లో రాసుకొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మార్చి 6, 2024న సీఎస్ శాంతి కుమారి రాసిన లేఖకు కేంద్రం సానుకూలంగా స్పందించి.. కంటోన్మెంట్‌పై అధికారాలను జీహెచ్ఎంసీకి అప్పగించిందని తెలిపింది. కంటోన్మెంట్ ప్రజల తరఫున.. ప్రజా ప్రభుత్వం సాధించిన విజయం ఇది అని తెలంగాణ కాంగ్రెస్ అభివర్ణించింది.

అయితే.. ఈ విషయంపై ఏళ్లుగా కేంద్రానికి ఇక్కడి ప్రభుత్వాలు విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనూ.. కేంద్రానికి మంత్రి కేటీఆర్ పలుమార్లు లేఖలు రాశారు. ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందని.. రహదారుల విస్తరణతో పాటు మూసేసిన పలు రోడ్లను తెరవాలంటూ విజ్ఞప్తులు చేశారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ విషయంపై కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేయగా.. ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.